Smiling
-
‘స్మైలింగ్ డెత్’ అంటే ఏమిటి? చనిపోయే ముందు ఎందుకు నవ్వుతుంటారు?
మరణం తర్వాత ఏమి జరుగుతుంది? మరణ రహస్యం ఏమిటనేది ఈ ప్రపంచంలో ఎవరికీ స్పష్టంగా తెలియదు. విశ్వవ్యాప్తమైన ఈ రహస్యంపై ప్రముఖ శాస్త్రవేత్తలు కూడా ఏమీ చెప్పలేకపోయారు. అయితే ప్రతీ మతానికి మరణ రహస్యంపై ప్రత్యేక వివరణలు ఉన్నాయి. మరణం అనేక రకాలుగా సంభవిస్తుంది. కొందరు ప్రమాదవశాత్తు మరణిస్తే, మరికొందరు అనారోగ్యరీత్యా మరణిస్తుంటారు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక కారణంతో మరణిస్తారు. కొందరు చనిపోయే ముందు నవ్వుతూ ఉంటారు. ఈ రకమైన మరణాన్ని 'స్మైలింగ్ డెత్' అని అంటారు. ఈ స్థితిలో బాధతో విలపిస్తున్న వారు కూడా నవ్వుతూ చనిపోతారు. దీనిని క్రష్ సిండ్రోమ్ అని కూడా అంటారు. ఇంతకీ స్మైలింగ్ డెత్ అంటే ఏమిటి? కొందరు చనిపోయే ముందు ఆకస్మికంగా ఎందుకు నవ్వుతారో ఇప్పుడు తెలుసుకుందాం. భూకంపం లేదా ప్రకృతి వైపరీత్యంలో చిక్కుకున్న వ్యక్తి రక్తంలో పొటాషియం అధిక మోతాదులో విడుదలవుతుంది. ఈ కారణంగా గుండె చప్పుడులో అసమతుల్యత ఏర్పడుతుంది. ఫలితంగా షాక్‌లో ఉంటూనే మరణిస్తాడు. ఈ రకమైన మరణానికి ముందు సదరు వ్యక్తి అసంకల్పితంగా నవ్వడం ప్రారంభిస్తాడు. ఆ వ్యక్తి అంతర్గతంగా విపరీతమైన నొప్పిని అనుభవిస్తున్నప్పటికీ, నవ్వుతూనే ఉంటాడు. అందుకే దీనిని స్మైలింగ్ డెత్ అంటారు. ఇది కూడా చదవండి: అంతరిక్షంలోకి వెళితే వయసు పెరగదా? ‘నాసా’ పరిశోధనలో ఏమి తేలింది? తొలిసారి కనుగొన్నారిలా.. స్మైలింగ్ డెత్‌ను మొదట జపాన్‌లో కనుగొన్నారు. 1923లో జపనీస్ చర్మవ్యాధి నిపుణుడు సీగో మినామి ఈ క్రష్ సిండ్రోమ్ అనే వ్యాధిని మొదటిసారిగా గుర్తించారు. ఆ సమయంలో మొదటి ప్రపంచ యుద్ధంలో కిడ్నీ ఫెయిల్యూర్ కారణంగా చాలా మంది చనిపోయారు. మినామి.. చనిపోయిన ముగ్గురు సైనిక సైనికుల పాథాలజీని అధ్యయనం చేశారు. జపాన్ తరువాత ఇంగ్లాండ్‌లో కూడా ఈ వ్యాధిపై అధ్యయనం జరిగింది. 1941లో ఆంగ్ల వైద్యుడు ఎరిక్ జార్జ్ లాప్‌థోర్న్ క్రష్ సిండ్రోమ్ గురించి తెలియజేశారు. క్రష్ సిండ్రోమ్ కేసులు చాలా తీవ్రమైన ప్రకృతి వైపరీత్యాల సమయంలో సంభవిస్తాయి. భూకంపం, యుద్ధం, ఏదైనా భవనం కూలిపోవడం లేదా రోడ్డు ప్రమాదాల వంటి సందర్భాలలో క్రష్ సిండ్రోమ్ కేసులు కనిపిస్తుంటాయి. ఉత్తర టర్కీలో భూకంపంలో క్రష్ సిండ్రోమ్(స్మైలింగ్ డెత్) కారణంగా నమోదైన మరణాల రేటు 15.2% గా ఉంది. ఈ భూకంపం 1999లో సంభవించింది. బ్రిటిష్ మెడికల్ జర్నల్ తెలిపిన వివరాల ప్రకారం క్రష్ సిండ్రోమ్ అనేది తీవ్రమైన నొప్పితో కూడిన ఒక రకమైన రిపెర్ఫ్యూజన్ గాయం. శిథిలాలలో చిక్కుకుపోవడం వల్ల శరీర కండరాలు అస్తవ్యస్తంగా మారతాయి. ఎవరైనా వ్యక్తి 4 నుండి 6 గంటల పాటు శిధిలాలలో ఉండిపోతే అతను క్రష్ సిండ్రోమ్ స్థితికి లోనవుతాడు. కొన్నిసార్లు ఈ పరిస్థితి ఒక గంటలోనే ఏర్పడవచ్చు. మరణించే చివరి క్షణంలో.. క్రష్ సిండ్రోమ్ స్థితికి గురైన వ్యక్తి తన భావాలను సరిగా వ్యక్తపరచలేడు. ఎలాంటి ఫీలింగ్ కలిగి ఉండాలో లేదా ఏమి ఆలోచించాలో అనే ధ్యాసలో మునిగిపోతారు. తాజాగా జరిగిన అధ్యయనంలో క్రష్ సిండ్రోమ్‌కు గురైన వ్యక్తి చివరి క్షణంలో అసమంజసమైన రీతిలో ఆలోచిస్తాడని తేలింది. నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌కు చెందిన ప్రొసీడింగ్స్ జర్నల్‌లో ప్రచురితమైన కథనం ప్రకారం మరణించే సమయంలో మనిషి.. చనిపోయిన తన బంధువులను గుర్తుకుతెచ్చుకుంటాడు. అమెరికాలోని మిచిగాన్ యూనివర్శిటీ పరిశోధకులు ఈ విషయంపై నలుగురిని ప్రయోగాత్మకంగా తీసుకున్నారు. వారు ఇక బతికే అవకాశాలు లేవని నిర్ధారించిన తరుణంలో వారికి వెంటిలేటర్ తొలగించిన తర్వాత వారి హృదయ స్పందన రేటుతో పాటు గామా కార్యకలాపాలు కూడా పెరిగాయని గుర్తించారు. ఈ ప్రయోగం ఆధారంగా శాస్త్రవేత్తలు మరణానికి ముందు సదరు వ్యక్తి తెల్లటి కాంతిని, చనిపోయిన బంధువులను చూస్తాడని, విభిన్న శబ్దాలను వింటాడని గుర్తించారు. ఇది కూడా చదవండి: ‘హలాల్ హాలిడే’ అంటే ఏమిటి? ముస్లిం యువతులకు ఎందుకంత ఇష్టం? -
హీహీహీ... హాహ్హాహ్హా అంతే!
నవ్వు ఆరోగ్యానికి మంచిదని మనందరికి తెలుసు. తీరికలేని లైఫ్‌స్టైల్, బాధ్యతలు, బరువులతో నవ్వడం కూడా మర్చిపోతున్నాం. ఇది చాలదన్నట్లు రెండేళ్లపాటు ప్రపంచాన్ని శాసించిన కరోనా పుణ ్యమా... ముఖానికి మాస్కుల తాళం పడింది. శానిటైజర్లు ఆవిరైపోయినట్లే ముఖాల మీద నవ్వులు మాయ మయ్యాయి. ఇప్పుడు చాలామందికి చక్కగా నవ్వడం ఎలాగో తెలియడం లేదు. ఈ జాబితాలో జపాన్ వాసులు ముందు వరుసలో ఉన్నారు. గత కొద్దికాలంగా నవ్వడం మర్చిపోయిన జపనీయులు ప్రస్తుతం నవ్వులు ్రపాక్టీస్ చేయడం కోసం కోచింగ్ సెంటర్లకు క్యూ కడుతున్నారు. ఇది కాస్త చిత్రంగా, మనకు నవ్వొస్తున్నా సరే... హహ్హా నవ్వుల కోసం వారు తెగ హడావుడి చేస్తున్నారు. నవ్వు ఆరోగ్యమేగాక, నవ్వడం వల్ల ముఖ కండరాలకు మంచి వ్యాయామం జరిగి ముఖం మరింత గ్లోగా కనిపిస్తుంది. ఒత్తిడి దూరమవుతుంది. ఎక్కడైనా పని లేదా ఉద్యోగం చేయాలన్నా ముఖం మీద చిరునవ్వు తప్పనిసరి. దానితోనే నలుగురితోపాటు ముందుకు సాగగలం. ఇదే విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న జపనీయులు శ్రద్ధగా నేర్చుకుని మరీ నవ్వుతున్నారు. అక్కడి స్మైలింగ్ కోచింగ్ సెంటర్లకు డిమాండ్ బాగా పెరిగిపోయింది. కోవిడ్ ఆంక్షలు, కొన్ని రకాల ఫ్లూల వల్ల దాదాపు మూడేళ్లపాటు మాస్కులు ధరించిన జపనీయులు నవ్వడం మర్చిపోయారు. ప్రస్తుతం అక్కడి ప్రభుత్వం ఆంక్షలు సడలించడంతో ‘స్మైలింగ్ లెసన్స్’ నేర్చుకుంటున్నారు. చక్కగా నవ్వేందుకు ఏకాగ్రతతో పాఠాలు వింటున్నారు. ఒక్కో స్మైలింగ్ ట్రైనర్ దగ్గర మూడు వేలమంది క్లాసులకు హాజరవుతున్నారంటే అక్కడి డిమాండ్ ఏంటో తెలుస్తోంది. హాలీవుడ్ స్మైల్... గతంలో రేడియో హోస్ట్‌గా పనిచేసిన కైకో క్వానో స్మైలింగ్ ఇన్స్టిట్యూట్ను నడుపుతున్నారు. ‘‘హాలీవుడ్ స్టైల్ స్మైలింగ్ టెక్నిక్’’ను నేర్పించడం ఈమె ప్రత్యేకత. కళ్లను నెలవంకలా తిప్పి, బుగ్గలను గుండ్రంగా పెట్టి పై దవడలోని ఎనిమిది దంతాలు కనిపించేలా నవ్వడమే హాలీవుడ్ స్మైల్. ప్రస్తుతం జపనీస్ విద్యార్థులు ఈ నవ్వుని ఎగబడి నేర్చుకుంటున్నారు. ‘‘విద్యార్థులు, నిరుద్యోగులు అధిక సంఖ్యలో మా దగ్గర క్లాసులు చెప్పించుకుంటున్నారు. భవిష్యత్‌లో చేయబోయే ఉద్యోగాలకు నవ్వు ముఖ్యమని వారంతా క్లాసులకు హాజరవుతున్నారు. స్మైల్ ఎడ్యుకేషన్ గతంలోకంటే ఇప్పుడు నాలుగు రెట్లు పెరిగింది. ఒక్కోక్లాసుకు మన రూపాయల్లో సుమారు రూ.4,500 తీసుకుంటున్నాము. నవ్వుతూ ఎవరిని పలకరించినా అ΄్యాయంగా దగ్గరవుతారు’’ అని క్వానో చెబుతోంది. నవ్వితే ముత్యాలేమీ రాలిపోవు, నాలుగు రకాలుగా మంచే జరుగుతుంది కాబట్టి మనం కూడ మనసారా నవ్వుదాం. ‘‘నవ్వు అనేది సహజసిద్ధంగా జరగాల్సిన ఒక ప్రక్రియ. ఇది చాలా ముఖ్యమైనది. ఎవరినైనా కలిసినప్పుడు మొదట మన నవ్వే పలకరిస్తుంది. మంచి మర్యాదలు మన నవ్వులోనే కనిపిస్తాయి. నవ్వడం మానేస్తే ముఖ కండరాలను ఎలా వాడాలో మెదడు మర్చిపోతుంది అని నిపుణులు చెబుతున్నారు. అందుకే నవ్వడం చాలా ముఖ్యం’’ అని స్మైలింగ్ ఇన్స్ట్రక్టర్ మిహోకిటానో చెబుతున్నారు. -
Viral Photo: దారుణం.. చావు ఇంట్లో నవ్వులు.. ఫ్యామిలీ ఫోటోపై ట్రోలింగ్..
తిరువనంతపురం: ఎవరైనా చనిపోతే ఆ ఇంట్లో ఏడుపులు వినిపిస్తాయి. కుటుంబసభ్యులంతా శోకసంద్రంలో మునిగిపోతారు. బంధువులు, చుట్టుపక్కల వారు వారిని ఓదారుస్తుంటారు. కానీ కేరళ పథానంతిట్ట జిల్లా మలపల్లి గ్రామంలోని ఓ ఇంట్లో కుటుంబసభ్యులు ఇందుకు భిన్నంగా ప్రవర్తించారు. 95 ఏళ్ల బామ్మ చనిపోతే.. ఆమె శవపేటిక చుట్టూ చేరి నవ్వుతూ ఫోటో దిగారు. ఇది కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. ఇంట్లో ఒకరు చనిపోతే మీరంతా ఎలా నవ్వుతున్నారని కొందరు నెటిజన్లు విమర్శలు గుప్పించారు. మరికొందరు మాత్రం ఆ ఫోటోలో ఏం తప్పులేదని కుటంబసభ్యులను వెనకేసుకొచ్చారు. దీనిపై పెద్ద చర్చే పెట్టారు. కేరళ విద్యాశాఖ మంత్రి వీ శివన్కుట్టి కూడా ఈ చర్చలో భాగమయ్యారు. 95ఏళ్ల మరియమ్మ ఆగస్టు 17న మరణించారు. ఆమెకు 9 మంది సంతానం. వాళ్లకు 19 మంది పిల్లలున్నారు. కుటుంబసభ్యులంతా దేశవిదేశాల్లో స్థిరపడ్డారు. వృద్ధాప్యం, అనారోగ్యంతో కొద్ది వారాల పాటు మంచానికే పరిమితమై మరియమ్మ కన్నుమూశారు. విషయం తెలిసి దాదాపు కుటంబసభ్యులు అందరూ స్వగ్రామానికి వచ్చారు. ఈ క్రమంలోనే ఆమె జ్ఞాపకార్థం ఓ ఫోటో దిగాలని కెమెరా ముందు నవ్వుతూ కన్పించారు. మరియమ్మ బతికినంతకాలం ఎంతో సంతోషంగా జీవించారని, అందరినీ ప్రేమగా చూసుకున్నారని ఓ కుటుంబసభ్యుడు తెలిపారు. అందుకే ఆమెకు కుటుంబసభ్యులంతా ఆనందంతో వీడ్కోలు ఇవ్వాలనుకున్నట్లు పేర్కొన్నారు. నవ్వుతూ ఫోటో దిగడంలో తప్పేమీ లేదన్నారు. కేరళ మంత్రి శివన్కుట్టి కూడా కుటుంబసభ్యులకు అండగా నిలిచారు. చావు చాలా బాధాకరం అని పేర్కొన్నారు. జీవితాంతం ఆనందంగా బతికిన వారిని అంతిమ వీడ్కోలులో నవ్వుతూ సాగనంపడంలో తప్పేం లేదన్నారు. ఈ ఫోటోపై నెగెటివ్‌గా స్పందించాల్సిన అవసరం లేదన్నారు. చదవండి: కాంగ్రెస్‌కు యువనేత గుడ్‌బై.. గాంధీలపై విమర్శలు -
నవ్వు మంత్రం వేస్తా!
‘‘నా దారిలో ఏది ఎదురొచ్చినా నవ్వుతూ పలకరించడమే నాకు అలవాటు. అది మంచైనా, చెడైనా సరే. నవ్వుతూనే పలకరిస్తాను’’ అంటున్నారు రష్మికా మందన్నా. అది తన స్వభావమట. ఈ విషయం గురించి రష్మికా మాట్లాడుతూ – ‘‘ప్రపంచంలో ఎప్పుడూ ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. ఎవరో ఒకరు ఇబ్బందుల్లో పడుతూనే ఉంటారు. కొంతమంది ఆ రోజు బావుండకపోవచ్చు. ఆ బాధలో నా దగ్గరికొస్తే అవన్నీ మర్చిపోయేలా చేయాలనుకుంటాను. నా నవ్వు మంత్రమేసి కాసేపైనా వాళ్లను సంతోషంగా ఉండేలా చేయాలనుకుంటాను. అందరితో దయగా ఉండాలి. దానికోసం ఏమీ ఖర్చు పెట్టక్కర్లేదు. బాధల్లో ఉన్నవారికి ఊరట కలిగించేలా సౌమ్యంగా మాట్లాడితే చాలు. అంతే.. అందువల్ల మన సంపాదన ఏమీ తరిగిపోదు’’ అన్నారు. -
నవ్వుతూ ఫొటో దిగితే పాస్‌పోర్టు ఇవ్వరు
పారిస్: ఒకప్పుడు కొత్తగా ఫొటో దిగాలంటే ఎవరికైనా అదోరకమైన ఆందోళన ఉండేది. కెమేరా కంటిలోకి చూడాలంటే కళ్లు మిటకరించేవాళ్లం. మూతి బిగబట్టి బిక్క మొహంతో దిగేవాళ్లం. సోషల్ మీడియా రాజ్యమేలుతున్న ఈ రోజుల్లో నవ్వుతూ తుళ్లుతూ సరదాగా, అనేక హావభావాలతో అందంగా దిగుతున్నాం. ఫొటోగ్రఫీలో ఇంత విప్లవాత్మక మార్పులు వచ్చిన నేటికి కూడా ఫ్రాన్స్ పాస్‌పోర్టు కార్యాలయం మాత్రం మడి కట్టుకునే కూర్చుంది. పాస్‌పోర్టుకు ఇచ్చే ఫొటోల్లో ఎలాంటి హావభావాలు, అంటే నవ్వుతున్నట్టు, ఏడుస్తున్నట్టుగానీ, విషాదంగానీ కనిపించకూడదు. ఎలాంటి భావాలు లేకుండా, ఒకరకంగా చెక్క మొహంలా ఉండాలి. పక్కచూపులు చూస్తున్నట్లు అసలు ఉండరాదు, జుట్టు ముందుకు వేలాడేసుకున్నట్లు స్టైయిల్ గా ఉండరాదు. పెదవులు బిగించి, కెమేరా కన్నులోకి చూస్తూ ఫొటో దిగాలి అంతే. లేదంటే ఫొటోను తిరస్కరిస్తుంది. ఫొటోలో నవ్వుతున్నాడన్న కారణంతో ఓ ఫ్రెంచ్ పౌరుడి ఫొటోను ఫ్రెంచ్ పాస్‌పోర్టు కార్యాలయం తిరస్కరించడంతో ఆయన కోర్టుకు ఎక్కారు. ఎప్పుడో కాలతీతమైన నిబంధనలను ఇప్పటికీ పాటించడమేందని, ఈ నిబంధన ప్రజల మానసిన స్థైర్యాన్ని దెబ్బతీస్తుందని పిటిషనర్ వాదించారు. ఫ్రెంచ్ ప్రజలను నవ్వొద్దని శాసించడం, ఫ్రెంచ్ సమాజాన్నే కృంగదీస్తుందని కూడా ఆయన ఆరోపించారు. అయినా పారిస్ అడ్మినిస్ట్రేషన్ కోర్టు ఆయన వాదనను వినిపించుకోలేదు. ఆయన పిటిషన్‌ను కొట్టివేసింది. కెమేరా కంటిలోకి చూస్తూ, తటస్థ భావంతో పెదాలు బిగించి ఫొటో దిగాలనే నిబంధనలో ఎలాంటి తప్పులేదని తేల్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ సదరు పిటిషనర్ ఇప్పుడు పారిస్ అప్పీల్ కోర్టును ఆశ్రయించారు. కెమేరాను చూస్తూ, పెదాలు మూసి ఫొటో దిగాలని మాత్రమే పాస్‌పోర్టు నిబంధన తెలియజేస్తోందని, నవ్వొద్దని చెప్పడం లేదని, పెదాలు మూసి కూడా నవ్వొచ్చని పిటీషనర్ న్యాయవాది రొమేన్ బౌలెట్ మీడియా ముందు వ్యాఖ్యానించారు. ప్రపంచ ప్రఖ్యాత చిత్రకారుడు లియోనార్డో డావిన్సీ గీసిన ‘మోనాలిసో’ చిత్రం కూడా పెదాలు మూసి నవ్వుతున్నట్లే ఉంటుందనే విషయాన్ని ఆయన గుర్తుచేశారు. పాస్‌పోర్ట్ నిబంధనను కొట్టివేస్తూ అప్పీల్ కోర్టు తీర్పు చెబుతుందని తాను ఆశిస్తున్నానని ఆయన అన్నారు. -
నవ్వుతూ... మరణించింది!
అర్జెంటీనా: ‘నవ్వుతూ బతకాలిరా.. తమ్ముడూ నవ్వుతూ చావాలిరా’ అనే పాట గుర్తుంది కదూ! ఈ పాటను నిజం చేస్తూ అర్జెంటీనా దేశంలోని శాంతా ఫే నగరానికి చెందిన సిస్టర్ సిసీలియా(42) నిజంగానే నవ్వుతూ మరణించింది. కొంతకాలం నుంచి కేన్సర్‌తో బాధపడుతున్న ఆమె ఇటీవల ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇలా నవ్వుతూ తుదిశ్వాస విడిచింది. తన మరణానంతరం అంత్యక్రియలు ఎలా జరగాలనే విషయంపై ఆలోచించానంటూ తన చివరి కోరికను ఓ కాగితంపై ఆమె రాసుకున్నారు. తాను మరణించాక మొదట ప్రార్థన చేసి, ఆ తరువాత ఓ పెద్ద వేడుకలా నిర్వహించాలని థెరీసా అండ్ జోసెఫ్ మాంటిస్సోరీ చర్చి నిర్వాహకులను కోరింది. సిసీలియా అభ్యర్థన మేరకు చర్చి నిర్వాహకులు ఆమె చివరి కోరికను తీర్చారు. సిసీలియా నవ్వుతూ మరణించిన ఫొటోలను ఇంటర్నెట్లో చాలామంది చూస్తున్నారు. ఓసారి మీరూ చూడండి. -
చిరునవ్వుతో సేవలు.. బీఎస్ఎన్ఎల్ నినాదం
న్యూఢిల్లీ: బీఎస్ఎన్ఎల్ సిబ్బంది ఇకపై తమ కస్టమర్లకు చిరునవ్వుతో సర్వీసులు అందించనున్నారు. అలాగే, సర్వీసుల సంబంధిత సమస్యలను సత్వరం పరిష్కరించడంపై మరింతగా దృష్టి పెట్టనున్నారు. ఇందుకు సంబంధించి సంస్థ ఉద్యోగులతో బీఎస్ఎన్ఎల్ సీఎండీ అనుపమ్ శ్రీవాస్తవ ప్రతిజ్ఞ చేయించారు. సర్వీస్ విత్ ఎ స్మైల్ (స్వాస్) తమ కొత్త నినాదంగా ఉంటుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.