మహీంద్రా ఎక్స్‌యూవీ 500 చౌక మోడల్ | Mahindra XUV500 W4 variant launched in India at Rs 10.83 lakh | Sakshi
Sakshi News home page

మహీంద్రా ఎక్స్‌యూవీ 500 చౌక మోడల్

Published Thu, Nov 7 2013 2:18 AM | Last Updated on Sat, Sep 2 2017 12:20 AM

మహీంద్రా ఎక్స్‌యూవీ 500 చౌక మోడల్

మహీంద్రా ఎక్స్‌యూవీ 500 చౌక మోడల్

న్యూఢిల్లీ: మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ బాగా పాపులర్ అయిన స్పోర్ట్స్ యుటిలిటి వెహికల్, ఎక్స్‌యూవీ500 మోడల్‌లో ఎంట్రీ లెవల్ వేరియంట్, డబ్ల్యూ4ను  బుధవారం మార్కెట్లోకి తెచ్చింది. ఈ కారు ధరను రూ.10.95 లక్షలు(ఎక్స్ షోరూమ్, ఢిల్లీ)గా నిర్ణయించామని ఎం అండ్ ఎం ఈడీ, ప్రెసిడెంట్ (ఆటోమోటివ్ అండ్ ఫార్మ్ ఎక్విప్‌మెంట్) పవన్ గోయెంకా చెప్పారు. మార్కెట్లోకి తెచ్చిన రెండేళ్లలోనే 74 వేల ఎక్స్‌యూవీ500 కార్లు అమ్ముడయ్యాయని వివరించారు.

మంచి అమ్మకాలు సాధించిన మోడళ్లలో ఈ కారు కూడా ఒకటని పేర్కొన్నారు. వినియోగదారుల ఫీడ్‌బ్యాక్ ఆధారంగా ఈ కొత్త వేరియంట్‌ను రూపొందించామని వివరించారు.  ప్రస్తుత ఎక్స్‌యూవీ500 ధరలు రూ.12 లక్షల నుంచి రూ.14.64 లక్షల రేంజ్‌లో (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ)ఉన్నాయి. ఇక  2.2 లీటర్ డీజిల్ ఇంజిన్ ఉన్న ఈ కారులో 6-స్పీడ్ ట్రాన్సిమిషన్, ఆరు రకాలుగా అడ్జెస్ట్ చేసుకోగల డ్రైవర్ సీటు, టిల్ట్ స్టీరింగ్, 4 స్పీకర్లతో కూడిన మ్యూజిక్ సిస్టమ్, రిమోట్ కంట్రోల్ లాకింగ్, ట్విన్ ఎయిర్‌బ్యాగ్స్, యాంటీ బ్రేకింగ్ సిస్టమ్(ఏబీఎస్) తదితర  ప్రత్యేకతలున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement