
న్యూఢిల్లీ: ప్రముఖ కార్ల తయారీ కంపెనీ ‘హోండా కార్స్’ తాజాగా తన కాంపాక్ట్ సెడాన్ ‘అమేజ్’లో సెకండ్ జనరేషన్ వెర్షన్‌ను విడుదల చేసింది. దీని ఎక్స్‌షోరూమ్ ప్రారంభ ధర రూ.5.59 లక్షలు. ఈ, ఎస్, వీ, వీఎక్స్ అనే 4 వేరియంట్లలో అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. వీటిల్లో డ్యూయెల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్స్, రియర్ పార్కింగ్ సెన్సర్స్, ఏబీఎస్ వంటి పలు ఫీచర్లు ఉన్నాయని పేర్కొంది. తాజా కొత్త అమేజ్ 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్, 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ రూపంలో మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లలో లభ్యమౌతుందని వివరించింది.
పెట్రోల్ వేరియంట్ల ధరలు రూ.5.59 లక్షలు– రూ.7.99 లక్షల శ్రేణిలో, డీజిల్ వేరియంట్ల ధరలు రూ.6.69 లక్షలు– రూ.8.99 లక్షల శ్రేణిలో ఉన్నాయని పేర్కొంది. ‘ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడు కొత్త ప్రోడక్టులను మార్కెట్‌లో తీసుకువస్తాం. అలాగే వచ్చే మూడేళ్ల కాలంలో మరో మూడు కొత్త ప్రోడక్టులను ఆవిష్కరిస్తాం’ అని హోండా కార్స్ ఇండియా (హెచ్‌సీఐఎల్) ప్రెసిడెంట్, సీఈవో గకు నకనిశి తెలిపారు. హోండా సిటీ మాదిరిగానే సెకండ్ జనరేషన్ అమేజ్ కూడా కస్టమర్ల ఆదరణను చూరగొంటుందని ధీమా వ్యక్తంచేశారు.
Comments
Please login to add a commentAdd a comment