Jabardasth Mukku Avinash Share About His Mother Health Video - Sakshi
Sakshi News home page

Jabardasth Mukku Avinash: ముక్కు అవినాశ్‌ తల్లికి గుండెపోటు, కొడుకు వల్లే బతికున్నాననంటూ కంటతడి..

Published Sat, Jul 15 2023 8:39 PM | Last Updated on Sun, Jul 16 2023 7:16 AM

Jabardasth Mukku Avinash Share About His Mother Health Video - Sakshi

జబర్దస్త్‌ కమెడియన్‌ ముక్కు అవినాశ్‌ తల్లి మల్లమ్మ అస్వస్థతకు లోనైంది. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లగా గుండెపోటు వచ్చినట్లు వైద్యులు వెల్లడించారు. గుండెలో బ్లాక్స్‌ ఉండటంతో వైద్యులు స్టంట్స్‌ వేశారు. ఈమేరకు ఓ వీడియోను ముక్కు అవినాశ్‌ తన యూట్యూబ్‌ ఛానల్‌లో రిలీజ్‌ చేశాడు. 'ఎప్పుడూ నవ్వుతూ ఉండే అమ్మ ఇలా ఇబ్బందిపడటం చూడలేకపోతున్నా. తను ముందు నుంచే షుగర్‌ వ్యాధితో బాదపడుతోంది. ఈ షుగర్‌ వల్ల నచ్చిన ఫుడ్‌ కూడా తినలేకపోతోంది. ఈ మధ్యే అమ్మకు గుండెపోటు(హార్ట్‌ స్ట్రోక్‌) వచ్చింది.

తనను ఊరిలో ఆస్పత్రికి తీసుకెళ్తే అమ్మ గుండె వీక్‌ ఉందన్నారు. అందుకే ఏమాత్రం ఆలస్యం చేయకుండా హైదరాబాద్‌ తీసుకొచ్చి ఇక్కడే ఒక ఆస్పత్రిలో చూపించాను. గుండెలో రెండు పెద్ద బ్లాక్స్‌ ఏర్పడ్డాయి. ఆంజియోగ్రామ్‌ చేయించాం, రెండు స్టంట్స్‌ వేయించాం. తననిప్పుడు ఇంకా జాగ్రత్తగా చూసుకోవాలి' అని చెప్పుకొచ్చాడు.

తనకు వచ్చిన పరిస్థితిని తలుచుకుని అవినాశ్‌ తల్లి కన్నీటిపర్యంతమైంది. 'నా కొడుకులు బతికించారు, అందుకే బతికినా. జరగబోయేది నాకు తెల్వదు. మీ దయ వల్ల మంచిగుండి డ్యాన్స్‌ చేశిన, అన్నీ చేశిన. నాకిప్పుడు ఈ కష్టం వచ్చింది. మీరు లేకుంటే బతకలేను, నా పెద్ద కొడుకు లేకపోయుంటే ఊరిలోనే నా ప్రాణం పోయేది. వాడు తొందరగా నన్ను ఆస్పత్రికి తీసుకెళ్లి చూపించడం వల్లే బతికి ఉన్నాను' అంటూ ఏడ్చేసింది. కొద్దిరోజులపాటు ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న అనంతరం ముక్కు అవినాశ్‌ తల్లిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ చేసి ఇంటికి తీసుకెళ్లాడు.

చదవండి: శామీర్‌పేట్‌ ఘటన.. నాకు సంబంధమే లేదంటున్న నటుడు మనోజ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement