పీఎఫ్‌ఆర్‌డీఏ, ఇండియన్‌ కోస్ట్‌గార్డ్‌లో ఉద్యోగాలు | PFRDA, Indian Coast Guard Recruitment 2021: Vacancies Details Here | Sakshi
Sakshi News home page

పీఎఫ్‌ఆర్‌డీఏ, ఇండియన్‌ కోస్ట్‌గార్డ్‌లో ఉద్యోగాలు

Published Wed, Aug 25 2021 6:15 PM | Last Updated on Wed, Aug 25 2021 6:18 PM

PFRDA, Indian Coast Guard Recruitment 2021: Vacancies Details Here - Sakshi

పీఎఫ్‌ఆర్‌డీఏ, న్యూఢిల్లీలో 14 గ్రేడ్‌–ఏ ఆఫీసర్‌ పోస్టులు
న్యూఢిల్లీలోని పెన్షన్‌ ఫండ్‌ రెగ్యులేటరీ అండ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (పీఎఫ్‌ఆర్‌డీఏ).. గ్రేడ్‌–ఏ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
► మొత్తం పోస్టుల సంఖ్య: 14

► పోస్టుల వివరాలు: జనరల్‌–05, యాక్చూరియల్‌–02, ఫైనాన్స్‌ అండ్‌ అకౌంట్స్‌–02, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ–02, అధికార భాష(రాజభాష)–01, రీసెర్చ్‌ (ఎకనామిక్స్‌)–01, రీసెర్చ్‌(స్టాటిస్టిక్స్‌)–01. (డిగ్రీతో ఏఓ కొలువు.. నెలకు రూ.60వేల వేతనం ఇక్కడ క్లిక్‌ చేయండి)

► అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్, ఇంజనీరింగ్‌ డిగ్రీ, అసోసియేట్‌ చార్టర్డ్‌ అకౌంటెంట్‌(ఏసీఏ), మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. » వయసు: 31.07.2021 నాటికి 30ఏళ్లు మించకూడదు.

► వేతనం: పోస్టును అనుసరించి నెలకు రూ.28,150 నుంచి రూ.55,600 వరకు చెల్లిస్తారు.

► ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ పరీక్ష(ఫేజ్‌ 1,ఫేజ్‌2), ఇంటర్వ్యూ(ఫేజ్‌ 3)ఆధారంగా ఎంపిక చేస్తారు.

► దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

► ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 16.09.2021

► వెబ్‌సైట్‌: https://www.pfrda.org.in/


ఇండియన్‌ కోస్ట్‌గార్డ్‌లో వివిధ పోస్టులు

ఇండియన్‌ కోస్ట్‌గార్డ్‌ హెడ్‌క్వార్టర్‌ నోయిడాలో.. వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

► మొత్తం పోస్టుల సంఖ్య: 09

 పోస్టుల వివరాలు: చార్జ్‌మ్యాన్, నాన్‌ గెజిటెడ్, నాన్‌ మినిస్టీరియల్‌ తదితరాలు.

► అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో డిప్లొమా ఇంజనీరింగ్‌ (ఎలక్ట్రికల్‌/మెరైన్‌/ఎలక్ట్రానిక్స్‌/ప్రొడక్షన్‌ ఇంజనీరింగ్‌) ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత విభాగంలో కనీసం 2ఏళ్ల పని అనుభవం ఉండాలి. వయసు 30ఏళ్లు మించకూడదు.

► ఎంపిక విధానం: రాతపరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.

► దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులను ది డైరెక్టర్‌ జనరల్, కోస్ట్‌గార్డ్‌ హెడ్‌ క్వార్టర్స్, డైరెక్టరేట్‌ రిక్రూట్‌మెంట్, సీ–1, ఫేజ్‌ 2, ఇండస్ట్రియల్‌ ఏరియా, సెక్టార్‌–62, నోయిడా, యూపీ–201309 చిరునామకు పంపించాలి.

► దరఖాస్తులకు చివరి తేది: 13.09.2021

► వెబ్‌సైట్‌: www.indiancoastguard.gov.in 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement