స్పీడు పెంచిన హ్యుందాయ్..8 కొత్త కార్లు లాంచ్
Published Fri, Feb 24 2017 12:40 PM | Last Updated on Tue, Sep 5 2017 4:30 AM
చెన్నై : దక్షిణ కొరియాకు చెందిన ఆటోమొబైల్ దిగ్గజం హ్యుందాయ్ మోటార్స్ మరింత స్పీడు పెంచింది. కొత్తకొత్త మోడల్స్తో వినియోగదారులను అలరించేందుకు సిద్ధమైంది. వచ్చే నాలుగేళ్లలో ఎనిమిది కొత్త మోడల్స్ను మార్కెట్లోకి తీసుకురానున్నట్టు హ్యుందాయ్ మోటార్స్ టాప్ అధికారి చెప్పారు. 2017లో హ్యుందాయ్ ఇండియాలో రెండంకెల వృద్ధిని నమోదుచేయనుందని పేర్కొన్నారు. వచ్చే నాలుగేళ్లలో కంపెనీ మొత్తం 10 ప్రొడక్ట్లను లాంచ్ చేయబోతుంది, దానిలో ఎనిమిది కొత్త మోడల్స్ అని హ్యుందాయ్ మోటార్స్ ఇండియా లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ వైకే కూ చెప్పారు. మిగతా రెండు మోడల్స్ అప్గ్రేడ్స్ చేసేవని తెలిపారు.
లోనిక్యూ హైబ్రిడ్ మోడల్ను న్యూఢిల్లీలో జరుగబోతున్న ఆటోషో 2018లో కంపెనీ షోకేసు చేయబోతుందని తెలిపారు. మిగతావి భవిష్యత్తులో లాంచ్ చేయబోతున్నట్టు పేర్కొన్నారు. కాంపాక్ట్ కారు సెగ్మెంట్లో హ్యుందాయ్ చాలా స్ట్రాంగ్గా ఉందని, ఐ10, ఐ20 లాంటి మోడల్స్తో 51 శాతం ఇండియన్ కారు మార్కెట్ను హ్యుందాయ్ సొంతం చేసుకుందని చెప్పారు. మిడ్ సెగ్మెంట్ పోర్ట్ ఫోలియోను మరింత బలోపేతం చేసేందుకు కంపెనీ కృషిచేస్తుందని తెలిపారు.
Advertisement