Mukku Avinash Buys New Mahindra XUV 500 Car - Sakshi
Sakshi News home page

Mukku Avinash: లక్షలు పెట్టి కొత్త కారు కొన్న జబర్దస్త్‌ కమెడియన్‌.. మొన్ననే అమ్మకు గుండెపోటు అన్నావ్‌, ఇంతలోనే కారు కొన్నావ్‌!

Published Mon, Jul 24 2023 10:50 AM | Last Updated on Mon, Jul 24 2023 11:32 AM

Mukku Avinash Buy Mahindra XUV 500 Car - Sakshi

జబర్దస్త్‌ షోతో కమెడియన్‌గా పేరు ప్రఖ్యాతలు సంపాదించాడు ముక్కు అవినాశ్‌. తన పంచులతో, కామెడీ స్కిట్లతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు. బుల్లితెరపై ప్రసారమవుతున్న పలు షోలలో కూడా అవినాశ్‌ పార్టిసిపేట్‌ చేస్తూ జనాలను ఎంటర్‌టైన్‌ చేస్తున్నాడు. ఆ మధ్య బిగ్‌బాస్‌కు కూడా వెళ్లి తన కామెడీతో షోకి కొత్త కళను తీసుకొచ్చాడు. మొత్తంగా అవినాశ్‌ ఎక్కడుంటే అక్కడ నవ్వుల పండగే అన్న పేరు తెచ్చుకున్నాడు.

ఇకపోతే అవినాశ్‌ భార్య అనూజ ప్రస్తుతం గర్భిణి అన్న సంగతి తెలిసిందే! ఓపక్క తండ్రి కాబోతున్నాడని సంతోషించే లోపే అతడి తల్లి మల్లమ్మ అనారోగ్యంతో ఆస్పత్రిపాలైంది. ఇటీవలే మల్లమ్మకు గుండెలో స్టంట్స్‌ పడ్డాయి. ఈ విషయాన్ని అవినాశ్‌ స్వయంగా యూట్యూబ్‌ ఛానల్‌లో వెల్లడించాడు. ఇప్పుడిప్పుడే ఆమె ఆరోగ్యం కుదుటపడుతోంది.

ఈ సమయంలో అవినాశ్‌ కొత్త కారు కొన్నాడు. పాత కారుకు యాక్సిడెంట్‌ అయిందని, అది డ్యామేజ్‌ కావడంతో దాన్ని ఎక్స్‌చేంజ్‌ చేసి కొత్త కారు కొన్నట్లు తెలిపాడు. మహీంద్రా ఎక్స్‌యూవీ 700 కారును కొనుగోలు చేసినట్లు వెల్లడించాడు. దీని ధర దాదాపు రూ.25 లక్షల మేర ఉంటుందని తెలుస్తోంది. ఈ కారుకు పూజ చేయించిన వీడియోను తన యూట్యూబ్‌ ఛానల్‌లో షేర్‌ చేశాడు. చాలామంది అభిమానులు అతడికి శుభాకాంక్షలు చెప్తుంటే కొంతమంది మాత్రం అవినాశ్‌పై అసహనం వ్యక్తం చేస్తున్నారు.

'అమ్మకు గుండెపోటు వచ్చి స్టంట్స్‌ వేయించుకుని అనారోగ్యంతో బాధపడుతుంటే ఇప్పుడు కొత్త కారు తీసుకోవడం అవసరమా?' అని కామెంట్లు చేస్తున్నారు. 'మీ అమ్మకు ఆరోగ్యం బాగోలేదని వీడియో తీశావు. ఆ వీడియో ద్వారా వచ్చిన డబ్బుతో అప్పుడే కొత్త కారు కొన్నావు. మంచి మంచి కట్టుబాట్లు ఉన్నాయే' అని సెటైర్లు వేస్తున్నారు.

చదవండి: గుంటూరు కారం నుంచి మ్యూజిక్‌ డైరెక్టర్‌ తమన్‌ అవుట్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement