కార్ల తయారీలో ఉన్న జపాన్ సంస్థ హోండా మూడవ తరం అమేజ్‌ను కంపెనీ పరిచయం చేసింది. ఎక్స్ షోరూమ్‌లో ధర రూ.7.99 లక్షల నుండి రూ.10.89 లక్షల వరకు ఉంది. ఈ మోడల్ మాన్యువల్, ఆటోమేటిక్ వేరియంట్లలో తయారైంది. కాంపాక్ట్ సెడాన్ సెగ్మెంట్లో మారుతీ డిజైర్, హ్యుండై ఆరా వంటి మోడళ్లతో ఇది పోటీపడుతోంది.
దేశంలో అడాస్ భద్రతా ఫీచర్లను కలిగిన అత్యంత సరసమైన కారు అమేజ్ అని హోండా కార్స్ ఇండియా ప్రెసిడెంట్, సీఈవో టకుయ సుమూర చెప్పారు.హోండా దేశంలో ఇప్పటివరకు 5.8 లక్షల యూనిట్ల అమేజ్ కార్లను విక్రయించింది. అమేజ్ మొదటి తరం 2013లో, రెండవ తరం 2018లో ప్రవేశించింది. అమేజ్ కస్టమర్లలో 50% మంది మొదటిసారి కారును సొంతం చేసుకున్నవారేనని సేల్స్ వైస్ ప్రెసిడెంట్ కునాల్ బెహల్ పేర్కొన్నారు.
2027 నాటికి మరో మూడు మోడళ్లు
హోండా 2027 మార్చి నాటికి భారత్‌లో మూడు కొత్త మోడళ్లను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. బలంగా అభివృద్ధి చెందుతున్న ఎస్‌యూవీ విభాగంలో వృద్ధి అవకాశాలను అందిపుచ్చుకోవాలని చూస్తున్నట్టు హోండా కార్స్ ఇండియా ప్రెసిడెంట్, సీఈవో టకుయ సుమూర తెలిపారు. కంపెనీ ప్రస్తుతం భారత్‌లో ఎలివేట్ ఎస్‌యూవీతోపాటు సెడాన్స్ అయిన అమేజ్, సిటీ మోడళ్లను విక్రయిస్తోంది.
2026–27 ఆర్థిక సంవత్సరం నాటికి హైబ్రిడ్, ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్‌లతో మూడు కొత్త మోడళ్లను పరిచయం చేయడానికి ప్రణాళిక చేస్తున్నట్టు సుమూర తెలిపారు. తద్వారా ఎస్‌యూవీ విభాగంలో కంపెనీ ఉనికిని విస్తరిస్తుందని చెప్పా రు. భారతీయ మార్కెట్‌కు సరిపోయే హైబ్రిడ్, బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనాల వంటి మోడళ్లను హోండా అభివృద్ధి చేస్తూనే ఉందని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment