హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ తన పాపులర్ మోడల్ హోండా అమేజ్ కారు 2018 వెర్షన్‌ను లాంచ్ చేసింది. ఈ సెంకండ్ జనరేషన్ హోండా అమేజ్ ఈ, ఎస్, వి, విఎక్స్ అనే 4 వేరియంట్లలో ఈ కారు లభ్యమవుతుంది. పెట్రోల్, డీజిల్ ఇంజీన్లతో, మాన్యువల్ అండ్ ఆటోమేటిక్ (సీవీఈ) ట్రాన్స్మిషన్ ఆప్షన్లలో ఈ కార్లు అందుబాటులో ఉన్నాయి. దీని ప్రారంభధర రూ. 5.59 లక్షల నుంచి (ఎక్స్ షోరూమ్, ఇండియా) మొదలవుతుంది. ఈ ధరలు తొలి 20వేల మంది కస్టమర్లకు మాత్రమేనని తెలిపింది. ఫస్ట్ జనరేషన్‌తో పోలిస్తే సెకండ్ జనరేషన్‌లోఎక్స్‌టీరయర్ డిజైన్ పూర్తిగా మార్చి న్యూ లుక్‌లో తీసుకొచ్చింది. దీంతోపాటు కి.మీలతో సంబంధం లేకుండా 3 సంవత్సరాల వారంటీ ఇస్తోంది. అలాతేడీజిల్ పెట్రోల్ వెర్షన్‌లో స్పెషల్ మెయింటెన్స్ ప్యాకేజీ కూడా అందిస్తోంది.
దేశవ్యాప్తంగా హోండా డీలర్లు ఇప్పటికే 2018 అమేజ్ బుకింగ్‌లను ప్రారంభించారనీ, డెలివరీలు త్వరలోనే ప్రారంభమవుతాయని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. కొత్త అమేజ్ లాంచింగ్ ద్వారా టైర్-2, టైర్ 3 ఏరియాల్లో తమ విక్రయాలు పెరుగుతాయనే విశ్వాసాన్ని వ్యక్తం చేసింది. డబుల్ ఫ్రంట్ ఎయిర్ బాగ్స్ ఈబీడీ, ఆటోమేటిక్ బ్రేక్ సిస్టం, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్, ఇంపాక్ట్ సెన్సింగ్ డోర్ లాక్స్, ఐసోఫిక్స్ సీటు యాంకర్స్, 15-ఇంచ్ అల్లాయ్ వీల్స్ ప్రామాణిక ఫీచర్లుగా ఉండనున్నాయి. ఇక ఇంధన సామర్ధ్యం విషయానికి వస్తే పెట్రోల్ వెర్షన్‌లో లీటరుకు మాన్యువల్‌లో19.5కి.మీ / సీవీటీ - 19 కి.మీ, డీజిల్ లీటరుకు (మాన్యువల్) 27.4కి.మీ / సీవీటీ - 23.8కి.మీ.గా ఉంది. మారుతి సుజుకి డిజైర్ గట్టి పోటీగా ఈ నిలుస్తున్న హోండా అమేజ్ కొత్త కారు డిజైర్‌తో పోలిస్తే 3వేల రూపాయల తక్కువ ధరకే అందుబాటులోకి తెచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment