న్యూ లుక్లో డిజైర్ ఆవిష్కరణ.. ధరెంత?
Published Mon, Apr 24 2017 6:38 PM | Last Updated on Tue, Sep 5 2017 9:35 AM
మారుతీ సుజుకి పాపులర్ కాంపాక్ట్ సెడాన్ డిజైర్ కొత్త అవతారం వచ్చేసింది. కొత్తతరం డిజైర్ వాహనాన్ని నేడు కంపెనీ భారత మార్కెట్లో ఆవిష్కరించింది. టాటా టీగోర్, హ్యుందాయ్ ఎక్సెంట్ ఫేస్లిఫ్ట్ ఇటీవల లాంచ్ కావడంతో మారుతీ సుజుకీ కూడా తన న్యూ డిజైర్ ను ఆవిష్కరించేసింది. మే 16న దీన్ని లాంచ్ చేయనున్నట్టు కంపెనీ ప్రకటించింది. ఈ వాహనం డిజైర్ బ్యాడ్జ్ తోనే మార్కెట్లోకి రానుంది. ముందువరకున్న సిఫ్ట్ డిజైర్ పేరు ఇక మనకు కనిపించదు. స్వతంత్రంగానే దాని సత్తా చూపించాలని కంపెనీ భావిస్తోంది. 2008లో ఇది లాంచ్ అయిన దగ్గర్నుంచి 13 లక్షల యూనిట్లకు పైగా వాహనాలు మారుతీ సుజుకీ ఫ్యాక్టరీ నుంచి బయట మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చాయి.. సోమవారం ఆవిష్కరణ అయిన కొత్త డిజైర్ లో ఉన్న ఫీచర్లేమిటో ఓ సారి చూద్దాం..
లుక్స్...
ఈ కొత్త డిజైర్ పూర్తిగా న్యూ, ప్రెష్ లుక్లో వచ్చింది. హెక్సాగోనల్ గ్రిల్ తో దీన్ని కంపెనీ రీడిజైన్ చేసింది. ఈ కొత్త డిజైర్ 40ఎంఎం వైడర్, 20ఎంఎం లాంగర్ వీల్ బేస్తో ఉంది. అతిపెద్ద ప్రొజెక్టర్ హెడ్ల్యాంప్స్, కర్వ్డ్ ఎల్ఈడీ డే-టైమ్ రన్నింగ్ ల్యాంప్స్ను, పూర్తిగా రీడిజైన్ చేసిన అలోయ్ వీల్స్ ను ఇది కలిగి ఉంది.
ఇంజిన్..
గరిష్ట పవర్ 83బీహెచ్పీ, 115ఎన్ఎం గరిష్ట టర్క్ ఉత్పత్తిచేసే 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ను ఇది కలిగి ఉంది. అదేవిధంగా 74బీహెచ్పీ పీక్ పవర్, 190ఎన్ఎం పీక్ టర్క్ ప్రొడ్యూస్ చేసే 1.3 లీటర్ మల్టి-జెట్ ఇంజిన్ తో ఇది రూపొందింది.
ట్రాన్స్మిషన్..
ఫైవ్-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఇది కలిగి ఉంది.
ఫీచర్లు..
టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఆపిల్ కార్ ప్లే/ ఆండ్రాయిడ్ ఆటో బ్లూటూత్, యూఎస్బీ, అక్స్-ఇన్.
ధర : బేస్ ధర ఆరు లక్షల నుంచి టాప్ ఎండ్ వేరియంట్ ధర తొమ్మిది లక్షల వరకు ఉండొచ్చని అంచనాలు వెలువడుతున్నాయి. హ్యుందాయ్ ఎక్సెంట్ ఫేస్లిప్ట్, న్యూ టాటా టిగోర్, హోండా అమేజ్, ఫోర్డ్ ఆస్పైర్, ఫోక్స్ వాగన్ అమియోలకు గట్టిపోటీనే ఇచ్చేందుకు ఇది లాంచింగ్ కు సిద్ధమైందట.
Advertisement