
న్యూ ఇయర్ సందర్భంగా ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ పలు కార్లపై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. కంపెనీ మోడల్ లైనప్‌లో అమేజ్, జాజ్, డబ్ల్యూఆర్-వీ, సిటీ కార్లపై లాభదాయకమైన డీల్‌లను కొనుగోలుదారులకు అందిస్తోంది. ఈ డీల్స్‌లో భాగంగా నగదు ప్రయోజనాలు, ఎక్స్ఛేంజ్ బోనస్, లాయల్టీ బోనస్, ఎఫ్‌ఓసీ ఉపకరణాలు, కార్పొరేట్ బోనస్లను హోండా అందిస్తోంది.
ఆయా కార్లపై హోండా అందిస్తోన్న ఆఫర్స్..!
హోండా అమేజ్
డిసెంబర్ 2021లో హోండా కార్లలో అత్యధికంగా అమ్ముడైన రెండో కారుగా హోండా అమేజ్ నిలిచింది. న్యూ ఇయర్ ఆఫర్‌లో భాగంగా రూ. 15,000 వరకు ఆఫర్లను అందిస్తోంది. ఇందులో కస్టమర్ లాయల్టీ బోనస్ రూ. 5,000, ఎక్స్ఛేంజ్ బోనస్ రూ. 6,000, కార్పొరేట్ డిస్కౌంట్ రూ. 4,000గా ఉంది.
హోండా సిటీ 5 జనరేషన్
జపనీస్ కార్‌మేకర్ బెస్ట్ సెల్లింగ్ మోడల్ హోండా సిటీ మోడల్‌పై ఏకంగా రూ. 35,596 తగ్గింపుతో రానుంది. క్యాష్ బెనిఫిట్ రూ. 10,000. ఎక్స్ఛేంజ్ బోనస్ రూ. 5,000, లాయల్టీ బోనస్ రూ. 5,000 కొనుగోలుదారులు పొందవచ్చు. ఎఫ్‌ఓసీ యాక్సెసరీస్‌పై సుమారు రూ. 10, 596 ప్రయోజనాలను హోండా అందిస్తోంది.
హోండా సిటీ 4 జనరేషన్
హోండా సిటీ 4 జనరేషన్ కారుపై సుమారు రూ. 20వేల వరకు తగ్గింపును హోండా అందిస్తోంది. లాయల్టీ బోనస్ రూ. 5,000, ఎక్స్ఛేంజ్ బోనస్ రూ. 7,000, హోండా సిటీ కొనుగోలుపై 8,000 కార్పొరేట్ తగ్గింపు రానుంది.
హోండా డబ్ల్యూఆర్-వీ
ఈ కారు కొనుగోలుపై ఎక్స్చేంజ్ బోనస్ రూ. 10, 000, లాయల్టీ బోనస్ రూ. 5,000, కార్పొరేట్ బెనిఫిట్లను రూ. 4,000 అందిస్తోంది.
హోండా జాజ్
హోండా జాజ్ కొనుగోలుపై రూ. 33,147 వరకు నగదు ప్రయోజనాలను కంపెనీ అందిస్తోంది, ఇందులో క్యాష్ బెనిఫిట్స్ రూ. 10,000, ఎక్స్ఛేంజ్ బోనస్ రూ. 5,000, లాయల్టీ బోనస్ రూ. 5,000, కార్పొరేట్ తగ్గింపు రూ. 4000 వరకు లభిస్తాయి. ఎఫ్‌ఓసీ యాక్సెరీస్‌పై రూ. 12,147 మేర ప్రయోజనాలను హోండా అందిస్తోంది.
చదవండి: దుమ్ము లేపుతున్న ఈవీ అమ్మకాలు.ఈ ఒక్క ఏడాదిలో 15 ఏళ్ల రికార్డు బద్ధలయ్యేనా?
Comments
Please login to add a commentAdd a comment