జీఎం (జనరల్ మోటార్స్) & హ్యుందాయ్ మోటార్ రెండూ కలిసి కీలకమైన రంగాలలో భవిష్యత్ ప్రణాళికలను రచించడానికి ఒక ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ రెండు బ్రాండ్స్ కలిసి కొత్త శ్రేణి వాహనాలను తీసుకురానున్నట్లు సమాచారం.
ఎలక్ట్రిక్, హైడ్రోజన్ వాహనాలతో సహా ప్రయాణికులకు అవసరమయ్యే వాహనాలు, కమర్షియల్ వాహనాలను జీఎం.. హ్యుందాయ్ మోటార్స్ తయారు చేసే అవకాశం ఉంది. అనుకున్నవన్నీ సజావుగా జరిగితే.. రానున్న రోజుల్లో రెండు బ్రాండ్స్ కలయికతో ఏర్పడ్డ కొత్త వెహికల్స్ రూపొందుతాయని తెలుస్తోంది.
ఈ ఒప్పందంపై హ్యుందాయ్ మోటార్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ యుయిసన్ చుంగ్ & జనరల్ మోటార్ చైర్మన్ అండ్ సీఈఓ మేరీ బర్రా సంతకం చేశారు. రెండు కంపెనీల మధ్య ఏర్పడ్డ భాగస్వామ్యం వాహన అభివృద్ధిని మరింత సమర్థవంతంగా చేసేలా చేస్తుందని బర్రా పేర్కొన్నారు.
ఇదీ చదవండి: ఒక్కసారిగా పెరిగిన బంగారం, వెండి.. చుక్కలు తాకిన కొత్త ధరలు!
భారత్‌లో జనరల్ మోటార్స్
1996లో జనరల్ మోటార్స్ కంపెనీ గుజరాత్‌లోని హలోల్ ప్లాంట్‌లో కార్లను నిర్మించడం ప్రారంభించింది. కొన్ని రోజులు దేశంలో సజావుగా ముందుకు సాగిన తరువాత కాలంలో కంపెనీ తన కార్యకలాపాలను దేశంలో పూర్తిగా నిలిపివేసింది. ఇప్పుడు హ్యుందాయ్ మోటార్ భాగస్వామ్యంతో మళ్ళీ దేశీయ మార్కెట్లో అడుగుపెట్టనుంది.
Comments
Please login to add a commentAdd a comment