న్యూఢిల్లీ: ప్రముఖ వాహన తయారీ కంపెనీ ‘హోండా కార్స్ ఇండియా’ (హెచ్‌సీఐఎల్) తాజాగా తన స్పోర్ట్స్ యుటిలిటీ వాహన శ్రేణిలో నూతన వేరియంట్‌ను గురువారం మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. డబ్ల్యూఆర్‌లో ‘వీ’ గ్రేడ్‌ను విడుదలచేసింది. డబ్ల్యూఆర్–వీ, వీఎక్స్, ఎస్ పేర్లతో అందుబాటులోకి వచ్చిన ఈకారు ప్రారంభ ధర రూ.9.95 లక్షలుగా కంపెనీ ప్రకటించింది. డీజిల్ ఇంజిన్ కలిగిన ఈ నూతన వేరియంట్‌లో ప్రీమియం ఎక్స్‌టీరియర్ ఫీచర్లు ఉన్నట్లు వివరించింది. ఫ్రంట్ ఫాగ్ లాంప్స్, పొజిషన్ లాంప్స్, గన్ మెటల్ ఫినిష్ మల్టీ–స్పోక్ అల్లాయ్ వీల్, హెడ్‌ల్యాంప్ ఇంటిగ్రేటెడ్ సిగ్నేచర్ ఎల్‌ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్స్ (డీఆర్‌ఎల్) వంటి అధునాతన బాహ్య ఫీచర్లతో పాటు.. వెనుక పార్కింగ్ సెన్సర్లు, ప్యాసింజర్ సీట్ బెల్ట్ రిమైండర్, హై స్పీడ్ అలర్ట్, స్పీడ్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్ వంటి భద్రత ఫీచర్లు ఉన్నట్లు పేర్కొంది. ఈ సందర్భంగా సీనియర్ వైస్ ప్రెసిడెంట్, డైరెక్టర్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) రాజేష్ గోయల్ మాట్లాడుతూ.. ‘నూతన వేరియంట్‌కు జోడించిన అధునాతన ఫీచర్లను మా వినియోగదారులు ఆదరిస్తారని భావిస్తున్నాం’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment