Hyundai Motor
-
వాహన అమ్మకాలు అంతంతే..!
ముంబై: పేరుకుపోయిన వాహన నిల్వలను కరిగించే చర్యల్లో భాగంగా డీలర్లకు పంపిణీ తగ్గించడంతో మారుతీ సుజుకీ, హ్యుందాయ్ మోటార్స్ అక్టోబర్ అమ్మకాలు అంతంత మాత్రంగానే నమోదయ్యాయి. మారుతీ సుజుకీ ప్యాసింజర్ వాహనాల దేశీయ అమ్మకాలు క్రితం ఏడాదితో పోలిస్తే 1,68,047 యూనిట్ల నుంచి 1,59,591 యూనిట్లకు తగ్గాయి. అమ్మకాలు 5% క్షీణించాయి. చిన్న కార్ల విభాగంలో ఆల్టో, ఎస్–ప్రెసో విక్రయాలు 14,568 నుంచి 10,687కు తగ్గాయి. కాంపాక్ట్ కార్ల విభాగంలో బాలెనో, సెలెరియో, డిజైర్, ఇగ్నిస్, స్విఫ్ట్, టూర్ ఎస్, వేగనార్, అమ్మకాలు 80,662 నుంచి 65,948 యూనిట్లతో సరిపెట్టుకుంది. అయితే యుటిలిటీ వాహన విభాగంలోని బ్రెజా, గ్రాండ్ విటారా, ఎర్టిగా, ఎక్స్ఎల్6 విక్రయాలు 59,147 నుంచి 70,644కు పెరిగాయి. హ్యుందాయ్ మోటార్ ఇండియా వాహనాల దేశీ పంపిణీ(హోల్‌సేల్) స్వల్పంగా 1 శాతం పుంజుకుని 55,568 వాహనాలకు చేరింది. 2023 అక్టోబర్ నెలలో 55,128 యూనిట్ల విక్రయాలు నమోదయ్యాయి. పండుగ సీజన్లో తమ ఎస్యూవీ కార్లకు మంచి గిరాకీ ఏర్పడిందని కంపెనీ సీవోవో తరుణ్ గార్గ్ తెలిపారు. హ్యుందాయ్ క్రెటా కార్లు 17,497 యూనిట్లతో పాటు ఎస్యూవీ కార్లు 37,902 యూనిట్లు విక్రయించామని, ఒక నెలలో ఇదే గరిష్టం అని అన్నారు. హ్యుందాయ్ కార్లలో 68 శాతం ఎస్‌యూవీలే ఉండటం విశేషమన్నారు. మహీంద్రాఅండ్‌మహీంద్రా ఎస్యూవీ దేశీయ విక్రయాలు 25% పెరిగి 54,504కు చేరాయి. ఈ పండుగ సీజన్లో తొలి 60 నిమిషాల్లో 5–డోర్ ఆఫ్ రోడ్ ఎస్యూవీ థార్ రాక్స్ 1.7 లక్షల బుకింగ్స్ అయ్యాయి. టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ దేశీ విక్రయాలు 48,337 నుంచి 48,131కు తగ్గాయి. టయోటా కిర్లోస్కర్ అమ్మకాలు 20,542 నుంచి 37% పెరిగి 28,138కు చేరా యి. జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్స్ అమ్మకాలు 31% పెరిగి 7,045 యూనిట్లకు చేరాయి. ఆల్‌టైం గరిష్టానికి మారుతీ సేల్స్... మారుతీ సుజుకీ మొత్తం విక్రయాలు(ఎగుమతులతో కలిపి) అక్టోబర్‌లో రికార్డు గరిష్టానికి చేరాయి. టోకు విక్రయాలు గత నెలలో 2,06,434 యూనిట్లుగా నమోదయ్యాయి. కంపెనీ నెలవారీ విక్రయాల్లో ఇవే ఇప్పటివరకు అత్యధికం. క్రితం ఏడాది ఇదే అక్టోబర్‌లో 1,99,217 యూనిట్లను డీలర్లకు సరఫరా చేసింది. -
జతకలిసిన జీఎం, హ్యుందాయ్.. కొత్త ప్లాన్ ఇదే..
