Indian Coast Guard
-
మునిగిపోయిన వాణిజ్య నౌక..
పోర్బందర్: అరేబియా సముద్ర జలాల్లో పయనిస్తున్న ఓ వాణిజ్య నౌక మునిగిపోవడంతో అందులో ఉన్న మొత్తం 12 మంది భారతీయ సిబ్బందిని మన తీర రక్షక దళం(ఐసీజీ) కాపాడింది. మన ప్రాదేశిక జలాల ఆవల చోటుచేసుకున్న ఈ ఘటనలో పాకిస్తాన్ మారిటైం సెక్యూరిటీ ఏజెన్సీ(పీఎంఎస్ఏ)సత్వరమే స్పందించి, సహకారం అందించినట్లు ఐసీజీ వెల్లడించింది. ఎంఎస్వీ ఏఐ పిరన్పిర్ అనే వాణిజ్య నౌక సరుకుతో ఇరాన్‌లోని బందర్ అబ్బాస్ పోర్టు నుంచి ఈనెల 2న గుజరాత్‌లోని పోర్బందర్కు బయలుదేరింది. అయితే, బుధవారం ఉదయం సముద్రంలోని అల్లకల్లోల పరిస్థితులతో లోపలికి భారీగా నీరు చేరి పాక్ ఆర్థిక జోన్ పరిధిలో ద్వారకకు పశ్చిమాన 270 కిలోమీటర్ల దూరంలో మునిగిపోయింది. ఓడలోని సిబ్బంది ముంబైలోని ఐసీజీ విభాగం మారిటైం రెస్క్యూ కో ఆర్డినేషన్ సెంటర్(ఎంఆర్సీసీ)కు రక్షించాలంటూ సందేశం పంపారు. దీనిని ఎంఆర్సీసీ గాందీనగర్‌లోని ఐసీజీ ప్రాంతీయ ప్రధాన కార్యాలయానికి చేరవేసింది. వెంటనే రంగంలోకి దిగిన ఐసీజీ విభాగం ఘటన జరిగిన పీఎంఎస్ఏ విభాగానికి అత్యవసర మెయిల్ పంపించింది. పిరన్పిర్ ఓడలోని సిబ్బంది చిన్న లైఫ్ బోట్లో తప్పించుకున్నారని, దాని జాడ కనిపెట్టాలని కోరింది. తక్షణమే స్పందించిన పీఎంఎస్ఏ ఆ సమీపంలోని మరో వాణిజ్య నౌకకు, నేవీకి సమాచారం అందించింది. ఐసీజీతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ పీఎంఎస్ఏ సిబ్బంది విమానం ద్వారా గాలించి చివరికి లైఫ్ బోట్ జాడ కనిపెట్టారు. ఆ మేరకు ఐసీజీ సార్థక్ ఓడలో మొత్తం 12 మందినీ తీసుకుని, పోర్బందర్కు తరలించింది. పాక్ అధికారులు తక్షణమే స్పందించి, పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించడం వల్లే ఈ మొత్తం ఆపరేషన్ విజయవంతంగా ముగిసిందని ఐసీజీ పేర్కొంది. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలనే అంతర్జాతీయ చట్టాలను గౌరవించడంతోపాటు ప్రాంతీయ సహకారాన్ని పెంపొందించడంలో పీఎంఎస్ఏ చూపిన నిబద్ధతను కొనియాడింది. -
అరేబియా సముద్రంలో భారీగా డ్రగ్స్ పట్టివేత
-
అండమాన్‌లో 6 వేల కిలోల డ్రగ్స్ పట్టివేత
పోర్ట్ బ్లయర్: అండమాన్ నికోబార్ దీవుల సమీపంలో భారత తీర రక్షక దళం(ఐసీజీ) ఈ నెల 23న భారీగా డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకుంది. ఓ పడవలో అక్రమంగా రవాణా అవుతున్న 6 వేల కిలోల నిషేధిత మెథాంఫెటమైన్ అనే మాదక ద్రవ్యంతోపాటు ఆరుగురు మయన్మార్ దేశస్తులను పట్టుకుంది. రెండు కిలోల చొప్పున బరువున్న 3 వేల ప్యాకెట్లలో ఉన్న ఈ డ్రగ్ విలువ అంతర్జాతీయ మార్కెట్లో కోట్లలోనే ఉంటుందని సోమవారం అధికారులు వెల్లడించారు. పోర్ట్ బ్లయర్‌కు 150 కిలోమీటర్ల దూరంలోని బారెన్ ఐలాండ్ వద్ద అనుమానాస్పదంగా ఉన్న మత్స్యకారుల పడవను గస్తీ విమానంలో గమనించి, తీరానికి తీసుకువచ్చామన్నారు. మన దేశంతోపాటు పొరుగుదేశాలకు చేరవేసేందుకు దీనిని తరలిస్తున్నట్లు విచారణలో తేలిందన్నారు. -
రూ.1.44 లక్షల కోట్ల ప్రతిపాదనలకు ఆమోదం
రక్షణశాఖలో మూలధన సేకరణకు కేంద్రం ఆమోదం తెలిపింది. దేశీయ తయారీని ప్రోత్సహించేలా రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ (డీఏసీ) సమావేశం నిర్వహించారు. ఇందులో రూ.1,44,716 కోట్ల మేర మూలధన సేకరణ ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. ఈ నిధుల్లో 99 శాతం దేశీయంగా తయారైన ఉత్పత్తులు కొనుగోలు చేయాలని నిర్ణయించారు.దేశీయ తయారీని ప్రోత్సహించేలా కేంద్రం చాలా నిర్ణయాలు తీసుకుంటోంది. విదేశీ కంపెనీలు దేశంలో తయారీని ప్రారంభించేలా ప్రోత్సాహకాలు అందిస్తోంది. దాంతో స్థానికంగా ఉత్పాదకత పెరిగి ఇతర దేశాలకు ఎగుమతులు హెచ్చవుతాయని ప్రభుత్వం భావిస్తోంది. దానివల్ల దేశ ఆదాయం ఊపందుకుంటుంది. ఫలితంగా జీడీపీ పెరుగుతుంది. రక్షణశాఖలోనూ దేశీయ ఉత్పత్తుల వినియోగాన్ని పెంచుతోంది. అంతర్జాతీయ భౌగోళిక అనిశ్చితులు పెరుగుతున్న నేపథ్యంలో భారత్ సైతం ఈ శాఖకు భారీగా నిధులు కేటాయిస్తోంది. డిఫెన్స్ విభాగానికి అవసరమయ్యే ఉత్పత్తులను దేశీయంగా తయారు చేయాలని నిర్ణయించింది. ఆ రంగం అభివృద్ధికి కేంద్రం మూలధనం సేకరించాలని ప్రతిపాదించింది. అందుకోసం డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ (డీఏసీ)తో కలిసి ఇటీవల రూ.1.44 లక్షల కోట్ల నిధులకు ఆమోదం తెలిపింది.ఫ్యూచర్ రెడీ కంబాట్ వెహికల్స్డీఏసీ ఆమోదంతో సేకరించిన నిధులతో భారత సైన్యం తన యుద్ధ ట్యాంకులను ఆధునీకరించాలని నిర్ణయించారు. రక్షణ మంత్రిత్వ శాఖ ఫ్యూచర్ రెడీ కంబాట్ వెహికల్స్ (ఎఫ్‌ఆర్‌సీఈ) కొనుగోలు చేయనున్నారు. ఎఫ్‌ఆర్‌సీఈ అత్యాధునిక టెక్నాలజీ కలిగి రియల్‌టైమ్ పరిస్థితులను అంచనావేస్తూ శత్రువులపై పోరాడే యుద్ధ ట్యాంక్. ఎయిర్ డిఫెన్స్ ఫైర్ కంట్రోల్ రాడార్లుఎయిర్ డిఫెన్స్ ఫైర్ కంట్రోల్ రాడార్ల సేకరణకు కూడా ఆమోదం లభించింది. ఇది గగనతలంలో శత్రువుల ఎయిర్‌క్రాఫ్ట్‌లను గుర్తించి ట్రాక్ చేసేందుకు ఉపయోగపడుతుంది. దాంతోపాటు మంటలతో వాటిని నియంత్రిస్తుంది.ఇదీ చదవండి: ఈవీలకు రూ.10,000 కోట్ల ప్రోత్సాహంఇండియన్ కోస్ట్ గార్డ్ఇండియన్ కోస్ట్ గార్డ్ సామర్థ్యాలను మెరుగుపరచడానికి కొన్ని ప్రతిపాదనలు ఆమోదించారు. డోర్నియర్-228 ఎయిర్‌క్రాఫ్ట్ కొనుగోలు చేయనున్నారు. ఇది నెక్స్ట్ జనరేషన్ ఫాస్ట్ పెట్రోల్ వెస్సెల్. అధునాతన సాంకేతికత కలిగిన దీన్ని తీర ప్రాంతంలో పెట్రోలింగ్ నిర్వహించడానికి ఉపయోగించనున్నారు. ఏదైనా విపత్తుల సమయంలోనూ ఇది సహాయపడుతుంది. -
అరేబియా సముద్రంలో కూలిన హెలికాప్టర్.. ముగ్గురు సిబ్బంది గల్లంతు
గుజరాత్‌లోని పోరుబందర్ తీరం వద్ద ప్రమాదం చోటుచేసుకుంది. అరేబియా సముద్రంలో ఇండియన్ కోస్ట్ గార్డ్‌కు చెందిన అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్(ఏఎల్ హెచ్) కూలిపోయింది. రెస్క్యూ ఆపరేషన్‌కు వెళ్తుండగా అత్యవసరంగా ల్యాండింగ్ చేస్తున్న సమయంలో సముద్రంలో హెలికాప్టర్ కూలడంతో.. ఇండియన్ కోస్ట్ గార్డ్‌కు చెందిన ముగ్గురు సిబ్బంది గల్లంతయ్యారు.గుజరాత్‌లోని పోర్బందర్ తీరం నుంచి అరేబియా సముద్రంలోకి 45 కిలోమీటర్ల దూరంలో మోటార్ ట్యాంకర్ హరిలీలాలో గాయపడిన సిబ్బందిని రక్షించడానికి సెప్టెంబర్ 2 రాత్రి 11 గంటలకు అధునాతన తేలికపాటి హెలికాప్టర్‌ను మోహరించినట్లు ఇండియన్ కోస్ట్ గార్డ్ తెలిపింది. రెస్క్యూ ఆపరేషన్ సందర్భంగా హెలికాప్టర్లో సమస్య తలెత్తి సముంద్రంపై అత్యవసర హార్డ్ ల్యాండింగ్ చేయవలసి వచ్చింది. ఈ క్రమంలో అరేబియా సముద్రంలో హెలికాప్టర్ ప్రమాదవశాత్తు పడిపోయిందని పేర్కొంది. ఆ సమయంలో హెలికాప్టర్లో నలుగురు సిబ్బంది ఉండగా అప్రమత్తమైన కోస్ట్‌గార్డ్ దళాలు తక్షణమే సహాయక చర్యలు చేపట్టాయి.వెంటనే ఒకరిని రక్షించగా. మిగతా ముగ్గురు అదృశ్యమయ్యారు. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నాలుగు నౌకలు, రెండు ఎయిర్‌క్రాఫ్ట్‌లతో సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు కోస్ట్‌గార్డ్ అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదానికి గురైన హెలికాప్టర్ ఇటీవల గుజరాత్ వర్షాల సమయంలో 67 మందిని కాపాడి సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు. -
కోస్ట్ గార్డ్ డీజీ హఠాన్మరణం
సాక్షి, చెన్నై/న్యూఢిల్లీ: భారత తీర రక్షక దళం(ఐసీజీ) డైరెక్టర్ జనరల్ రాకేశ్ పాల్ హఠాన్మరణం చెందారు. ఆదివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో జరిగిన ఐసీజీ కార్యక్రమంలో రాజ్‌నాథ్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా గుండెపోటుకు గురైన రాకేశ్ పాల్‌ను వెంటనే చెన్నైలోని రాజీవ్ గాంధీ జనరల్ ఆస్పత్రికి తరలించారు. రాత్రి 7 గంటల సమయంలో ఆయన ఆస్పత్రిలో కన్నుమూశారని అధికార వర్గాలు తెలిపాయి. చెన్నైలోనే ఉన్న రక్షణ మంత్రి రాజ్‌నాథ్ ఆస్పత్రికి వెళ్లి రాకేశ్ పాల్‌కు నివాళులర్పించారు. రాకేశ్ పాల్ పారి్థవ దేహాన్ని ప్రత్యేక ఏర్పాట్లతో చెన్నై నుంచి అర్ధరాత్రి వేళ ఢిల్లీకి తరలించారు. రాకేశ్ పాల్ గతేడాది జూలై 19వ తేదీన ఐసీజీ 25వ డీజీగా బాధ్యతలు స్వీకరించారు. ఇండియన్ నావల్ ఎకాడమీ విద్యార్థి అయిన రాకేశ్ పాల్ 1989లో ఐసీజీ (ఇండియన్ కోస్ట్ గార్డ్)లో చేరి 34 ఏళ్లపాటు వివిధ హోదాల్లో పనిచేశారు. -
'నారీ శక్తి'..'నారీ శక్తి' అంటారుగా!.. చేతల్లో చూపండి!
మహిళలు సున్నితమైన వాళ్లు అంటూ కొన్ని రంగాలకే పరిమితం చేయొద్దని గొంతెత్తినా.. ప్రయోజనం లేకుండా పోతుంది. అక్కడకి మహిళ సాధికారత పేరుతో చైతన్యం తీసుకొచ్చి మహిళలు అన్ని రంగాల్లో పురుషులకు ధీటుగా చేయగలరని నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఎదురవ్వుతోంది. పోనీ అంత కష్టపడ్డ లింగ సమానత్వపు హక్కు పూర్తి స్థాయిలో అమలుకు నోచుకోవడం లేదు. ఏదో ఒక పేరుతో వెనక్కిలాగేయడమే. ఆఖరికి ప్రభుత్వాలు కూడా 'నారీ శక్తి' అని మాటలు చెప్పడమే గానీ పదోన్నతుల విషయంలో నిబద్దతను చూపించడంలేదు. అందుకు ఉదహారణే కోస్ట్ గార్డ్‌లో మహిళకు శాశ్వత కమిషన్ ఏర్పాటు కేసు. ఈ విషయమే సర్వోన్నత న్యాయస్థానం కేంద్రానికి అక్షింతలు వేసింది. ఇంతకీ ఏంటా కేసు? ఎవరు దాఖలు చేశారంటే..? కోస్ట్ గార్డ్‌లో అర్హులైన షార్ట్ సర్వీస్ కమిషన్డ్ (ఎస్ఎస్సీ) అధికారిణులతో పర్మినెంట్ కమిషన్ ఏర్పాటు చేయడానికి అనుమతి లభించకపోవడంతో ప్రియాంక త్యాగి అనే అధికారిణి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ మేరకు ప్రియాంక త్యాగి ఇండియన్ కోస్ట్‌గార్డ్‌లో మహిళా అధికారులకు శాశ్వత కమిషన్‌ను నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఆ పిటిషన్‌పై సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ జె.బి.పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. మహిళా సాధికారికత గురించి మాట్లాడే మీరు దాన్ని ఇక్కడ చూపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సర్వోన్నత న్యాయస్థానం నిలదీసింది. అసలు కోస్ట్‌గార్డ్‌లో మహిళలకు శాశ్వత కమిషన్‌పై "పితృస్వామ్య" విధానాన్ని ఎందుకు అవలంబిస్తున్నారంటూ కేంద్రానికి అక్షింతలు వేసింది. "మాట్లాడితే 'నారీ శక్తి'..'నారీ శక్తి' అంటారు. ఇప్పడు ఇక్కడ ఎందుకు చూపించడం లేదు. ఈ విషయంలో నిబద్ధతను ప్రదర్శించాల్సిన తరుణం ఆసన్నమయ్యింది. అయితే ఆర్మీ, నేవీలో ఈ విధానం సాధ్యమయ్యినప్పుడు కోస్ట్‌గార్డ్‌లో ఎందుకీ వివక్ష?. అసలు కోస్ట్ గార్డ్ పట్ల ఎందుకంత ఉదాసీన వైఖరి.. ఈ విషయంలో మీరు చాలా అగాథంలో ఉన్నారు.. మహిళలను సముచితంగా పరిగణించే విధానాన్ని మీరు రూపొందించాల్సిందే" అని కేంద్రాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించింది ధర్మాసనం. అంతేగాదు మహిళలు కోస్ట్‌గార్డ్‌లో ఉండలేరని చెప్పే రోజులు పోయాయని, వాళ్లు సరిహద్దులను రక్షించగలిగినప్పుడూ తీరాలను రక్షించగలరని సుప్రీం కోర్టు పేర్కొంది. కేంద్రం తరఫున వాదనలు వినిపించిన అదనపు సొలిసిటర్ జనరల్ విక్రమ్‌జీత్ బెనర్జీ సదరు అదికారిణి త్యాగి ఆర్మీ, నేవీ కాకుండా తీర రక్షక దళంలో వేరొక డొమైన్లో పనిచేస్తున్నందున ఇది వర్తించదని వాదన వినిపించడంతో జేబీ పార్దివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఇలా వ్యాఖ్యానించింది. అలాగే అధికారిణులకు 10% శాశ్వత కమిషన్ మంజూరు చేయవచ్చన్న విక్రమ్‌జిత్ బెనర్జీ వాదనపై కూడా దర్మాసనం మండిపడింది. అసలు మహిళలకు 10 శాతమే ఎందుకు?.. అంటే వారేమైనా తక్కువా? అని ధర్మాసనం చివాట్లు పెట్టింది. నేవీలో మహిళలకు శాశ్వత కమిషన్ ఉన్నప్పుడు కోస్ట్‌గార్డ్ అలా ఎందుకు చేయడం లేదని నిలదీసింది. మహిళలను సముచితంగా పరిగణించే విధానాన్ని రూపొందించాల్సిందే అని కేంద్రాన్ని ఉద్దేశించి స్పష్టం చేసింది. త్రివిధ దళాల్లో మహిళలకు శాశ్వత కమిషన్ల ఏర్పాటుపై సర్వోన్నత న్యాయస్థానం తీర్పులిచ్చినా ఇంకా పూర్వకాల ఆలోచనలతోనే ఉన్నారా? అని కేంద్రాన్ని ప్రశ్నించింది. ఈ విషయంలో కేంద్రం అనుసరించే విధానం సమానత్వ భావనకు విరుద్ధమని, లింగ సమానత్వాన్ని దెబ్బతీస్తుందని పేర్కొంది. అందువల్ల స్త్రీ పురుష సమానత్వం ఉన్న విధానాన్ని రూపొందించాలని కేంద్రాన్ని ఆదేశించింది సర్వోన్నత న్యాయస్థానం. (చదవండి: నాడు జర్నలిస్ట్ నేడు ఉత్తరాఖండ్ తొలి మహిళా ప్రధాన కార్యదర్శిగా..!) -
Republic Day 2024: కర్తవ్య పథ్‌లో దళ నాయికలు
ఢిల్లీ పోలీస్ మొదటిసారి రిపబ్లిక్ డే పరేడ్‌లో సంపూర్ణ మహిళా దళాన్ని కవాతు చేయించనుంది. ఇదొక రికార్డు. ఈ దళానికి ఐపిఎస్ శ్వేత కె సుగాధన్ నాయకత్వం వహించనుంది. అలాగే ఇండియన్ కోస్ట్ గార్డ్ దళానికి అసిస్టెంట్ కమాండెంట్ చునౌతి శర్మ నాయకత్వం వహించనుంది. ఇదీ రికార్డే. భారత త్రివిధ దళాలలో, రక్షణ దళాలలో మహిళల భాగస్వామ్యం ప్రతి ఏటా ప్రాధాన్యం సంతరించుకుంటోంది. 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలలో మహిళా శక్తి తన స్థయిర్యాన్ని ప్రదర్శించనుంది. దేశ రక్షణలో, సాయుధ ప్రావీణ్యంలో తాను ఎవరికీ తీసిపోనని చాటి చెప్పనుంది. గత రెండు మూడు సంవత్సరాలుగా రిపబ్లిక్ డే పరేడ్‌లో మహిళలకు దొరుకుతున్న ప్రాధాన్యం ఈ సంవత్సరం కూడా కొనసాగుతోంది. అంతే కాదు గత కొన్నాళ్లుగా త్రివిధ దళాలలో ప్రమోషన్లు, ర్యాంకులు, నియామకాల్లో స్త్రీలకు సంబంధించిన పట్టింపులు సడలింపునకు నోచుకుంటున్నాయి. ప్రాణాంతక విధుల్లో కూడా స్త్రీలు ఆసక్తి ప్రదర్శిస్తే వారిని నియుక్తులను చేయడం కనిపిస్తోంది. ఆ తెగువే ఇప్పుడు రిపబ్లిక్ డే పరేడ్‌లో ప్రదర్శితం కానుంది. ఢిల్లీ మహిళా దళం ఈ సంవత్సరం గణతంత్ర వేడుకలలో ఢిల్లీ పోలీసులు సంపూర్ణ మహిళా దళాన్ని కవాతు చేయించాలని, దానికి మరో మహిళా ఆఫీసర్ నాయకత్వం వహించాలని నిర్ణయించడం చరిత్రాత్మకం. ఎప్పుడో 1975లో ఢిల్లీ పోలీసు దళానికి నాటి ఐ.పి.ఎస్. ఆఫీసర్ కిరణ్ బేడీ నాయకత్వం వహించి చరిత్ర సృష్టించింది. మళ్లీ గత సంవత్సరంగాని ఐ.పి.ఎస్. ఆఫీసర్ శ్వేత కె సుగాధన్కు నాయకత్వం వహించే అవకాశం రాలేదు. అయితే ఆ దళంలో ఉన్నది మగవారు. ఈసారి మాత్రం పూర్తి మహిళా దళం పాల్గొననుండటం విశేషం. దీనికి తిరిగి శ్వేత కె సుగాధన్ నాయత్వం వహించనుండటం మరో విశేషం. నార్త్ ఢిల్లీకి అడిషినల్ డీసీపీగా పని చేస్తున్న శ్వేత కె సుగాధన్ది కేరళ. 2015లో బి.టెక్ పూర్తి చేసిన శ్వేత మొదటిసారి కాలేజీ టూర్లో ఢిల్లీని దర్శించింది. 2019లో యు.పి.ఎస్.సి. పరీక్షలు రాయడానికి రెండోసారి ఢిల్లీ వచ్చింది. అదే సంవత్సరం ఐ.పి.ఎస్.కు ఎంపికైన శ్వేత ఇప్పుడు అదే ఢిల్లీలో గణతంత్ర దినోత్సవంలో దళ నాయకత్వం వహించే అవకాశాన్ని పొందింది. శ్వేత దళంలో మొత్తం 194 మంది మహిళా హెడ్ కానిస్టేబుళ్లు ఉంటారు. వీరిలో 80 శాతం మంది ఈశాన్య రాష్ట్రాలకు చెందినవారు. ఢిల్లీ పోలీసు విభాగంలో ఈశాన్య రాష్ట్రాల మహిళల నియామకానికి ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. అందుకే శ్వేత నాయకత్వం వహించే దళంలో ఈశాన్య రాష్ట్రాలకు చెందిన మహిళా పోలీసులే ఉంటారు. మరో విశేషం ఏమంటే ఈసారి ఢిల్లీ పోలీస్ బ్యాండ్‌కు రుయాంగియో కిన్సే అనే మహిళా ఆఫీసర్ నాయకత్వం వహించనుంది. 135 మంది పురుష కానిస్టేబుళ్లు ఢిల్లీ పోలీసు గీతాన్ని కవాతులో వినిపిస్తూ ఉంటే వారికి కిన్సే నాయకత్వం వహించనుంది. కోస్ట్ గార్డ్‌కు చునౌతి శర్మ గణతంత్ర వేడుకలలో ఇండియన్ కోస్ట్ గార్డ్ దళానికి అసిస్టెంట్ కమాండెంట్ చునౌతి శర్మ నాయకత్వం వహించనుంది. తీర ప్రాంతాల గస్తీకి, అసాంఘిక కార్యకలాపాల నిరోధానికి నియుక్తమైన ఇండియన్ కోస్ట్ గార్డ్ తన ప్రాతినిధ్య దళంతో పరేడ్‌లో పాల్గొననుంది. దీనికి నాయకత్వం వహించే అవకాశం రావడం పట్ల చునౌతి శర్మ ఆనందం వ్యక్తం చేసింది. ‘గతంలో నేను ఎన్సీసీ కేడెట్‌గా పరేడ్‌లో పాల్గొన్నాను. ఎన్సీసీలో మహిళా కాడెట్ల దళం, పురుష కాడెట్ల దళం విడిగా ఉంటాయి. కాని ఇక్కడ నేను కోస్ట్ గార్డ్ పురుష జవాన్ల దళానికి నాయకత్వం వహించనున్నాను. ఈ కారణానికే కాదు మరోకందుకు కూడా ఈ వేడుకల నాకు ప్రత్యేకమైనవి. ఎందుకంటే నా భర్త శిక్కు దళానికి పరేడ్‌లో నాయకత్వం వహించనున్నాడు. దేశ సేవలో ఇదో విశిష్ట అవకాశం’ అందామె. వీరే కాదు... త్రివిధ దళాల మరిన్ని విభాగాలలోనూ స్త్రీల ప్రాధాన్యం ఈ రిపబ్లిక్ డే వేడుకల్లో పథం తొక్కనుంది. -
‘సాగర్ కవచ్’ కవాతు ప్రారంభం
సాక్షి,విశాఖపట్నం: దేశంలో రెండో అతి పెద్ద తీరాన్ని కలిగి ఉన్న ఆంధ్రప్రదేశ్ వెంబడి ఉన్న సముద్ర జలాల పరిధిలో సమగ్ర తీర భద్రతపై 2 రోజుల పాటు నిర్వహించనున్న ‘సాగర్ కవచ్’ కవాతు బుధవారం ప్రారంభమైంది. సముద్ర సంబంధిత భద్రతా వ్యవస్థలతో సంయుక్తంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ విన్యాసాలను నిర్వహిస్తోంది. 2008 నవంబర్ 26న ముంబై ఉగ్రదాడి తర్వాత తీర భద్రతపై దృష్టిసారించిన భారత్.. ప్రతి ఏటా తీరం వెంబడి ఉన్న రాష్ట్రాల్లో సాగర్ కవచ్‌ని నిర్వహిస్తోంది. భారత నౌకాదళం, ఇండియన్ కోస్ట్‌గార్డ్, స్టేట్ మెరైన్ పోలీస్, కస్టమ్స్, మత్స్యశాఖ, పోర్టు అథారిటీలు, డీజీఎల్ఎల్తో పాటు ఇతర కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విభాగాలు, ఏజెన్సీలు, మారీటైమ్ డొమైన్లో భాగస్వాములైన ఏజెన్సీలు ఈ సాగర్ కవచ్‌లో పాల్గొంటున్నాయి. సముద్ర జలాల్లో ఆయా కేంద్ర, రాష్ట్ర రక్షణ విభాగాల మధ్య పరస్పర సహకారం, సమన్వయం, విభాగాల వారీగా బలబలాల్ని నిరూపించుకునేలా ఈ కార్యక్రమం జరుగుతుంది. వనరుల దోపిడీ జరగకుండా ఏవిధమైన భద్రతని పెంపొందించాలనే అంశాలపైనా ఆయా విభాగాలు చర్చించుకుంటాయి. ఏపీ తీరం వెంబడి పూర్తిస్థాయి భద్రత వలయాన్ని నిర్మించేందుకు మత్స్యకారుల నుంచి ఎలాంటి సహకారం అందుతుంది? వారిని ఎలా సుశిక్షుతుల్ని చేయాలనేదానిపైనా విన్యాసాలు నిర్వహిస్తున్నారు. ఈ విన్యాసాల్ని రాష్ట్ర ప్రభుత్వం పర్యవేక్షిస్తుండగా.. విశాఖలోని కోస్ట్‌గార్డ్ తూర్పు ప్రధాన కార్యాలయం నుంచి సమన్వయ సహకారం జరుగుతోంది. సముద్ర జలాల్లో ఏ చిన్న శత్రు సంబంధిత సమాచారం దొరికినా..పోలీస్(100) లేదా కోస్టల్ సెక్యూరిటీ పోలీస్‌కు సంబంధించి 1093 లేదా ఇండియన్ కోస్ట్‌గార్డు హెల్ప్‌లైన్ నంబర్ 1554కి సమాచారం అందించాలని రక్షణ విభాగాలు విజ్ఞప్తి చేశాయి. గురువారం సాయంత్రంతో సాగర్ కవచ్ ముగియనుంది. -
కాకినాడ తీరంలో కోస్ట్ గార్డ్ విన్యాసాలు
-
వరద బీభత్సం.. హెలికాప్టర్ రాకపోతే ప్రాణాలు పోయేవే!
దేశవ్యాప్తంగా వానలు దంచికొడుతున్నాయి. భారీ వర్షాల కారణంగా నదులు, వాగులు, వంకలు పొర్లిపొంగుతున్నాయి. దీంతో కొన్నిచోట్ల ప్రజలు వరదల్లో చిక్కుకుంటున్నారు. ఇక, గుజరాత్లో కురిసిన భారీ వర్షాలకు అంబికా నది ఒడ్డున ఒక్కసారిగి ఆకస్మిక వరదలు వచ్చాయి. ఈ వదరల్లో దాదాపు 16 మంది చిక్కుకుపోయారు. ఈ నేపథ్యంలో వారిని రక్షించాలని కలెక్టర్ వల్సాద్.. కోస్ట్ గార్డ్ అధికారులను అభ్యర్థించారు. దీంతో రంగంలోకి దిగిన ఇండియన్ కోస్ట్ అధికారులు చేతక్ హెలికాప్టర్ ద్వారా 16 మందిని అతికష్టం మీద కాపాడారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో బలమైన గాలుల కారణంగా హెలికాప్టర్ సైతం.. ఒడిదుడుకులకు లోనైంది. Gujarat | On request from Collector Valsad to rescue personnel stranded due to flash floods on the banks of river Ambika, Indian Coast Guard launched an op through Chetak helicopter and rescued 16 people amidst marginal visibility in strong winds & heavy rains: ICG officials pic.twitter.com/LhJxJzboMs — ANI (@ANI) July 11, 2022 ఇది కూడా చదవండి: వరదల్లో కొట్టుకుపోయిన లారీ.. రేషన్ బియ్యం నీటిపాలు -
Agnipath scheme: అగ్నివీరులకు మరో ఆఫర్
న్యూఢిల్లీ: నిరసనలను చల్లార్చేందుకు అగ్నిపథ్ పథకానికి కేంద్రం మార్పుచేర్పులు చేసింది. నాలుగేళ్ల సర్వీసు అనంతరం బయటికొచ్చే అగ్నివీరుల్లో అర్హులకు రక్షణ శాఖ ఖాళీల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించింది. ఈ ప్రతిపాదనకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ శనివారం ఆమోదముద్ర వేశారు. ఇండియన్ కోస్ట్ గార్డ్, డిఫెన్స్ సివీలియన్ పోస్టులతో పాటు రక్షణ శాఖ పరిధిలోని 16 ప్రభుత్వ రంగ సంస్థల్లోనూ వారికి 10 శాతం రిజర్వేషన్లు అమలవుతాయి. అలాగే సెంట్రల్ ఆర్మ్డ్ పారా మిలటరీ ఫోర్స్ (సీఏపీఎఫ్), అసోం రైఫిల్స్‌లో కూడా అగ్నివీర్లకు 10 శాతం కోటా కల్పించే ప్రతిపాదనకు కేంద్ర హోం శాఖ కూడా ఆమోదముద్ర వేసింది. అంతేగాక వారికి గరిష్ట వయోపరిమితిని మూడేళ్లు పెంచింది. అగ్నిపథ్ నియామకాలకు ఈ ఏడాది గరిష్ట వయో పరిమితిని ఇప్పటికే రెండేళ్లు పెంచడం తెలిసిందే. ఆ లెక్కన తొలి బ్యాచ్ అగ్నివీర్లకు సీఏపీఎఫ్, అసోం రైఫిల్స్‌లో నియామకాలకు ఐదేళ్ల వయోపరిమితి సడలింపు వర్తిస్తుందంటూ హోం శాఖ ట్వీట్ చేసింది. వారికి మరిన్ని ఉపాధి కల్పన అవకాశాలు కల్పించడంలో భాగంగా ప్రభుత్వ బ్యాంకులు, ఆర్థిక సంస్థల చీఫ్‌లతో కేంద్ర ఆర్థిక శాఖ ఇప్పటికే చర్చలు జరిపింది. పెట్రోలియం శాఖలోనూ అవకాశాలు అగ్నివీరులను సర్వీసు అనంతరం హౌసింగ్, పెట్రోలియం శాఖల్లో తీసుకుంటామని ఆ శాఖల మంత్రి హరదీప్‌సింగ్ పురీ చెప్పారు. బీజేపీ పాలిత రాష్ట్రాలు ఇప్పటికే అగ్నివీరులకు పలు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ప్రకటించాయి. పోలీసు, సంబంధిత సర్వీసుల్లో వారికి ప్రాధాన్యమిస్తామని యూపీ, మధ్యప్రదేశ్, అసోం పేర్కొన్నాయి. అద్భుత పథకం: కేంద్రం మెడిసిన్, ఇంజనీరింగ్ విద్యార్థులకు ఉపాధి హామీ ఎక్కడుంది: రాజ్‌నాథ్ అగ్నిపథ్‌ను కేంద్రం గట్టిగా సమర్థించింది. మాజీ సైనికాధికారులు తదితరులతో రెండేళ్ల పాటు విస్తృతంగా సంప్రదింపులు జరిపిన అనంతరమే ఏకాభిప్రాయంతో పథకానికి రూపకల్పన చేసినట్టు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వివరించారు. పథకంపై దేశవ్యాప్త ఆందోళనల నేపథ్యంలో త్రివిధ దళాధిపతులతో శనివారం ఆయన సమీక్ష జరిపారు. ‘‘సైనిక నియామక ప్రక్రియలో అగ్నిపథ్ విప్లవాత్మక మార్పులు తెస్తుంది. రాజకీయ అవసరాల కోసం కొందరు దీనిపై అపోహలు వ్యాప్తి చేస్తున్నారు. దాంతో ప్రజల్లో అయోమయం నెలకొంది. నాలుగేళ్ల తర్వాత బయటికొచ్చాక ఉపాధి హామీ లేదనడం సరికాదు. లక్షలు పెట్టి మెడిసిన్, ఇంజనీరింగ్ చదువుతున్న యువతకు కూడా ఉపాధి హామీ లేదు కదా!’’ అన్నారు. వారికి సైనికోద్యోగాలు రావు హింసాత్మక నిరసనలకు పాల్పడే వారికి సైనికోద్యోగాలకు దారులు శాశ్వతంగా మూసుకుపోతాయని ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌధరి అన్నారు. కేసుల్లో ఇరుక్కుంటే పోలీస్ క్లియరెన్సులు రావన్నారు. -
విశాఖపట్నం సాగరతీరం సాహసాలకు మురి‘సీ’
-
గుజరాత్ సముద్ర తీరంలో పాక్ బోటు పట్టివేత
అహ్మదాబాద్: గుజరాత్ సమీపంలో అరేబియా సముద్రంలోని భారత ప్రాదేశిక జలాల్లోకి ప్రవేశించిన పాకిస్తాన్‌కు చెందిన పడవతోపాటు అందులోని 10 మంది సిబ్బందిని అదుపులోకి తీసుకున్నట్లు భారత తీరరక్షణ దళం(ఐసీజీ) తెలిపింది. శనివారం అర్ధరాత్రి పెట్రోలింగ్ సమయంలో పాక్‌కు చెందిన యాసీన్ అనే పడవ భారత ప్రాదేశిక జలాల్లోకి 11 కిలోమీటర్ల దూరం చొచ్చుకురావడాన్ని ఐసీజీ పసిగట్టింది. చదవండి: సెన్సార్ దెబ్బ.. ఏకంగా రూ.40 వేల కోట్ల నష్టం!! ఆగిపోతే ఆగమేమో? వెంటనే పడవలోని సిబ్బందిని ప్రశ్నించింది. వారు సరైన సమాధానం ఇవ్వకపోగా, పాక్ జలాల్లోకి పారిపోయేందుకు ప్రయతి్నంచారు. వెంటనే అప్రమత్తమై ఆ పడవను అడ్డగించి, అదుపులోకి తీసుకున్నట్లు ఐసీజీ వెల్లడించింది. పాక్‌లోని కేతిబందర్‌లో రిజిస్టరై ఉన్న ఆ పడవలోని 2 వేల కిలోల చేపలు, 600 లీటర్ల డీజిల్‌ను సీజ్ చేశామని తెలిపింది. ఆ పడవను పోర్బందర్లో నిలిపి ఉంచి, దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపింది. -
పీఎఫ్ఆర్డీఏ, ఇండియన్ కోస్ట్‌గార్డ్‌లో ఉద్యోగాలు
పీఎఫ్ఆర్డీఏ, న్యూఢిల్లీలో 14 గ్రేడ్–ఏ ఆఫీసర్ పోస్టులు న్యూఢిల్లీలోని పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (పీఎఫ్ఆర్డీఏ).. గ్రేడ్–ఏ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 14 ► పోస్టుల వివరాలు: జనరల్–05, యాక్చూరియల్–02, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్–02, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ–02, అధికార భాష(రాజభాష)–01, రీసెర్చ్ (ఎకనామిక్స్)–01, రీసెర్చ్(స్టాటిస్టిక్స్)–01. (డిగ్రీతో ఏఓ కొలువు.. నెలకు రూ.60వేల వేతనం ఇక్కడ క్లిక్ చేయండి) ► అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్, ఇంజనీరింగ్ డిగ్రీ, అసోసియేట్ చార్టర్డ్ అకౌంటెంట్(ఏసీఏ), మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. » వయసు: 31.07.2021 నాటికి 30ఏళ్లు మించకూడదు. ► వేతనం: పోస్టును అనుసరించి నెలకు రూ.28,150 నుంచి రూ.55,600 వరకు చెల్లిస్తారు. ► ఎంపిక విధానం: ఆన్లైన్ పరీక్ష(ఫేజ్ 1,ఫేజ్2), ఇంటర్వ్యూ(ఫేజ్ 3)ఆధారంగా ఎంపిక చేస్తారు. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 16.09.2021 ► వెబ్సైట్: https://www.pfrda.org.in/ ఇండియన్ కోస్ట్‌గార్డ్‌లో వివిధ పోస్టులు ఇండియన్ కోస్ట్‌గార్డ్ హెడ్‌క్వార్టర్ నోయిడాలో.. వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 09 ► పోస్టుల వివరాలు: చార్జ్‌మ్యాన్, నాన్ గెజిటెడ్, నాన్ మినిస్టీరియల్ తదితరాలు. ► అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో డిప్లొమా ఇంజనీరింగ్ (ఎలక్ట్రికల్/మెరైన్/ఎలక్ట్రానిక్స్/ప్రొడక్షన్ ఇంజనీరింగ్) ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత విభాగంలో కనీసం 2ఏళ్ల పని అనుభవం ఉండాలి. వయసు 30ఏళ్లు మించకూడదు. ► ఎంపిక విధానం: రాతపరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. ► దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులను ది డైరెక్టర్ జనరల్, కోస్ట్‌గార్డ్ హెడ్ క్వార్టర్స్, డైరెక్టరేట్ రిక్రూట్మెంట్, సీ–1, ఫేజ్ 2, ఇండస్ట్రియల్ ఏరియా, సెక్టార్–62, నోయిడా, యూపీ–201309 చిరునామకు పంపించాలి. ► దరఖాస్తులకు చివరి తేది: 13.09.2021 ► వెబ్సైట్: www.indiancoastguard.gov.in -
ఇండియన్ కోస్ట్‌గార్డులో 350 ఖాళీలు
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్ కోస్ట్ గార్డు, ఆర్మ్డ్ ఫోర్స్‌ల్లో నావిక్ (జనరల్ డ్యూటీ), నావిక్(డొమెస్టిక్ బ్రాంచ్), యాంత్రిక్ 01/2022 బ్యాచ్ పోస్టుల భర్తీకి అర్హులైన పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 350 ► పోస్టుల వివరాలు: నావిక్(జనరల్ డ్యూటీ)–260, నావిక్(డొమెస్టిక్ బ్రాంచ్)–50, యాంత్రిక్(మెకానికల్)–20, యాంత్రిక్(ఎలక్ట్రికల్)–13, యాంత్రిక్(ఎలక్ట్రానిక్స్)–07. అర్హతలు ► నావిక్(జనరల్ డ్యూటీ): మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 18–22ఏళ్ల మధ్య ఉండాలి. 01.02.2000–31.01.2004 మధ్య జన్మించి ఉండాలి. ► నావిక్(డొమెస్టిక్ బ్రాంచ్): గుర్తింపు పొందిన ఎడ్యుకేషన్ బోర్డుల నుంచి పదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 18–22 ఏళ్ల మధ్య ఉండాలి. 01.04.2000–31.03.2004 మధ్య జన్మించి ఉండాలి. ► యాంత్రిక్: గుర్తింపు పొందిన ఎడ్యుకేషన్ బోర్డుల నుంచి పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు ఎలక్ట్రికల్/మెకానికల్/ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్(రేడియో/పవర్) ఇంజనీరింగ్‌లో డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 18–22 ఏళ్ల మధ్య ఉండాలి. 01.02.2000–31.01.2004 మధ్య జన్మించి ఉండాలి. ► ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు గరిష్ట వయసులో సడలింపు ఉంటుంది. ► ఎంపిక విధానం: ఎంపిక విధానం వివిధ దశల్లో ఉంటుంది.స్టేజ్1,2,3,4 ద్వారా ఎంపికచేస్తారు. ► మొదటి దశ(స్టేజ్–1): స్టేజ్–1లో రాతపరీక్ష ఉంటుంది. ఇందులో సెక్షన్–1, 2,3,4,5 పరీక్షలు నిర్వహిస్తారు. సంబంధిత పోస్టులకు ఏ సెక్షన్ పరీక్ష నిర్వహిస్తారు. దానిలో సాధించాల్సిన ఉత్తీర్ణత మార్కులు, సంబంధిత సబ్జెక్టుల సిలబస్, పరీక్షా సమయం, అడిగే ప్రశ్నల గురించి పూర్తి వివరాలు నోటిఫికేషన్లో చూడొచ్చు. ► రెండో దశ(స్టేజ్–2): మొదటి దశలో నిర్వహించిన కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ టెస్ట్‌లో ప్రతిభ ఆధారంగా మెరిట్ జాబితా తయారుచేస్తారు. దీని ప్రకారం స్టేజ్–2కి ఎంపికచేస్తారు. ఇందులో ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, రీ అసెస్మెంట్ టెస్ట్, తొలి మెడికల్ టెస్ట్ ఉంటాయి. ► మూడో దశ(స్టేజ్–3): స్టేజ్–1, స్టేజ్–2లో ప్రతిభ ఆధారంగా స్టేజ్–3కి ఎంపికచేస్తారు. స్టేజ్–3లో డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఫైనల్ మెడికల్ టెస్ట్, ఒరిజినల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, పోలీస్ వెరిఫికేషన్ ఉంటాయి. ► నాలుగో దశ(స్టేజ్–4): ఇందులో వివిధ ఎడ్యుకేషన్ బోర్డ్‌లు/యూనివర్సిటీలు /రాష్ట్ర ప్రభుత్వం నుంచి పొందిన ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇండియన్ కోస్టు గార్డ్ ముందు ఉంచాలి. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► దరఖాస్తు ప్రారంభ తేది: 02.07.2021 ► దరఖాస్తులకు చివరి తేది: 16.07.2021 ► వెబ్సైట్: https://joinindiancoastguard.cdac.in మరిన్ని నోటిఫికేషన్లు: వైఎస్సార్ ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్ ట్రస్ట్, కడపలో 12 ఖాళీలు ఐబీపీఎస్ నోటిఫికేషన్, 10 వేలకు పైగా ఉద్యోగాలు -
yaas cyclone: బురదలో చిక్కుకున్న వందమంది
కోల్‌కతా:యాస్ తుపానులో చిక్కకుని విలవిలాడుతున్న పశ్చిమబెంగాల్, ఒడిషాలలో సహాయ చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ముఖ్యంగా తుపాను దాటికి బెంగాల్‌లోని సుందర్బన్ ప్రాంతం తీవ్రంగా దెబ్బతింది. ఒక్కసారిగా సముద్రం ఉప్పొంగి ఊళ్లకు ఊళ్లనే చుట్టేసింది. దీంతో బంకమట్టి నేలలు అధికంగా ఉండే సుందర్బన్లో అనేక మంది బురదలో కూరుకుపోయారు. నాయచార గ్రామంలో వంద మంది ప్రజలు బురదలో చిక్కుకున్నట్టు సమాచారం రావడంతో ఇండియన్ కోస్ట్‌గార్డ్ స్పందించింది. హుటాహుటిన ఆ గ్రామానికి వెళ్లి ప్రజలను సురక్షిత ప్రాంతానికి తరలించింది. సహాయ చర్యలు తుపాను తీవ్రతకు పశ్చిమ బెంగాల్లో నాలుగు జిల్లాలు తీవ్రంగా నష్టపోయాయి. దాదాపు కోటి ఇళ్లు ధ్వంసమైనట్టు బెంగాల్ సీఎం ప్రకటించారు. వరదలో చిక్కుకుపోయిన వారికి సహాయ కార్యక్రమాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇటు ఒడిషాలోనూ పలు గ్రామాలను చుట్టుముట్టిన సముద్రపు నీరు నెమ్మదిగా వెనక్కి మళ్లుతోంది West Bengal | Indian Coast Guard response team rescues about 100 stranded people through air cushion vehicle in Nayachara village. Rescue operation also underway at Contai (Video Source: Indian Coast Guard)#CycloneYass pic.twitter.com/P6s7wLqGT8 — ANI (@ANI) May 26, 2021 -
కొలంబో తీరంలో కాలిపోతున్న నౌక.. ఐసీజీ చేయూత
కొలంబో: గుజరాత్ నుంచి శ్రీలంకలోని కొలంబో పోర్టుకు వెళ్తున్న సరుకు రవాణా నౌక ఎంవీ ఎక్స్‌ప్రెస్ పెర్ల్‌లో ఆరు రోజుల కిందట అగ్ని ప్రమాదం సంభవించింది. కొలంబో పోర్టుకు సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో మంగళవారం ఒక కంటైనర్ అంటుకొని పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. కాగా ప్రమాద సమయంలో నౌకలో ఉన్న వివిధ దేశాలకు 25 మంది సిబ్బందిని ఇప్పటికే సురక్షితంగా కాపాడారు. కాలిపోతున్న నౌకలోని సరుకును సురక్షితంగా తెచ్చేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే రెండు ఐసీజీ ఓడలు 'వైభవ్', 'వజ్రా'లను సహాయం కోసం పంపినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. శ్రీలంక అధికారులతో జరిపిన చర్చల అనంతరం ఎలాంటి ప్రమాదాలనైనా తట్టుకునే వైభవ్, వజ్రల పంపించినట్లు కోస్ట్‌గార్డ్ అధికారులు పేర్కొన్నారు. వీటికి అదనంగా, కొచ్చి, చెన్నై, టుటికోరిన్ వద్ద ఇండియన్ కోస్ట్ గార్డ్ నౌకలను తక్షణ సహాయం కోసం రెడీగా ఉంచినట్లు పేర్కొన్నారు. ఈ ఆపరేషన్ కోసం శ్రీలంక అధికారులతో ఐసీజీ నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది. చదవండి: ఘోర రైలు ప్రమాదం.. 213 మందికి గాయాలు -
8 మంది పాకిస్తానీలు.. 30 కేజీల హెరాయిన్
న్యూఢిల్లీ: గుజరాత్‌లోని జఖావు తీరంలో ఒక ఫిషింగ్ బోట్లో 8 మంది పాకిస్తానీలను, 30 కేజీల హెరాయిన్‌ను భారత తీర రక్షణ దళం పట్టుకుంది. పాకిస్తాన్‌కు చెందిన బోటు నిషేధిత డ్రగ్స్‌తో భారత సముద్ర జలాల్లోకి వచ్చిందన్న సమాచారంతో ఇండియన్ కోస్ట్ గార్డ్(ఐసీజీ), గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ గురువారం తెల్లవారుజామున ఈ ఆపరేషన్ చేపట్టాయి. ఆ బోటు నుంచి రూ. 150 కోట్ల విలువైన 30 కేజీల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నామని ఐసీజీ ప్రకటించింది. గుజరాత్ ఉగ్రవాద వ్యతిరేక దళానికి వారిని అప్పగించినట్లు తెలిపింది. హెరాయిన్‌ను గుజరాత్ నుంచి పంజాబ్‌కు రోడ్డు మార్గంలో తరలించాలన్నది వారి పన్నాగమని పేర్కొంది. ఏడాదిలో స్మగ్లర్ల నుంచి రూ. 5,200 కోట్ల విలువైన 1.6 టన్నుల డ్రగ్స్‌ను ఐసీజీ స్వాధీనం చేసుకుంది. -
నడి సంద్రంలో నాలుగు రోజులు, అంతా సేఫ్!
చెన్నై: బంగాళాఖాతంలో బోటు మునిగిపోయి ప్రమాదం అంచున నిలిచిన ఆరుగురు శ్రీలంక మత్స్యకారులను ఇండియన్ కోస్ట్ గార్డ్స్ ఆదివారం ఉదయం రక్షించారు. ముంబై మారీటైమ్ రెస్క్యూ కోఆర్డినేషన్ సెంటర్ (ఎమ్మార్సీసీ) నుంచి అందిన సమాచారంతో చెన్నైలోని మారీటైమ్ రెస్క్యూ కోఆర్డినేషన్ సెంటర్ సిబ్బంది ఈ రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. చెన్నైకి తూర్పున 170 నాటికల్ మైళ్ల దూరంలో ఈ రెస్క్యూ ఆపరేషన్ జరిగింది. శ్రీలంకలోని త్రింకోమాళికి చెందిన ఆరుగురు మత్స్యకారులు చేపల వేట కోసం సముంద్రంలోకి వచ్చారు. అయితే, వాతావరణం ప్రతికూలంగా మారడంతో అలల తాకిడికి వారి బోటు బోల్తాపడింది. దాంతో నాలుగు రోజులుగా వారు బోటుపైనే బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఈ నాలుగు రోజులుగా అలలు ఎటు నెడితే బోటు అటే కొట్టుకుపోతూ వచ్చింది. ఇదే క్రమంలో చెన్నై నుంచి విశాఖపట్నం వెళ్తున్న వైఎం సమ్మిట్ వాణిజ్య నౌకా సిబ్బందికి శ్రీలంక మత్స్యకారులు కనిపించారు. వెంటనే వైఎం సమ్మిట్ మాస్టర్ ఈ విషయాన్ని ముంబైలోని ఎమ్మార్సీసీకి అందించారు. వారు చెన్నైలోని మారీటైమ్ రెస్క్యూ కోఆర్డినేషన్ సెంటర్ సిబ్బందిని అలర్ట్ చేశారు. దాంతో చెన్నైలోని కోస్ట్ గార్డ్స్ రంగంలోకి దిగి శ్రీలంక మత్స్యకారులను రక్షించారు. వాణిజ్య నౌక ద్వారా మత్స్యకారులను చెన్నైలోని నౌకా కేంద్రానికి తీసుకెళ్లారు. అనంతరం శ్రీలంక రాయబార కార్యాలాయానికి సమాచారం ఇవ్వగా.. వారు మత్స్యకారులను స్వదేశానికి తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. (చదవండి: పబ్జీ ఉచ్చు: తాతా ఖాతాకు చిల్లు) -
సముద్రంలో బోటు మునక, రక్షించిన కోస్ట్ గార్డ్స్
-
600 కోట్ల డ్రగ్స్ ఉన్న పాక్ పడవ పట్టివేత
న్యూఢిల్లీ: రూ. 600 కోట్ల విలువైన మాదకద్రవ్యాలతో నిండిన పాకిస్తానీ పడవను భారత తీరప్రాంత భద్రతాదళం (ఇండియన్ కోస్ట్ గార్డ్–ఐసీజీ) మంగళవారం పట్టుకుంది. గుజరాత్ తీరానికి దూరంగా, రెండు రోజులపాటు సముద్రంలో 200 నాటికల్ మైళ్ల దూరం గాలించి ఈ పడవను పట్టుకున్నారని ఓ ఉన్నతాధికారి చెప్పారు. పడవలోని ఆరుగురు సిబ్బందిని అదుపులోకి తీసుకున్నామని ఐసీజీ అదనపు డీజీ వీఎస్ఆర్ మూర్తి తెలిపారు. నిఘా వర్గాలు, ఐసీజీ అధికారులతో కూడిన సంయుక్త బృందం వారిని విచారిస్తుందని మూర్తి వెల్లడించారు. కాగా, 8 నాటికల్ మైళ్లపాటు భారత జలాల్లోకి ప్రవేశించి చేపలు పడుతున్న ‘అల్–మదీనా’ అనే మరో పడవను కూడా ఐసీజీ మంగళవారం గుర్తించింది. -
భారత తీర ప్రాంతంలో హై అలర్ట్
న్యూఢిల్లీ: శ్రీలంకలో మరణహోమం నేపథ్యంలో భారత కోస్ట్ గార్డ్ అధికారులు తీర ప్రాంతంలో హై అలర్ట్ ప్రకటించారు. శ్రీలంకలో వరుస పేలుళ్లకు పాల్పడిన ఉగ్రవాదులు సముద్ర జలాల గుండా భారత్‌లో ప్రవేశించే అవకాశం ఉండటంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈస్టర్ పర్వదినాన జరిగిన వరుస బాంబు పేలుళ్ల వెనుక ఇస్లామిక్ తీవ్రవాద సంస్థ ‘నేషనల్ తౌహీద్ జమాత్ (ఎన్టీజే)’ హస్తం ఉందని శ్రీలకం ప్రభుత్వం ప్రకటించింది. ఈ దాడులకు పాల్పడిన ఉగ్రవాదులు సముద్ర మార్గం గుండా ద్వీప దేశం నుంచి పారిపోయే అవకాశం ఉందని అక్కడి వర్గాలు పేర్కొన్నాయి. దీంతో అప్రమత్తమైన భారత కోస్ట్ గార్డ్ అధికారులు ముందస్తు భద్రత చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా భారత సముద్ర జలాల్లో గస్తీ నిర్వహించడానికి భారీగా షిప్పులను, డ్రోనియర్ ఎయిర్‌క్రాఫ్ట్‌ను మోహరించినట్టు ఏఎన్ఐ వార్త సంస్థ తెలిపింది. భారత జలాల్లోకి ప్రవేశించే అనుమానిత బోట్స్‌ను గుర్తించడానికి పెద్ద ఎత్తున భద్రత చర్యలు చేపట్టారు. మరోవైపు శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన సోమవారం అర్ధరాత్రి నుంచి శ్రీలంక వ్యాప్తంగా ఎమర్జెన్సీ విధించనున్నట్టు పేర్కొన్నారు. ఆదివారం శ్రీలంకలో జరిగిన వరసు పేలుళ్లలో మృతుల సంఖ్య దాదాపు 300 మందికి చేరింది. దాయాది పాకిస్తాన్ నుంచి సుముద్ర జలాల గుండా భారత్‌లోకి ప్రవేశించిన ఉగ్రవాదులు 2008 నవంబర్ 26వ తేదీన ముంబైలో మరణహోమం సృష్టించిన సంగతి తెలిసిందే. -
కోస్ట్‌గార్డ్ అమ్ములపొదిలో చేరిన అత్యాధునిక నౌక ‘వీర’
-
విపత్తులు ఎదుర్కొనేందుకు సదా సన్నద్ధతతో ఉంటాం
విశాఖ సిటీ: భారత సాగర తీరంలో శాంతి భద్రతల్ని కాపాడటమే ప్రధాన లక్ష్యంగా తూర్పు నౌకాదళం సేవలందిస్తోందని ఈఎన్సీ ప్రధానాధికారి వైస్ అడ్మిరల్ కరమ్‌బీర్ సింగ్ తెలిపారు. ఆయన శుక్రవారమిక్కడ మీడియాతో మాట్లాడారు. జాతీయ విపత్తులను ఎదుర్కొనేందుకు నౌకాదళం ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటుందన్నారు. నౌకాదళంలో సబ్‌మెరైన్ సేవలు ప్రారంభమై 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ నెల 7న సబ్‌మెరైన్ స్వర్ణోత్సవాలు నిర్వహించనున్నట్లు కరమ్‌బీర్ సింగ్ తెలిపారు. 1968లో సేవలు ప్రారంభించిన తూర్పు నౌకాదళానికి 2018 మార్చి నాటికి 50 ఏళ్లు పూర్తవుతున్నా యన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి రామ్నాథ్కోవింద్ డిసెంబర్ 7, 8 తేదీల్లో జరిగే స్వర్ణోత్సవాల్లో పాల్గొంటారని తెలిపారు.