Honda Cars India Ltd
-
హోండా నుంచి న్యూ మోడల్ కారు
సాక్షి, హైదరాబాద్: హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ కొత్త మోడల్ కారును లాంచ్ చేసింది. నాగోల్ గ్రీన్ హోండా షోరూమ్ వద్ద బుధవారం ‘ఈ–హెవ్’ మోడల్ కారును హైదరాబాద్ మెట్రోవాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డు (హెచ్ఎమ్ఎస్ఎస్) ఎండీ ఎం.దానకిశోర్ లాంఛనంగా ప్రారంభించారు. కార్యక్రమంలో సీఈఓ వివేకానంద ఆర్యశ్రీ, సేల్స్ హెడ్ శ్రీధర్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హోండా ‘న్యూ సిటీ ఈ–హెవ్’ దేశంలో మొదటి బలమైన హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వాహనమని చెప్పారు. మెయిన్ స్ట్రీమ్ సెగ్మెంట్లో విప్లవాత్మక స్వీయ–ఛార్జింగ్‌తో అత్యంత సమర్థవంతంగా పని చేస్తోందన్నారు. గత నెల 14 నుంచి బుకింగ్ మొదలు కాగా, ఈ నెలలో అమ్మకాలను ప్రారంభించినట్లు వారు పేర్కొన్నారు. దీని పనితీరు, సామర్ధ్యం ప్రాముఖ్యంగా ఉంటుందని పేర్కొన్నారు. (చదవండి: యూట్యూబ్ క్రియేటర్లకు గూగుల్ భారీ షాక్!) -
న్యూ ఇయర్ ఆఫర్: హోండా కార్లపై భారీ తగ్గింపు..!
న్యూ ఇయర్ సందర్భంగా ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ పలు కార్లపై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. కంపెనీ మోడల్ లైనప్‌లో అమేజ్, జాజ్, డబ్ల్యూఆర్-వీ, సిటీ కార్లపై లాభదాయకమైన డీల్‌లను కొనుగోలుదారులకు అందిస్తోంది. ఈ డీల్స్‌లో భాగంగా నగదు ప్రయోజనాలు, ఎక్స్ఛేంజ్ బోనస్, లాయల్టీ బోనస్, ఎఫ్ఓసీ ఉపకరణాలు, కార్పొరేట్ బోనస్‌లను హోండా అందిస్తోంది. ఆయా కార్లపై హోండా అందిస్తోన్న ఆఫర్స్..! హోండా అమేజ్ డిసెంబర్ 2021లో హోండా కార్లలో అత్యధికంగా అమ్ముడైన రెండో కారుగా హోండా అమేజ్ నిలిచింది. న్యూ ఇయర్ ఆఫర్లో భాగంగా రూ. 15,000 వరకు ఆఫర్లను అందిస్తోంది. ఇందులో కస్టమర్ లాయల్టీ బోనస్ రూ. 5,000, ఎక్స్ఛేంజ్ బోనస్ రూ. 6,000, కార్పొరేట్ డిస్కౌంట్ రూ. 4,000గా ఉంది. హోండా సిటీ 5 జనరేషన్ జపనీస్ కార్‌మేకర్ బెస్ట్ సెల్లింగ్ మోడల్ హోండా సిటీ మోడల్‌పై ఏకంగా రూ. 35,596 తగ్గింపుతో రానుంది. క్యాష్ బెనిఫిట్ రూ. 10,000. ఎక్స్ఛేంజ్ బోనస్ రూ. 5,000, లాయల్టీ బోనస్ రూ. 5,000 కొనుగోలుదారులు పొందవచ్చు. ఎఫ్ఓసీ యాక్సెసరీస్‌పై సుమారు రూ. 10, 596 ప్రయోజనాలను హోండా అందిస్తోంది. హోండా సిటీ 4 జనరేషన్ హోండా సిటీ 4 జనరేషన్ కారుపై సుమారు రూ. 20వేల వరకు తగ్గింపును హోండా అందిస్తోంది. లాయల్టీ బోనస్ రూ. 5,000, ఎక్స్ఛేంజ్ బోనస్ రూ. 7,000, హోండా సిటీ కొనుగోలుపై 8,000 కార్పొరేట్ తగ్గింపు రానుంది. హోండా డబ్ల్యూఆర్-వీ ఈ కారు కొనుగోలుపై ఎక్స్చేంజ్ బోనస్ రూ. 10, 000, లాయల్టీ బోనస్ రూ. 5,000, కార్పొరేట్ బెనిఫిట్లను రూ. 4,000 అందిస్తోంది. హోండా జాజ్ హోండా జాజ్ కొనుగోలుపై రూ. 33,147 వరకు నగదు ప్రయోజనాలను కంపెనీ అందిస్తోంది, ఇందులో క్యాష్ బెనిఫిట్స్ రూ. 10,000, ఎక్స్ఛేంజ్ బోనస్ రూ. 5,000, లాయల్టీ బోనస్ రూ. 5,000, కార్పొరేట్ తగ్గింపు రూ. 4000 వరకు లభిస్తాయి. ఎఫ్ఓసీ యాక్సెరీస్పై రూ. 12,147 మేర ప్రయోజనాలను హోండా అందిస్తోంది. చదవండి: దుమ్ము లేపుతున్న ఈవీ అమ్మకాలు.ఈ ఒక్క ఏడాదిలో 15 ఏళ్ల రికార్డు బద్ధలయ్యేనా? -
హోండా ‘డబ్ల్యూఆర్–వీ’ కొత్త వేరియంట్
న్యూఢిల్లీ: ప్రముఖ వాహన తయారీ కంపెనీ ‘హోండా కార్స్ ఇండియా’ (హెచ్‌సీఐఎల్) తాజాగా తన స్పోర్ట్స్ యుటిలిటీ వాహన శ్రేణిలో నూతన వేరియంట్‌ను గురువారం మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. డబ్ల్యూఆర్‌లో ‘వీ’ గ్రేడ్‌ను విడుదలచేసింది. డబ్ల్యూఆర్–వీ, వీఎక్స్, ఎస్ పేర్లతో అందుబాటులోకి వచ్చిన ఈకారు ప్రారంభ ధర రూ.9.95 లక్షలుగా కంపెనీ ప్రకటించింది. డీజిల్ ఇంజిన్ కలిగిన ఈ నూతన వేరియంట్లో ప్రీమియం ఎక్స్టీరియర్ ఫీచర్లు ఉన్నట్లు వివరించింది. ఫ్రంట్ ఫాగ్ లాంప్స్, పొజిషన్ లాంప్స్, గన్ మెటల్ ఫినిష్ మల్టీ–స్పోక్ అల్లాయ్ వీల్, హెడ్‌ల్యాంప్ ఇంటిగ్రేటెడ్ సిగ్నేచర్ ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్స్ (డీఆర్ఎల్) వంటి అధునాతన బాహ్య ఫీచర్లతో పాటు.. వెనుక పార్కింగ్ సెన్సర్లు, ప్యాసింజర్ సీట్ బెల్ట్ రిమైండర్, హై స్పీడ్ అలర్ట్, స్పీడ్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్ వంటి భద్రత ఫీచర్లు ఉన్నట్లు పేర్కొంది. ఈ సందర్భంగా సీనియర్ వైస్ ప్రెసిడెంట్, డైరెక్టర్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) రాజేష్ గోయల్ మాట్లాడుతూ.. ‘నూతన వేరియంట్‌కు జోడించిన అధునాతన ఫీచర్లను మా వినియోగదారులు ఆదరిస్తారని భావిస్తున్నాం’ అని అన్నారు. -
పెరగనున్న హోండా కార్ల ధరలు
న్యూఢిల్లీ: వచ్చే నెల నుంచి కార్ల ధరలను పెంచాలని యోచిస్తున్నట్లు హోండా కార్స్ ఇండియా వెల్లడించింది. పెరుగుతున్న ఉత్పత్తి వ్యయాలు, నూతన భద్రతా ప్రమాణాల అమలుకు సంబంధించిన ధరల భారాన్ని వినియోగదారులపై మోపాలని భావిస్తున్నట్లు తెలిపింది. ఈ అంశంపై కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, డైరెక్టర్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) రాజేష్ గోయల్ మాట్లాడుతూ.. ‘జూలై నుంచి కార్ల ధరలను పెంచే దిశగా నిర్ణయాలు తీసుకుంటున్నాం. గత కొంతకాలంగా ముడి పదార్థాల ధరలు పెరుగుతుండడం, భద్రతా ప్రమాణాల అంశాలే ఇందుకు ప్రధాన కారణం. ఈ నేపథ్యంలో ధరలు 1.2 శాతం మేర పెరిగేందుకు అవకాశం ఉంది’ అని అన్నారు. పెంపు అమలైతే ఈ ఏడాదిలో రెండవ సారి హోండా కార్ల ధరలు పెరిగినట్లు అవుతుంది. ఫిబ్రవరిలో రూ.10,000 మేర ధరలు పెరిగాయి. మరోవైపు ఇతర సంస్థలు కూడా ఈఏడాది జనవరిలో ధరలను పెంచాయి. -
కారు కొంటే.. హోండా బంపర్ ఆఫర్
సాక్షి,న్యూఢిల్లీ: సెప్టెంబర్ 1నుంచి కార్ల ధరలు పెరిగాయని అందోళన పడుతున్నవారికి ప్రముఖ కార్ల తయారీ సంస్థ హోండా పండుగ కానుక అందిస్తోంది. హోండా కారు కొనుగోలు చేసిన వినియోగదారులకు నెలవారీ విలువైన బహుమతులతోపాటు, ఒక బంపర్ ఆఫర్ ఉంటుందని ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని హోండా షోరూంలలో ప్రమోషనల్ ఆఫర్‌గా తీసుకొచ్చిన ఈ ఆఫర్లో లక్కీ డ్రా గెలిచిన కస్టమర్లకు ఉచితంగా విదేశీ ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తోంది. తమ మోడల్ కార్లు అన్నింటిపైనా ఈ ఆఫర్ వర్తింస్తుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. వార్షికోత్సవ వేడుకల సందర్భంగా భారతదేశంలో ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ ఈ ఆఫర్‌ను వెల్లడించింది. ది గ్రేట్ హోండా ఫెస్ట్ పేరుతో ప్రకటించిన ఆఫర్లో నెలవారీ డిస్కౌంట్లు, ఆఫర్లకు తోడుగా మరో గ్రాండ్ ప్రైజ్‌ను కూడా అందిచనున్నామని తెలిపింది. ఇందులో లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేసిన కస్టమర్‌కు లండన్, పారిస్ టూర్ ఆఫర్ అందిస్తోంది. సెప్టెంబర్ 1నుంచి నవంబరు7, 2018 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. కారును కొనుగోలు చేసిన అనంతరం హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ వెబ్సైట్ www.hondacarindia.లో రిజిస్టర్ కావాల్సి ఉంటుంది. నిర్దేశిత కాలంలో బిల్లింగ్, డాక్యుమెంటేషన్ తదితర అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసిన కస్టమర్లు ఈ ఆఫర్ పొందేందుకు అర్హులు. బ్రియో జాజ్, అమేజ్, డబ్యలువీఆర్-వీ, సిటీ, బీఆర్-వి ఎస్యూవీ , సీఆర్-వి, అకార్డ్ హైబ్రిడ్ సహా అన్ని హోండా కార్ల కొనుగోళ్లపై ఆ ఆఫర్ వర్తిస్తుంది. -
పండుగల నాటికి సివిక్ రీ–ఎంట్రీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కార్ల తయారీ సంస్థ హోండా కార్స్ ఇండియా నుంచి ప్రీమియం సెడాన్ ‘సివిక్’ రీ–ఎంట్రీ ఇవ్వబోతోంది. 2013లో ఈ మోడల్ కార్ల అమ్మకాలను కంపెనీ నిలిపివేసింది. 55,000లకు పైగా సివిక్ కార్లు భారత రోడ్లపై పరుగెడుతున్నాయి. కస్టమర్ల నుంచి డిమాండ్ రావడంతో తిరిగి ఈ కారును ప్రవేశ పెట్టాలని నిర్ణయించామని హోండా కార్స్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రాజేశ్ గోయల్ మంగళవారం పేర్కొన్నారు. ఎస్యూవీ అయిన సీఆర్–వీ అప్‌గ్రేడెడ్ మోడల్ సైతం రంగ ప్రవేశం చేయనుందని చెప్పారు. ఈ రెండు మోడళ్లు పండుగల సీజన్ నాటికి అడుగుపెట్టే అవకాశం ఉందని వెల్లడించారు. హైదరాబాద్‌లో కొత్త అమేజ్ కారును ప్రవేశపెట్టిన సందర్భంగా సౌత్ సేల్స్ హెడ్ సెంథిల్ కుమార్ నటరాజన్‌తో కలసి మీడియాతో మాట్లాడారు. రెండంకెల వృద్ధి.. కంపెనీ 2017–18లో భారత్‌లో 1,70,000 పైగా కార్లను విక్రయించింది. అంత క్రితం ఏడాదితో పోలిస్తే ఇది 8 శాతం అధికం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్యాసింజర్ కార్ల పరిశ్రమ వృద్ధి రేటు 8 శాతం ఉండనుందని రాజేశ్ గోయల్ తెలిపారు. ‘హోండా వృద్ధి రేటు పరిశ్రమను మించి రెండంకెలు సాధిస్తుందన్న ధీమా ఉంది. కొత్త అమేజ్ కోసం ఈ ఏడాది మార్చిలోపే 50,000లకు పైగా ఎంక్వైరీలు వచ్చాయి. నూతన ప్లాట్‌ఫామ్‌పైన ఈ కారును అభివృద్ధి చేశాం. ఫస్ట్ జనరేషన్ అమేజ్ మోడల్లో 2.6 లక్షల కార్లు ఇప్పటి వరకు అమ్ముడయ్యాయి. 241 నగరాల్లో 353 ఔట్లెట్లను నిర్వహిస్తున్నాం’ అని వివరించారు. -
హోండా అమేజ్ సరికొత్తగా...ప్రారంభ ఆఫర్
హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ తన పాపులర్ మోడల్ హోండా అమేజ్ కారు 2018 వెర్షన్‌ను లాంచ్ చేసింది. ఈ సెంకండ్ జనరేషన్ హోండా అమేజ్ ఈ, ఎస్, వి, విఎక్స్ అనే 4 వేరియంట్లలో ఈ కారు లభ్యమవుతుంది. పెట్రోల్, డీజిల్ ఇంజీన్లతో, మాన్యువల్ అండ్ ఆటోమేటిక్ (సీవీఈ) ట్రాన్స్మిషన్ ఆప్షన్లలో ఈ కార్లు అందుబాటులో ఉన్నాయి. దీని ప్రారంభధర రూ. 5.59 లక్షల నుంచి (ఎక్స్ షోరూమ్, ఇండియా) మొదలవుతుంది. ఈ ధరలు తొలి 20వేల మంది కస్టమర్లకు మాత్రమేనని తెలిపింది. ఫస్ట్ జనరేషన్‌తో పోలిస్తే సెకండ్ జనరేషన్లోఎక్స్టీరయర్ డిజైన్ పూర్తిగా మార్చి న్యూ లుక్‌లో తీసుకొచ్చింది. దీంతోపాటు కి.మీలతో సంబంధం లేకుండా 3 సంవత్సరాల వారంటీ ఇస్తోంది. అలాతేడీజిల్ పెట్రోల్ వెర్షన్లో స్పెషల్ మెయింటెన్స్ ప్యాకేజీ కూడా అందిస్తోంది. దేశవ్యాప్తంగా హోండా డీలర్లు ఇప్పటికే 2018 అమేజ్ బుకింగ్‌లను ప్రారంభించారనీ, డెలివరీలు త్వరలోనే ప్రారంభమవుతాయని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. కొత్త అమేజ్ లాంచింగ్ ద్వారా టైర్-2, టైర్ 3 ఏరియాల్లో తమ విక్రయాలు పెరుగుతాయనే విశ్వాసాన్ని వ్యక్తం చేసింది. డబుల్ ఫ్రంట్ ఎయిర్ బాగ్స్ ఈబీడీ, ఆటోమేటిక్ బ్రేక్ సిస్టం, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్, ఇంపాక్ట్ సెన్సింగ్ డోర్ లాక్స్, ఐసోఫిక్స్ సీటు యాంకర్స్, 15-ఇంచ్ అల్లాయ్ వీల్స్ ప్రామాణిక ఫీచర్లుగా ఉండనున్నాయి. ఇక ఇంధన సామర్ధ్యం విషయానికి వస్తే పెట్రోల్ వెర్షన్లో లీటరుకు మాన్యువల్‌లో19.5కి.మీ / సీవీటీ - 19 కి.మీ, డీజిల్ లీటరుకు (మాన్యువల్) 27.4కి.మీ / సీవీటీ - 23.8కి.మీ.గా ఉంది. మారుతి సుజుకి డిజైర్ గట్టి పోటీగా ఈ నిలుస్తున్న హోండా అమేజ్ కొత్త కారు డిజైర్‌తో పోలిస్తే 3వేల రూపాయల తక్కువ ధరకే అందుబాటులోకి తెచ్చింది. -
హోండా కార్ల ధరలు పెరుగుతాయ్
న్యూఢిల్లీ: హోండా కార్స్ ఇండియా కంపెనీ కార్ల ధరలను పెంచనున్నది. వచ్చే నెల మొదటి వారం నుంచి తమ కార్ల ధరలను పెంచాలనుకుంటున్నామని కంపెనీ సీనియర్ వైస్-ప్రెసిడెంట్ జ్ఞానేశ్వర్ సేన్ చెప్పారు. ద్రవ్యోల్బణం, కరెన్సీ ఒడిదుడుకుల ప్రభావాలను కొంతైనా తట్టుకునేందుకు ధరలు పెంచాలని యోచిస్తున్నామని, ఏ మేరకు ధరలు పెంచాలనేదానిపై కసరత్తు చేస్తున్నావన్నారు. తాము విక్రయించే అన్ని మోడళ్ల కార్ల (అమేజ్, బ్రియో, సీఆర్-వీ, అకార్డ్) ధరలను పెంచనున్నామని చెప్పారు. ఈ ఏడాది అక్టోబర్‌లోనే హోండా కార్ల ధరలను రూ.2,000-రూ.10,000 రేంజ్లో పెంచింది. వచ్చే నెల నుంచి కార్ల ధరలను పెంచనున్నామని ఇప్పటికే బీఎండబ్ల్యూ, ఆడి, మెర్సిడెస్‌లు ప్రకటించాయి. -
హోండా సిటీ.. డీజిల్ వేరియంట్
న్యూఢిల్లీ: జపాన్‌కు చెందిన హోండా కంపెనీ సిటీ మోడల్లో ఫోర్త్ జనరేషన్ వేరియంట్లను సోమవారం ఆవిష్కరించింది. తొలిసారిగా సిటీ మోడల్లో డీజిల్ వేరియంట్‌ను అందిస్తోంది. జనవరి నుంచి ఈ ఫోర్త్ జనరేషన్ సిటీ మోడల్ (పెట్రోల్, డీజిల్ వేరియంట్ల) విక్రయాలు ప్రారంభిస్తామని కంపెనీ ప్రెసిడెంట్ అండ్ సీఈవో హిరొనొరి కనయమ చెప్పారు. ఈ కొత్త మోడల్‌కు ముందస్తు బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభించామని పేర్కొన్నారు. ధర వివరాలను ఆయన వెల్లడించనప్పటికీ, ఈ కారు ధరలు రూ.7.50-రూ.11.50 లక్షల రేంజ్లో ఉంటాయనేది పరిశ్రమవర్గాల అంచనా. ఈ కారు హ్యుందాయ్ వెర్నా, రేనాల్ట్ స్కేలా, నిస్సాన్ సన్నీ, మారుతీ సుజుకి ఎస్ఎక్స్4, ఫోక్స్‌వ్యాగన్ వెంటో, ఫోర్డ్ ఫియస్టా, షెవర్లే సెయిల్, ఫియట్ లినియా, స్కోడా రాపిడ్‌లతో పోటీ పడాల్సి ఉంటుందని పరిశ్రమ వర్గాలంటున్నాయి. వచ్చే ఏడాది మొదట్లో మల్టీ పర్పస్ వెహికల్, మొబిలియోను అందుబాటులోకి తెస్తామని, మరో 3 కొత్త మోడళ్లను మార్కెట్లోకి తెస్తామని కనయమ పేర్కొన్నారు. 1998లో హోండా సిటీ కారును కంపెనీ తొలిసారి భారత్ మార్కెట్లోకి విడుదల చేసింది. ఇప్పటిదాకా 4.3 లక్షల కార్లను విక్రయించింది. హోండా మోడళ్లలో అత్యధికంగా అమ్ముడయ్యే కారు ఇదే. ప్రస్తుతం హోండా సిటీ పెట్రోల్ వేరియంట్లోనే లభిస్తోంది. ఇక కొత్త హోండా సిటీ పెట్రోల్, డీజిల్ ఇంజిన్‌లోనూ లభ్యమవుతాయి. టచ్‌స్క్రీన్ ఇంటర్ఫేస్, బ్లూటూత్ టెలిఫోనీ, రియర్ వ్యూ కెమెరా, కీలెస్ స్టార్ట్, సన్‌రూఫ్ వంటి ప్రత్యేకతలున్నాయి.