బిడ్డను కోల్పోవడంపై తొలిసారి పెదవి విప్పిన అవినాష్‌ | Sakshi Cartoon: Harirama Jogaiah Comments On CM Post | Sakshi
Sakshi News home page

Mukku Avinash: ఏమని సమాధానం చెప్పాలో అర్థం కాలే.. నా జీవితంలో..

Published Wed, Feb 7 2024 12:59 PM | Last Updated on Wed, Feb 7 2024 1:19 PM

Jabardasth Comedian Mukku Avinash About Baby Loss - Sakshi

గర్భం దాల్చింది మొదలు.. పొట్టలో ఉన్న బుజ్జాయి ఎప్పుడు బయటకు వస్తుందా? ఆ బిడ్డను ఎప్పుడు ఎత్తుకుందామా? అని ఆ మహిళ తెగ ఆరాటపడుతూ ఉంటుంది. ఇక తండ్రి కాబోతున్నానోచ్‌ అని గాల్లో తేలే భర్త పుట్టబోయే బిడ్డ కోసం అన్నీ ముందస్తుగానే సిద్దం చేసి పెడతాడు. అన్నీ అనుకున్నట్లు జరిగితే వారికి తల్లిదండ్రులుగా ప్రమోషన్‌ లభించినట్లే! జబర్దస్త్‌ కమెడియన్‌ ముక్కు అవినాష్‌- అనూజ కూడా త్వరలోనే అమ్మానాన్న కాబోతున్నామని సంతోషించారు. సీమంతం చేశారు. మెటర్నటీ షూట్‌ చేశారు.

బాధను భరిస్తూ నవ్వించాడు
పుట్టబోయే బిడ్డ కోసం వేయి కళ్లతో ఎదురుచూశారు. కానీ వారి కలలు కల్లలయ్యాయి. పురిటిలోనే బిడ్డ మరణించింది. ఈ విషాద వార్తను జనవరి 7న సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించాడు అవినాష్‌. అంతటి బాధను పంటి కిందే భరిస్తూ సినిమాలు, ఈవెంట్లు చేస్తున్నాడు. అందరినీ నవ్విస్తున్నాడు. తాజాగా తొలిసారి ఆ బాధాకర ఘటన గురించి మాట్లాడాడు. 'నా బిడ్డ చనిపోయినప్పుడు సినీ ఇండస్ట్రీ నుంచి కూడా చాలామంది కాల్స్‌ చేశారు. వారికి ఏమని సమాధానం చెప్పాలో అర్థం కాలేదు.

దేవుడు మాకలా రాసిపెట్టాడు
పైగా నేను మాట్లాడే స్థితిలో లేకపోవడం వల్ల ఎవరి ఫోనూ లిఫ్ట్‌ చేయలేదు. దీని గురించి అడగొద్దు అని చెప్పినప్పటికీ మానవత్వంతో ప్రతి ఒక్కరూ అడుగుతూనే ఉన్నారు. చాలా ఫోన్లు చేశారు, మెసేజ్‌లు చేశారు. మా మీద అంత ప్రేమ చూపించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. నా జీవితంలో అదొక కరిగిపోయిన మేఘంలాంటిది. దేవుడు మాకు అలా రాసిపెట్టాడు. భవిష్యత్తులో ఏదైనా ఇంకా బెస్ట్‌ రాబోతుందేమో చూడాలి! అని చెప్పుకొచ్చాడు. కాగా అవినాష్‌-అనూజ 2021వ సంవత్సరంలో పెళ్లి చేసుకున్నారు.

చదవండి: ప్రజలకు రుణపడి ఉంటా.. చేతనైనంతలో సాయం చేయాలనుకున్నా..
పుష్ప 3 ఉందని రూమర్స్.. అలా చేస్తే చిక్కులు గ్యారంటీ!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement