న్యూఢిల్లీ: కాంపాక్ట్ సెడాన్ కార్ల విభాగంలో రేట్ల పోరుకు తెర లేపుతూ హ్యుందాయ్ మోటార్ ఇండియా తాజాగా ఎక్సెంట్ కారును మార్కెట్లోకి విడుదల చేసింది. ప్రారంభ ఆఫర్ కింద దీని ధర రూ. 4.66 లక్షలు నుంచి రూ. 7.38 లక్షల దాకా ఉంటుంది. ఇది పెట్రోల్, డీజిల్ వెర్షన్లలో లభిస్తుంది. మారుతీ సుజుకీ డిజైర్, హోండా అమేజ్‌తో పాటు టాటా మోటార్స్ ప్రవేశపెట్టబోతున్న జెస్ట్ కార్లకు ఎక్సెంట్ పోటీనివ్వనుంది. కాంపాక్ట్ సెడాన్ సెగ్మెంట్‌లో భారీగా అమ్ముడవుతున్న మారుతీ సుజుకీ డిజైర్ రేటు రూ. 4.85 లక్షలు - రూ. 7.32 లక్షలుగా (ఢిల్లీ ఎక్స్‌షోరూం ధర) ఉంది.
ఈ విభాగంలో నెలకు 24,000 కార్లు అమ్ముడవుతున్నట్లు అంచనా. గతేడాది ప్రవేశపెట్టిన గ్రాండ్ ఐ10 కారు ప్లాట్‌ఫాంపైనే ఎక్సెంట్‌ని కూడా రూపొందించారు. నాణ్యత, డిజైన్, ఫీచర్స్‌పరంగా ఇది కొత్త ప్రమాణాలు నెలకొల్పుతుందని హ్యుందాయ్ మోటార్ ఇండియా (హెచ్‌ఎంఐఎల్) ఎండీ బీఎస్ సియో చెప్పారు. తాజా ఎక్సెంట్‌తో.. 4 మీటర్ల లోపు ఎంట్రీ లెవెల్ కార్ల నుంచి ప్రీమియం ఎగ్జిక్యూటివ్ కార్ల దాకా అన్ని విభాగాల్లోనూ తమ దగ్గర కార్లు ఉన్నట్లవుతుందని ఆయన పేర్కొన్నారు. దేశీ మార్కెట్లో తమ స్థానం పటిష్టం చేసుకునేందుకు ఎక్సెంట్ తోడ్పడగలదని హెచ్‌ఎంఐఎల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రాకేశ్ శ్రీవాస్తవ తెలిపారు.
హ్యుందాయ్ నుంచి ఎక్సెంట్
Published Thu, Mar 13 2014 1:04 AM | Last Updated on Sat, Sep 2 2017 4:38 AM
Advertisement
Advertisement