sport utility vehicle
-
మూడేళ్లలో సగం ఎస్‌యూవీలే
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలో స్పోర్ట్ యుటిలిటీ వెహికల్స్ (ఎస్యూవీ) హవా నడుస్తోంది. అభివృద్ధి చెందిన మార్కెట్లలో ఎస్‌యూవీల వాటా 35–38 శాతం ఉంటే.. భారత్‌లో ఇది 42 శాతమని బీవైడీ ఇండియా ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వెహికిల్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సంజయ్ గోపాలకృష్ణన్ తెలిపారు. భారత్‌లో సంస్థ మూడవ షోరూం మోడీ బీవైడీని హైదరాబాద్‌లో శుక్రవారం ప్రారంభించిన సందర్భంగా సాక్షి బిజినెస్ బ్యూరోతో మాట్లాడారు. మూడేళ్లలో ఎస్‌యూవీల వాటా 50 శాతానికి చేరుతుందన్నారు. హ్యాచ్‌బ్యాక్‌ల ధరలోనే రూ. 6–7 లక్షల నుంచే ఈ మోడళ్లు లభ్యం కావడం ఈ స్థాయి అమ్మకాలకు కారణమని చెప్పారు. ఆయనింకా ఏమన్నారంటే.. ధర ప్రాధాన్యత కాదు.. ప్యాసింజర్ వెహికల్స్ విషయంలో హైదరాబాద్ విభిన్న మార్కెట్. ఇక్కడి మార్కెట్లో ఏం జరుగుతుందో అంచనా వేయలేం. గడిచిన అయిదేళ్లలో హైదరాబాద్ విపణి గణనీయంగా వృద్ధి చెందింది. విక్రయాల పరంగా ఢిల్లీ, బెంగళూరు తర్వాత భాగ్యనగరి టాప్‌లో నిలిచింది. కారు కొనుగోలు నిర్ణయం విషయంలో ఒకప్పుడు ధర ప్రామాణికంగా ఉండేది. ప్రాధాన్యత క్రమంలో ఇప్పుడు బ్రాండ్, ఎక్స్టీరియర్స్, ఇంటీరియర్స్, ఫీచర్స్, సేఫ్టీ తర్వాత ధర నిలిచింది. దేశవ్యాప్తంగా జూలైలో ప్యాసింజర్ కార్లు 2,50,972 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఈ ఏడాది 50,000 యూనిట్లు.. దేశంలో సగటున నెలకు అన్ని బ్రాండ్లవి కలిపి 3,500 ఎలక్ట్రిక్ కార్లు అమ్ముడవుతున్నాయి. ఈ ఏడాది జూలై నాటికి 26,000 యూనిట్లు రోడ్డెక్కాయి. 2022లో దేశవ్యాప్తంగా 50,000 ఎలక్ట్రిక్ కార్లు అమ్ముడవుతాయని అంచనా. ప్యాసింజర్ వాహన రంగంలో ఈవీల వాటా 2 శాతమే. ఇది 2030 నాటికి 30 శాతానికి చేరనుంది. ఇక ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహన విక్రయాల్లో టాప్–1 ర్యాంక్ కోసం హైదరాబాద్, బెంగళూరు పోటీపడుతున్నాయి. ఈ–ప్యాసింజర్ వెహికల్స్‌లో దక్షిణాది వాటా 50–60 శాతంగా ఉంది. కస్టమర్లు తమ రెండవ కారుగా ఈవీని కొనుగోలు చేస్తున్నారు. భారీ లక్ష్యంతో.. అంతర్జాతీయంగా అందుబాటులో ఉన్న కార్లను భారత్‌లో పరిచయం చేస్తాం. బీవైడీ ఎలక్ట్రిక్ కారు ఈ6ను 2021 నవంబర్‌లో ప్రవేశపెట్టాం. 450 యూనిట్లు విక్రయించాం. ఒకసారి చార్జింగ్ చేస్తే ఈ కారు 520 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. దీపావళికి ప్రీమియం ఈ–ఎస్‌యూవీని ప్రకటించనున్నాం. జనవరి నుంచి డెలివరీలు ఉంటాయి. 2030 నాటికి ఈ–ప్యాసింజర్ వెహికల్స్ రంగంలో దేశంలో 30 శాతం మార్కెట్‌ను కైవసం చేసుకుంటాం. బీవైడీ భారత్‌లో ఇప్పటివరకు సుమారు రూ.1,185 కోట్లు వెచ్చించింది. -
Mahindra XUV 700: మేఘాలలో తేలిపొమ్మన్నది
ఎస్యూవీ మార్కెట్లో ఇతర కంపెనీలకు గట్టి పోటీ ఇచ్చేందుకు మహీంద్రా సిద్దమవుతోంది. త్వరలో రాబోతున్న మహీంద్రా ఎక్స్‌యూవీ 700 మోడల్ని అత్యున్నత ప్రమాణాలతో రూపుదిద్దుతోంది. ఈ మోడల్‌కి సంబంధించిన కీలక అప్డేట్ని మహీంద్రా అఫీషియల్‌గా రివీల్ చేసింది. స్కై రూఫ్ గత రెండుమూడేళ్లుగా సన్ రూఫ్ ఫీచర్ కస్టమర్లను బాగా ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా స్పోర్ట్స్ యూటిలిటీ సెగ్మెంట్లో ఈ ఫీచర్ క్రమంగా తప్పనిసరిగా మారింది. దీంతో మహీంద్రా సంస్థ నుంచి త్వరలో రాబోతున్న ఎక్స్‌యూవీ 700 మోడల్లో సన్‌రూఫ్‌ని మరింత ఆకర్షణీయంగా డిజైన్ చేశారు. స్కై రూఫ్ పేరుతో ఈ సెగ్మెంట్లో ఉన్న ఇతర కార్లకంటే పెద్దగా సన్‌రూఫ్‌ని డిజైన్ చేశారు. మహీంద్రా వెల్లడించిన వివరాల ప్రకారం 1360 మిల్లీమీటర్ల పొడవు, 870 మిల్లీమీటర్ల వెడల్పుతో స్కైరూఫ్ ఉంది. వీటికి పోటీగా ఇండియాలో అమ్మకాలు ఎక్కువగా ఎస్యూవీ మోడళ్లైన ఎంజీ హెక్టార్, జీప్ కంపాస్, టాటా హారియర్, టాటా సఫారీ, ఎంజీ జెడ్ఎస్ ఈవీలలో పనోరమిక్ సన్‌రూఫ్ ఫీచర్ ఉంది. ఇప్పుడు వాటి కంటే పెద్ద సన్‌రూఫ్‌తో మహీంద్రా మార్కెట్లో అడుగు పెడుతోంది. అంతేకాదు వేగానఇ బట్టి ఆటోమేటిక్‌గా లైటింగ్ అడ్జస్ట్ చేసే ఆటో బూస్టర్ హెడ్‌ల్యాంప్ ఫీచర్‌ని సైతం మహీంద్రా యాడ్ చేసింది. వెహికల్ స్పీడ్ 80 కి.మీ దాటితే ఆటోమేటిగా లైటింగ్ పెరుగుతుంది. Sorry sunroofs. The Skyroof™ has arrived.https://t.co/TsnlBtaeFq . . Stay tuned. There’s more coming.#HelloXUV700 #HelloSkyroof#XUV700 pic.twitter.com/ywfQcAo2Ph — MahindraXUV700 (@MahindraXUV700) June 26, 2021 చదవండి : స్కోడా ఎలక్ట్రిక్ కార్లు త్వరలోనే..! -
హోండా ‘డబ్ల్యూఆర్–వీ’ కొత్త వేరియంట్
న్యూఢిల్లీ: ప్రముఖ వాహన తయారీ కంపెనీ ‘హోండా కార్స్ ఇండియా’ (హెచ్‌సీఐఎల్) తాజాగా తన స్పోర్ట్స్ యుటిలిటీ వాహన శ్రేణిలో నూతన వేరియంట్‌ను గురువారం మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. డబ్ల్యూఆర్‌లో ‘వీ’ గ్రేడ్‌ను విడుదలచేసింది. డబ్ల్యూఆర్–వీ, వీఎక్స్, ఎస్ పేర్లతో అందుబాటులోకి వచ్చిన ఈకారు ప్రారంభ ధర రూ.9.95 లక్షలుగా కంపెనీ ప్రకటించింది. డీజిల్ ఇంజిన్ కలిగిన ఈ నూతన వేరియంట్లో ప్రీమియం ఎక్స్టీరియర్ ఫీచర్లు ఉన్నట్లు వివరించింది. ఫ్రంట్ ఫాగ్ లాంప్స్, పొజిషన్ లాంప్స్, గన్ మెటల్ ఫినిష్ మల్టీ–స్పోక్ అల్లాయ్ వీల్, హెడ్‌ల్యాంప్ ఇంటిగ్రేటెడ్ సిగ్నేచర్ ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్స్ (డీఆర్ఎల్) వంటి అధునాతన బాహ్య ఫీచర్లతో పాటు.. వెనుక పార్కింగ్ సెన్సర్లు, ప్యాసింజర్ సీట్ బెల్ట్ రిమైండర్, హై స్పీడ్ అలర్ట్, స్పీడ్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్ వంటి భద్రత ఫీచర్లు ఉన్నట్లు పేర్కొంది. ఈ సందర్భంగా సీనియర్ వైస్ ప్రెసిడెంట్, డైరెక్టర్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) రాజేష్ గోయల్ మాట్లాడుతూ.. ‘నూతన వేరియంట్‌కు జోడించిన అధునాతన ఫీచర్లను మా వినియోగదారులు ఆదరిస్తారని భావిస్తున్నాం’ అని అన్నారు. -
మహీంద్రా ఎక్స్‌యూవీ 500 చౌక మోడల్
న్యూఢిల్లీ: మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ బాగా పాపులర్ అయిన స్పోర్ట్స్ యుటిలిటి వెహికల్, ఎక్స్‌యూవీ500 మోడల్లో ఎంట్రీ లెవల్ వేరియంట్, డబ్ల్యూ4ను బుధవారం మార్కెట్లోకి తెచ్చింది. ఈ కారు ధరను రూ.10.95 లక్షలు(ఎక్స్ షోరూమ్, ఢిల్లీ)గా నిర్ణయించామని ఎం అండ్ ఎం ఈడీ, ప్రెసిడెంట్ (ఆటోమోటివ్ అండ్ ఫార్మ్ ఎక్విప్మెంట్) పవన్ గోయెంకా చెప్పారు. మార్కెట్లోకి తెచ్చిన రెండేళ్లలోనే 74 వేల ఎక్స్‌యూవీ500 కార్లు అమ్ముడయ్యాయని వివరించారు. మంచి అమ్మకాలు సాధించిన మోడళ్లలో ఈ కారు కూడా ఒకటని పేర్కొన్నారు. వినియోగదారుల ఫీడ్‌బ్యాక్ ఆధారంగా ఈ కొత్త వేరియంట్‌ను రూపొందించామని వివరించారు. ప్రస్తుత ఎక్స్‌యూవీ500 ధరలు రూ.12 లక్షల నుంచి రూ.14.64 లక్షల రేంజ్లో (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ)ఉన్నాయి. ఇక 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్ ఉన్న ఈ కారులో 6-స్పీడ్ ట్రాన్సిమిషన్, ఆరు రకాలుగా అడ్జెస్ట్ చేసుకోగల డ్రైవర్ సీటు, టిల్ట్ స్టీరింగ్, 4 స్పీకర్లతో కూడిన మ్యూజిక్ సిస్టమ్, రిమోట్ కంట్రోల్ లాకింగ్, ట్విన్ ఎయిర్‌బ్యాగ్స్, యాంటీ బ్రేకింగ్ సిస్టమ్(ఏబీఎస్) తదితర ప్రత్యేకతలున్నాయి.