600 కోట్ల డ్రగ్స్‌ ఉన్న పాక్‌ పడవ పట్టివేత | Coast Guard seizes Pakistani boat carrying heroin worth Rs 600 crore | Sakshi
Sakshi News home page

600 కోట్ల డ్రగ్స్‌ ఉన్న పాక్‌ పడవ పట్టివేత

Published Wed, May 22 2019 2:39 AM | Last Updated on Wed, May 22 2019 7:33 AM

Coast Guard seizes Pakistani boat carrying heroin worth Rs 600 crore - Sakshi

న్యూఢిల్లీ: రూ. 600 కోట్ల విలువైన మాదకద్రవ్యాలతో నిండిన పాకిస్తానీ పడవను భారత తీరప్రాంత భద్రతాదళం (ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్‌–ఐసీజీ) మంగళవారం పట్టుకుంది. గుజరాత్‌ తీరానికి దూరంగా, రెండు రోజులపాటు సముద్రంలో 200 నాటికల్‌ మైళ్ల దూరం గాలించి ఈ పడవను పట్టుకున్నారని ఓ ఉన్నతాధికారి చెప్పారు. పడవలోని ఆరుగురు సిబ్బందిని అదుపులోకి తీసుకున్నామని ఐసీజీ అదనపు డీజీ వీఎస్‌ఆర్‌ మూర్తి తెలిపారు. నిఘా వర్గాలు, ఐసీజీ అధికారులతో కూడిన సంయుక్త బృందం వారిని విచారిస్తుందని మూర్తి వెల్లడించారు. కాగా, 8 నాటికల్‌ మైళ్లపాటు భారత జలాల్లోకి ప్రవేశించి చేపలు పడుతున్న ‘అల్‌–మదీనా’ అనే మరో పడవను కూడా ఐసీజీ మంగళవారం గుర్తించింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement