
ఏటీఎం కేంద్రం వద్దకు దొంగను తీసుకువచ్చిన పోలీసులు
గౌరిబిదనూరు: దొంగలు ఎంతో చాకచక్యంగా ఏటీఎంను తస్కరించడం, అది గుర్తించని వినియోగదారుడు తేరుకనేలోపే ఖాతాలో ఉన్న నగదు కొట్టేయడం పోలీసులకు పెద్ద సవాల్‌గా మారింది. ఇలాంటి ఓ కేసుకు సంబంధించి స్థానిక పట్టణ పోలీసులు అంతర్ రాష్ట్ర దొంగలు అనంతపురం జిల్లా కదిరి తాలూకా సనంశెట్టి కృష్ణమూర్తి, రాజువారి పల్లి గ్రామానికి చెందిన ఆకల హరినాథ్‌లను విచారణ నిమిత్తం తీసుకువచ్చారు. వారి సమక్షంలోనే ఇటీవల తాలూకాలోని చిక్కకురుగోడు గ్రామానికి చెందిన కరియణ్ణ ఎస్‌బీఐ ఖాతా నుంచి వీరు రూ. 40 వేలు డ్రా చేశారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు వీరిని సదరు ఏటీఎం వద్దకు తీసుకువచ్చి ఎలా ఏటీఎంను మారుస్తారో విచారణ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment