Flipkart Big Saving Days Sale On March 11 - Sakshi
Sakshi News home page

Flipkart Big Saving Days sale: మళ్లీ ఆఫర్లు.. ఖరీదైన ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!

Published Thu, Mar 9 2023 8:49 PM | Last Updated on Thu, Mar 9 2023 9:06 PM

Flipkart Big Saving Days Sale On March 11 - Sakshi

ఖరీదైన ఫోన్లు తక్కువ ధరకు కొనాలనుకుంటున్నవారికి మళ్లీ సరికొత్త ఆఫర్లను తీసుకొస్తోంది ఈ-కామ‌ర్స్ దిగ్గ‌జం ఫ్లిప్‌కార్ట్ (Flipkart). మార్చి 11 నుంచి మార్చి 15 వ‌ర‌కూ బిగ్ సేవింగ్స్ డేస్ సేల్‌ను నిర్వ‌హించ‌నుంది. ప్ల‌స్ మెంబ‌ర్స్‌కు బిగ్ సేవింగ్ డేస్ సేల్ ఒక రోజు ముందుగా అంటే మార్చి 10నే అందుబాటులోకి వస్తుందని కంపెనీ తెలిపింది. 

ఈ సేల్ సంద‌ర్భంగా  స్మార్ట్‌ఫోన్ల‌పై కొన్ని డిస్కాంట్ ఆఫ‌ర్ల‌ను ఫ్లిప్‌కార్ట్‌ తమ వెబ్‌సైట్‌లో వెల్ల‌డించింది. ఐఫోన్ 14,  ఐఫోన్ 14 ప్లస్‌, నథింగ్‌ ఫోన్‌, గూగుల్‌ పిక్సెల్ తదితర  ఫోన్లపై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. వీటికి అదనంగా బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌ ఆఫర్లు ఉంటాయి.

ఇదీ చదవండి: బీటెక్‌ అమ్మాయి.. బుల్లెట్‌పై హైజీనిక్‌ పానీపూరి

వీటిలో ముఖ్యంగా ఐఫోన్ 14,  ఐఫోన్ 14 ప్లస్‌ ఫోన్లపై అత్యధిక డిస్కౌంట్లు ఉండనున్నాయి. కంపెనీ వెబ్‌సైట్‌లో పేర్కొన్న ప్రకారం.. ఐఫోన్ 14ను రూ.60,009 నుంచి 69,999 లకు సొంతం చేసుకోవచ్చు. అలాగే ఐఫోన్ 14 ప్లస్‌ కూడా రూ.80 వేల లోపు లభిస్తుంది. రూ.79,999 ధర ఉన్న ఐఫోన్‌ 14ను ఫ్లిప్‌ కార్ట్‌ ఇప్పటికే రూ.71,999 అందిస్తుండగా బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో మరింత తగ్గుతుంది. ఇంకా బ్యాంక్‌ ఆఫర్లను కూడా కలుపుకుంటే మీకు ఆ ఫోన్‌ రూ.60 వేల కంటే తక్కువకే వచ్చేస్తుంది.

ఇక ఈ మధ్యనే లాంచ్‌ అయిన గూగుల్‌ పిక్సెల్‌ 7 ధర రూ.59,999. అయితే ఫ్లిప్‌కార్ట్‌ బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో దీన్ని రూ.50 వేల కంటే తక్కువకే కొనుగోలు చేయొచు. గూగుల్‌ పిక్సెల్‌ 7 ప్రో కూడా తక్కువ ధరకు లభించనుంది. అయితే కచ్చితంగా ఎంత అన్నది ఇప్పుడే తెలియదు.

ఇదీ చదవండి: Campa Cola: రిలయన్స్‌ ‘చల్లటి’ కబురు... మార్కెట్‌లోకి రిఫ్రెష్‌ డ్రింక్స్‌

అలాగే నథంగ్‌ ఫోన్‌(1)పై కూడా పెద్ద తగ్గింపే ఉండనుంది. ప్రస్తుతం రూ.27,999 ఉన్న 128 జీబీ వేయియంట్‌ ఈ సేల్‌లో బ్యాంకు ఆఫర్లు కూడా కలిపి రూ. 25 వేలకే లభించే అవకాశం ఉంది. ఈ ఫోన్‌పై కచ్చితమైన డిస్కౌంట్‌ను ఫ్లిప్‌కార్ట్‌ ప్రకటించలేదు. ఇంకా మరికొన్ని ఖరీదైన ఫోన్లపై భారీ తగ్గింపులు పొందాలంటే మార్చి 11 వరకూ ఆగాల్సిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement