హోండా సిటీ.. డీజిల్ వేరియంట్ | New Honda City unveiled; to be available in diesel variant too | Sakshi
Sakshi News home page

హోండా సిటీ.. డీజిల్ వేరియంట్

Published Tue, Nov 26 2013 1:45 AM | Last Updated on Sat, Sep 2 2017 12:58 AM

హోండా సిటీ.. డీజిల్ వేరియంట్

హోండా సిటీ.. డీజిల్ వేరియంట్

న్యూఢిల్లీ: జపాన్‌కు చెందిన హోండా కంపెనీ సిటీ మోడల్‌లో ఫోర్త్ జనరేషన్ వేరియంట్‌లను సోమవారం ఆవిష్కరించింది. తొలిసారిగా సిటీ మోడల్‌లో డీజిల్ వేరియంట్‌ను అందిస్తోంది. జనవరి నుంచి ఈ ఫోర్త్ జనరేషన్ సిటీ మోడల్ (పెట్రోల్, డీజిల్ వేరియంట్‌ల) విక్రయాలు ప్రారంభిస్తామని కంపెనీ ప్రెసిడెంట్ అండ్ సీఈవో హిరొనొరి కనయమ చెప్పారు.
 
 ఈ కొత్త మోడల్‌కు ముందస్తు బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభించామని పేర్కొన్నారు. ధర వివరాలను ఆయన వెల్లడించనప్పటికీ, ఈ కారు ధరలు రూ.7.50-రూ.11.50 లక్షల రేంజ్‌లో ఉంటాయనేది పరిశ్రమవర్గాల అంచనా. ఈ కారు హ్యుందాయ్ వెర్నా, రేనాల్ట్ స్కేలా, నిస్సాన్ సన్నీ, మారుతీ సుజుకి ఎస్‌ఎక్స్4, ఫోక్స్‌వ్యాగన్ వెంటో, ఫోర్డ్ ఫియస్టా, షెవర్లే సెయిల్, ఫియట్ లినియా, స్కోడా రాపిడ్‌లతో పోటీ పడాల్సి ఉంటుందని పరిశ్రమ వర్గాలంటున్నాయి. వచ్చే ఏడాది మొదట్లో మల్టీ పర్పస్ వెహికల్, మొబిలియోను అందుబాటులోకి తెస్తామని, మరో 3 కొత్త మోడళ్లను మార్కెట్లోకి తెస్తామని కనయమ పేర్కొన్నారు.
 
 1998లో హోండా సిటీ కారును కంపెనీ తొలిసారి భారత్ మార్కెట్లోకి విడుదల చేసింది. ఇప్పటిదాకా 4.3 లక్షల కార్లను విక్రయించింది. హోండా మోడళ్లలో అత్యధికంగా అమ్ముడయ్యే కారు ఇదే. ప్రస్తుతం హోండా సిటీ పెట్రోల్ వేరియంట్‌లోనే లభిస్తోంది. ఇక కొత్త హోండా సిటీ పెట్రోల్, డీజిల్ ఇంజిన్‌లోనూ లభ్యమవుతాయి. టచ్‌స్క్రీన్ ఇంటర్‌ఫేస్, బ్లూటూత్ టెలిఫోనీ, రియర్ వ్యూ కెమెరా, కీలెస్ స్టార్ట్, సన్‌రూఫ్ వంటి ప్రత్యేకతలున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement