హోండా అమేజ్, బ్రియో కొత్త వేరియంట్‌లు | Honda launches new variants of Amaze, Brio | Sakshi
Sakshi News home page

హోండా అమేజ్, బ్రియో కొత్త వేరియంట్‌లు

Published Wed, Jan 14 2015 1:38 AM | Last Updated on Sat, Sep 2 2017 7:39 PM

హోండా అమేజ్, బ్రియో కొత్త వేరియంట్‌లు

హోండా అమేజ్, బ్రియో కొత్త వేరియంట్‌లు

 న్యూఢిల్లీ: హోండా కార్స్ ఇండియా కంపెనీ అమేజ్, బ్రియో మోడళ్లలో కొత్త వేరియంట్‌లను మంగళవారం మార్కెట్లోకి తెచ్చింది. కొత్త అమేజ్ పెట్రోల్ వేరియంట్ ధర రూ. 7.32 లక్షలని, డీజిల్ వేరియంట్ ధర రూ.8.2 లక్షలని కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్(మార్కెటింగ్ అండ్ సేల్స్) జ్నానేశ్వర్ సేన్ చెప్పారు.

కొత్త బ్రియో వేరియంట్‌లలో మాన్యువల్ మోడల్ ధర రూ.5.99 లక్షలు, ఆటోమాటిక్ వేరియంట్ ధర రూ.6.78 లక్షలు (అన్ని ధరలూ ఎక్స్‌షోరూమ్, ఢిల్లీ) అని పేర్కొన్నారు. కొత్త అమేజ్ వేరియంట్‌లో ఆడియో-వీడియో నావిగేషన్ ప్రత్యేక ఆకర్షణ అని,త్వరలో అమేజ్ సీఎన్‌జీ వేరియంట్‌ను కూడా అందించనున్నామని వివరించారు.

2013, ఏప్రిల్‌లో అమేజ్‌ను మార్కెట్లోకి తెచ్చామని, ఇప్పటివరకూ 1.25 లక్షల కార్లను విక్రయించామని పేర్కొన్నారు. బ్రియో మోడల్‌లో కూడా ఆడియో-వీడియో నావిగేషన్ ఫీచర్‌ను అందిస్తున్నామని వివరించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement