‘స్మైలింగ్‌ డెత్‌’ అంటే ఏమిటి? చనిపోయే ముందు ఎందుకు నవ్వుతుంటారు? | Explained: Smiling Death and Crush Syndrome - Sakshi
Sakshi News home page

‘స్మైలింగ్‌ డెత్‌’ అంటే ఏమిటి? చనిపోయే ముందు ఎందుకు నవ్వుతుంటారు?

Published Mon, Aug 28 2023 7:32 AM | Last Updated on Mon, Aug 28 2023 8:45 AM

Explained Smiling Death and Crush Syndrome - Sakshi

మరణం తర్వాత ఏమి జరుగుతుంది? మరణ  రహస్యం ఏమిటనేది ఈ ‍ప్రపంచంలో ఎవరికీ స్పష్టంగా తెలియదు. విశ్వవ్యాప్తమైన ఈ రహస్యంపై ప్రముఖ శాస్త్రవేత్తలు కూడా ఏమీ చెప్పలేకపోయారు. అయితే ప్రతీ మతానికి మరణ రహస్యంపై ప్రత్యేక వివరణలు ఉన్నాయి. మరణం అనేక రకాలుగా సంభవిస్తుంది. కొందరు ప్రమాదవశాత్తు మరణిస్తే, మరికొందరు అనారోగ్యరీత్యా మరణిస్తుంటారు. 

ప్రతి ఒక్కరూ ఏదో ఒక కారణంతో మరణిస్తారు. కొందరు చనిపోయే ముందు నవ్వుతూ ఉంటారు. ఈ రకమైన మరణాన్ని 'స్మైలింగ్ డెత్' అని అంటారు. ఈ స్థితిలో బాధతో విలపిస్తున్న వారు కూడా నవ్వుతూ చనిపోతారు. దీనిని క్రష్ సిండ్రోమ్ అని కూడా అంటారు. ఇంతకీ స్మైలింగ్ డెత్ అంటే ఏమిటి? కొందరు చనిపోయే ముందు ఆకస్మికంగా ఎందుకు నవ్వుతారో ఇప్పుడు తెలుసుకుందాం.  

భూకంపం లేదా ప్రకృతి వైపరీత్యంలో చిక్కుకున్న వ్యక్తి రక్తంలో పొటాషియం అధిక మోతాదులో విడుదలవుతుంది. ఈ కారణంగా గుండె చప్పుడులో అసమతుల్యత ఏర్పడుతుంది. ఫలితంగా షాక్‌లో ఉంటూనే మరణిస్తాడు. ఈ రకమైన మరణానికి ముందు సదరు వ్యక్తి అసంకల్పితంగా నవ్వడం ప్రారంభిస్తాడు. ఆ వ్యక్తి అంతర్గతంగా విపరీతమైన నొప్పిని అనుభవిస్తున్నప్పటికీ, నవ్వుతూనే ఉంటాడు. అందుకే దీనిని స్మైలింగ్ డెత్ అంటారు.
ఇది కూడా చదవండి: అంతరిక్షంలోకి వెళితే వయసు పెరగదా? ‘నాసా’ పరిశోధనలో ఏమి తేలింది?

తొలిసారి కనుగొన్నారిలా..
స్మైలింగ్ డెత్‌ను మొదట జపాన్‌లో కనుగొన్నారు. 1923లో జపనీస్ చర్మవ్యాధి నిపుణుడు సీగో మినామి ఈ క్రష్ సిండ్రోమ్ అనే వ్యాధిని మొదటిసారిగా గుర్తించారు. ఆ సమయంలో మొదటి ప్రపంచ యుద్ధంలో కిడ్నీ ఫెయిల్యూర్ కారణంగా చాలా మంది చనిపోయారు. మినామి.. చనిపోయిన ముగ్గురు సైనిక సైనికుల పాథాలజీని అధ్యయనం చేశారు. జపాన్ తరువాత ఇంగ్లాండ్‌లో కూడా ఈ వ్యాధిపై అధ్యయనం జరిగింది. 1941లో ఆంగ్ల వైద్యుడు ఎరిక్ జార్జ్ లాప్‌థోర్న్ క్రష్ సిండ్రోమ్‌ గురించి తెలియజేశారు. క్రష్ సిండ్రోమ్ కేసులు చాలా తీవ్రమైన ప్రకృతి వైపరీత్యాల సమయంలో సంభవిస్తాయి. భూకంపం, యుద్ధం, ఏదైనా భవనం కూలిపోవడం లేదా రోడ్డు ప్రమాదాల వంటి సందర్భాలలో క్రష్ సిండ్రోమ్ కేసులు కనిపిస్తుంటాయి. 

ఉత్తర టర్కీలో భూకంపంలో క్రష్ సిండ్రోమ్(స్మైలింగ్‌ డెత్‌) కారణంగా నమోదైన మరణాల రేటు 15.2% గా ఉంది. ఈ భూకంపం 1999లో సంభవించింది. బ్రిటిష్ మెడికల్ జర్నల్ తెలిపిన వివరాల ప్రకారం క్రష్ సిండ్రోమ్ అనేది తీవ్రమైన నొప్పితో కూడిన ఒక రకమైన రిపెర్ఫ్యూజన్ గాయం. శిథిలాలలో చిక్కుకుపోవడం వల్ల శరీర కండరాలు అస్తవ్యస్తంగా మారతాయి. ఎవరైనా వ్యక్తి 4 నుండి 6 గంటల పాటు శిధిలాలలో ఉండిపోతే అతను క్రష్ సిండ్రోమ్ స్థితికి లోనవుతాడు. కొన్నిసార్లు ఈ పరిస్థితి ఒక గంటలోనే ఏర్పడవచ్చు. 

మరణించే చివరి క్షణంలో..
క్రష్ సిండ్రోమ్ స్థితికి గురైన వ్యక్తి తన భావాలను సరిగా వ్యక్తపరచలేడు. ఎలాంటి ఫీలింగ్ కలిగి ఉండాలో లేదా ఏమి ఆలోచించాలో అనే ధ్యాసలో మునిగిపోతారు. తాజాగా జరిగిన అధ్యయనంలో క్రష్ సిండ్రోమ్‌కు గురైన వ్యక్తి చివరి క్షణంలో అసమంజసమైన రీతిలో ఆలోచిస్తాడని తేలింది. నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌కు చెందిన ప్రొసీడింగ్స్ జర్నల్‌లో ప్రచురితమైన కథనం ప్రకారం మరణించే సమయంలో మనిషి.. చనిపోయిన తన బంధువులను గుర్తుకుతెచ్చుకుంటాడు. అమెరికాలోని మిచిగాన్ యూనివర్శిటీ పరిశోధకులు ఈ విషయంపై నలుగురిని ప్రయోగాత్మకంగా తీసుకున్నారు. వారు ఇక బతికే అవకాశాలు లేవని నిర్ధారించిన తరుణంలో వారికి వెంటిలేటర్ తొలగించిన తర్వాత వారి హృదయ స్పందన రేటుతో పాటు గామా కార్యకలాపాలు కూడా పెరిగాయని గుర్తించారు. ఈ ప్రయోగం ఆధారంగా శాస్త్రవేత్తలు మరణానికి ముందు సదరు వ్యక్తి తెల్లటి కాంతిని, చనిపోయిన బంధువులను చూస్తాడని, విభిన్న శబ్దాలను వింటాడని గుర్తించారు.
ఇది కూడా చదవండి: ‘హలాల్‌ హాలిడే’ అంటే ఏమిటి? ముస్లిం యువతులకు ఎందుకంత ఇష్టం?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement