Yantriks
-
ఇండియన్ కోస్ట్‌గార్డులో 350 ఖాళీలు
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్ కోస్ట్ గార్డు, ఆర్మ్డ్ ఫోర్స్‌ల్లో నావిక్ (జనరల్ డ్యూటీ), నావిక్(డొమెస్టిక్ బ్రాంచ్), యాంత్రిక్ 01/2022 బ్యాచ్ పోస్టుల భర్తీకి అర్హులైన పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 350 ► పోస్టుల వివరాలు: నావిక్(జనరల్ డ్యూటీ)–260, నావిక్(డొమెస్టిక్ బ్రాంచ్)–50, యాంత్రిక్(మెకానికల్)–20, యాంత్రిక్(ఎలక్ట్రికల్)–13, యాంత్రిక్(ఎలక్ట్రానిక్స్)–07. అర్హతలు ► నావిక్(జనరల్ డ్యూటీ): మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 18–22ఏళ్ల మధ్య ఉండాలి. 01.02.2000–31.01.2004 మధ్య జన్మించి ఉండాలి. ► నావిక్(డొమెస్టిక్ బ్రాంచ్): గుర్తింపు పొందిన ఎడ్యుకేషన్ బోర్డుల నుంచి పదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 18–22 ఏళ్ల మధ్య ఉండాలి. 01.04.2000–31.03.2004 మధ్య జన్మించి ఉండాలి. ► యాంత్రిక్: గుర్తింపు పొందిన ఎడ్యుకేషన్ బోర్డుల నుంచి పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు ఎలక్ట్రికల్/మెకానికల్/ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్(రేడియో/పవర్) ఇంజనీరింగ్‌లో డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 18–22 ఏళ్ల మధ్య ఉండాలి. 01.02.2000–31.01.2004 మధ్య జన్మించి ఉండాలి. ► ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు గరిష్ట వయసులో సడలింపు ఉంటుంది. ► ఎంపిక విధానం: ఎంపిక విధానం వివిధ దశల్లో ఉంటుంది.స్టేజ్1,2,3,4 ద్వారా ఎంపికచేస్తారు. ► మొదటి దశ(స్టేజ్–1): స్టేజ్–1లో రాతపరీక్ష ఉంటుంది. ఇందులో సెక్షన్–1, 2,3,4,5 పరీక్షలు నిర్వహిస్తారు. సంబంధిత పోస్టులకు ఏ సెక్షన్ పరీక్ష నిర్వహిస్తారు. దానిలో సాధించాల్సిన ఉత్తీర్ణత మార్కులు, సంబంధిత సబ్జెక్టుల సిలబస్, పరీక్షా సమయం, అడిగే ప్రశ్నల గురించి పూర్తి వివరాలు నోటిఫికేషన్లో చూడొచ్చు. ► రెండో దశ(స్టేజ్–2): మొదటి దశలో నిర్వహించిన కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ టెస్ట్‌లో ప్రతిభ ఆధారంగా మెరిట్ జాబితా తయారుచేస్తారు. దీని ప్రకారం స్టేజ్–2కి ఎంపికచేస్తారు. ఇందులో ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, రీ అసెస్మెంట్ టెస్ట్, తొలి మెడికల్ టెస్ట్ ఉంటాయి. ► మూడో దశ(స్టేజ్–3): స్టేజ్–1, స్టేజ్–2లో ప్రతిభ ఆధారంగా స్టేజ్–3కి ఎంపికచేస్తారు. స్టేజ్–3లో డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఫైనల్ మెడికల్ టెస్ట్, ఒరిజినల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, పోలీస్ వెరిఫికేషన్ ఉంటాయి. ► నాలుగో దశ(స్టేజ్–4): ఇందులో వివిధ ఎడ్యుకేషన్ బోర్డ్‌లు/యూనివర్సిటీలు /రాష్ట్ర ప్రభుత్వం నుంచి పొందిన ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇండియన్ కోస్టు గార్డ్ ముందు ఉంచాలి. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► దరఖాస్తు ప్రారంభ తేది: 02.07.2021 ► దరఖాస్తులకు చివరి తేది: 16.07.2021 ► వెబ్సైట్: https://joinindiancoastguard.cdac.in మరిన్ని నోటిఫికేషన్లు: వైఎస్సార్ ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్ ట్రస్ట్, కడపలో 12 ఖాళీలు ఐబీపీఎస్ నోటిఫికేషన్, 10 వేలకు పైగా ఉద్యోగాలు -
ఇస్రో మాజీ చైర్మన్‌పై చార్జ్‌షీట్
‘యాంత్రిక్స్-దేవాస్’ కేసులో నాయర్‌తో పాటు పలువురి పేర్లు కేబినెట్‌తో పాటు అంతరిక్ష కమిషన్‌ను మోసగించారన్న సీబీఐ న్యూఢిల్లీ: యాంత్రిక్స్-దేవాస్ ఒప్పందం కేసులో ఇస్రో మాజీ చైర్మన్ జి.మాధవన్ నాయర్‌తో పాటు ఇతర ఉన్నతాధికారులపై గురువారం సీబీఐ చార్జ్‌షీట్ దాఖలు చేసింది. ప్రైవేట్ మల్టీమీడియా కంపెనీ దేవాస్‌కు ఇస్రో వాణిజ్య విభాగం యాంత్రిక్స్ రూ. 578 కోట్ల మేర అక్రమంగా లబ్ధి చే కూర్చినట్లు చార్జ్‌షీట్‌లో పేర్కొంది. నాయర్‌తో పాటు అప్పటి యాంత్రిక్స్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ కె.ఆర్.శ్రీధర్ మూర్తి, దేవాస్ సీఈవో రామచంద్ర విశ్వనాథన్(ఫోర్జ్ అడ్వైజర్స్ మాజీ ఎండీ), దేవాస్ డెరైక్టర్ ఎం.జి.చంద్రశేఖర్‌ల పేర్లను అభియోగ పత్రంలో చేర్చారు. ఢిల్లీలోని సంబంధిత కోర్టులో సమర్పించిన ఈ చార్జ్‌షీట్‌లో అంతరిక్ష విభాగం అదనపు కార్యదర్శి వీనా ఎస్ రావు, ఇస్రో అప్పటి డెరై క్టర్ ఎ.భాస్కర్ నారాయణరావు, దేవాస్కి చెందిన ఇద్దరు డెరైక్టర్లు డి.వేణుగోపాల్, ఎం.ఉమేశ్ పేర్లనూ పేర్కొన్నారు. మోసానికి పాల్పడినందుకు ఐపీసీలోని వివిధ సెక్షన్లతో పాటు, అధికార దుర్వినియోగంతో తమకు, ఇతరులకు అక్రమ లబ్ధి చేకూరేలా వ్యవహరించినందుకు అవినీతి నిరోధక చట్టంలోని పలు సెక్షన్ల కింద నేరానికి పాల్పడినట్లు ఆరోపించింది. జీశాట్-6, జీశాట్-6ఏ ఉపగ్రహాలు, భారత భూ భాగంలోని వ్యవస్థల ద్వారా ఎస్-బ్యాండ్ సాయంతో మొబైల్ ఫోన్లకు వీడియోలు, మల్టీమీడియా వివరాలు, సమాచార సేవల్ని పంపేందుకు దేవాస్‌ను అనుమతించేలా అధికార దుర్వినియోగం చేశారంది. వివరాల్ని తొక్కిపెట్టారు: ఎస్-బ్యాండ్ తరంగాలు కావాలంటూ రక్షణ, టెలికం శాఖలు కోరాయన్న అంశాలపై విచారణ కొనసాగుతుందని సీబీఐ తెలిపింది. ‘మే, 26 2005న అంతరిక్ష కమిషన్ 104వ సమావేశంలో జీశాట్-6/ఇన్సాట్-4ఈ కోసం రూ.269 కోట్ల బడ్జెట్ సాయం చేయాల్సిందిగా ఇస్రో కోరింది. అప్పటికే దేవాస్‌తో ఒప్పందం చేసుకున్నా ఆ విషయాన్ని వెల్లడించలేదు. నవంబర్ 17, 2005న జీశాట్-6 నిర్మాణం కోసం కేబినెట్‌కు నోట్ సమర్పించారు. ఒప్పందంపై కేబినెట్‌కు తప్పుడు సమాచారమిచ్చారు. డిసెంబర్, 2005న కేబినెట్ ఆమోదం తెలిపింది’ అని పేర్కొంది. ఒప్పందాన్ని యాంత్రిక్స్ రద్దు చేసుకోవడంపై అంతర్జాతీయ ట్రిబ్యునల్‌లో కేసును భారత్ ఓడిపోయిన నెల తర్వాత చార్జ్‌షీట్ దాఖలు చేయడం గమనార్హం. కేసు ఓటమితో పరిహారం కింద దేవాస్ రూ.కోట్లలో పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. దేని ఆధారంగా దాఖలు చేశారు?: నాయర్ ఏ ఆధారంగా కేసు దాఖలు చేశారో నిజానికి తనకు అర్థంకావడం లేదని ఇస్రో మాజీ చైర్మన్ మాధవన్ నాయర్ అన్నారు. ‘ఈ అంశంపై ఇంతకుముందు చతుర్వేది, ప్రత్యూష్ సిన్హా కమిటీలు విచారించి.. ప్రభుత్వానికి నష్టం జరగలేదని నిర్ధారణకు వచ్చాయి. అయినా సరే ఆ సమయంలో నలుగురు శాస్త్రవేత్తల్ని శిక్షించారు. నాలుగేళ్ల అనంతరం అదే అంశంపై కోర్టులో కేసు ఎలా దాఖలు చేస్తారో అర్థంకావ డం లేదు’ అని అన్నారు.