అరేబియా స‌ముద్రంలో కూలిన హెలికాప్ట‌ర్.. ముగ్గురు సిబ్బంది గల్లంతు | 3 Missing As Coast Guard Chopper Makes Emergency Landing In Sea Near Gujarat | Sakshi
Sakshi News home page

అరేబియా స‌ముద్రంలో కూలిన హెలికాప్ట‌ర్.. ముగ్గురు సిబ్బంది గల్లంతు

Published Tue, Sep 3 2024 11:12 AM | Last Updated on Tue, Sep 3 2024 12:56 PM

3 Missing As Coast Guard Chopper Makes Emergency Landing In Sea Near Gujarat

గుజరాత్‌లోని పోరుబందర్‌ తీరం వద్ద ప్రమాదం చోటుచేసుకుంది. అరేబియా సముద్రంలో ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్‌కు చెందిన అడ్వాన్స్‌డ్‌ లైట్‌ హెలికాప్టర్‌(ఏఎల్‌ హెచ్‌)  కూలిపోయింది. రెస్క్యూ ఆపరేషన్‌కు వెళ్తుండగా అత్యవసరంగా ల్యాండింగ్‌ చేస్తున్న సమయంలో సముద్రంలో హెలికాప్టర్‌ కూలడంతో.. ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్‌కు చెందిన ముగ్గురు సిబ్బంది గల్లంతయ్యారు.

గుజరాత్‌లోని పోర్‌బందర్‌ తీరం నుంచి అరేబియా సముద్రంలోకి 45 కిలోమీటర్ల దూరంలో మోటార్‌ ట్యాంకర్‌ హరిలీలాలో గాయపడిన సిబ్బందిని రక్షించడానికి సెప్టెంబర్‌ 2 రాత్రి 11 గంటలకు అధునాతన తేలికపాటి హెలికాప్టర్‌ను మోహరించినట్లు ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్‌ తెలిపింది. 

రెస్క్యూ ఆపరేషన్‌ సందర్భంగా హెలికాప్టర్‌లో సమస్య తలెత్తి సముంద్రంపై అత్యవసర హార్డ్‌ ల్యాండింగ్‌ చేయవలసి వచ్చింది. ఈ క్రమంలో అరేబియా సముద్రంలో హెలికాప్టర్‌ ప్రమాదవశాత్తు పడిపోయిందని పేర్కొంది. ఆ సమయంలో హెలికాప్టర్‌లో నలుగురు సిబ్బంది ఉండగా అప్రమత్తమైన కోస్ట్‌గార్డ్‌ దళాలు తక్షణమే సహాయక చర్యలు చేపట్టాయి.

వెంటనే ఒకరిని రక్షించగా. మిగతా ముగ్గురు అదృశ్యమయ్యారు. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నాలుగు నౌకలు, రెండు ఎయిర్‌క్రాఫ్ట్‌లతో సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు కోస్ట్‌గార్డ్‌ అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదానికి గురైన హెలికాప్టర్‌ ఇటీవల గుజరాత్‌ వర్షాల సమయంలో 67 మందిని కాపాడి సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement