హోండా కార్ల ధరలు పెరుగుతాయ్ | Honda Cars to hike prices of entire range from January | Sakshi
Sakshi News home page

హోండా కార్ల ధరలు పెరుగుతాయ్

Published Thu, Dec 5 2013 1:42 AM | Last Updated on Sat, Sep 2 2017 1:15 AM

హోండా కార్ల ధరలు పెరుగుతాయ్

హోండా కార్ల ధరలు పెరుగుతాయ్

న్యూఢిల్లీ: హోండా కార్స్ ఇండియా కంపెనీ కార్ల ధరలను పెంచనున్నది. వచ్చే నెల మొదటి వారం నుంచి తమ కార్ల ధరలను పెంచాలనుకుంటున్నామని కంపెనీ సీనియర్ వైస్-ప్రెసిడెంట్ జ్ఞానేశ్వర్ సేన్ చెప్పారు. ద్రవ్యోల్బణం, కరెన్సీ ఒడిదుడుకుల ప్రభావాలను కొంతైనా తట్టుకునేందుకు ధరలు పెంచాలని యోచిస్తున్నామని, ఏ మేరకు ధరలు పెంచాలనేదానిపై కసరత్తు చేస్తున్నావన్నారు. తాము విక్రయించే అన్ని మోడళ్ల కార్ల (అమేజ్, బ్రియో, సీఆర్-వీ, అకార్డ్) ధరలను పెంచనున్నామని చెప్పారు. ఈ ఏడాది అక్టోబర్‌లోనే హోండా కార్ల ధరలను రూ.2,000-రూ.10,000 రేంజ్‌లో పెంచింది. వచ్చే నెల నుంచి కార్ల ధరలను పెంచనున్నామని ఇప్పటికే బీఎండబ్ల్యూ, ఆడి, మెర్సిడెస్‌లు ప్రకటించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement