
చిరునవ్వుతో సేవలు.. బీఎస్‌ఎన్‌ఎల్ నినాదం
న్యూఢిల్లీ: బీఎస్‌ఎన్‌ఎల్ సిబ్బంది ఇకపై తమ కస్టమర్లకు చిరునవ్వుతో సర్వీసులు అందించనున్నారు. అలాగే, సర్వీసుల సంబంధిత సమస్యలను సత్వరం పరిష్కరించడంపై మరింతగా దృష్టి పెట్టనున్నారు. ఇందుకు సంబంధించి సంస్థ ఉద్యోగులతో బీఎస్‌ఎన్‌ఎల్ సీఎండీ అనుపమ్ శ్రీవాస్తవ ప్రతిజ్ఞ చేయించారు. సర్వీస్ విత్ ఎ స్మైల్ (స్వాస్) తమ కొత్త నినాదంగా ఉంటుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.