జీఎం (జనరల్ మోటార్స్) & హ్యుందాయ్ మోటార్ రెండూ కలిసి కీలకమైన రంగాలలో భవిష్యత్ ప్రణాళికలను రచించడానికి ఒక ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ రెండు బ్రాండ్స్ కలిసి కొత్త శ్రేణి వాహనాలను తీసుకురానున్నట్లు సమాచారం.ఎలక్ట్రిక్, హైడ్రోజన్ వాహనాలతో సహా ప్రయాణికులకు అవసరమయ్యే వాహనాలు, కమర్షియల్ వాహనాలను జీఎం.. హ్యుందాయ్ మోటార్స్ తయారు చేసే అవకాశం ఉంది. అనుకున్నవన్నీ సజావుగా జరిగితే.. రానున్న రోజుల్లో రెండు బ్రాండ్స్ కలయికతో ఏర్పడ్డ కొత్త వెహికల్స్ రూపొందుతాయని తెలుస్తోంది.ఈ ఒప్పందంపై హ్యుందాయ్ మోటార్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ యుయిసన్ చుంగ్ & జనరల్ మోటార్ చైర్మన్ అండ్ సీఈఓ మేరీ బర్రా సంతకం చేశారు. రెండు కంపెనీల మధ్య ఏర్పడ్డ భాగస్వామ్యం వాహన అభివృద్ధిని మరింత సమర్థవంతంగా చేసేలా చేస్తుందని బర్రా పేర్కొన్నారు.ఇదీ చదవండి: ఒక్కసారిగా పెరిగిన బంగారం, వెండి.. చుక్కలు తాకిన కొత్త ధరలు!భారత్‌లో జనరల్ మోటార్స్1996లో జనరల్ మోటార్స్ కంపెనీ గుజరాత్‌లోని హలోల్ ప్లాంట్‌లో కార్లను నిర్మించడం ప్రారంభించింది. కొన్ని రోజులు దేశంలో సజావుగా ముందుకు సాగిన తరువాత కాలంలో కంపెనీ తన కార్యకలాపాలను దేశంలో పూర్తిగా నిలిపివేసింది. ఇప్పుడు హ్యుందాయ్ మోటార్ భాగస్వామ్యంతో మళ్ళీ దేశీయ మార్కెట్లో అడుగుపెట్టనుంది. -
పండుగల సీజన్లో కార్ల జోరు
న్యూఢిల్లీ: ఈ ఏడాది పండుగల సీజన్లో రికార్డు స్థాయిలో అమ్మకాలు ఉంటాయని మారుతీ సుజుకీ ఇండియా, హ్యుందాయ్ మోటార్ ఇండియా అంచనా వేస్తున్నాయి. పరిశ్రమ వార్షిక అమ్మకాల్లో పండుగల సీజన్ వాటా సగటున 23–26 శాతంగా ఉందని మారుతీ సుజుకీ ఇండియా మార్కెటింగ్, సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శశాంక్ శ్రీవాస్తవ మంగళవారం జరిగిన సియామ్ సదస్సులో తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా అన్ని కంపెనీలవి కలిపి 40.5–41 లక్షల యూనిట్లు అమ్ముడవుతాయని చెప్పారు. ఇందులో పండుగల సీజన్ వాటా 10 లక్షల యూనిట్లు ఉంటుందన్నారు. ప్యాసింజర్ వెహికిల్స్ పరిశ్రమ తొలిసారిగా 10 లక్షల యూనిట్ల మార్కును చేరుకుంటుందని వెల్లడించారు. ఇప్పటి వరకు దేశంలో 2021లో అత్యధికంగా పండుగల సీజన్లో 9.34 లక్షల యూనిట్లు నమోదయ్యాయని వివరించారు. ఆ రెండూ జరగకపోతేనే.. ఓనమ్ విక్రయాల్లో 24 శాతం వృద్ధి సాధించామని శ్రీవాస్తవ పేర్కొన్నారు. గతేడాది 3.55 లక్షల యూనిట్లతో పోలిస్తే 2023 సెపె్టంబరులో 3.61 లక్షల యూనిట్ల హోల్‌సేల్ అమ్మకాలు ఆశిస్తున్నట్టు చెప్పారు. గ్రామీణ సెంటిమెంట్‌ను ప్రభావితం చేసే అధిక వడ్డీ రేట్లు, రుతుపవనాల లోటు వృద్ధికి అడ్డుకట్ట అని తెలిపారు. ఇవి రెండూ జరగకపోతే ఉపశమనం లభిస్తుందని అన్నారు. ‘వడ్డీ రేట్లు పెరగకూడదు. ఆహార ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉంటే అవి పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం మైనస్ 8 శాతంగా నమోదవుతున్న వర్షపాతం కారణంగా గ్రామీణుల మనోభావాలు దెబ్బతినకూడదు’ అని ఆయన పేర్కొన్నారు. హుందాయ్ వృద్ధి 9 శాతం.. గతేడాదితో పోలిస్తే పండుగల సీజన్లో 9 శాతం వృద్ధి ఆశిస్తున్నట్టు హుందాయ్ మోటార్ ఇండియా సీవోవో తరుణ్ గర్గ్ తెలిపారు. ఈ ఏడాది అర్ధ భాగం విక్రయాల్లో ఎస్‌యూవీల వాటా 54 శాతం నమోదైందన్నారు. ఎక్స్టర్ రాకతో జూలై, ఆగస్ట్‌లో ఇది 64 శాతానికి ఎగసిందని చెప్పారు. వెయిటింగ్ పీరియడ్ తగ్గిందని, తద్వారా సమయానికి డెలివరీలు అందించేందుకు వీలవుతోందని చెప్పారు. బలమైన తాజా డిమాండ్ రాబోయే కాలానికి మంచి సూచిక అన్నారు. పరిస్థితులు సానుకూలంగా ఉన్నాయని వివరించారు. -
ప్యాసింజర్ వాహనాలు పెరిగాయ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయంగా 2023 ఏప్రిల్‌లో కంపెనీల నుంచి డీలర్లకు చేరిన ప్యాసింజర్ వాహనాల సంఖ్య 3,31,278 యూనిట్లు నమోదైంది. 2022 ఏప్రిల్‌తో పోలిస్తే ఇది 13 శాతం పెరుగుదల అని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (సియామ్) తెలిపింది. ‘మారుతీ సుజుకీ ఇండియా గత నెలలో 1,37,320 యూనిట్లను డీలర్లకు సరఫరా చేసింది. అంత క్రితం ఏడాది ఇదే కాలంలో 1,21,995 యూనిట్లు నమోదైంది. హ్యుండై మోటార్ ఇండియా హోల్‌సేల్ విక్రయాలు 44,001 నుంచి 49,701 యూనిట్లకు చేరాయి. అలాగే ఈ ఏడాది ఏప్రిల్‌లో డీలర్లకు 13,38,588 యూనిట్ల ద్విచక్ర వాహనాలు సరఫరా అయ్యాయి. 2022 ఏప్రిల్‌లో ఈ సంఖ్య 11,62,582 యూనిట్లు. మోటార్‌సైకిళ్లు 7,35,360 నుంచి 8,39,274 యూనిట్లు, స్కూటర్లు 3,88,442 నుంచి 4,64,389 యూనిట్లకు చేరాయి. త్రిచక్ర వాహనాలు రెండింతలై కోవిడ్ ముందస్తు స్థాయికి చేరువలో 42,885 యూనిట్లకు ఎగశాయి. ‘ఏప్రిల్ 2022తో పోలిస్తే అన్ని వాహన విభాగాలు గత నెలలో వృద్ధిని నమోదు చేశాయి. 2023 ఏప్రిల్ 1 నుండి పరిశ్రమ బీఎస్–6 ఫేజ్–2 ఉద్గార నిబంధనలకు చాలా సాఫీగా మారిందని ఇది స్పష్టంగా సూచిస్తోంది. పరిశ్రమ క్రమంగా రుతుపవనాల సీజన్లోకి ప్రవేశిస్తున్నందున మంచి వర్షపాతం కూడా ఈ రంగం వృద్ధిని కొనసాగించడంలో సహాయపడుతుంది’ అని సియామ్ ప్రెసిడెంట్ వినోద్ అగర్వాల్ తెలిపారు. -
స్పోర్టియస్ట్ డిజైన్‌తో హ్యుందాయ్ సొనాటా సరికొత్తగా
సాక్షి,ముంబై: ఆటోమొబైల్ దిగ్గజం హ్యుందాయ్ మోటార్స్ సరికొత్త హ్యుందాయ్ సొనాటాకారును ఆవిష్కరించింది. లాంచ్ చేసింది. మిడ్ సెగ్మెంట్లో 8వ జెనరేషన్ సొనాటాను కొత్త బ్యాడ్జ్, లాంగ్ హుడ్, ఫ్రంట్-ఎండ్ లేఅవుట్‌తో స్పోర్టియస్ట్ డిజైన్‌తో పరిచయం చేసింది. స్పోర్ట్, స్టాండర్డ్ , N లైన్ వేరియంట్లలో మార్చి 30న ప్రపంచవ్యాప్తంగా లాంచ్ కానుంది. హ్యుందాయ్ సొనాటా వెర్నా, కోనా ఎలక్ట్రిక్, స్టారియా పోలిన స్టయిల్‌తోపాటు, డ్రైవర్-సెంట్రిక్ ఇంటీరియర్ లేఅవుట్‌తో ఆల్ న్యూ హ్యుందాయ్సొనాటా రానుంది. ముఖ్యంగా హ్యుందాయ్ మోడల్లో తొలిసారిగా సొనాటా డ్రైవర్ ఇన్ఫర్మేషన్ క్లస్టర్లు, ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్‌తో కర్వ్డ్ డిస్ప్లేను జోడించింది. సిగ్నేచర్ ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్ బార్, రియర్ ఎల్ఈడీ టెయిల్‌లైట్ స్ట్రిప్, బ్లాక్ బార్, మధ్యలో హ్యుందాయ్ లోగో, డిఫరెంట్ గ్రిల్‌తో దీన్ని అప్డేట్ చేసింది. అలాగే స్పోర్టియర్ ఎక్స్టీరియర్ ఇమేజ్‌తో ఆధునిక జీవనశైలికి మద్దతుగా భవిష్యత్ మొబిలిటీ సెన్సిబిలిటీతో దీన్ని తీర్చిదిద్దింది. 12.3 ఇంచ్ ట్విన్ టచ్ స్క్రీన్ డిస్ప్లే, ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఫుల్లీ ఎక్స్టెండెడ్ ఎయిర్ వెంట్స్, న్యూ సెంట్రల్ క్లైమేట్ కంట్రోల్ ప్యానెల్, న్యూ 3 స్పోక్ స్టీరింగ్ వీల్ మార్పులు కూడా చేసింది. ఇంజీన్ 1.6 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్, 2.5 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్, 2.5 లీటర్ టర్బో ఇంజిన్ ఆప్షన్స్ తో ఇది రానుంది. అలాగే ఎన్ లైన్లో మరొకటి వస్తోంది. ఈ ఇంజీన్ 285హెచ్‌పీ పవర్, 422 ఎన్ఎం టార్క్‌ను అందిస్తుంది. మార్చి 30నుంచి ఏప్రిల్ 9 వరకు జరగనున్న 2023 సియోల్ మొబిలిటీ షోలో దీన్ని ఆవిష్కరించనుంది. #Hyundai #SONATA inherits the identity of the 4-door coupe with Absolute Sportiness. And its futuristic and progressive interior is completed with our new technology, Panoramic Curved Display. On March 30th, #ThenewSONATA will be fully unveiled.#HyundaiDesign #SONATADesign pic.twitter.com/1r91CvNBIQ — Hyundai Motor Group (@HMGnewsroom) March 26, 2023 -
స్పోర్టీ లుక్‌తో హ్యుందాయ్ ఐ20 కారు
వాహన తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్ ఇండియా తాజాగా స్పోర్టీ లుక్‌తో ఐ20 ఎన్-లైన్ కారును ప్రవేశపెట్టింది. ఎన్-లైన్ శ్రేణిలో యువ కస్టమర్లను దృష్టిలో పెట్టుకుని తీసుకొచ్చిన తొలి మోడల్ ఇది. ప్రస్తుతం ఈ శ్రేణి మోడళ్లను యూరప్, దక్షిణ కొరియా, యూఎస్, రష్యా వంటి దేశాల్లో కంపెనీ విక్రయిస్తోంది. స్పోర్టీ లుక్ కోసం కారు వెలుపలా, లోపలా పలు మార్పులు చేశారు. (చదవండి: మునిగిపోతున్న పడవను నడుపుతున్న తాలిబన్లు) 1 లీటర్ పెట్రోల్ టర్బో జీడీఐ ఇంజిన్ పొందుపరిచారు. 6 స్పీడ్ ఇంటెలిజెంట్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, 7 స్పీడ్ డీసీటీ ట్రాన్స్మిషన్ ఆప్షన్స్‌లో ప్రవేశపెట్టింది. 120 పీఎస్ పవర్, నాలుగు డిస్క్ బ్రేక్స్, 50కిపైగా కనెక్టివిటీ ఫీచర్స్, సన్‌రూఫ్, ఆరు ఎయిర్‌బ్యాగ్స్ ఏర్పాటు ఉంది. గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని 10 సెకన్లలో అందుకుంటుంది. సన్‌రూఫ్ కోరుకునే కస్టమర్ల సంఖ్య 2018లో 13 శాతముంటే ప్రస్తుతం 30 శాతానికి చేరిందని కంపెనీ తెలిపింది. -
వాహన ఎగుమతులు పెరిగాయ్
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా మహమ్మారి నుంచి పరిస్థితులు మెరుగుపడుతున్న నేపథ్యంలో.. భారత్ నుంచి వాహన ఎగుమతులు తిరిగి పుంజుకున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్–జూన్ కాలంలో 14,19,430 వాహనాలు పలు దేశాలకు సరఫరా అయ్యాయి. అంత క్రితం ఏడాది ఇదే కాలంలో ఈ సంఖ్య 4,36,500 మాత్రమే. ప్రయాణికుల వాహనాలు 43,619 నుంచి 1,27,115 యూనిట్లకు చేరాయి. వీటిలో కార్లు 79,376 కాగా, యుటిలిటీ వెహికిల్స్ 47,151 ఉన్నాయి. మారుతి సుజుకి 45,056, హ్యుండాయ్ మోటార్ 29,881, కియా 12,448, ఫోక్స్‌వ్యాగన్ 11,566 యూనిట్లను ఎగుమతి చేశాయి. ద్విచక్ర వాహనాలు గడిచిన మూడేళ్లతో పోలిస్తే మెరుగ్గా నమోదు అయ్యాయి. ఈ విభాగంలో 2021–22 తొలి త్రైమాసికంలో 11,37,102 యూనిట్లు సరఫరా అయ్యాయి. అంత క్రితం ఏడాది ఇదే కాలంలో ఈ సంఖ్య 3,37,983. వాణిజ్య వాహనాలు 3,870 నుంచి 16,006 యూనిట్లకు, త్రిచక్ర వాహనాలు 50,631 నుంచి 1,37,582కు ఎగిశాయి. కాగా విక్రయాలు కోవిడ్ ముందస్తు స్థాయికి రావాల్సి ఉంది. -
ట్రాఫిక్‌కు చెక్: ఫ్లైయింగ్ కార్లు వచ్చేస్తున్నాయ్!
హ్యుందాయ్ మోటార్స్, జనరల్ మోటార్స్ సంయుక్తంగా ఫ్లైయింగ్ కార్లపై దృష్టిసారించాయి. వీరి భాగస్వామ్యంతో ఫ్లైయింగ్ కార్ల ఉత్పత్తి మరింత వేగం పుంజుకోనుంది. 2025లోపు ఎయిర్ టాక్సీలను మొదలు పెట్టాలని ఇరు కంపెనీలు ఆశాభావం వ్యక్తం చేశాయి. ఫైయింగ్ కార్లలో భాగంగా హ్యుందాయ్ ఎస్-ఏ1 ఎయిర్ టాక్సీలను సీఈఎస్-2020 కాన్ఫరెన్స్‌లో ఇప్పటికే రిలీజ్ చేయగా, జనరల్ మోటార్స్ 2021 జనవరిలో ఫైయింగ్ కాడిలాక్ కాన్సెప్ట్‌ను రిలీజ్ చేసింది. కాగా ఈ ఫ్లైయింగ్ కార్లు హైబ్రిడ్ ఇంజన్ కాన్సెప్ట్‌తో పనిచేయనున్నాయి. ఫ్లైయింగ్ కార్ల రాకతో ట్రాఫిక్ జామ్స్‌కు చెక్‌పెట్టవచ్చునని ఇరు కంపెనీలు భావిస్తున్నాయి. ఎయిర్ టాక్సీల రాకతో వాయు ప్రయాణాల మార్కెట్ విలువ 2040 వరకు సుమారు ఒక ట్రిలియన్ (రూ. 73 లక్షల 28 వేల 450 కోట్లు)కు చేరగా, అదే 2050 సంవత్సరానికి తొమ్మిది ట్రిలియన్లకు చేరుకుంటుందని ప్రముఖ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ సంస్థ మోర్గాన్ స్టాన్లీ తెలిపింది. కాగా ఫ్లైయింగ్ కార్లపై ఇప్పటికే ప్రముఖ స్టార్టప్ కంపెనీలతోపాటు, దిగ్గజ ఆటోమోబైల్ కంపెనీలు టయోటా మోటార్, డైమ్లెర్ ఏజీ, చైనాకు చెందిన గీలీ మోటార్ కంపెనీలు దృష్టిసారించాయి. చదవండి : Huwaie: వాహనాల తయారీ కాదు.. ఏకంగా డ్రైవర్‌లెస్ కార్! -
వాహన విక్రయాలకు డిమాండ్ దెబ్బ
న్యూఢిల్లీ: దాదాపు తొమ్మిది నెలల పాటు డిమాండ్ తగ్గుదలతో గడిచిన ఆర్థిక సంవత్సరంలో మారుతీ సుజుకీ ఇండియా, హ్యుందాయ్, మహీంద్రా అండ్ మహీంద్రా వంటి ఆటోమొబైల్ దిగ్గజ సంస్థల అమ్మకాల వృద్ధి సింగిల్ డిజిట్‌కే పరిమితమైంది. మారుతీ సుజుకీ 2018–19లో రికార్డు స్థాయిలో మొత్తం 18,62,449 యూనిట్లు విక్రయించినప్పటికీ.. అంతక్రితం ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 4.7 శాతం మాత్రమే వృద్ధి సాధించింది. 2017–18లో మారుతీ 17,79,574 వాహనాలు విక్రయించింది. దీంతో సవరించుకున్న అంచనాలను కూడా సాధించలేకపోయింది. గత ఆర్థిక సంవత్సరంలో రెండంకెల స్థాయిలో అమ్మకాల వృద్ధి ఉంటుందని అంచనా వేసినప్పటికీ గతేడాది డిసెంబర్లో మారుతీ సుజుకీ దీన్ని 8%కి కుదించింది. దేశీయంగా విక్రయాలు చూస్తే.. 6.1% వృద్ధితో 16,53,500 యూనిట్స్ నుంచి 17,53,700 యూనిట్స్‌కు పెరిగాయి. మరోవైపు హ్యుందాయ్ మోటార్ ఇండియా మొత్తం అమ్మకాలు 2.5 శాతం వృద్ధితో 6,90,184 వాహనాల నుంచి 7,07,348 వాహనాలకు పెరిగాయి. అయితే, దేశీయంగా మాత్రం అమ్మకాలు కేవలం 1.7 శాతం వృద్ధికి పరిమితమయ్యాయి. 5,36,241 నుంచి 5,45,243 వాహనాలకు పెరిగాయి. ‘గత ఆర్థిక సంవత్సరం 1.7 శాతం వృద్ధితో సానుకూలంగా ముగిసింది. దేశీయంగా అమ్మకాలు అత్యధిక స్థాయిలో నమోదయ్యాయి‘ అని హ్యుందాయ్ మోటార్ ఇండియా నేషనల్ సేల్స్ హెడ్ వికాస్ జైన్ తెలిపారు. అటు మహీంద్రా అండ్ మహీంద్రా విక్రయాలు 2 శాతం వృద్ధితో 2,49,505 యూనిట్స్ నుంచి 2,54,701 యూనిట్స్‌కు పెరిగాయి. దేశీయంగా ఆటోమొబైల్ రంగం పలు సవాళ్లు ఎదుర్కొంటున్నప్పటికీ.. అన్ని విభాగాలు కలిపి చూస్తే దేశీ విక్రయాల్లో 11 శాతం వృద్ధి సాధించగలిగామని ఎంఅండ్ఎం ప్రెసిడెంట్ రాజన్ వధేరా చెప్పారు. కొత్తగా ప్రవేశపెట్టిన మూడు ఉత్పత్తులు ఇందుకు తోడ్పడ్డాయని ఆయన వివరించారు. టాటా మోటార్స్ 16 శాతం.. టాటా మోటార్స్ విక్రయాలు గత ఆర్థిక సంవత్సరం 16 శాతం వృద్ధితో 5,86,507 యూనిట్స్ నుంచి 6,78,486కి చేరాయి. గత నెల మార్చిలో మాత్రం 1 శాతం క్షీణించి 69,409 యూనిట్స్ నుంచి 68,709 యూనిట్స్‌కు తగ్గాయి. ఇక హోండా కార్స్ ఇండియా అమ్మకాలు 8 శాతం పెరిగి 1,70,026 యూనిట్స్ నుంచి 1,83,787 యూనిట్స్‌కు చేరాయి. మార్కెట్లో కఠిన పరిస్థితులు నెలకొన్నప్పటికీ ఈ ఫలితాలు సాధించడం సానుకూలాంశమని సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రాజేష్ గోయల్ చెప్పారు. టయోటా కిర్లోస్కర్ మోటార్ (టీకేఎం) అమ్మకాలు 7 శాతం వృద్ధితో 1,40,645 వాహనాల నుంచి 1,50,525 యూనిట్స్‌కు చేరింది. హీరో అమ్మకాలు 78 లక్షలు.. ద్విచక్ర వాహనాల విభాగంలో హీరో మోటోకార్ప్ 78,20,745 వాహనాలు విక్రయించింది. 2017–18లో అమ్మకాలు 75,87,130గా నమోదయ్యాయి. అటు సుజుకీ మోటార్‌సైకిల్ ఇండియా విక్రయాలు సుమారు 30 శాతం వృద్ధితో 5,74,711 యూనిట్స్ నుంచి 7,47,506కి చేరాయి. గత ఆర్థిక సంవత్సరంలో టీవీఎస్ మోటార్స్ అమ్మకాలు 12 శాతం వృద్ధితో 37.57 లక్షలకు పెరిగాయి. పెరిగిన మారుతీ సుజుకీ కార్ల ధరలు న్యూఢిల్లీ: ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ.. ఏప్రిల్ ఒకటి నుంచి అన్ని మోడళ్ల కార్ల ధరలను స్వల్పంగా పెంచినట్లు ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం ‘హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్స్’ (హెచ్ఎస్ఆర్పీ)ను వాహనాలకు తప్పనిసరి చేసిన నేపథ్యంలో ఈ ప్లేట్స్ వ్యయాన్ని కస్టమర్లపై మోపుతున్నట్లు వివరించింది. తక్షణమే అమల్లోకి వచ్చే విధంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అధిక భద్రతా ప్లేట్ ధర రూ.689 వరకు ఉన్నందున ఈ మొత్తానికి ధరలు పెరిగినట్లు వెల్లడించింది. ఆల్టో 800 నుంచి ఎస్‌క్లాస్ వరకు అనేక కార్లను సంస్థ విక్రయిస్తుండగా.. వీటి ధరల శ్రేణి రూ.2.67 లక్షలు–11.48 లక్షల వరకు ఉన్నాయి. -
స్పీడు పెంచిన హ్యుందాయ్..8 కొత్త కార్లు లాంచ్
చెన్నై : దక్షిణ కొరియాకు చెందిన ఆటోమొబైల్ దిగ్గజం హ్యుందాయ్ మోటార్స్ మరింత స్పీడు పెంచింది. కొత్తకొత్త మోడల్స్‌తో వినియోగదారులను అలరించేందుకు సిద్ధమైంది. వచ్చే నాలుగేళ్లలో ఎనిమిది కొత్త మోడల్స్‌ను మార్కెట్లోకి తీసుకురానున్నట్టు హ్యుందాయ్ మోటార్స్ టాప్ అధికారి చెప్పారు. 2017లో హ్యుందాయ్ ఇండియాలో రెండంకెల వృద్ధిని నమోదుచేయనుందని పేర్కొన్నారు. వచ్చే నాలుగేళ్లలో కంపెనీ మొత్తం 10 ప్రొడక్ట్‌లను లాంచ్ చేయబోతుంది, దానిలో ఎనిమిది కొత్త మోడల్స్ అని హ్యుందాయ్ మోటార్స్ ఇండియా లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ వైకే కూ చెప్పారు. మిగతా రెండు మోడల్స్ అప్‌గ్రేడ్స్ చేసేవని తెలిపారు. లోనిక్యూ హైబ్రిడ్ మోడల్‌ను న్యూఢిల్లీలో జరుగబోతున్న ఆటోషో 2018లో కంపెనీ షోకేసు చేయబోతుందని తెలిపారు. మిగతావి భవిష్యత్తులో లాంచ్ చేయబోతున్నట్టు పేర్కొన్నారు. కాంపాక్ట్ కారు సెగ్మెంట్లో హ్యుందాయ్ చాలా స్ట్రాంగ్‌గా ఉందని, ఐ10, ఐ20 లాంటి మోడల్స్‌తో 51 శాతం ఇండియన్ కారు మార్కెట్‌ను హ్యుందాయ్ సొంతం చేసుకుందని చెప్పారు. మిడ్ సెగ్మెంట్ పోర్ట్ ఫోలియోను మరింత బలోపేతం చేసేందుకు కంపెనీ కృషిచేస్తుందని తెలిపారు. -
టాప్ గేర్ లో హ్యుందాయ్...
చెన్నై: దేశంలోని అతిపెద్ద కార్ల తయారీదారు హ్యుందాయ్ అక్టోబర్‌లో టాప్ రేంజ్ లో దూసుకుపోయింది. ఒకవైపు ప్రధాన ప్రత్యర్థి మారుతి అమ్మకాల్లో క్షీణతను నమోదుచేయగా హ్యుందాయ్ గరిష్ట అమ్మకాలను నమోదు చేసింది. 64,372 యూనిట్లు విక్రయంతో రికార్డ్ స్థాయి అమ్మకాలను నమోదు చేసినట్టు హ్యుందాయ్ మోటార్ ఇండియా ఒక ప్రకటనలో వెల్లడించింది. దేశీయంగా 50,016 వాహనాలు అమ్మగా, 14,356 వాహనాలను ఎగుమతి చేసింది. గత ఏడాది ఇదే సమయంలో 61,701 యూనిట్ల (దేశీయ 47,105 యూనిట్లు, ఎగుమతులు 14,686 యూనిట్లు) విక్రయించింది. 15 నెలల్లో దేశీయంగా అత్యధిక , వేగవంతమైన అమ్మకాలు సాధించినట్టు హ్యుందాయ్ ఎండీ, సీఈవో వైకే కూ ప్రకటించారు. 50,000 యూనిట్ల గరిష్ట అమ్మకాలతో, గత 40 వేల అమ్మకాల మైలురాయిని అధిగమించినట్టు చెప్పారు. మరోవైపు ఇండియాలో అత్యధికంగా అమ్ముడవుతున్న కారు మోడల్ గా ఉన్న మారుతి సుజుకి అక్టోబర్ అమ్మకాలు క్షీణించాయి. గడచిన అక్టోబరులో ఆల్టో అమ్మకాలు 9.8 శాతం తగ్గాయి. గత సంవత్సరం పండగ సీజనులో 37,595 ఆల్టో యూనిట్లు విక్రయం కాగా, ఈ సంవత్సరం 33,929 యూనిట్లు అమ్ముడయ్యాయని మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ ఓ ప్రకటనలో తెలిపింది. -
హ్యుందాయ్ హవా తగ్గుతోందా?
క్యూ1లో 12శాతం పడిపోయిన నికరలాభాలు సియోల్ : సౌత్ కొరియాకు చెందిన హ్యుందాయ్ మోటార్ వరుసగా తొమ్మిదో త్రైమాసికంలో కూడా లాభాలను కోల్పోయింది. హ్యుందాయ్ మోటర్ కు అతి పెద్ద మార్కెటైన చైనాలో, స్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్స్ కు డిమాండ్ పడిపోవడంతో మొదటి త్రైమాసికంలో నికర లాభాలు 12శాతం పడిపోయాయి. రూ.1,69,027 కోట్లగా(1.69 ట్రిలియన్లు)గా నికర లాభాలను నమోదుచేసినట్టు కంపెనీ ప్రకటించింది. నిర్వహణ లాభాలు కూడా 16 శాతం కిందకు జారి, 1.34 ట్రిలియన్ గా నమోదయ్యాయి. కాగ కంపెనీ రెవెన్యూ 7 శాతం పెరిగి, 22.35 ట్రిలియన్ గా నమోదైంది. హ్యుందాయ్ మోటార్ కు ఈ త్రైమాసికంలో ప్రపంచవ్యాప్తంగా అమ్మకాలు పడిపోయాయి. ఈ అమ్మకాలు 6 శాతం నష్టపోయి, కేవలం 1.1 ట్రిలియన్ వెహికిల్స్ ను మాత్రమే అమ్మినట్టు కంపెనీ ప్రకటించింది. ఒక్క చైనాలోనే ఈ కంపెనీ అమ్మకాలు 10 శాతం పడిపోయాయని వెల్లడించింది. చిన్న కార్ల కొనుగోలు మీద చైనా పన్నుల కోత విధించినప్పటికీ, అమ్మకాలను మాత్రం పుంజుకోలేకపోయాయని కంపెనీ ఆందోళన వ్యక్తంచేసింది. హ్యుందాయ్ కు బలం, చిన్న,ఇంధన సామర్థ్య సెడాన్ లు కలిగి ఉండటం. గ్లోబల్ ఎకానమీ తిరోగమనంలో నడుస్తున్నప్పటికీ ఈ కంపెనీని ఇండస్ట్రీలో బాగా నడిపించిన శక్తి ఈ వెహికిల్స్ దే. అయితే ఈ మధ్యకాలంలో ఆయిల్ ధరలు పెరగడంతో వినియోగదారులు ఎక్కువగా గ్యాస్ గజ్లింగ్ స్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్స్ వైపు మొగ్గుచూపారు. ఈ కారణంతో ఇంధన సామర్థ్యం కలిగిన హ్యుందాయ్ వెహికిల్స్ కు డిమాండ్ తగ్గింది. -
పల్లెబాట పట్టిన హ్యుందాయ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్ ఇండియా పల్లెబాట పట్టింది. గ్రామీణ ప్రాంతాల నుంచీ కంపెనీ కార్లకు గిరాకీ అంతకంతకూ పెరుగుతోంది. దీంతో కస్టమర్లకు చేరువ అయ్యేందుకు మూడు, నాల్గవ తరగతి పట్టణాల్లో రూరల్ సేల్స్ ఔట్లెట్లను (ఆర్‌ఎస్‌వో) విస్తరిస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సుమారు 315 ఆర్ఎస్వోలను కంపెనీ నిర్వహిస్తోంది. ఈ విధానం విజయవంతం కావడంతో వ్యాపార అవకాశాలు ఉన్న ప్రాంతాల్లో మరిన్ని ఔట్లెట్లను ప్రారంభించనుంది. మొత్తం అమ్మకాల్లో 10 శాతం వాటా ఆర్‌ఎస్‌వోల ద్వారా సమకూరుతోంది. 2014-15లో ఇది 15 శాతానికి చేరుకోవచ్చని అంచనా వేస్తోంది. ఏటా రెండు మోడళ్లు.. హ్యుందాయ్ భారత్‌లో ఏటా కనీసం రెండు మోడళ్లను పరిచయం చేయాలని కృతనిశ్చయంతో ఉంది. 2014లో మూడు మోడళ్లను మార్కెట్లోకి తీసుకొచ్చామని కంపెనీ ప్రొడక్షన్ విభాగం వైస్ ప్రెసిడెంట్ టి.సారంగరాజన్ తెలిపారు. ఎలైట్ ఐ20 మోడల్‌ను మంగళవారం హైదరాబాద్ మార్కెట్లో ప్రవేశపెట్టిన సందర్భంగా ఆర్ఎస్ఎం తేజ అడుసుమల్లి చౌదరితో కలిసి మీడియాతో మాట్లాడారు. కాంపాక్ట్ ఎస్యూవీ విభాగంలోకి త్వరలో రానున్నామని వెల్లడించారు. ప్రతి మోడల్ ఒక కొత్త విభాగాన్ని సృష్టిస్తోందని పేర్కొన్నారు. అంతర్జాతీయంగా విక్రయిస్తున్న మోడళ్లకు మార్పులు చేసి భారత్‌లో విడుదల చేస్తున్నామని చెప్పారు. 7 సీట్ల మల్లీ యుటిలిటీ వాహనాన్ని కంపెనీ 2016లోగా భారత్‌కు తెచ్చే యోచనలో ఉంది. హైదరాబాద్ ఆర్అండ్డీలో.. నూతన మోడళ్ల డిజైనింగ్‌లో హైదరాబాద్‌లోని హ్యుందాయ్ పరిశోధన, అభివృద్ధి కేంద్రం పాత్ర అత్యంత కీలకమని సారంగరాజన్ పేర్కొన్నారు. విదేశీ మోడళ్ల రూపకల్పనలో సైతం ఈ కేంద్రం పాలుపంచుకుంటోందని చెప్పారు. ఇక ఈ ఏడాది దేశంలో 4.10 లక్షల వాహనాల విక్రయ లక్ష్యం విధించుకున్నామని పేర్కొన్నారు. 2013-14లో 3.95 లక్షల యూనిట్లు హ్యుందాయ్ విక్రయించింది. ఎగుమతులు 2.3 లక్షల యూనిట్లు కాగా, ఈ ఆర్థిక సంవత్సరంలో 2.2 లక్షల యూనిట్లు చేయాలని నిర్ణయించింది. దీర్ఘకాలిక వ్యూహంలో భాగంగా చెన్నై ప్లాంటు నుంచి యూరప్ దేశాలకు ఎగుమతులను నిలిపివేసింది. ఇక నుంచి దేశీయ మార్కెట్‌పై ప్రత్యేక దృష్టి సారించనుంది. -
హ్యుందాయ్ నుంచి ఎక్సెంట్
న్యూఢిల్లీ: కాంపాక్ట్ సెడాన్ కార్ల విభాగంలో రేట్ల పోరుకు తెర లేపుతూ హ్యుందాయ్ మోటార్ ఇండియా తాజాగా ఎక్సెంట్ కారును మార్కెట్లోకి విడుదల చేసింది. ప్రారంభ ఆఫర్ కింద దీని ధర రూ. 4.66 లక్షలు నుంచి రూ. 7.38 లక్షల దాకా ఉంటుంది. ఇది పెట్రోల్, డీజిల్ వెర్షన్లలో లభిస్తుంది. మారుతీ సుజుకీ డిజైర్, హోండా అమేజ్‌తో పాటు టాటా మోటార్స్ ప్రవేశపెట్టబోతున్న జెస్ట్ కార్లకు ఎక్సెంట్ పోటీనివ్వనుంది. కాంపాక్ట్ సెడాన్ సెగ్మెంట్లో భారీగా అమ్ముడవుతున్న మారుతీ సుజుకీ డిజైర్ రేటు రూ. 4.85 లక్షలు - రూ. 7.32 లక్షలుగా (ఢిల్లీ ఎక్స్‌షోరూం ధర) ఉంది. ఈ విభాగంలో నెలకు 24,000 కార్లు అమ్ముడవుతున్నట్లు అంచనా. గతేడాది ప్రవేశపెట్టిన గ్రాండ్ ఐ10 కారు ప్లాట్‌ఫాంపైనే ఎక్సెంట్ని కూడా రూపొందించారు. నాణ్యత, డిజైన్, ఫీచర్స్‌పరంగా ఇది కొత్త ప్రమాణాలు నెలకొల్పుతుందని హ్యుందాయ్ మోటార్ ఇండియా (హెచ్ఎంఐఎల్) ఎండీ బీఎస్ సియో చెప్పారు. తాజా ఎక్సెంట్‌తో.. 4 మీటర్ల లోపు ఎంట్రీ లెవెల్ కార్ల నుంచి ప్రీమియం ఎగ్జిక్యూటివ్ కార్ల దాకా అన్ని విభాగాల్లోనూ తమ దగ్గర కార్లు ఉన్నట్లవుతుందని ఆయన పేర్కొన్నారు. దేశీ మార్కెట్లో తమ స్థానం పటిష్టం చేసుకునేందుకు ఎక్సెంట్ తోడ్పడగలదని హెచ్ఎంఐఎల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రాకేశ్ శ్రీవాస్తవ తెలిపారు. -
అర కోటి దాటిన హ్యుందాయ్...
న్యూఢిల్లీ: ప్రముఖ కార్ల కంపెనీ హ్యుందాయ్ భారత్‌లో 50 లక్షలవ కారును గురువారం ఉత్పత్తి చేసింది. చెన్నై సమీపంలోని ఇరున్గట్టుకొట్టై ప్లాంట్‌లో ఈ కారును ఉత్పత్తి చేశామని హ్యుందాయ్ మోటార్స్ ఇండియా లిమిటెడ్ ఎండీ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ బి.ఎస్. సియో పేర్కొన్నారు. ఇది తమకొక ముఖ్యమైన మైలురాయని వివరించారు. తాము భారత్‌లో ఉత్పత్తి చేసిన 50 లక్షల కార్లలో 62 శాతం కార్లను దేశీయ మార్కెట్లో విక్రయించామని, 38% కార్లను ఎగుమతి చేశామని తెలిపారు. 1998లో భారత్‌లో కార్యకలాపాలు ప్రారంభించిన హ్యుందాయ్ కంపెనీ ఇప్పటిదాకా 270 కోట్ల డాలర్లు పెట్టుబడులు పెట్టింది. వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 6.8 లక్షల కార్లుగా ఉన్న ఈ కంపెనీ గత ఏడాది 500 కోట్ల డాలర్ల టర్నోవర్ సాధించింది. 9,500 మందికి ప్రత్యక్షంగా ఉపాధిని కల్పిస్తోంది.