atm card fraud
-
బీఅలర్ట్ : ఏటీఎంలలో నయా మోసం
జేబులు కత్తిరించకుండానే ఖాతాలు ఖాళీ చేస్తున్నారు. బీరువాలను ముట్టుకోకుండానే సొమ్ము మాయం చేస్తున్నారు. అర్ధరాత్రి నిద్దర మానుకుని దొంగతనాలు చేసే పని లేకుండా ఏ సమయంలోనైనా ఈజీగా నగదు కొల్లగొడుతున్నారు. అందుకు వారు వాడే ఆయుధం జనం అమాయకత్వం మాత్రమే. ఏటీఎం కార్డుదారులు ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా వైట్ కాలర్ మాయగాళ్లు రెచ్చిపోతారు. దీనిపై పోలీసులు సైబర్ అవేర్నెస్ వీక్ పేరిట అవగాహన కల్పించారు. కార్డుదారులు పాటించాల్సిన జాగ్రత్తలు వివరించారు. శ్రీకాకుళం: ఇటీవలి కాలంలో జరుగుతున్న అనేక సైబర్ నేరాల్లో ఏటీఎం కార్డు నేరాలు చాలా ఎక్కువగా నమోదయ్యాయి. ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్, అవగాహన రాహిత్యం గల ప్రజలు ఇలాంటి నేరాల్లో బాధితులు అవుతున్నారు. దీనిపై పోలీసులు పలు సూచనలు చేస్తున్నారు. అవగాహన పెంచుకుంటే మోసాల బారిన పడకుండా ఉంటారని సూచిస్తున్నారు. ఏటీఎం మోసాల్లో కొన్నింటిని పరిశీలిస్తే.. ఏటీఎం కార్డు మార్చడం.. ఇలాంటి మోసాలు ఎక్కువగా ఏటీఎం సెంటర్లో జరుగుతుంటాయి. నేరస్తుడు ఏటీఎం గది లోపలే ఉండి వృద్ధులు, అవగాహన రాహిత్యం గల వారిని టార్గెట్‌గా చేసుకొని మోసపూరితమైన మాటలతో వారి ధ్యాసను మళ్లించి, ఏటీఎం పిన్ నంబరును గమనించి వారి ఏటీఎం కార్డును మార్చేస్తాడు. దాని బదులు తన వద్ద ఉండే అదే రకమైన కార్డు ఇచ్చి మోసం చేస్తాడు. ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్, అవగాహన రాహిత్యం గల ప్రజలు ఇలాంటి నేరాల్లో బాధితులవుతున్నారు. ఎలా జాగ్రత్త పడాలి..? ►ఏటీఎం సెంటర్లో కార్డు వినియోగం కోసం అపరిచిత వ్యక్తుల సహాయం కోర కూడదు. మనతో అనవసరంగా మాటలు కలిపేందుకు ప్రయత్నించే అపరిచితులతో జాగ్రత్తగా ఉండాలి. ►పిన్ నంబర్‌ను కార్డు/పేపరుపైన రాయడం చేయకూడదు. ఏటీఎంకు దగ్గరగా నిలబడి చేతిని అడ్డుపెట్టుకుంటూ పిన్ నంబర్‌ను ఎవరూ గమనించకుండా జాగ్రత్తపడాలి. ►ఏటీఎంలో కార్డును పెట్టే ప్రదేశంలో ఏదైనా అసాధారణమైన డివైస్ అమర్చినట్లు గమనించినా లేదా ఏటీఎం రూమ్‌లో ఏవైనా సీక్రెట్ కెమెరాలు ఉన్నట్లు గమనించినా లేదా కీ పాడ్ పైన ఏవైనా లేయర్స్ (కీ–లోగెర్స్) ఉన్నట్లు గమనిస్తే అలాంటి ఏటీఎంలో ఎలాటి లావాదేవీలు చేయకూడదు. ►మన ఏటీఎం కార్డు పోయినా/దొంగిలించినా వెంటనే బ్యాంకును సంప్రదించి కార్డు బ్లాక్ చేయించుకోవాలి, పోలీస్ స్టేషన్లో రిపోర్టు చేయాలి. గుర్తు పెట్టుకోండి.. ►బ్యాంకులు/ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్కు సంబంధించిన ఉద్యోగులు వారి కస్టమర్లకు ఫోన్‌కాల్స్ ద్వారా గాని, ఎస్ఎంఎస్/ఈ–మెయిల్ ద్వారా గాని ఏ విధమైన వ్యక్తిగత సమాచారం, ఓటీపీ నెంబర్, పాస్‌వర్డ్‌లను గురించి అడగదు. ►అలాంటి కాల్స్/ఎస్ఎంఎస్/ఈ–మెయిల్స్‌కు ఎప్పుడూ రెస్పాండ్ అవ్వకూడదు. పొరపాటున ఏదైనా సమాచారం ఇస్తే వెంటనే పాస్వర్డ్ మా ర్చుకోవాలి. సంబంధిత బ్యాంకులను సంప్రదించాలి, పోలీస్ స్టేషన్లో రిపోర్టు చేయాలి. ఫోన్ ద్వారా.. ఈ మధ్య కాలంలో సైబర్ నేరస్తులు/మోసగాళ్లు కొత్త పంథాలను ఎంచుకున్నారు. వారు ఏదో ఒక బ్యాంక్/ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్కు చెందిన ఉద్యోగులుగా చెప్పుకుంటూ మన డెబిట్/క్రెడిట్ కార్డు బ్లాక్ అవుతుందని, బ్యాంక్ కేవైసీ అప్డేట్ చేయాలని లేదా బ్యాంకు అకౌంట్‌కు ఆధార్ లింక్ చేయాలనే నెపంతో మనకు ఫోన్ కాల్స్ చేస్తారు (విషింగ్). కొన్ని సార్లు ఎస్ఎంఎస్ (స్మిషింగ్) పెడతారు. మరికొన్ని సార్లు ఈ–మెయిల్స్ (ఫిషింగ్) ద్వారా లింక్స్ పంపిస్తారు. ఈ పద్ధతుల్లో మన డెబిట్/క్రెడిట్ కార్డుకు సంబంధించిన 16 డిజిట్ కార్డు నంబర్, కార్డు ఎక్స్పైరీ తేదీ, సీవీవీ నంబర్, ఓటీపీ నంబర్, ఏటీఎం పిన్ నంబర్, నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ వంటి సున్నితమైన సమాచారాన్ని సేకరించి వాటిని మనకు తెలియకుండా వారి వ్యక్తిగత ఆర్థిక అవసరాల నిమిత్తం వాడుకుంటూ నేరాలు చేస్తున్నారు. ఇటీవల కాలంలో సైబర్ మోసగాళ్లు గవర్నమెంట్ ఆఫీషియల్స్గా చెప్పుకుంటూ కోవిడ్ వ్యాక్సిన్ స్లాట్ బుకింగ్ కోసం ఆధార్ కార్డు, ఇతర వివరాలను సేకరించి నేరాలు చేస్తున్నారు. కార్డ్ క్లోనింగ్ సాధారణంగా మన డెబిట్/క్రెడిట్ కార్డుకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం అంతా కార్డు వెనుక వైపు ఉండే మాగ్నెటిక్ స్ట్రిప్‌లో నిక్షిప్తమై ఉంటుంది. సైబర్ నేరస్తులు స్కిమ్మర్ అనే ఎలక్ట్రానిక్ సాధనాన్ని ఉపయోగించి మన కార్డు సమాచారాన్ని ఆ మాగ్నెటిక్ స్ట్రిప్ నుంచి మోసపూరితంగా సేకరిస్తారు. మనం పిన్ నంబరును కొట్టేటప్పుడు దాన్ని గమనిస్తారు. ఇలాంటి నేరాలు ఎక్కువగా రెస్టారెంట్లు, బార్లు, పెట్రోలు బంకులు, స్కిమ్మింగ్ డివైస్‌లు అమ ర్చిన ఏటీఎంలలో మన కార్డు ద్వారా లావాదేవీలు చేయడం వల్ల జరుగుతాయి. -
కంప్యూటర్స్ చదివి.. మోసాలలో ఆరితేరి..
ఏలూరు టౌన్ (పశ్చిమగోదావరి): కంప్యూటర్ చదువుకున్నాడు.. కంప్యూటర్ అప్లికేషన్స్‌లో ఆరితేరిపోయాడు.. ఇంకేముంది సులువుగా డబ్బు సంపాదించాలనే ఆశతో మోసాలకు పాల్పడుతున్నాడు.. ఏటీఎం కేంద్రాల వద్ద ఏటీఎం కార్డులను మారుస్తూ, ట్యాంపరింగ్ చేస్తూ సొమ్ములు కాజేస్తున్నాడు. ఐదు జిల్లాల్లో 42 కేసుల్లో నిందితుడిగా ఉన్న మోసగాడిని కొవ్వూరు పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. అతడి నుంచి భారీగా నగదు, బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఏలూరు జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఏటీఎం మోసగాడిని అరెస్టు చూపుతూ జిల్లా ఎస్పీ కె.నారాయణనాయక్ గురువారం వివరాలు వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లా ఐ.పోలవరం గ్రామానికి చెందిన పళ్ల సురేంద్రకుమార్ బీకాం కంప్యూటర్స్ చదివి కంప్యూటర్ అప్లికేషన్స్‌లో నైపుణ్యం సంపాదించాడు. విలాసాలకు అలవాటుపడిన సురేంద్రకుమార్ ఏటీఎం కేంద్రాల వద్దకు నగదు డ్రా చేసేందుకు వచ్చిన వారిని ఏమార్చి కార్డులను మార్చివేయడం, టాంపరింగ్ చేయడంలో సిద్ధహస్తుడిగా మారాడు. కార్డుల పిన్ నంబర్లు తెలుసుకుని షాపింగ్ మాల్స్, జ్యూయలరీ షోరూమ్‌లకు వెళ్లి వస్తువులు కొనుగోలు చేస్తుంటాడు. అతడిపై కృష్ణా, ఉభయగోదావరి, విజయనగరం, విశాఖ జిల్లాల్లో 42 కేసులు ఉన్నాయి. కొవ్వూరు పోలీసుల చాకచక్యం కొవ్వూరులో ఓ వ్యక్తిని ఏమార్చి ఏటీఎం కార్డును మార్చివేసి డబ్బులు డ్రా చేయటం, బంగారు ఆభరణాలు కొనుగోలు చేసిన సంఘటనపై సురేంద్రకుమార్‌పై టౌన్ స్టేషన్లో కేసు నమోదైంది. దీనిపై జిల్లా ఎస్పీ నారాయణనాయక్ ఆదేశాల మేరకు కొవ్వూరు డీఎస్పీ శ్రీనాథ్ ప్రత్యేక దృష్టి సారించి దర్యాప్తు చేపట్టారు. ప్రత్యేక బృందాలు చాకచక్యంగా విచారణ చేసి రాజమండ్రి తాడితోటలో సురేంద్రకుమార్ నివాసముంటున్న చోట అతడిని అరెస్ట్ చేశా రు. అతని నుంచి రూ.18.53 లక్షల నగదు, రూ.23 లక్షల విలువైన 450 గ్రాముల బంగారు, రూ.15 వేల విలువైన 200 గ్రాముల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసు అధికారులకు రివార్డులు నిందితుడిని పట్టుకోవడంలో ప్రతిభ చూపిన కొవ్వూ రు టౌన్ సీఐ ఎంవీవీఎస్‌ఎన్ మూర్తి, టౌన్ ఎస్ఐ కేవీ రమణ, సీసీఎస్ ఎస్సై రవీంద్రబాబు, ఎస్బీ హెచ్‌సీ పీవీ సత్యనారాయణ, పీసీలు జి.తమ్మా రావు, జీవీఎన్‌వీ అనిల్‌కుమార్, అఫ్సారీ బేగ్‌ను జిల్లా ఎస్పీ నారాయణనాయక్ అభినందిస్తూ నగదు ప్రోత్సాహకాలు అందజేశారు. అదనపు ఎస్పీ ఏవీ సుబ్బరాజు, కొవ్వూరు డీఎస్పీ బీ.శ్రీనాథ్, సీసీఎస్ డీఎస్పీ జీవీఎస్ పైడేశ్వరరావు ఉన్నారు. చదవండి: భక్తి ముసుగులో మహిళలను లోబర్చుకుని... హత్యా..ఆత్మహత్యా?: బాలిక అనుమానాస్పద మృతి -
ఏటీఎం కార్డును ఇలా ఏమారుస్తాం !
గౌరిబిదనూరు: దొంగలు ఎంతో చాకచక్యంగా ఏటీఎంను తస్కరించడం, అది గుర్తించని వినియోగదారుడు తేరుకనేలోపే ఖాతాలో ఉన్న నగదు కొట్టేయడం పోలీసులకు పెద్ద సవాల్‌గా మారింది. ఇలాంటి ఓ కేసుకు సంబంధించి స్థానిక పట్టణ పోలీసులు అంతర్ రాష్ట్ర దొంగలు అనంతపురం జిల్లా కదిరి తాలూకా సనంశెట్టి కృష్ణమూర్తి, రాజువారి పల్లి గ్రామానికి చెందిన ఆకల హరినాథ్‌లను విచారణ నిమిత్తం తీసుకువచ్చారు. వారి సమక్షంలోనే ఇటీవల తాలూకాలోని చిక్కకురుగోడు గ్రామానికి చెందిన కరియణ్ణ ఎస్బీఐ ఖాతా నుంచి వీరు రూ. 40 వేలు డ్రా చేశారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు వీరిని సదరు ఏటీఎం వద్దకు తీసుకువచ్చి ఎలా ఏటీఎంను మారుస్తారో విచారణ చేశారు. -
కార్డు మార్చాడు.. క్యాష్ కొట్టేశాడు!
చదువుకున్న వారిని చూస్తే గతంలో ఎంతో గౌరవంగా చూసేవారు. ఇప్పుడు చదువు'కొన్న' వారిని చూస్తే భయపడే పరిస్థితి దాపురించింది. సమకాలిన సమాజంలో జరుగుతున్న నేరాల్లో ఉన్నత చదువులు చదివిన వారు ఎక్కువగా ఉండడమే ఈ దుస్థితికి కారణం. ఇంజనీరింగ్ లాంటి ప్రొఫెనల్ కోర్సులు చదువుతున్న వారు నేరాల బాట పడుతుండడం మరింత ఆందోళనకు గురిచేస్తోంది. విలాసాలు, దురాలవాట్లకు బానిసలుగా మారుతున్న విద్యార్థులు ఎక్కువగా ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారు. ఇందుకు ఉదాహరణలివిగో... ఏటీఎం దగ్గర సాయం అడిగిన పాపానికి ఓ ప్రభుత్వోగి రూ. లక్షలు కోల్పోయాడు. ఇంజనీరింగ్ చదువుతున్న ఓ విద్యార్థి చేతిలో మోసపోయిన అతడు పోలీసులను ఆశ్రయించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. బీఎస్ఎన్ఎల్ ఆఫీసులో డ్రైవర్ గా పనిచేస్తున్న సంగారెడ్డి మఖ్దుంనగర్ కు చెందిన బురానొద్దీన్.. మే నెలలో సంగారెడ్డి ఎస్బీహెచ్ ఏటీఎంలో డబ్బు డ్రా చేసేందుకు వెళ్లాడు. కార్డు సరిగా పనిచేయకపోవడంతో పక్కనే ఉన్న లక్న కృపారావు(21)ను సాయమడిగాడు. డబ్బు తీసిచ్చిన తర్వాత అతడి కార్డుకు బదులు తన ఏటీఎం కార్డు బురానొద్దీన్ కు ఇచ్చాడు. బురానొద్దీన్ కార్డుతో అతడి ఎకౌంట్ లోని లక్షలాది రూపాయలు డ్రా చేశాడు. తన ఖాతాలో రూ. 8 లక్షలకు కేవలం రూ.1.18 లక్షలు మాత్రమే మిగలడంతో కంగుతిన్న బురానొద్దీన్ పోలీసులను ఆశ్రయించాడు. శేరిలింగంపల్లిలో కృపారావును అరెస్ట్ చేశారు. గుంటూరు జిల్లా కోటప్పకొండకు చెందిన కృపారావు పటాన్‌చెరులోని ఓ కాలేజీలో ఇంజినీరింగ్ చదువుతున్నాడు. అవసరానికి ఆదుకున్న వ్యక్తి బ్యాంకు ఎకౌంట్ వివరాలు రహస్యంగా వాడుకుని రూ.1.15 లక్షల ఆన్లైన్ షాషింగ్ చేసిన బేతపూడి క్రేసీ ఏంజెలినా అనే ఎంటెక్ విద్యార్థిని పేట్ బషీరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. సీడ్ ప్రొడక్షన్ కంపెనీలో పనిచేస్తున్న నాగరాణి మహాజన్ తనతో కలిసి ఫ్లాట్ లో నివసించిన ఏంజెలినాకు అవసరం కోసం గతేడాది నవంబర్ లో తన బ్యాంకు ఎకౌంట్ వివరాలిచ్చింది. వీటిని రహస్యంగా వాడుకుని ఏంజెలినా ఆన్లైన్ షాపింగ్ చేసింది. మోసాన్ని గుర్తించిన మహాజన్ పోలీసులను ఆశ్రయించడంతో ఏంజెలినాను అదుపులోకి తీసుకున్నారు.