explained
-
Subrahmanyan Chandrasekhar: చుక్కల్లో చంద్రుడు
నక్షత్రాల జీవిత చరిత్రను వెల్లడించిన శాస్త్రజ్ఞులు ప్రపంచంలో కొద్ది మందే ఉన్నారు. వారిలో ఒకరే సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్. నేడు ఆయన జన్మదినం. ఈ సందర్భంగా ఆయన సాధించిన ఘనతను ఒకసారి గుర్తు చేసుకుందాం. అలాగే ఆయనకు ప్రముఖ భౌతిక శాస్త్రేవత్త సర్ సీవీ రామన్‌తో గల సంబంధం ఏమిటో కూడా తెలుసుకుందాం.నక్షత్రాలపై పరిశోధనలు సాగించిన ప్రముఖ శాస్త్రవేత్తలు కోపర్నికస్, గెలీలియో, కెప్లర్, న్యూటర్ మొదలైన వారు వేసిన బాటలో పయనించి, నోబెల్ బహుమతిని సాధించిన సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్ దక్షిణ భారతానికి చెందిన ప్రముఖ శాస్త్రవేత్త. ఆయన 1910 అక్టోబర్ 19న అవిభక్త భారతదేశంలోని పంజాబ్ రాష్ట్రం(ప్రస్తుతం పాకిస్తాన్ లో ఉంది)లోని లాహోర్ పట్టణంలో సీతాలక్ష్మి, చంద్రశేఖర సుబ్రహ్మణ్య అయ్యర్ దంపతులకు జన్మించారు.హైస్కూలు, కాలేజీ చదువులను మద్రాస్ (చెన్నై)లో పూర్తిచేశారు. 1953లో డాక్టర్ చంద్రశేఖర్ అమెరికా పౌరసత్వం స్వీకరించకపోతే, ఆయనను మన భారతీయ శాస్త్రవేత్తగా ప్రపంచానికి సగర్వంగా ప్రకటించుకునే వాళ్లం. తన 19వ ఏట ఉన్నత విద్యాభ్యాసం కోసం ఓడ మీద ఇంగ్లాండు వెళ్లిన ఆయన ఖగోళ శాస్త్ర సంబంధిత విషయాలపై అధ్యయనం సాగించారు. 1935 జనవరి 11న తన మిత్రుడు విలియం మాక్ క్రీ తో కలిసి ఇంపీరియల్ కాలేజీ నుంచి బర్లింగ్టన్ హౌస్ వెళ్లిన ఆయన తన పరిశోధనా పత్రాన్ని వేదికపై చదివి, భౌతిక ఖగోళ శాస్త్రవేత్తలను మంత్రుముగ్ధులను చేశారు. దీంతో కేంబ్రిడ్జి ట్రినిటి కాలేజీ ఫెలోషిప్‌కు ఎన్నికయ్యారు. అక్కడ సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్‌ను అందరూ ముద్దుగా ‘చంద్ర’ అని పిలిచేవారు.ప్రతి వ్యక్తి జీవితంలో బాల్యం, కౌమారం, యవ్వనం, వృద్ధాప్య దశలు ఉన్నట్టే నక్షత్రాల్లోనూ పరిణామ దశలుంటాయని ‘చంద్ర’ తెలిపారు. వీటిలో చెప్పుకోదగ్గవి అరుణ మహాతార (రెడ్‌జెయంట్), శ్వేత కుబ్జ తార (వైట్‌డ్వార్ఫ్), బృహన్నవ్య తార (సూపర్నోవా), నూట్రాన్ తార, కృష్ణ బిలం (బ్లాక్‌హోల్) అనే దశలు ముఖ్యమైనవని పేర్కొన్నారు. తారలపై అవగాహనను పెంచే సిద్ధాంతాలను, పరిశోధనలను అందించిన చంద్రశేఖర్ 1983లో భౌతికశాస్త్రంలో నోబెల్ బహుమతి పొందారు.సాపేక్ష, క్వాంటం సిద్ధాంతాల్లోని అంశాల ఆధారంగా నక్షత్రాల పరిణామాలకు సంబంధించిన పరిస్థితులను చంద్రశేఖర్ విశ్లేషించారు. ఒక నక్షత్రం వైట్‌డ్వార్ఫ్ దశకు చేరుకోవాలంటే ఎలాటి పరిస్థితులుండాలో తెలియజేసిన సిద్ధాంతమే 'చంద్రశేఖర్ లిమిట్'గా పేరొందింది. దీని ప్రకారం సూర్యుని ద్రవ్యరాశి కన్నా 1.44 రెట్లకు తక్కువ ద్రవ్యరాశి ఉన్న నక్షత్రాలే వైట్‌డ్వార్ఫ్‌గా మారుతాయి. అంతకు మించిన ద్రవ్యరాశి ఉంటే అవి వాటి కేంద్రకంలోని గురుత్వశక్తి ప్రభావం వల్ల కుంచించుకుపోయి సూపర్నోవాగా, న్యూట్రాన్‌స్టార్‌గా మారుతూ, చివరికి బ్లాక్‌హోల్ (కృష్ణబిలం)గా అయిపోతాయని చంద్రశేఖర్ సిద్ధాంతీకరించారు.ప్రపంచంలోనే ప్రతిష్ఠాత్మక నోబెల్ బహుమతులను మన దేశంలో ఒకే కుటుంబంలోని ఇద్దరు మేథావులు సాధించడం ఓ అరుదైన విషయం. వారిలో ఒకరు నోబెల్ పొందిన శాస్త్రవేత్త సర్ సీవీ రామన్ కాగా, రెండో వ్యక్తి ఆయన అన్నకొడుకు సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్. 1995 ఆగస్టు 21న అమెరికాలో తన 85వ ఏట చంద్రశేఖర్ గుండె సంబంధిత వ్యాధితో కన్నుమూశారు. ఇది కూడా చదవండి: భారత దౌత్యవేత్తలపై నిఘా: కెనడా -
కర్ణాటక అంతటా నీటి కటకట..!(ఫొటోలు)
-
‘స్మైలింగ్ డెత్’ అంటే ఏమిటి? చనిపోయే ముందు ఎందుకు నవ్వుతుంటారు?
మరణం తర్వాత ఏమి జరుగుతుంది? మరణ రహస్యం ఏమిటనేది ఈ ప్రపంచంలో ఎవరికీ స్పష్టంగా తెలియదు. విశ్వవ్యాప్తమైన ఈ రహస్యంపై ప్రముఖ శాస్త్రవేత్తలు కూడా ఏమీ చెప్పలేకపోయారు. అయితే ప్రతీ మతానికి మరణ రహస్యంపై ప్రత్యేక వివరణలు ఉన్నాయి. మరణం అనేక రకాలుగా సంభవిస్తుంది. కొందరు ప్రమాదవశాత్తు మరణిస్తే, మరికొందరు అనారోగ్యరీత్యా మరణిస్తుంటారు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక కారణంతో మరణిస్తారు. కొందరు చనిపోయే ముందు నవ్వుతూ ఉంటారు. ఈ రకమైన మరణాన్ని 'స్మైలింగ్ డెత్' అని అంటారు. ఈ స్థితిలో బాధతో విలపిస్తున్న వారు కూడా నవ్వుతూ చనిపోతారు. దీనిని క్రష్ సిండ్రోమ్ అని కూడా అంటారు. ఇంతకీ స్మైలింగ్ డెత్ అంటే ఏమిటి? కొందరు చనిపోయే ముందు ఆకస్మికంగా ఎందుకు నవ్వుతారో ఇప్పుడు తెలుసుకుందాం. భూకంపం లేదా ప్రకృతి వైపరీత్యంలో చిక్కుకున్న వ్యక్తి రక్తంలో పొటాషియం అధిక మోతాదులో విడుదలవుతుంది. ఈ కారణంగా గుండె చప్పుడులో అసమతుల్యత ఏర్పడుతుంది. ఫలితంగా షాక్‌లో ఉంటూనే మరణిస్తాడు. ఈ రకమైన మరణానికి ముందు సదరు వ్యక్తి అసంకల్పితంగా నవ్వడం ప్రారంభిస్తాడు. ఆ వ్యక్తి అంతర్గతంగా విపరీతమైన నొప్పిని అనుభవిస్తున్నప్పటికీ, నవ్వుతూనే ఉంటాడు. అందుకే దీనిని స్మైలింగ్ డెత్ అంటారు. ఇది కూడా చదవండి: అంతరిక్షంలోకి వెళితే వయసు పెరగదా? ‘నాసా’ పరిశోధనలో ఏమి తేలింది? తొలిసారి కనుగొన్నారిలా.. స్మైలింగ్ డెత్‌ను మొదట జపాన్‌లో కనుగొన్నారు. 1923లో జపనీస్ చర్మవ్యాధి నిపుణుడు సీగో మినామి ఈ క్రష్ సిండ్రోమ్ అనే వ్యాధిని మొదటిసారిగా గుర్తించారు. ఆ సమయంలో మొదటి ప్రపంచ యుద్ధంలో కిడ్నీ ఫెయిల్యూర్ కారణంగా చాలా మంది చనిపోయారు. మినామి.. చనిపోయిన ముగ్గురు సైనిక సైనికుల పాథాలజీని అధ్యయనం చేశారు. జపాన్ తరువాత ఇంగ్లాండ్‌లో కూడా ఈ వ్యాధిపై అధ్యయనం జరిగింది. 1941లో ఆంగ్ల వైద్యుడు ఎరిక్ జార్జ్ లాప్‌థోర్న్ క్రష్ సిండ్రోమ్ గురించి తెలియజేశారు. క్రష్ సిండ్రోమ్ కేసులు చాలా తీవ్రమైన ప్రకృతి వైపరీత్యాల సమయంలో సంభవిస్తాయి. భూకంపం, యుద్ధం, ఏదైనా భవనం కూలిపోవడం లేదా రోడ్డు ప్రమాదాల వంటి సందర్భాలలో క్రష్ సిండ్రోమ్ కేసులు కనిపిస్తుంటాయి. ఉత్తర టర్కీలో భూకంపంలో క్రష్ సిండ్రోమ్(స్మైలింగ్ డెత్) కారణంగా నమోదైన మరణాల రేటు 15.2% గా ఉంది. ఈ భూకంపం 1999లో సంభవించింది. బ్రిటిష్ మెడికల్ జర్నల్ తెలిపిన వివరాల ప్రకారం క్రష్ సిండ్రోమ్ అనేది తీవ్రమైన నొప్పితో కూడిన ఒక రకమైన రిపెర్ఫ్యూజన్ గాయం. శిథిలాలలో చిక్కుకుపోవడం వల్ల శరీర కండరాలు అస్తవ్యస్తంగా మారతాయి. ఎవరైనా వ్యక్తి 4 నుండి 6 గంటల పాటు శిధిలాలలో ఉండిపోతే అతను క్రష్ సిండ్రోమ్ స్థితికి లోనవుతాడు. కొన్నిసార్లు ఈ పరిస్థితి ఒక గంటలోనే ఏర్పడవచ్చు. మరణించే చివరి క్షణంలో.. క్రష్ సిండ్రోమ్ స్థితికి గురైన వ్యక్తి తన భావాలను సరిగా వ్యక్తపరచలేడు. ఎలాంటి ఫీలింగ్ కలిగి ఉండాలో లేదా ఏమి ఆలోచించాలో అనే ధ్యాసలో మునిగిపోతారు. తాజాగా జరిగిన అధ్యయనంలో క్రష్ సిండ్రోమ్‌కు గురైన వ్యక్తి చివరి క్షణంలో అసమంజసమైన రీతిలో ఆలోచిస్తాడని తేలింది. నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌కు చెందిన ప్రొసీడింగ్స్ జర్నల్‌లో ప్రచురితమైన కథనం ప్రకారం మరణించే సమయంలో మనిషి.. చనిపోయిన తన బంధువులను గుర్తుకుతెచ్చుకుంటాడు. అమెరికాలోని మిచిగాన్ యూనివర్శిటీ పరిశోధకులు ఈ విషయంపై నలుగురిని ప్రయోగాత్మకంగా తీసుకున్నారు. వారు ఇక బతికే అవకాశాలు లేవని నిర్ధారించిన తరుణంలో వారికి వెంటిలేటర్ తొలగించిన తర్వాత వారి హృదయ స్పందన రేటుతో పాటు గామా కార్యకలాపాలు కూడా పెరిగాయని గుర్తించారు. ఈ ప్రయోగం ఆధారంగా శాస్త్రవేత్తలు మరణానికి ముందు సదరు వ్యక్తి తెల్లటి కాంతిని, చనిపోయిన బంధువులను చూస్తాడని, విభిన్న శబ్దాలను వింటాడని గుర్తించారు. ఇది కూడా చదవండి: ‘హలాల్ హాలిడే’ అంటే ఏమిటి? ముస్లిం యువతులకు ఎందుకంత ఇష్టం? -
హోండా అమేజ్‌లో రెండో జనరేషన్
న్యూఢిల్లీ: ప్రముఖ కార్ల తయారీ కంపెనీ ‘హోండా కార్స్’ తాజాగా తన కాంపాక్ట్ సెడాన్ ‘అమేజ్’లో సెకండ్ జనరేషన్ వెర్షన్‌ను విడుదల చేసింది. దీని ఎక్స్‌షోరూమ్ ప్రారంభ ధర రూ.5.59 లక్షలు. ఈ, ఎస్, వీ, వీఎక్స్ అనే 4 వేరియంట్లలో అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. వీటిల్లో డ్యూయెల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్స్, రియర్ పార్కింగ్ సెన్సర్స్, ఏబీఎస్ వంటి పలు ఫీచర్లు ఉన్నాయని పేర్కొంది. తాజా కొత్త అమేజ్ 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్, 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ రూపంలో మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్లలో లభ్యమౌతుందని వివరించింది. పెట్రోల్ వేరియంట్ల ధరలు రూ.5.59 లక్షలు– రూ.7.99 లక్షల శ్రేణిలో, డీజిల్ వేరియంట్ల ధరలు రూ.6.69 లక్షలు– రూ.8.99 లక్షల శ్రేణిలో ఉన్నాయని పేర్కొంది. ‘ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడు కొత్త ప్రోడక్టులను మార్కెట్లో తీసుకువస్తాం. అలాగే వచ్చే మూడేళ్ల కాలంలో మరో మూడు కొత్త ప్రోడక్టులను ఆవిష్కరిస్తాం’ అని హోండా కార్స్ ఇండియా (హెచ్‌సీఐఎల్) ప్రెసిడెంట్, సీఈవో గకు నకనిశి తెలిపారు. హోండా సిటీ మాదిరిగానే సెకండ్ జనరేషన్ అమేజ్ కూడా కస్టమర్ల ఆదరణను చూరగొంటుందని ధీమా వ్యక్తంచేశారు. -
ఏటీఎం కార్డును ఇలా ఏమారుస్తాం !
గౌరిబిదనూరు: దొంగలు ఎంతో చాకచక్యంగా ఏటీఎంను తస్కరించడం, అది గుర్తించని వినియోగదారుడు తేరుకనేలోపే ఖాతాలో ఉన్న నగదు కొట్టేయడం పోలీసులకు పెద్ద సవాల్‌గా మారింది. ఇలాంటి ఓ కేసుకు సంబంధించి స్థానిక పట్టణ పోలీసులు అంతర్ రాష్ట్ర దొంగలు అనంతపురం జిల్లా కదిరి తాలూకా సనంశెట్టి కృష్ణమూర్తి, రాజువారి పల్లి గ్రామానికి చెందిన ఆకల హరినాథ్‌లను విచారణ నిమిత్తం తీసుకువచ్చారు. వారి సమక్షంలోనే ఇటీవల తాలూకాలోని చిక్కకురుగోడు గ్రామానికి చెందిన కరియణ్ణ ఎస్బీఐ ఖాతా నుంచి వీరు రూ. 40 వేలు డ్రా చేశారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు వీరిని సదరు ఏటీఎం వద్దకు తీసుకువచ్చి ఎలా ఏటీఎంను మారుస్తారో విచారణ చేశారు. -
యాపిల్ కంపెనీ టాక్స్ ఎలా ఎగ్గొట్టింది...?
-
ఆపిల్ కంపెనీ పన్ను నుంచి ఎలా తప్పించుకుంది?
న్యూయార్క్: ప్రపంచవ్యాప్తంగా ఐఫోన్లు, ఐపాడ్ అమ్మకాల ద్వారా ఏటా కోటానుకోట్ల రూపాయల లాభాలను గడిస్తున్న ఆపిల్ కంపెనీ చిల్లర పైసల్లో మాత్రమే ఎలా పన్ను చెల్లించగలుగుతున్నదన్నది ఇప్పుడు ఆసక్తికరమైన చర్చగా మారింది. ఆపిల్ కంపెనీ 2014 సంవత్సరంలో తాను సంపాదించిన ప్రతి పది లక్షల డాలర్ల లాభాలపై 0.005 శాతం మాత్రమే పన్ను చెల్లించిందంటే ఆశ్చర్యం వేస్తోంది. మరి అది ఎలా సాధ్యమైంది? ఆపిల్ కంపెనీ కొన్ని దశాబ్దాలుగా ఐర్లాండ్ నుంచి యూరప్, మధ్యప్రాచ్య, ఆఫ్రికా, భారత్ దేశాలకు తన ఉత్పత్తులను విక్రయిస్తోంది. అందుకోసం ఆపిల్ కంపెనీ 1991లో ఐర్లాండ్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకొని అక్కడ రెండు సంస్థలను స్థాపించింది. వాటిలో ఆపిల్ సేల్స్ ఇంటర్నేషనల్ ఒకటికాగా, ఆపిల్ ఆపరేషన్స్ అన్నది మరో కంపెనీ. ఈ రెండు కంపెనీల ద్వారా జరిగే ఉత్పత్తుల విక్రయాలకు యూరోపియన్ యూనియన్‌లో భాగంగా కొనసాగుతున్న ఐర్లాండ్‌లో స్థానిక చట్టాల ప్రకారం12.5 శాతం కార్పొరేట్ పన్నును చెల్లించాల్సి ఉంటుంది. యూరోపియన్ యూనియన్ సభ్య దేశాల్లోకెల్లా అతి తక్కువ పన్నును విధిస్తున్న దేశం ఐర్లాండే. యూరోపియన్ యూనియన్‌లో సభ్య దేశాలుగా కొనసాగుతున్నప్పటికీ సొంత పన్ను వ్యవస్థను ఏర్పాటు చేసుకునే హక్కు వాటికి ఉండడంతోప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సంస్థలను, కంపెనీలను ఆహ్వానించడం కోసమే ఐర్లాండ్ చాలా తక్కువ పన్నును వసూలు చేస్తోంది. అందుకనే అపిల్తోపాటు గూగుల్, ఫేస్బుక్, ఈబే, ట్విట్టర్ లాంటి కంపెనీలన్నీ తమ యూరప్ ప్రధాన కార్యాలయాలన్నింటిని ఐర్లాండ్‌లోనే ఏర్పాటు చేశాయి. ఐర్లాండ్ చట్టాల ప్రకారం లాభాల్లో 12.5 శాతాన్ని పన్నుగా చెల్లించాల్సి ఉన్నప్పుడు మరీ ఆపిల్ కంపెనీ తాను సాధించిన లాభాల్లో కేవలం 0.005 శాతాన్నే ఎలా చెల్లించగలిగింది. అసలు కిటుకంతా ఇక్కడే ఉంది. ఆపిల్ ఇంటర్నేషనల్ సేల్స్ సంస్థకు ఓ గోస్ట్ హెడ్క్వాటర్స్ను ఆపిల్ కంపెనీ ఏర్పాటు చేసింది. అంటే ఈ హెడ్క్వాటర్స్ కాగితం మీద తప్ప మరి ఎక్కడా కనిపించదు. హెడ్క్వాటర్స్ కింద ఎవరూ పనిచేయరు. ఎలాంటి లావాదేవీలు జరగవు. అప్పుడప్పుడు బోర్డు మీటింగ్‌లు తప్ప. కానీ లాభాల్లో మెజారిటీ వాటా హెడ్క్వాటర్స్ కోటాలోకి వెళుతుంది కనుక వాటికి నయాపైసా పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. హెడ్క్వాటర్స్ అనే పేపర్ కంపెనీ ఉనికి తమ దేశంలో లేదుకనుక తమకు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదన్నది కూడా ఐర్లాండ్ ప్రభుత్వ వైఖరి. ఐర్లాండ్‌లో జరిగే కంపెనీ ఉత్పత్తుల అమ్మకాలను అక్కడ రిజస్టర్ చేసిన రెండు కంపెనీల్లో చూపిస్తుంది. కానీ యూరప్, భారత్, ఆఫ్రికా దేశాల్లో జరిగిన విక్రయాలను ఎక్కువగా హెడ్ క్వాటర్స్ కింద చూపిస్తోంది ఆపిల్ కంపెనీ. 2011 సంవత్సరంలో ఆపిల్ కంపెనీ 1600 కోట్ల యూరోల లాభాలు గడించగా, కేవలం ఐదు కోట్ల యూరోలను మాత్రమే పన్నుగా చెల్లించింది. అందుకనే ఇటీవల యూరోపియన్ కమిషన్ ఆపిల్ కంపెనీతోపాటు ఐర్లాండ్ ప్రభుత్వాన్ని ఆక్షేపించింది. 13 బిలియన్ యూరోలను పన్ను కింద ఐర్లాండ్ ప్రభుత్వానికి చెల్లించాల్సిందిగా ఆపిల్ కంపెనీని ఆదేశించింది. అయితే ఆ సొమ్మును తీసుకునేందుకు ఐర్లాండ్ ప్రభుత్వం కూడా సిద్ధంగా లేదు. స్థానిక చట్టాల ప్రకారమే తాము వ్యవహరించామని చెప్పుకుంటున్న ఆపిల్ కంపెనీ కూడా కమిషన్ తీర్పుపై అప్పీల్‌కు వెళుతోంది. ఆపిల్ కంపెనీకి అమెరికా ప్రభుత్వం కూడా అండగా నిలిచింది.