Anchor Lasya Wedding Anniversary Car Gift Given To Her Husband Manjunath - Sakshi
Sakshi News home page

పెళ్లి రోజు: కొత్త కారు కొన్న లాస్య

Published Tue, Feb 16 2021 5:41 PM | Last Updated on Tue, Feb 16 2021 7:22 PM

Lasya Car Gift To Manju On Marriage Anniversary - Sakshi

యాంకర్‌ లాస్య. ఈ పేరు తెలియని టీవీ ప్రేక్షకులు లేరనడంలో అతిశయోక్తి లేదు. ప్రముఖ యాంకర్‌గా పాపులారిటీ గడించిన ఆమె తన వ్యక్తిగత జీవితంలోని ఆటుపోట్లు కారణంగా బుల్లితెర మీద నుంచి నెమ్మదిగా పక్కకు జరిగింది. ప్రేమించిన వ్యక్తిని పెళ్లాడటం, పెద్దలను ఒప్పించి మరోసారి అదే వ్యక్తితో వేదమంత్రాల సాక్షిగా, కుటుంబ సభ్యుల సమక్షంలో భర్త వేలు పట్టుకుని ఏడడుగులు నడిచింది. ఆమె యాంకర్‌గా తిరిగి రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్న సమయంలో మరోసారి బిగ్‌బాస్‌ షో నుంచి పిలుపు వచ్చింది.

ఈసారి ఆలోచించింది, షోలో పాల్గొనేందుకు ఓకే చెప్పింది. అలా బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌లో అడుగు పెట్టిన లాస్య తన అభిమానులను మెప్పించింది. అనవసర విషయాల్లో తలదూర్చకుండా తన పనేదో తను చేసుకుపోయింది. కానీ అందరికీ వండి పెడుతూ వంటలక్కలా స్థిరపడిపోయింది. తన ప్రేమ, పెళ్లి విషయాలు చెప్తూ ఎన్నోసార్లు కంటతడి పెట్టింది. సోమవారం వారి పెళ్లి రోజు. ఈ సందర్భంగా లాస్య కొత్త కారు కొంది. మహీంద్రా ఎక్స్‌యూవీ 500 కారు కొనుగోలు చేసి భర్తకు కానుకగా ఇచ్చింది. దీని ధర పదహారు లక్షల పైమాటే! 

ప్రత్యేకమైన రోజుల్లో ఇలాంటి బహుమతినిస్తే ఎంత సంతృప్తిగా ఉంటుందో?! మేము ఇప్పుడు దీనిలో ఓ రౌండ్‌ వేసుకొస్తాం అని రాసుకొచ్చింది. ఇక నిన్న పెళ్లిరోజును పురస్కరించుకుని మంజునాథ్‌తో కలిసి దిగిన ఫొటోను అభిమానులతో పంచుకుంది. ఏ అనుబంధంలోనూ మంచి రోజులే ఉండవు. తుపానులా చుట్టేసే కష్టం ఎదురొచ్చినా సరే ఒకే గొడుగు కింద ఉండి దాన్ని ఎదుర్కొందాం. ఆ శక్తి మనకు ప్రేమ అందిస్తుంది అని భావోద్వేగ నోట్‌ రాసుకొచ్చింది. తన ప్రేమ కథను చెప్తూ ఓ స్పెషల్‌ వీడియోను తన యూట్యూబ్‌ ఛానల్‌లో రిలీజ్‌ చేసింది.

చదవండి: లాస్య ఛానెల్‌ హ్యాక్‌: హ్యాపీ అంటున్న నోయల్‌

బిగ్‌బాస్‌: అరియానా ఖాతాలో అరుదైన ఘనత

సినిమాలు తెలుగోడి దమ్ము చూపిస్తున్నాయి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement