హ్యుందాయ్ హవా తగ్గుతోందా?
క్యూ1లో 12శాతం పడిపోయిన నికరలాభాలు
సియోల్ : సౌత్ కొరియాకు చెందిన హ్యుందాయ్ మోటార్ వరుసగా తొమ్మిదో త్రైమాసికంలో కూడా లాభాలను కోల్పోయింది. హ్యుందాయ్ మోటర్ కు అతి పెద్ద మార్కెటైన చైనాలో, స్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్స్ కు డిమాండ్ పడిపోవడంతో మొదటి త్రైమాసికంలో నికర లాభాలు 12శాతం పడిపోయాయి. రూ.1,69,027 కోట్లగా(1.69 ట్రిలియన్లు)గా నికర లాభాలను నమోదుచేసినట్టు కంపెనీ ప్రకటించింది. నిర్వహణ లాభాలు కూడా 16 శాతం కిందకు జారి, 1.34 ట్రిలియన్ గా నమోదయ్యాయి.
కాగ కంపెనీ రెవెన్యూ 7 శాతం పెరిగి, 22.35 ట్రిలియన్ గా నమోదైంది. హ్యుందాయ్ మోటార్ కు ఈ త్రైమాసికంలో ప్రపంచవ్యాప్తంగా అమ్మకాలు పడిపోయాయి. ఈ అమ్మకాలు 6 శాతం నష్టపోయి, కేవలం 1.1 ట్రిలియన్ వెహికిల్స్ ను మాత్రమే అమ్మినట్టు కంపెనీ ప్రకటించింది. ఒక్క చైనాలోనే ఈ కంపెనీ అమ్మకాలు 10 శాతం పడిపోయాయని వెల్లడించింది. చిన్న కార్ల కొనుగోలు మీద చైనా పన్నుల కోత విధించినప్పటికీ, అమ్మకాలను మాత్రం పుంజుకోలేకపోయాయని కంపెనీ ఆందోళన వ్యక్తంచేసింది.
హ్యుందాయ్ కు బలం, చిన్న,ఇంధన సామర్థ్య సెడాన్ లు కలిగి ఉండటం. గ్లోబల్ ఎకానమీ తిరోగమనంలో నడుస్తున్నప్పటికీ ఈ కంపెనీని ఇండస్ట్రీలో బాగా నడిపించిన శక్తి ఈ వెహికిల్స్ దే. అయితే ఈ మధ్యకాలంలో ఆయిల్ ధరలు పెరగడంతో వినియోగదారులు ఎక్కువగా గ్యాస్ గజ్లింగ్ స్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్స్ వైపు మొగ్గుచూపారు. ఈ కారణంతో ఇంధన సామర్థ్యం కలిగిన హ్యుందాయ్ వెహికిల్స్ కు డిమాండ్ తగ్గింది.