
సాక్షి, న్యూఢిల్లీ: దేశీయ రెండవ ద్విచక్ర వాహన సంస్థ బజాజ్ ఆటో రెండు కొత్త బైక్‌లను లాంచ్ చేసింది. అంతర్జాతీయంగనూ దేశీయ మార్కెట్లో అమ్మకాలను పెంచుకునే లక్ష్యంతో తన పాపులర్ మోడల్ బజాజ డిస్కవర్ 2018 మోడల్స్‌ను విడుదల చేసింది. ఇందులో డిస్కవర్ 110 డిస్కవర్ 125 పేరుతో కొత్త మోడల్స్‌ను అందించనున్నట్లు కంపెనీ పేర్కొంది.కొత్త ఇంజీన్, కొత్త ఫీచర్లు, కొత స్టయిల్‌గా సరికొత్తగా వీటిని రూపొందించింది.
బజాజ్ డిస్కవర్ 110, డిస్కవర్ 125 ధరలను రూ. 50,176 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) రూ. 53,171 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా నిర్ణయించింది. బజాజ్ డిస్కవర్ 110 ఒకవేరియంట్‌లోనూ,బజాజ్ డిస్కవర్ 125 (డ్రమ్ బ్రేక్ , డిస్క్ బ్రేక్) రెండు వేరియంట్స్‌లోనూ అందుబాటులో ఉంది. వీటి ధరలు వరుసగా రూ. 53,171, రూ. 55,994 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉండనున్నాయి. ట్విన్ ఎల్‌ఈడీ డే టైమ్ రన్నింగ్ లాంప్స్, పార్ట్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఫస్ట్ ఇన్‌కాస్ల్ పీచర్లను 2018 మెడల్ బైక్స్‌లో జోడించింది.
బజాజ్ డిస్కవర్ 110: 110 సీసీ సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్ మోటార్, 8.5 బీహెచ్‌పీ వపర్, 9 ఎన్‌ఎం గరిష్ట టార్క్
బజాజ్ డిస్కవర్ 125: 125 సీసీ సింగిల్ సిలిండర్ , ఎయిర్ కూల్డ్ మోటార్,11 బీహెచ్‌పీ వపర్, 10.8 ఎంఎం గరిష్ట టార్క్ 5 స్పీడ్ ట్రాన్సిమిషన్ ప్రధాన ఫీచర్లు



Comments
Please login to add a commentAdd a comment