అమ్మకోసం ఆసుపత్రికి పోయి.. | 21 Year Old Crushed To Death In Hospital By Elevator | Sakshi
Sakshi News home page

అమ్మకోసం ఆసుపత్రికి పోయి..

Published Sat, Jul 2 2016 12:39 PM | Last Updated on Sun, Mar 10 2019 8:23 PM

అమ్మకోసం ఆసుపత్రికి పోయి.. - Sakshi

అమ్మకోసం ఆసుపత్రికి పోయి..

మథుర: ప్రమాదవశాత్తు ఎలివేటర్ లో ఇరుక్కుపోయి 21 ఏళ్ల యువకుడు మృతి చెందిన సంఘటన నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పల్వాల్ జిల్లాకు చెందిన సతీష్ అమ్మకు అనారోగ్యంగా ఉండటంతో గురువారం రాత్రి ఆపరేషన్ కు ఆసుపత్రికి తీసుకెళ్లాడు. ఆమెను ఆసుపత్రి మూడో ఫ్లోర్ లోని గదిలో ఉంచిన అతను మందుల కోసం ఫస్ట్ ఫ్లోర్ లోని మందుల షాపుకు వెళ్లడానికి రూమ్ నుంచి బయటకు వచ్చాడు.

లిఫ్ట్ కోసం బటన్ నొక్కగా డోర్ తెరుచుకున్నా లిఫ్ట్ రాకపోవడంతో లోపలికి తలపెట్టి చూశాడు. నాలుగు, మూడు ఫ్లోర్ ల మధ్య ఇరుక్కుపోయిన లిఫ్ట్ షాఫ్ట్ ఒక్కసారిగా కిందకు పడటంతో సతీష్ దానికింద పడి మృతి చెందాడు. అతని సోదరుడు పోలీసులకు చేసిన ఫిర్యాదులో ఆసుపత్రి డైరెక్టర్ పై కేసు నమోదు చేయాలని కోరాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement