అర కోటి దాటిన హ్యుందాయ్...
అర కోటి దాటిన హ్యుందాయ్...
Published Fri, Oct 18 2013 1:10 AM | Last Updated on Fri, Sep 1 2017 11:44 PM
న్యూఢిల్లీ: ప్రముఖ కార్ల కంపెనీ హ్యుందాయ్ భారత్‌లో 50 లక్షలవ కారును గురువారం ఉత్పత్తి చేసింది. చెన్నై సమీపంలోని ఇరున్‌గట్టుకొట్టై ప్లాంట్‌లో ఈ కారును ఉత్పత్తి చేశామని హ్యుందాయ్ మోటార్స్ ఇండియా లిమిటెడ్ ఎండీ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ బి.ఎస్. సియో పేర్కొన్నారు. ఇది తమకొక ముఖ్యమైన మైలురాయని వివరించారు. తాము భారత్‌లో ఉత్పత్తి చేసిన 50 లక్షల కార్లలో 62 శాతం కార్లను దేశీయ మార్కెట్లో విక్రయించామని, 38% కార్లను ఎగుమతి చేశామని తెలిపారు. 1998లో భారత్‌లో కార్యకలాపాలు ప్రారంభించిన హ్యుందాయ్ కంపెనీ ఇప్పటిదాకా 270 కోట్ల డాలర్లు పెట్టుబడులు పెట్టింది. వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 6.8 లక్షల కార్లుగా ఉన్న ఈ కంపెనీ గత ఏడాది 500 కోట్ల డాలర్ల టర్నోవర్ సాధించింది. 9,500 మందికి ప్రత్యక్షంగా ఉపాధిని కల్పిస్తోంది.
Advertisement