Maruti Suzuki DZire
-
అత్యధిక మైలేజ్ ఇచ్చే కారును లాంచ్ చేసిన మారుతి సుజుకీ..!
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకి భారత మార్కెట్లలోకి సరికొత్త కాంపాక్ట్ సెడాన్ డిజైర్‌లో సీఎన్జీ వేరియంట్‌ను విడుదల చేసింది. ఇది భారత్‌లో మోస్ట్ ఫ్యూయల్ ఎఫిసియంట్ కారుగా నిలుస్తోందని కంపెనీ పేర్కొంది. న్యూ డిజైర్ ఎస్-సీఎన్జీ గ్రీన్ మొబిలిటే లక్ష్యంగా మారుతి సుజుకీ పలు మోడళ్లను సీఎన్జీ వేరియంట్‌గా మారుస్తోంది. ఈ మోడల్‌తో మొత్తంగా 9 మోడల్ కార్లను సీఎన్జీ టెక్నాలజీతో జతచేసింది. మారుతి సుజుకీ న్యూ డిజైర్ ఎస్- సీఎన్జీ వేరియంట్ ధర రూ. 8 లక్షల నుంచి ప్రారంభం కానుంది. హై-ఎండ్ వేరియంట్ జెడ్ఎక్స్ఐ రూ. 8.82 లక్షల వద్ద లభిస్తుందని కంపెనీ తెలిపింది. ఈ మోడల్ కోసం బుకింగ్స్ ప్రారంభించామని, కొనుగోలుదారులు డీలర్ల వద్ద రూ. 11,000 అడ్వాన్స్ రూపంలో చెల్లించి బుకింగ్ చేసుకోవచ్చని కంపెనీ పేర్కొంది. దేశీయంగా సీఎన్జీ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని కంపెనీ వరుసగా సీఎన్జీ మోడల్స్‌ను మార్కెట్లోకి తీసుకొస్తోంది. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో డిజైర్ మోడల్‌కు వినియోగదారుల నుంచి అద్భుతమైన ఆదరణ ఉంది. కంపెనీ ఇప్పటికే మారుతి ఆల్టో, మారుతి ఎస్-ప్రెస్సో, వ్యాగన్ఆర్, మారుతీ ఎకో, మారుతీ సెలెరియో, ఎర్టిగా మోడళ్లను సీఎన్జీ వేరియంట్లో విక్రయిస్తోంది. ఈ జాబితాలో ఇప్పుడు డిజైర్‌ను కూడా తీసుకొచ్చింది ఇంజన్ విషయానికి వస్తే..! ఇంధన ధరల నుంచి ఉపశమనం కల్పిస్తూ మోస్ట్ ఫ్యూయల్ ఎఫిసియంట్ కారుగా న్యూ డిజైర్ ఎస్-సీఎన్జీ వేరియంట్‌ను కొనుగోలుదారులకు మారుతి సుజుకీ అందుబాటులోకి తెచ్చింది. కొత్త డిజైర్ ఎస్-సీఎన్జీ సాంకేతికతతో, కే-సిరీస్ డ్యూయల్ జెట్, డ్యూయల్ VVT 1.2L ఇంజన్ జతచేశారు. ఇది 57kW గరిష్ట శక్తిని, 98.5Nm గరిష్ట టార్క్‌ను అందించనుంది. ఈ కొత్త డిజైర్ ఒక కేజీకి 31.12 కిమీ మేర మైలేజీని అందిస్తోందని కంపెనీ పేర్కొంది. ఫీచర్స్‌లో సరికొత్తగా.. ఫీచర్ల పరంగా ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లేతో పాటు ఆటోమెటిక్ క్లైమెట్ కంట్రోల్, డ్యుయెల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్, బ్రేక్ అసిస్ట్ లాంటి అనేక అత్యాధునిక ఫీచర్లు ఇందులో ఉన్నాయని కంపెనీ వెల్లడించింది. చదవండి: క్రేజీ ఆఫర్..! పలు మహీంద్రా కార్లపై రూ. 3 లక్షల వరకు భారీ తగ్గింపు..! -
సెకండ్ హ్యాండ్ వాహనాల అమ్మకాల్లో ఇవే టాప్
న్యూఢిల్లీ: 2020లో భారతదేశంలో మారుతి సుజుకి డిజైర్, బజాజ్ పల్సర్ సరోకొత్త రికార్డు సృష్టించాయి. గత ఏడాది సెకండ్ హ్యాండ్ వాహనాల అమ్మకాల్లో అత్యధికంగా అమ్ముడైన కారుగా మారుతి సుజుకి డిజైర్, అత్యధికంగా అమ్ముడైన ద్విచక్ర వాహనంగా బజాజ్ పల్సర్ నిలిచినట్లు "ఆటోమొబైల్ ఇండస్ట్రీ ట్రెండ్ రిపోర్ట్ 2020" ప్రకారం ఆన్ లైన్ ప్రీ ఓన్డ్ ఆటోమొబైల్ సంస్థ డ్రూమ్ వెల్లడించింది. 2020లో సెకండ్ హ్యాండ్ కార్ల సగటు అమ్మకపు ధర రూ.8,38,827గా ఉంది. అలాగే మోటార్ సైకిళ్ల సగటు ధర రూ.47,869గా ఉన్నట్లు నివేదిక పేర్కొంది. 2020లో విక్రయించిన వాడిన కార్లు, మోటార్ సైకిళ్ల సగటు యాజమాన్యం వ్యవధి 5ఏళ్ల నుంచి 7ఏళ్లగా ఉంది. 2020లో విక్రయించిన మొత్తం సెకండ్ హ్యాండ్ కార్లలో 34 శాతం పెట్రోల్ మోడల్స్, 65 శాతం డీజిల్ మోడల్స్, 1 శాతం పెట్రోల్ + సిఎన్జి మోడల్స్ ఉన్నాయి. అలాగే ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఉన్న కార్లు మొత్తం కార్ల అమ్మకాల్లో 63 శాతం ఉండగా, మిగిలిన కార్లు మాన్యువల్ ట్రాన్స్మిషన్ కలిగి ఉన్నాయి. నివేదిక ప్రకారం.. తెలుపు, సిల్వర్, బూడిద రంగు గల వాటిని ఎక్కువగా కొనుగోలుదారులు ఇష్ట్టపడ్డారు. 2020లో విక్రయించిన మొత్తం సెకండ్ హ్యాండ్ కార్లలో 36 శాతం భారతీయ కంపెనీలకు, 22 శాతం జపాన్ కంపెనీలకు, 18 శాతం జర్మన్ కంపెనీలకు, 12 శాతం దక్షిణ కొరియా కంపెనీలకు చెందినవని నివేదిక పేర్కొంది. చదవండి: బంగారం రుణాలపై తాజా వడ్డీ రేట్లు ఇవే! -
మారుతీ కొత్త డిజైర్ సందడి
న్యూఢిల్లీ: దేశీ దిగ్గజ కార్ల తయారీ కంపెనీ ‘మారుతీ సుజుకీ ఇండియా’ తాజాగా తన కాంపాక్ట్ సెడాన్ ‘డిజైర్’లో సరికొత్త వెర్షన్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. దీని ధర రూ.5.45 లక్షలు–రూ. 9.41 లక్షల (ఎక్స్‌షోరూమ్ ఢిల్లీ) శ్రేణిలో ఉంది. ఇది హ్యుందాయ్ ఎక్సెంట్, హోండా అమేజ్, ఫోర్డ్ యాస్సైర్, ఫోక్స్‌వ్యాగన్ అమియోలకు గట్టిపోటీనిస్తుందని విళ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఈ కార్ల ధరలు కూడా రూ.4.7 లక్షలు–రూ.8.41 లక్షల మధ్యలోనే ఉన్నాయి. ‘డిజైర్ మోడల్‌ను భారత్‌ను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకంగా రూపొందించాం. అనతికాలంలోనే ఇండియన్ ఆటోమొబైల్ రంగంలో ఇది అత్యంత పాపులర్ బ్రాండ్ స్థాయికి ఎదిగింది. యువతను, సెడాన్ కస్టమర్ల కోసం ఇప్పుడు ఇదే మోడల్లో సరికొత్త వెర్షన్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చాం’ అని మారుతీ సుజుకీ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో కెనిచి అయుకవ తెలిపారు. కొత్త డిజైర్ మోడల్‌కు సంబంధించి కంపెనీకి ఇప్పటికే 33,000 యూనిట్లకు గానూ బుకింగ్స్ అందాయని పేర్కొన్నారు. కాగా కంపెనీ తన సప్లయర్స్‌తో కలిసి ఈ మోడల్‌పై రూ.1,000 కోట్లకుపైగా ఇన్వెస్ట్ చేసింది. ప్రత్యేకతలు కొత్త డిజైర్ వేరియంట్ పెట్రోల్, డీజిల్ ఇంజిన్ ఆప్షన్లలో కస్టమర్లకు అందుబాటులోకి వస్తోంది. ఇందులో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్, 1.3 లీటర్ డీజిల్ ఇంజిన్‌ను అమర్చారు. డీజిల్ వెర్షన్ లీటర్‌కు 28.4 కిలోమీటర్ల మైలేజ్‌ను, పెట్రోల్ వెర్షన్ లీటర్‌కు 22 కిలోమీటర్ల మైలేజ్‌ను అందిస్తుందని కంపెనీ తెలిపింది. మారుతీ ఇప్పటిదాకా దేశంలో 14 లక్షల యూనిట్ల డిజైర్ కార్లను విక్రయించింది. డిజైర్ మోడల్‌ను 2008 మార్చిలో మార్కెట్లోకి వచ్చింది. ఎంట్రీ సెడాన్ విభాగంలో మారుతీ సుజుకీ ఆధిపత్యానికి డిజైర్ మోడలే ప్రధాన కారణం. -
న్యూ లుక్‌లో డిజైర్ ఆవిష్కరణ.. ధరెంత?
మారుతీ సుజుకి పాపులర్ కాంపాక్ట్ సెడాన్ డిజైర్ కొత్త అవతారం వచ్చేసింది. కొత్తతరం డిజైర్ వాహనాన్ని నేడు కంపెనీ భారత మార్కెట్లో ఆవిష్కరించింది. టాటా టీగోర్, హ్యుందాయ్ ఎక్సెంట్ ఫేస్‌లిఫ్ట్ ఇటీవల లాంచ్ కావడంతో మారుతీ సుజుకీ కూడా తన న్యూ డిజైర్ ను ఆవిష్కరించేసింది. మే 16న దీన్ని లాంచ్ చేయనున్నట్టు కంపెనీ ప్రకటించింది. ఈ వాహనం డిజైర్ బ్యాడ్జ్ తోనే మార్కెట్లోకి రానుంది. ముందువరకున్న సిఫ్ట్ డిజైర్ పేరు ఇక మనకు కనిపించదు. స్వతంత్రంగానే దాని సత్తా చూపించాలని కంపెనీ భావిస్తోంది. 2008లో ఇది లాంచ్ అయిన దగ్గర్నుంచి 13 లక్షల యూనిట్లకు పైగా వాహనాలు మారుతీ సుజుకీ ఫ్యాక్టరీ నుంచి బయట మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చాయి.. సోమవారం ఆవిష్కరణ అయిన కొత్త డిజైర్ లో ఉన్న ఫీచర్లేమిటో ఓ సారి చూద్దాం.. లుక్స్... ఈ కొత్త డిజైర్ పూర్తిగా న్యూ, ప్రెష్ లుక్‌లో వచ్చింది. హెక్సాగోనల్ గ్రిల్ తో దీన్ని కంపెనీ రీడిజైన్ చేసింది. ఈ కొత్త డిజైర్ 40ఎంఎం వైడర్, 20ఎంఎం లాంగర్ వీల్ బేస్‌తో ఉంది. అతిపెద్ద ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, కర్వ్డ్ ఎల్ఈడీ డే-టైమ్ రన్నింగ్ ల్యాంప్స్‌ను, పూర్తిగా రీడిజైన్ చేసిన అలోయ్ వీల్స్ ను ఇది కలిగి ఉంది. ఇంజిన్.. గరిష్ట పవర్ 83బీహెచ్పీ, 115ఎన్ఎం గరిష్ట టర్క్ ఉత్పత్తిచేసే 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ను ఇది కలిగి ఉంది. అదేవిధంగా 74బీహెచ్పీ పీక్ పవర్, 190ఎన్ఎం పీక్ టర్క్ ప్రొడ్యూస్ చేసే 1.3 లీటర్ మల్టి-జెట్ ఇంజిన్ తో ఇది రూపొందింది. ట్రాన్స్మిషన్.. ఫైవ్-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఇది కలిగి ఉంది. ఫీచర్లు.. టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఆపిల్ కార్ ప్లే/ ఆండ్రాయిడ్ ఆటో బ్లూటూత్, యూఎస్బీ, అక్స్-ఇన్. ధర : బేస్ ధర ఆరు లక్షల నుంచి టాప్ ఎండ్ వేరియంట్ ధర తొమ్మిది లక్షల వరకు ఉండొచ్చని అంచనాలు వెలువడుతున్నాయి. హ్యుందాయ్ ఎక్సెంట్ ఫేస్‌లిప్ట్, న్యూ టాటా టిగోర్, హోండా అమేజ్, ఫోర్డ్ ఆస్పైర్, ఫోక్స్ వాగన్ అమియోలకు గట్టిపోటీనే ఇచ్చేందుకు ఇది లాంచింగ్ కు సిద్ధమైందట. -
హ్యుందాయ్ నుంచి ఎక్సెంట్
న్యూఢిల్లీ: కాంపాక్ట్ సెడాన్ కార్ల విభాగంలో రేట్ల పోరుకు తెర లేపుతూ హ్యుందాయ్ మోటార్ ఇండియా తాజాగా ఎక్సెంట్ కారును మార్కెట్లోకి విడుదల చేసింది. ప్రారంభ ఆఫర్ కింద దీని ధర రూ. 4.66 లక్షలు నుంచి రూ. 7.38 లక్షల దాకా ఉంటుంది. ఇది పెట్రోల్, డీజిల్ వెర్షన్లలో లభిస్తుంది. మారుతీ సుజుకీ డిజైర్, హోండా అమేజ్‌తో పాటు టాటా మోటార్స్ ప్రవేశపెట్టబోతున్న జెస్ట్ కార్లకు ఎక్సెంట్ పోటీనివ్వనుంది. కాంపాక్ట్ సెడాన్ సెగ్మెంట్లో భారీగా అమ్ముడవుతున్న మారుతీ సుజుకీ డిజైర్ రేటు రూ. 4.85 లక్షలు - రూ. 7.32 లక్షలుగా (ఢిల్లీ ఎక్స్‌షోరూం ధర) ఉంది. ఈ విభాగంలో నెలకు 24,000 కార్లు అమ్ముడవుతున్నట్లు అంచనా. గతేడాది ప్రవేశపెట్టిన గ్రాండ్ ఐ10 కారు ప్లాట్‌ఫాంపైనే ఎక్సెంట్ని కూడా రూపొందించారు. నాణ్యత, డిజైన్, ఫీచర్స్‌పరంగా ఇది కొత్త ప్రమాణాలు నెలకొల్పుతుందని హ్యుందాయ్ మోటార్ ఇండియా (హెచ్ఎంఐఎల్) ఎండీ బీఎస్ సియో చెప్పారు. తాజా ఎక్సెంట్‌తో.. 4 మీటర్ల లోపు ఎంట్రీ లెవెల్ కార్ల నుంచి ప్రీమియం ఎగ్జిక్యూటివ్ కార్ల దాకా అన్ని విభాగాల్లోనూ తమ దగ్గర కార్లు ఉన్నట్లవుతుందని ఆయన పేర్కొన్నారు. దేశీ మార్కెట్లో తమ స్థానం పటిష్టం చేసుకునేందుకు ఎక్సెంట్ తోడ్పడగలదని హెచ్ఎంఐఎల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రాకేశ్ శ్రీవాస్తవ తెలిపారు.