
జబర్దస్త్ కమెడియన్ ముక్కు అవినాష్ బుల్లితెరపై ప్రసారమయ్యే షోలతో పాటు సినిమాలు కూడా చేస్తున్నాడు. జగిత్యాల జిల్లాలోని రాఘవపట్నం గ్రామానికి చెందిన ఈ కమెడియన్ అంచెలంచెలుగా ఎదిగి తనకంటూ పేరుప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు. 2021లో అనూజతో పెళ్లి జరగ్గా గతేడాది ఆమె ప్రెగ్నెన్సీ వార్తను వెల్లడించాడు. కానీ ఈ ఏడాది ప్రారంభంలో అబార్షన్ అయిందని బ్యాడ్ న్యూస్ చెప్పాడు.
ఐదు నెలల క్రితమే..
తాజాగా ఓ ఇంటర్వ్యూలో అవినాష్ మాట్లాడుతూ.. నాది పెద్దలు కుదిర్చిన సంబంధం. 2021లో అనూజతో నా పెళ్లి జరిగింది. గతేడాది తను గర్భవతి. ఐదు నెలల క్రితమే బిడ్డను కోల్పోయాం. తెల్లవారితే డెలివరీ అనగా సడన్‌గా అనూజ కడుపులో బేబీ కదలికలు ఆగిపోయాయి. ఆస్పత్రికి తీసుకెళ్తే బిడ్డ గుండె కొట్టుకోవడం ఆగిపోయిందన్నారు. ఉమ్మునీరు మింగడం వల్ల అలా జరిగి ఉండొచ్చన్నారు.

అర్ధరాత్రి రోడ్డుపై..
అప్పుడు నేను స్టేజీపై షూటింగ్‌లో ఉన్నాను. వెంటనే ఆస్పత్రికి వెళ్లి ఏదో ఒకటి చేయండని డాక్టర్ కాళ్ల మీద పడ్డాను. హార్ట్‌బీట్ ఆగిపోతే ఏం చేయలేమన్నారు. అర్ధరాత్రి ఒంటిగంటకు ఎటు వెళ్తున్నానో కూడా తెలీకుండా రోడ్డుపై ఏడ్చుకుంటూ ఒంటరిగా సాగిపోయాను. ఆ శిశువును బయటకు తీస్తే అచ్చం నాలాగే ఉన్నాడు. 2.75 కిలోల బరువుతో పుట్టాడు. కానీ వాడిలో ప్రాణం లేదు. ఇప్పటికీ నా భార్య అర్ధరాత్రిళ్లు కుమిలి కుమిలి ఏడుస్తోంది. తొమ్మిది నెలలు మోసింది కదా.. ఆ బాధ నుంచి బయటకు రాలేకపోతోంది' అని అవినాష్ ఎమోషనలయ్యాడు.
చదవండి: Satish Joshi: స్టేజీపై కుప్పకూలి తుదిశ్వాస విడిచిన నటుడు
Comments
Please login to add a commentAdd a comment