
రష్మికా మందన్నా
‘‘నా దారిలో ఏది ఎదురొచ్చినా నవ్వుతూ పలకరించడమే నాకు అలవాటు. అది మంచైనా, చెడైనా సరే. నవ్వుతూనే పలకరిస్తాను’’ అంటున్నారు రష్మికా మందన్నా. అది తన స్వభావమట. ఈ విషయం గురించి రష్మికా మాట్లాడుతూ – ‘‘ప్రపంచంలో ఎప్పుడూ ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. ఎవరో ఒకరు ఇబ్బందుల్లో పడుతూనే ఉంటారు. కొంతమంది ఆ రోజు బావుండకపోవచ్చు.
ఆ బాధలో నా దగ్గరికొస్తే అవన్నీ మర్చిపోయేలా చేయాలనుకుంటాను. నా నవ్వు మంత్రమేసి కాసేపైనా వాళ్లను సంతోషంగా ఉండేలా చేయాలనుకుంటాను. అందరితో దయగా ఉండాలి. దానికోసం ఏమీ ఖర్చు పెట్టక్కర్లేదు. బాధల్లో ఉన్నవారికి ఊరట కలిగించేలా సౌమ్యంగా మాట్లాడితే చాలు. అంతే.. అందువల్ల మన సంపాదన ఏమీ తరిగిపోదు’’ అన్నారు.