honda Amaze
-
హోండా అమేజ్ థర్డ్ జనరేషన్ వచ్చేసింది..
కార్ల తయారీలో ఉన్న జపాన్ సంస్థ హోండా మూడవ తరం అమేజ్‌ను కంపెనీ పరిచయం చేసింది. ఎక్స్ షోరూమ్‌లో ధర రూ.7.99 లక్షల నుండి రూ.10.89 లక్షల వరకు ఉంది. ఈ మోడల్ మాన్యువల్, ఆటోమేటిక్ వేరియంట్లలో తయారైంది. కాంపాక్ట్ సెడాన్ సెగ్మెంట్లో మారుతీ డిజైర్, హ్యుండై ఆరా వంటి మోడళ్లతో ఇది పోటీపడుతోంది.దేశంలో అడాస్ భద్రతా ఫీచర్లను కలిగిన అత్యంత సరసమైన కారు అమేజ్ అని హోండా కార్స్ ఇండియా ప్రెసిడెంట్, సీఈవో టకుయ సుమూర చెప్పారు.హోండా దేశంలో ఇప్పటివరకు 5.8 లక్షల యూనిట్ల అమేజ్ కార్లను విక్రయించింది. అమేజ్ మొదటి తరం 2013లో, రెండవ తరం 2018లో ప్రవేశించింది. అమేజ్ కస్టమర్లలో 50% మంది మొదటిసారి కారును సొంతం చేసుకున్నవారేనని సేల్స్ వైస్ ప్రెసిడెంట్ కునాల్ బెహల్ పేర్కొన్నారు. 2027 నాటికి మరో మూడు మోడళ్లు హోండా 2027 మార్చి నాటికి భారత్‌లో మూడు కొత్త మోడళ్లను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. బలంగా అభివృద్ధి చెందుతున్న ఎస్యూవీ విభాగంలో వృద్ధి అవకాశాలను అందిపుచ్చుకోవాలని చూస్తున్నట్టు హోండా కార్స్ ఇండియా ప్రెసిడెంట్, సీఈవో టకుయ సుమూర తెలిపారు. కంపెనీ ప్రస్తుతం భారత్‌లో ఎలివేట్ ఎస్‌యూవీతోపాటు సెడాన్స్ అయిన అమేజ్, సిటీ మోడళ్లను విక్రయిస్తోంది.2026–27 ఆర్థిక సంవత్సరం నాటికి హైబ్రిడ్, ఎలక్ట్రిక్ పవర్ట్రెయిన్లతో మూడు కొత్త మోడళ్లను పరిచయం చేయడానికి ప్రణాళిక చేస్తున్నట్టు సుమూర తెలిపారు. తద్వారా ఎస్యూవీ విభాగంలో కంపెనీ ఉనికిని విస్తరిస్తుందని చెప్పా రు. భారతీయ మార్కెట్‌కు సరిపోయే హైబ్రిడ్, బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనాల వంటి మోడళ్లను హోండా అభివృద్ధి చేస్తూనే ఉందని వెల్లడించారు. -
హోండా కార్లు కొనేవారికి చేదువార్త! ఆ మోడళ్ల ధరల పెంపు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ హోండా కార్స్ ఇండియా సిటీ, అమేజ్ మోడళ్ల ధరలను జూన్ నుంచి ఒక శాతం వరకు పెంచనున్నట్లు తెలిపింది. పెరిగిన వ్యయ ఒత్తిళ్ల ప్రభావాన్ని అధిగమించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీ బుధవారం (మే24) ప్రకటించింది. హైదరాబాద్ ఎక్స్‌షోరూంలో అమేజ్ ధర రూ.6.99 లక్షల నుంచి రూ.9.60 లక్షల వరకు ఉంది. స్ట్రాంగ్ హైబ్రిడ్ ట్రిమ్స్‌తో సహా సిటీ మోడల్ శ్రేణి రూ.11.55 లక్షలు మొదలుకుని రూ.20.39 లక్షల వరకు ఉంది. మరోవైపు హోండా ఇండియా కార్స్ తన తాజా ఎస్యూవీ లాంచింగ్ తేదీని ధ్రువీకరించింది. జూన్ 6న హోండా ఎలివేట్ ఎస్‌యూవీని ఆవిష్కరించనుంది. ఈ ఎస్‌యూవీకి సంబంధించిన టీజీర్ చిత్రాన్ని హోండా ట్విటర్ ద్వారా విడుదల చేసింది. ఇదీ చదవండి: e-Sprinto Amery: మార్కెట్లోకి మరో ఎలక్ట్రిక్ స్కూటర్.. ఒక్కసారి చార్జి చేస్తే 140 కిలోమీటర్లు.. -
హోండా జాజ్ స్పెషల్ ఎడిషన్ లాంచ్
సాక్షి, న్యూఢిల్లీ : హోండా కార్స్ ఇండియా తన ఫ్లాగ్షిప్ హ్యాచ్ బ్యాక్ కారు జాజ్‌లో ఎక్స్‌క్లూజివ్ ఎడిషన్‌ను లాంచ్ చేసింది. పెట్రోలు సీవీటీ వేరియంట్‌గా మాత్రమే లభిస్తున్న ఈ స్పెషల్ వేరియంట్ హోండా జాజ్ ధరను రూ.9.22 లక్షలుగా (ఎక్స్ షోరూం,ఢిల్లీ) నిర్ణయించింది. కారు బయటా, లోపల స్టయిలిష్ డిజైన్‌తో రేడియంట్ రెడ్, ఆర్చిడ్ వైట్ పర్ల్ కరల్స్ లో దీన్ని ఆవిష్కరించింది. దీంతోపాటు హోండా అమేజ్, హోండా డబ్యుఆర్-వీ లో కూడా ప్రత్యేక ఎడిషన్‌ను తీసుకొచ్చింది. హోండా అమేజ్ ధర రూ.7.86లక్షలుగా, డబ్యుఆర్-వీ ధరను రూ.9.35లక్షలుగా నిర్ణయించింది. జాజ్ తప్ప మిగిలిన రెండూ పెట్రోల్, డీజిల్ ఇంజీన్లతో లభ్యమవుతున్నాయి. -
కొత్త హోండా అమేజ్ లాంచ్
-
తెలంగాణలోకి కొత్త హోండా అమేజ్
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ కార్ల తయారీ కంపెనీ హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ నేడు తన ‘హోండా అమేజ్’ సెకండ్ జనరేషన్ వెర్షన్‌ను హైదరాబాద్‌లో విడుదల చేసింది. అంతా కొత్త ప్లాట్‌ఫామ్‌పై ఈ కారును కంపెనీ రూపొందించింది. దీని ఎక్స్‌షోరూమ్ ప్రారంభ ధర రూ.5.59 లక్షలుగా పేర్కొంది. డీజిల్ సీటీవీ టెక్నాలజీతో భారత మార్కెట్లోకి వచ్చిన తొలి వాహనం ఇదే కావడం విశేషం. భారత కస్టమర్ల అవసరాలు, ఆకాంక్షలను దృష్టిలో ఉంచుకుని ఈ వాహనాన్ని అభివృద్ధి చేసినట్టు హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ సేల్స్ మార్కెటింగ్ డైరెక్టర్, ఎస్వీపీ రాజేష్ గోయల్ చెప్పారు. హెచ్‌సీఐఎల్ వ్యాపారాలకు బలమైన పునాదుల్లో ఇదీ ఒకటిగా నిలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. తమ వ్యాపారాలను వృద్ధి చేసుకోవడానికి ఇది ఒక గొప్ప అవకాశాన్ని కల్పిస్తుందన్నారు. కొత్త అమేజ్ 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్, 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ రూపంలో మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్లలో లభ్యమౌతుంది. పెట్రోల్ వేరియంట్ల ధరలు రూ.5.59 లక్షలు నుంచి రూ.7.99 లక్షల శ్రేణిలో, డీజిల్ వేరియంట్ల ధరలు రూ.6.69 లక్షలు నుంచి రూ.8.99 లక్షల శ్రేణిలో ఉన్నాయి. దీనిలో డ్యూయెల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్స్, రియర్ పార్కింగ్ సెన్సర్స్, ఏబీఎస్ వంటి పలు ఫీచర్లు ఉన్నాయని కంపెనీ పేర్కొంది. అంతా కొత్త డిజైన్, అధునాతనమైన, విశాలమైన ఇంటీరియర్, మరింత సమర్థవంతమైన పవర్‌ట్రెయిన్, అత్యుత్తమ డ్రైవింగ్ డైనమిక్స్, అధునాతన ఫీచర్లు, సేఫ్టీ టెక్నాలజీలు ఈ కారు ఆఫర్ చేస్తోంది. గత కొన్ని రోజుల క్రితమే ఈ వాహనాన్ని ఢిల్లీలో లాంచ్ చేశారు. నేడు(మంగళవారం) కంపెనీ హైదరాబాద్‌లో కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. -
హోండా అమేజ్‌లో రెండో జనరేషన్
న్యూఢిల్లీ: ప్రముఖ కార్ల తయారీ కంపెనీ ‘హోండా కార్స్’ తాజాగా తన కాంపాక్ట్ సెడాన్ ‘అమేజ్’లో సెకండ్ జనరేషన్ వెర్షన్‌ను విడుదల చేసింది. దీని ఎక్స్‌షోరూమ్ ప్రారంభ ధర రూ.5.59 లక్షలు. ఈ, ఎస్, వీ, వీఎక్స్ అనే 4 వేరియంట్లలో అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. వీటిల్లో డ్యూయెల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్స్, రియర్ పార్కింగ్ సెన్సర్స్, ఏబీఎస్ వంటి పలు ఫీచర్లు ఉన్నాయని పేర్కొంది. తాజా కొత్త అమేజ్ 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్, 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ రూపంలో మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్లలో లభ్యమౌతుందని వివరించింది. పెట్రోల్ వేరియంట్ల ధరలు రూ.5.59 లక్షలు– రూ.7.99 లక్షల శ్రేణిలో, డీజిల్ వేరియంట్ల ధరలు రూ.6.69 లక్షలు– రూ.8.99 లక్షల శ్రేణిలో ఉన్నాయని పేర్కొంది. ‘ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడు కొత్త ప్రోడక్టులను మార్కెట్లో తీసుకువస్తాం. అలాగే వచ్చే మూడేళ్ల కాలంలో మరో మూడు కొత్త ప్రోడక్టులను ఆవిష్కరిస్తాం’ అని హోండా కార్స్ ఇండియా (హెచ్‌సీఐఎల్) ప్రెసిడెంట్, సీఈవో గకు నకనిశి తెలిపారు. హోండా సిటీ మాదిరిగానే సెకండ్ జనరేషన్ అమేజ్ కూడా కస్టమర్ల ఆదరణను చూరగొంటుందని ధీమా వ్యక్తంచేశారు. -
హోండా అమేజ్ సరికొత్తగా...ప్రారంభ ఆఫర్
హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ తన పాపులర్ మోడల్ హోండా అమేజ్ కారు 2018 వెర్షన్‌ను లాంచ్ చేసింది. ఈ సెంకండ్ జనరేషన్ హోండా అమేజ్ ఈ, ఎస్, వి, విఎక్స్ అనే 4 వేరియంట్లలో ఈ కారు లభ్యమవుతుంది. పెట్రోల్, డీజిల్ ఇంజీన్లతో, మాన్యువల్ అండ్ ఆటోమేటిక్ (సీవీఈ) ట్రాన్స్మిషన్ ఆప్షన్లలో ఈ కార్లు అందుబాటులో ఉన్నాయి. దీని ప్రారంభధర రూ. 5.59 లక్షల నుంచి (ఎక్స్ షోరూమ్, ఇండియా) మొదలవుతుంది. ఈ ధరలు తొలి 20వేల మంది కస్టమర్లకు మాత్రమేనని తెలిపింది. ఫస్ట్ జనరేషన్‌తో పోలిస్తే సెకండ్ జనరేషన్లోఎక్స్టీరయర్ డిజైన్ పూర్తిగా మార్చి న్యూ లుక్‌లో తీసుకొచ్చింది. దీంతోపాటు కి.మీలతో సంబంధం లేకుండా 3 సంవత్సరాల వారంటీ ఇస్తోంది. అలాతేడీజిల్ పెట్రోల్ వెర్షన్లో స్పెషల్ మెయింటెన్స్ ప్యాకేజీ కూడా అందిస్తోంది. దేశవ్యాప్తంగా హోండా డీలర్లు ఇప్పటికే 2018 అమేజ్ బుకింగ్‌లను ప్రారంభించారనీ, డెలివరీలు త్వరలోనే ప్రారంభమవుతాయని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. కొత్త అమేజ్ లాంచింగ్ ద్వారా టైర్-2, టైర్ 3 ఏరియాల్లో తమ విక్రయాలు పెరుగుతాయనే విశ్వాసాన్ని వ్యక్తం చేసింది. డబుల్ ఫ్రంట్ ఎయిర్ బాగ్స్ ఈబీడీ, ఆటోమేటిక్ బ్రేక్ సిస్టం, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్, ఇంపాక్ట్ సెన్సింగ్ డోర్ లాక్స్, ఐసోఫిక్స్ సీటు యాంకర్స్, 15-ఇంచ్ అల్లాయ్ వీల్స్ ప్రామాణిక ఫీచర్లుగా ఉండనున్నాయి. ఇక ఇంధన సామర్ధ్యం విషయానికి వస్తే పెట్రోల్ వెర్షన్లో లీటరుకు మాన్యువల్‌లో19.5కి.మీ / సీవీటీ - 19 కి.మీ, డీజిల్ లీటరుకు (మాన్యువల్) 27.4కి.మీ / సీవీటీ - 23.8కి.మీ.గా ఉంది. మారుతి సుజుకి డిజైర్ గట్టి పోటీగా ఈ నిలుస్తున్న హోండా అమేజ్ కొత్త కారు డిజైర్‌తో పోలిస్తే 3వేల రూపాయల తక్కువ ధరకే అందుబాటులోకి తెచ్చింది. -
అమ్మకాల్లో అదరగొడుతున్న హోండా అమేజ్
న్యూఢిల్లీ : కాంపాక్ట్ సెడాన్ లోకి దూసుకొచ్చిన హోండా అమేజ్ కారు అమ్మకాల్లో అదరహో అనిపిస్తోంది. దేశీయ మార్కెట్లో 2 లక్షల అమ్మకాల మైలురాయిని హోండా అమేజ్ చేధించింది. 2013 ఏప్రిల్ లో ఈ కారును భారత మార్కెట్లోకి ఆవిష్కరించారు. ఈ కారుతో భారత డీజిల్ విభాగంలోకి హోండా ప్రవేశించింది. మూడేళ్ల వ్యవధిలో ఈ కారు 2లక్షల యూనిట్ల అమ్మకాలతో మైలురాయిని తాకాయని, కొత్త కస్టమర్లను ఎక్కువగా ఈ కారు ఆకట్టుకుంటోందని హోండా కార్ల ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్, మార్కెటింగ్, సేల్స్ అధినేత జ్ఞానేశ్వర్ సేన్ తెలిపారు. చిన్న, పెద్ద రెండు పట్టణాల్లో హోండా అమేజ్ బాగా పాపులర్ అయిందని పేర్కొన్నారు. ఈ కాంపాక్ట్ సెడాన్ అప్ గ్రేడెడ్ వెర్షన్ ను వివిధ రకాల ఫీచర్స్ తో మార్చిలో కంపెనీ ప్రవేశపెట్టింది. కంటిన్యూగా వేరియబుల్ ట్రాన్సిమిషన్(సీవీటీ) కలిగి ఉండటం ఈ అప్ డేట్ ప్రధాన ఫీచర్. 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్, 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ సామర్థ్యాలు ఈ కారు కలిగి ఉంది. భద్రతపై ఎక్కువగా దృష్టిసారించిన హోండా అప్ గ్రేడెడ్ వెర్షన్ లో డ్యూయల్ ఎస్ఆర్ఎస్ ఎయిర్ బ్యాగ్స్ ను ఈ కారులో పొందుపరిచింది. భవిష్యత్తులో అన్ని హోండా కార్లు డ్యూయల్ ఎస్ఆర్ఎస్ ఎయిర్ బ్యాగ్స్ తోనే వస్తాయని కంపెనీ పేర్కొంది. సీవీటీ ఆప్షన్ ను ఆఫర్ చేసే మొదటి పెట్రోల్ కాంపాక్ట్ సెడాన్ ఈ కొత్త అమేజ్ నే. దీనివల్ల మంచి ఇంధన సామర్థ్యాన్ని అమేజ్ కలిగి ఉంటోంది. ఈ కారు ధర రూ.5.41లక్షల నుంచి రూ.8.31లక్షల(ఎక్స్ షోరూం ఢిల్లీ) మధ్య ఉంటోంది. -
హోండా అమేజ్, బ్రియో కొత్త వేరియంట్లు
న్యూఢిల్లీ: హోండా కార్స్ ఇండియా కంపెనీ అమేజ్, బ్రియో మోడళ్లలో కొత్త వేరియంట్లను మంగళవారం మార్కెట్లోకి తెచ్చింది. కొత్త అమేజ్ పెట్రోల్ వేరియంట్ ధర రూ. 7.32 లక్షలని, డీజిల్ వేరియంట్ ధర రూ.8.2 లక్షలని కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్(మార్కెటింగ్ అండ్ సేల్స్) జ్నానేశ్వర్ సేన్ చెప్పారు. కొత్త బ్రియో వేరియంట్లలో మాన్యువల్ మోడల్ ధర రూ.5.99 లక్షలు, ఆటోమాటిక్ వేరియంట్ ధర రూ.6.78 లక్షలు (అన్ని ధరలూ ఎక్స్‌షోరూమ్, ఢిల్లీ) అని పేర్కొన్నారు. కొత్త అమేజ్ వేరియంట్లో ఆడియో-వీడియో నావిగేషన్ ప్రత్యేక ఆకర్షణ అని,త్వరలో అమేజ్ సీఎన్జీ వేరియంట్‌ను కూడా అందించనున్నామని వివరించారు. 2013, ఏప్రిల్‌లో అమేజ్‌ను మార్కెట్లోకి తెచ్చామని, ఇప్పటివరకూ 1.25 లక్షల కార్లను విక్రయించామని పేర్కొన్నారు. బ్రియో మోడల్లో కూడా ఆడియో-వీడియో నావిగేషన్ ఫీచర్‌ను అందిస్తున్నామని వివరించారు. -
హ్యుందాయ్ నుంచి ఎక్సెంట్
న్యూఢిల్లీ: కాంపాక్ట్ సెడాన్ కార్ల విభాగంలో రేట్ల పోరుకు తెర లేపుతూ హ్యుందాయ్ మోటార్ ఇండియా తాజాగా ఎక్సెంట్ కారును మార్కెట్లోకి విడుదల చేసింది. ప్రారంభ ఆఫర్ కింద దీని ధర రూ. 4.66 లక్షలు నుంచి రూ. 7.38 లక్షల దాకా ఉంటుంది. ఇది పెట్రోల్, డీజిల్ వెర్షన్లలో లభిస్తుంది. మారుతీ సుజుకీ డిజైర్, హోండా అమేజ్‌తో పాటు టాటా మోటార్స్ ప్రవేశపెట్టబోతున్న జెస్ట్ కార్లకు ఎక్సెంట్ పోటీనివ్వనుంది. కాంపాక్ట్ సెడాన్ సెగ్మెంట్లో భారీగా అమ్ముడవుతున్న మారుతీ సుజుకీ డిజైర్ రేటు రూ. 4.85 లక్షలు - రూ. 7.32 లక్షలుగా (ఢిల్లీ ఎక్స్‌షోరూం ధర) ఉంది. ఈ విభాగంలో నెలకు 24,000 కార్లు అమ్ముడవుతున్నట్లు అంచనా. గతేడాది ప్రవేశపెట్టిన గ్రాండ్ ఐ10 కారు ప్లాట్‌ఫాంపైనే ఎక్సెంట్ని కూడా రూపొందించారు. నాణ్యత, డిజైన్, ఫీచర్స్‌పరంగా ఇది కొత్త ప్రమాణాలు నెలకొల్పుతుందని హ్యుందాయ్ మోటార్ ఇండియా (హెచ్ఎంఐఎల్) ఎండీ బీఎస్ సియో చెప్పారు. తాజా ఎక్సెంట్‌తో.. 4 మీటర్ల లోపు ఎంట్రీ లెవెల్ కార్ల నుంచి ప్రీమియం ఎగ్జిక్యూటివ్ కార్ల దాకా అన్ని విభాగాల్లోనూ తమ దగ్గర కార్లు ఉన్నట్లవుతుందని ఆయన పేర్కొన్నారు. దేశీ మార్కెట్లో తమ స్థానం పటిష్టం చేసుకునేందుకు ఎక్సెంట్ తోడ్పడగలదని హెచ్ఎంఐఎల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రాకేశ్ శ్రీవాస్తవ తెలిపారు.