జబర్దస్త్ నవీన్.. బుల్లితెరపై, వెండితెరపై నవ్వుల జల్లు కురిపిస్తూనే ఉన్నాడు. జబర్దస్త్ నవీన్, గడ్డం నవీన్, నవీన్ ఇటిక, జూనియర్ రాఘవేంద్రరావు.. ఇలా ఎన్నో పేర్లతో పాపులర్ అయ్యాడు. వరుస సినిమాలతో, విభిన్న పాత్రలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. 25 ఏళ్లుగా ఇండస్ట్రీలో నటుడిగా వెలుగొందుతున్న జబర్దస్త్ గడ్డం నవీన్ బర్త్‌డే నేడు (సెప్టెంబర్ 1). ఈ సందర్భంగా తన గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.
► ఇది 47వ పుట్టిన రోజు.. 1995లో సినీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చాను. అప్పటి నుంచి ఎన్నో ఒడిదుడుకులు చూశాను. ఈ సంవత్సరం చాలా సంతృప్తికరమైన జర్నీ సాగుతోంది. గేమ్ చేంజర్, సైంధవ్ సహా 10 సినిమాలు చేస్తున్నాను. మా పెద్దబాబు డిగ్రీలో గోల్డ్ మెడల్ సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది.
► పుట్టిపెరిగింది సికింద్రాబాద్. మా తల్లిదండ్రులు కృష్ణ, సక్కుబాయి. మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మా నాన్న ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేశారు. అయినా ఆర్థిక కష్టాలు మా కుటుంబాన్ని వెంటాడేవి. చదువుకుంటూనే మెకానిక్ షాపు, బట్టల షాపు, చిరు వ్యాపారాలు చేశాను. ఒకానొక సమయంలో ఆఫీస్ బాయ్‌గా కూడా పని చేశాను. ఆ క్రమంలోనే 1995 నుంచి సినీ అవకాశాల కోసం ప్రయత్నించాను. అప్పుడే పెళ్లిచేసుకున్నాను. నా భార్య పేరు బబితా. ఇద్దరు కొడుకులు పవన్ దినేష్, అక్షయ్ కుమార్. లోకల్ కాబట్టి సినీఇండస్ట్రీలో ఆకలి బాధలు పడలేదు కానీ.. మిగతా ఇబ్బందులు ఫేస్ చేశాను.
► సినిమాలకు వెళ్ళానుకున్నప్పుడు మా బాబాయ్ శ్రీను ప్రోత్సాహంతో ఓ చిన్న ఎంట్రీ దొరికింది. 'ప్రేమించేది ఎందుకమ్మా' సినిమాకి దర్శకులు సురేందర్ రెడ్డి ఆసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఆ సమయంలో నా హెయిర్ స్టైల్ బాగుండేది. సురేందర్ రెడ్డి గారు నన్ను సెలెక్ట్ చేసి అవకాశం ఇచ్చారు. మా వైఫ్ కూడా ఆర్టిస్ట్. అమెను కూడా ఫస్ట్ టైమ్ అక్కడే చూశాను.. సినిమా పూర్తియ్యేసరికి పేరేంట్స్‌కి తెలియకుండా పెళ్లి చేసుకున్నాం. ఈ విషయం తెలిసి సీరియస్ అయ్యారు.. కానీ తర్వాత అంతా హ్యాపీగా ఫీల్ అయ్యారు.
► హీరో అవుదామనే ఇండస్ట్రీకి వచ్చాను. ఫస్ట్ టైమ్ సిల్వర్ స్క్రీన్ పై కృష్ణ యాక్షన్ సీన్స్ చూసి బాగా ఫిదా అయ్యాను. ఆ తర్వాత చిరంజీవి సినిమాలు చూశాక మెంటల్ ఎక్కిపోయింది. ప్రతి ఆదివారం సినిమాలు చూడటం అలవాటై సినిమాలపై మక్కువ పెరిగింది. కమెడియన్‌గా కొంత గుర్తింపు తెచ్చుకున్నందుకు సంతోషంగా ఉంది. ఇప్పటివరకు 150 సినిమాలు చేశాను. నిర్మాత కావాలనేదే నా లక్ష్యం. అంతేకాకుండా ఓ సింగిల్ థియేటర్ నిర్మించాలన్న కల కూడా ఉంది.
► జబర్దస్త్, సినిమాలు, ఈవెంట్స్ చేస్తున్నాను కానీ.. ఆ పేమెంట్ నా కుటుంబ పోషణకు ఉపయోగపడుతుంది. అయితే ఉద్యోగం చేసేవాడిని, కానీ ఇప్పుడు వెళ్లడం లేదు. మా కంపెనీ యాజమానీ దినేష్ గారు.. ఎప్పుడు వెళ్లినా నాకు ఉద్యోగం ఇస్తారు. అందుకే ఆ కంపెనీకి ఇంకా రాజీనామా చేయలేదు. సొంత ఇల్లు కట్టుకోవాలనే డ్రీమ్ ఉంది. అప్పటి వరకు మీ సహకారంతో కష్టపడుతూనే ఉంటాను.
చదవండి: ఫోటో షేర్ చేసిన మంచు లక్ష్మి.. విష్ణుకు ఎందుకు రాఖీ కట్టలేదంటూ..?
Comments
Please login to add a commentAdd a comment