Indian Coast Guard Notification 2021, Navik And Yantrick Posts - Sakshi
Sakshi News home page

ఇండియన్‌ కోస్ట్‌గార్డులో 350 ఖాళీలు

Published Mon, Jun 14 2021 5:09 PM | Last Updated on Mon, Jun 14 2021 6:13 PM

Indian Coast Guard Recruitment 2021: Navik And Yantrik posts, Eligibility, Selection Process - Sakshi

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్‌ కోస్ట్‌ గార్డు, ఆర్మ్‌డ్‌ ఫోర్స్‌ల్లో నావిక్‌ (జనరల్‌ డ్యూటీ), నావిక్‌(డొమెస్టిక్‌ బ్రాంచ్‌), యాంత్రిక్‌ 01/2022 బ్యాచ్‌ పోస్టుల భర్తీకి అర్హులైన పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

► మొత్తం పోస్టుల సంఖ్య: 350

పోస్టుల వివరాలు: నావిక్‌(జనరల్‌ డ్యూటీ)–260, నావిక్‌(డొమెస్టిక్‌ బ్రాంచ్‌)–50, యాంత్రిక్‌(మెకానికల్‌)–20, యాంత్రిక్‌(ఎలక్ట్రికల్‌)–13, యాంత్రిక్‌(ఎలక్ట్రానిక్స్‌)–07.

అర్హతలు
నావిక్‌(జనరల్‌ డ్యూటీ): మ్యాథ్స్, ఫిజిక్స్‌ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 18–22ఏళ్ల మధ్య ఉండాలి. 01.02.2000–31.01.2004 మధ్య జన్మించి ఉండాలి.

నావిక్‌(డొమెస్టిక్‌ బ్రాంచ్‌): గుర్తింపు పొందిన ఎడ్యుకేషన్‌ బోర్డుల నుంచి పదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 18–22 ఏళ్ల మధ్య ఉండాలి. 01.04.2000–31.03.2004 మధ్య జన్మించి ఉండాలి.

యాంత్రిక్‌: గుర్తింపు పొందిన ఎడ్యుకేషన్‌ బోర్డుల నుంచి పదో తరగతి ఉత్తీర్ణతతో  పాటు ఎలక్ట్రికల్‌/మెకానికల్‌/ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలికమ్యూనికేషన్‌(రేడియో/పవర్‌) ఇంజనీరింగ్‌లో డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 18–22 ఏళ్ల మధ్య ఉండాలి. 01.02.2000–31.01.2004 మధ్య జన్మించి ఉండాలి.

► ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు గరిష్ట వయసులో సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం: ఎంపిక విధానం వివిధ దశల్లో ఉంటుంది.స్టేజ్‌1,2,3,4 ద్వారా ఎంపికచేస్తారు.

మొదటి దశ(స్టేజ్‌–1): స్టేజ్‌–1లో రాతపరీక్ష ఉంటుంది. ఇందులో సెక్షన్‌–1, 2,3,4,5 పరీక్షలు నిర్వహిస్తారు. సంబంధిత పోస్టులకు ఏ సెక్షన్‌ పరీక్ష నిర్వహిస్తారు. దానిలో సాధించాల్సిన ఉత్తీర్ణత మార్కులు, సంబంధిత సబ్జెక్టుల సిలబస్, పరీక్షా సమయం, అడిగే ప్రశ్నల గురించి పూర్తి వివరాలు నోటిఫికేషన్‌లో చూడొచ్చు.

రెండో దశ(స్టేజ్‌–2): మొదటి దశలో నిర్వహించిన కంప్యూటర్‌ బేస్డ్‌ ఆన్‌లైన్‌ టెస్ట్‌లో ప్రతిభ ఆధారంగా మెరిట్‌ జాబితా తయారుచేస్తారు. దీని ప్రకారం స్టేజ్‌–2కి ఎంపికచేస్తారు. ఇందులో ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ టెస్ట్, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్, రీ అసెస్‌మెంట్‌ టెస్ట్, తొలి మెడికల్‌ టెస్ట్‌ ఉంటాయి.

మూడో దశ(స్టేజ్‌–3): స్టేజ్‌–1, స్టేజ్‌–2లో ప్రతిభ ఆధారంగా స్టేజ్‌–3కి ఎంపికచేస్తారు. స్టేజ్‌–3లో డాక్యుమెంట్‌ వెరిఫికేషన్, ఫైనల్‌ మెడికల్‌ టెస్ట్, ఒరిజినల్‌ డాక్యుమెంట్‌ వెరిఫికేషన్, పోలీస్‌ వెరిఫికేషన్‌ ఉంటాయి.

నాలుగో దశ(స్టేజ్‌–4): ఇందులో వివిధ ఎడ్యుకేషన్‌ బోర్డ్‌లు/యూనివర్సిటీలు /రాష్ట్ర ప్రభుత్వం నుంచి పొందిన ఒరిజినల్‌ సర్టిఫికెట్లు ఇండియన్‌ కోస్టు గార్డ్‌ ముందు ఉంచాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ప్రారంభ తేది: 02.07.2021
దరఖాస్తులకు చివరి తేది: 16.07.2021
వెబ్‌సైట్‌: https://joinindiancoastguard.cdac.in

మరిన్ని నోటిఫికేషన్లు:
వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్‌ ట్రస్ట్, కడపలో 12 ఖాళీలు

ఐబీపీఎస్‌ నోటిఫికేషన్‌, 10 వేలకు పైగా ఉద్యోగాలు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement