porbandar coast
-
హెలికాఫ్టర్ ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం
గాంధీ నగర్ : గుజరాత్ (Gujarat)లో విషాదం చోటు చేసుకుంది. పోర్బందర్ ఎయిర్పోర్ట్ (Porbandar Airport)లో ఘోర హెలికాప్టర్ (helicopter crash porbandar) ప్రమాదం జరిగింది. కోస్ట్ గార్డ్‌కు చెందిన ఏఎల్‌హెచ్ ధృవ్ హెలికాప్టర్ టేకాఫ్ సమయంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఆ హెలికాప్టర్ భూమిని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడినట్లు సమాచారం. అయితే మరణాలకు సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.ప్రమాదం వెంటనే హెలికాప్టర్ భూమిని ఢీకొట్టిన తర్వాత మంటలు చెలరేగి, దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. ఘటనా స్థలంలో విమానాశ్రయ సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను వెంటనే సివిల్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.Helicopter of Indian Coast Guard ALH Dhruv 'crashed' in Porbandar, Gujarat during a routine training sortie.3 crew members DEAD. pic.twitter.com/vt4L025Ifl— RAMULU.B (@vedicramrekha) January 5, 2025 -
గుజరాత్ తీరంలో 700 కిలోల డ్రగ్స్ స్వాధీనం
న్యూఢిల్లీ: గుజరాత్‌లోని పోర్బందర్ తీరంలో 700 కిలోల మాదక ద్రవ్యాలను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) అధికారులు శుక్రవారం స్వా«దీనం చేసుకున్నారు. ఈ మెథాంఫెటామైన్ డ్రగ్స్ విలువ అంతర్జాతీయ మార్కెట్లో దాదాపు రూ.3,500 కోట్లు ఉంటుందని అధికారులు చెప్పారు. అలాగే 8 మంది ఇరాన్ జాతీయులను అరెస్టు చేశారు. విదేశాల నుంచి పెద్ద ఎత్తున డ్రగ్స్ వస్తున్నట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం అందడంతో ‘సాగర్ మంథన్–4’ అనే కోడ్నేమ్లో ఎన్సీబీ, భారత నావికాదళం, గుజరాత్ పోలీసు శాఖకు చెందిన యాంటీ–టెర్రరిస్టు స్క్వాడ్(ఏటీఎస్) సిబ్బంది జాయింట్ ఆపరేషన్ ప్రారంభించారు. గుజరాత్ తీరంలో భారత ప్రాదేశిక జలాల్లో ప్రవేశించిన రిజిస్టర్ కాని ఓ పడవను అడ్డుకున్నారు. అందులో తనిఖీ చేయగా 700 కిలోల డ్రగ్స్ లభించాయి. పడవలో ఉన్న 8 మంది ఇరాన్ పౌరులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద ఎలాంటి గుర్తింపు పత్రాలు లేవు. భారీ ఎత్తున డ్రగ్స్ స్వా«దీనం చేసుకున్న అధికారులను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అభినందించారు. ‘మాదక ద్రవ్యాల రహిత భారత్’ తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొంటూ ఎక్స్‌లో పోస్టు చేశారు. డ్రగ్స్ రవాణా చేసేవారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ ఏడాది ఇప్పటివరకు 3,500 కిలోల డ్రగ్స్‌ను అధికారులు స్వా«దీనం చేసుకున్నారు. మూడు కేసుల్లో 11 మంది ఇరాన్ పౌరులను, 14 మంది పాకిస్తాన్ పౌరులను అరెస్టు చేశారు. వారంతా ప్రస్తుతం ఇండియా జైళ్లలో ఉన్నారు. ఢిల్లీలో 80 కిలోల కొకైన్ స్వాధీనం దేశ రాజధాని ఢిల్లీలో రూ.900 కోట్ల విలువైన 80 కిలోల కొకైన్‌ను ఎన్సీబీ శుక్రవారం స్వా«దీనం చేసుకుంది. ఓ కొరియర్ సెంటర్లో ఆ డ్రగ్స్ లభించినట్లు అధికారులు చెప్పారు. -
అరేబియా సముద్రంలో కూలిన హెలికాప్టర్.. ముగ్గురు సిబ్బంది గల్లంతు
గుజరాత్‌లోని పోరుబందర్ తీరం వద్ద ప్రమాదం చోటుచేసుకుంది. అరేబియా సముద్రంలో ఇండియన్ కోస్ట్ గార్డ్‌కు చెందిన అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్(ఏఎల్ హెచ్) కూలిపోయింది. రెస్క్యూ ఆపరేషన్‌కు వెళ్తుండగా అత్యవసరంగా ల్యాండింగ్ చేస్తున్న సమయంలో సముద్రంలో హెలికాప్టర్ కూలడంతో.. ఇండియన్ కోస్ట్ గార్డ్‌కు చెందిన ముగ్గురు సిబ్బంది గల్లంతయ్యారు.గుజరాత్‌లోని పోర్బందర్ తీరం నుంచి అరేబియా సముద్రంలోకి 45 కిలోమీటర్ల దూరంలో మోటార్ ట్యాంకర్ హరిలీలాలో గాయపడిన సిబ్బందిని రక్షించడానికి సెప్టెంబర్ 2 రాత్రి 11 గంటలకు అధునాతన తేలికపాటి హెలికాప్టర్‌ను మోహరించినట్లు ఇండియన్ కోస్ట్ గార్డ్ తెలిపింది. రెస్క్యూ ఆపరేషన్ సందర్భంగా హెలికాప్టర్లో సమస్య తలెత్తి సముంద్రంపై అత్యవసర హార్డ్ ల్యాండింగ్ చేయవలసి వచ్చింది. ఈ క్రమంలో అరేబియా సముద్రంలో హెలికాప్టర్ ప్రమాదవశాత్తు పడిపోయిందని పేర్కొంది. ఆ సమయంలో హెలికాప్టర్లో నలుగురు సిబ్బంది ఉండగా అప్రమత్తమైన కోస్ట్‌గార్డ్ దళాలు తక్షణమే సహాయక చర్యలు చేపట్టాయి.వెంటనే ఒకరిని రక్షించగా. మిగతా ముగ్గురు అదృశ్యమయ్యారు. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నాలుగు నౌకలు, రెండు ఎయిర్‌క్రాఫ్ట్‌లతో సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు కోస్ట్‌గార్డ్ అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదానికి గురైన హెలికాప్టర్ ఇటీవల గుజరాత్ వర్షాల సమయంలో 67 మందిని కాపాడి సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు. -
రూ. 600 కోట్ల డ్రగ్స్ పట్టివేత.. 14 మంది అరెస్ట్
గుజరాత్‌లోని అరేబియా సముద్ర తీరంలో భారీస్థాయి మాదకద్రవ్యాల రాకెట్‌ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) ఛేదించింది. భారత్‌లోకి అక్రమంగా మాదకద్రవ్యాలు చేరవేయాలనుకున్న పాకిస్థానీయుల కుట్రను భగ్నం చేసింది. ఎన్సీబీ, గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్), ఇండియన్ కోస్ట్‌గార్డ్ శనివారం రాత్రి సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్‌లో రూ.600 కోట్ల విలువైన 86 కిలోల మాదకద్రవ్యాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పోరుబందర్ సమీప తీరంలోని నౌక నుంచి వాటిని సీజ్ చేసి, పాకిస్థాన్‌కు చెందిన 14 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఆపరేషన్‌లో భాగంగా పాక్ నౌకని నిలువరించేందుకు కోస్ట్‌గార్డ్ నౌకలు, విమానాలను మోహరించింది. ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న కీలక నౌకల్లో కోస్ట్ గార్డ్ షిప్ రాజ్‌రతన్‌లో ఎన్సీబీ,ఏటీఎస్ అధికారులు దాడులు చేశారు. Anti #Narco #Operations @IndiaCoastGuard Ship Rajratan with #ATS #Gujarat & #NCB @narcoticsbureau in an overnight sea - air coordinated joint ops apprehends #Pakistani boat in Arabian Sea, West of #Porbandar with 14 Pak crew & @86 Kg contraband worth approx ₹ 600Cr in… pic.twitter.com/N49LfrYLzz— Indian Coast Guard (@IndiaCoastGuard) April 28, 2024 -
అరేబియా సముద్రంలో భారత్‌కు వస్తున్న నౌకపై డ్రోన్ దాడి..
అరేబియా సముద్రం ద్వారా భారత్ వస్తున్న ఓ వాణిజ్య నౌకపై గుజరాత్ తీరంలో డ్రోన్ దాడి జరిగింది. పోరుబందర్ తీరానికి 401 కిలోమీటర్ల దూరంలో పేలుడు సంభవించింది. డ్రోన్ దాడి కారణంగా నౌకలోని రసాయన పదార్థాలున్న ట్యాంకర్ పేలి మంటలు చెలరేగాయి. అయితే ఆ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. నౌక మాత్రం స్వల్పంగా దెబ్బతింది. ప్రమాద సమయంలో 20 మంది భారతీయులు నౌకలో ఉన్నారు. ఈ విషయాన్ని బ్రిటన్ సముద్ర మారిటైమ్ ఎజెన్సీ అంబ్రే శనివారం పేర్కొంది. లైబేరియన్ జెండాతో ఉన్న ఈ నౌక.. ఇజ్రాయెల్‌కు చెందిన ఎంవీ కెమ్ ఫ్ల్యూటో అనే వాణిజ్య నౌక. ప్రమాదంపై సమాచారం అందుకున్న భారత నేవీ అధికారులు..‘ఐసీజీఎస్ విక్రమ్’ను రంగంలోకి దించి సహాయక చర్యలు చేపట్టారు. దీనికి సాయం చేసేందుకు సదరు ప్రాంతంలోని అన్ని నౌకలను విక్రమ్ అలర్ట్ చేసినట్లు నేవీ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం భారత కోస్ట్‌గార్డ్‌కు చెందిన గస్తీ నౌక ఐసీజీఎస్ విక్రమ్ ఘటనాస్థలానికి వెళ్లి వాణిజ్య నౌకలో మంటలను ఆర్పివేసింది. కాగా ఈ నౌక సౌదీ అరేబియా ఓడరేవు నుంచి క్రూడాయిల్‌తో మంగళూరుకు వైపు వెళుతోంది. అయితే.. ఆ నౌకపై డ్రోన్ దాడికి బాధ్యత వహిస్తూ ఇంతవరకూ ఎలాంటి ప్రకటనలు వెలువడలేదు. చదవండి: Temple Vandalised: భారత్ స్ట్రాంగ్ రియాక్షన్ -
ఒబామా వస్తున్నారనే కుట్ర?
కొత్త సంవత్సరం వేడుకల్లో అంతా మునిగి ఉంటారు. ఆ సమయంలో ఎవరూ పట్టించుకోరు కాబట్టి సులభంగా దేశంలో ప్రవేశించవచ్చు.. జనవరి 26వ తేదీ.. రిపబ్లిక్ డే నాడు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ముఖ్య అతిథిగా వస్తున్నారు కాబట్టి, ఆ రోజున భారతదేశంలో భారీగా ఉగ్రదాడులకు పాల్పడాలి.. స్థూలంగా ఇదీ లష్కరే తాయిబా ఉగ్రవాదుల కుట్ర. ఈ విషయం కోస్ట్ గార్డ్ సిబ్బంది, నిఘా వర్గాలు కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు అందించిన నివేదికలో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. అయితే... వాళ్ల కుట్రను ముందుగానే పసిగట్టిన భారతీయ కోస్ట గార్డ్ సిబ్బంది.. దాన్ని సమర్థంగా భగ్నం చేయగలిగారు. లష్కరే తాయిబా ఉగ్రవాదులు వేసుకొచ్చిన బోటులో భారీ మొత్తంలో పేలుడు పదార్థాలున్నట్లు ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. అందులో కనీసం నలుగురు ఉన్నారని, వాళ్లను కోస్ట్ గార్డ్ సిబ్బంది దాదాపు గంటపాటు వెంటాడటంతో.. చివరకు వాళ్లు తమను తాము పేల్చేసుకున్నారని సమాచారం. పాక్ తాలిబన్లు పెషావర్ లోని ఓ పాఠశాలలో 130 మంది పిల్లలను కాల్చి చంపిన తర్వాతే భారత నిఘా సంస్థలు మన దేశం మీద ఉగ్రదాడి జరిగే ప్రమాదం ఉందని హెచ్చరికలు పంపాయి. ప్రధానంగా రైల్వే స్టేషన్లు, పాఠశాలలు, తీరప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలన్నారు. లష్కరే తాయిబా ఉగ్రవాదుల మాటలను తాము ఇంటర్సెప్ట్ చేశామని, దాంట్లోనే ఉగ్రవాద దాడి విషయం తెలిసిందని నిఘా వర్గాలు చెప్పాయి. 26/11 దాడి వెనక కూడా లష్కర్ హస్తం ఉన్న విషయం తెలిసిందే. ఆనాటి దాడిలో 166 మంది మరణించారు. ఇక ఈసారి రిపబ్లిక్ డే వేడుకలకు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ముఖ్య అతిథిగా రానున్నారు. ఈ ఉత్సవాలకు అమెరికా అధ్యక్షుడు ఒకరు రావడం ఇదే మొదటిసారి. దాంతో.. ఇలాంటి సందర్భాన్నే తాము వాడుకోవాలని ఉగ్రవాదులు కూడా భావించినట్లు తెలిసింది. -
ఉగ్రవాద దాడియత్నం.. ఎప్పుడేం జరిగింది?
* అది డిసెంబర్ 31వ తేదీ అర్ధరాత్రి సమయం. పోర్బందర్ తీరానికి సరిగ్గా 365 కిలోమీటర్ల దూరంలో పాక్ వైపు నుంచి ఓ బోటు అనుమానాస్పదంగా రావడాన్ని కోస్ట్ గార్డ్ సిబ్బంది గమనించారు. * ఆ మత్స్యకార బోటును వెంటనే ఆపాల్సిందిగా బోటులోని వారికి కోస్ట్ గార్డ్ సిబ్బంది హెచ్చరికలు జారీచేశారు. * కానీ బోటులో ఉన్నవాళ్లు వినిపించుకోలేదు. బోటు స్పీడు పెంచి, అక్కడినుంచి పారిపోయే ప్రయత్నం చేశారు. * హెచ్చరికగా కోస్ట్ గార్డ్ సిబ్బంది కాల్పులు జరిపి..బోటు సమీపంలోకివళ్లారు. * కోస్ట్ గార్డ్ సిబ్బంది పాక్ బోటును దాదాపు గంట సేపు వెంబడించారు. * ఎట్టకేలకు బోటుకు అత్యంత సమీపంలోకి కోస్ట్ గార్డ్ సిబ్బంది వెళ్లి చూశారు. *అయితే బోటు సిబ్బంది మొత్తం డెక్ కింది భాగంలో దాక్కుని ఉన్నారు. వాళ్లను లొంగిపోవాలని హెచ్చరించగా కొద్ది సేపటికే తమను తాము పేల్చేసుకున్నారు. * ఫిషింగ్ బోటులో మొత్తం నలుగురు మాత్రమే ఉన్నారు. అయితే అందులో భారీ మొత్తంలో పేలుడు పదార్థాలు ఉన్నాయి. దాంతో భారీ ఎత్తున పేలుడు సంభవించి మంటలు చెలరేగాయి. * ఈ పేలుడు నుంచి ఎవరైనా తప్పించుకున్నారేమోనన్న అనుమానంతో కోస్ట్ గార్డ్ సిబ్బందితో పాటు నేవీ హెలికాప్టర్లు కూడా ఆ పరిసర ప్రాంతాల్లో ముమ్మరంగా గాలింపు జరిపాయి. * కరాచీ సమీపంలోని కేతిబందర్ ప్రాంతం నుంచి ఈ బోటు బయల్దేరినట్లు భారత వర్గాలు గుర్తించాయి. * ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉందని నేవీ చీఫ్ గత నెలలోనే చెప్పారు. -
గుజరాత్ తీరంలో పాక్ ఉగ్రవాదుల కలకలం
-
గుజరాత్ తీరంలో పాక్ ఉగ్రవాదుల కలకలం
గుజరాత్ తీరంలో కలకలం రేగింది. భారతదేశంపై ఉగ్రవాద దాడి చేసేందుకు పాకిస్థాన్ నుంచి కొందరు ఉగ్రవాదులు ఓ నౌకలో పోర్బందర్ తీరం గుండా మన దేశంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. అయితే.. వారి ప్రయత్నాన్ని భారత కోస్ట్ గార్డ్ బృందాలు గమనించాయి. వెంటనే వాళ్లను వెంబడించి, గంట పాటు వారిని నిలువరించారు. పట్టుకోడానికి ప్రయత్నం చేయగా, ఈలోపు నౌకలోని ఉగ్రవాదులు తమ నౌకను తామే పేల్చేసుకున్నారు. భారతదేశం మీద మరో ఉగ్రవాద దాడి జరిపేందుకు పాక్ నుంచి ఉగ్రవాదులు వచ్చినట్లు అనుమానిస్తున్నారు. గతంలో ముంబై మీద ఉగ్రదాడి చేసినప్పుడు కూడా ఇలాగే జలమార్గంలోనే ముంబైకి దూరంగా తీరంలోకి చిన్నబోటు సాయంతో ప్రవేశించారు. అయితే ఈసారి మన కోస్ట్ గార్డ్ అత్యంత అప్రమత్తంగా వ్యవహరించడంతో ఉగ్రవాదులు ఆత్మాహుతి చేసుకున్నారు. మత్స్యకారుల బోటులో వచ్చి భారత దేశంలో జనవరి ఒకటోతేదీన విధ్వంసం సృష్టించాలని లష్కరే తాయిబాకు చెందిన ఉగ్రవాదులు ప్రయత్నించారు. డిసెంబర్ 31వ తేదీ రాత్రి ఈ ఘటన జరిగింది. ముందుగా ఓ నౌకలో పోర్ బందర్ వరకు వచ్చిన ఉగ్రవాదులు... ఆ తర్వాత ఓ మత్స్యకార బోటు ద్వారా దేశంలోకి ప్రవేశించాలనుకున్నారు. అయితే.. వాళ్లు ఇంకా నౌకలో ఉండగానే అనుమానించిన కోస్ట్ గార్డ్ బృందాలు వాళ్లను వెంబడించడంతో.. భయపడి తమకు తాము పేల్చేసుకున్నారు. ఈ మేరకు కోస్ట్ గార్డ్ అందించిన రహస్య నివేదిక కేంద్ర ప్రభుత్వానికి చేరింది. పోర్బందర్కు 360 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన జరిగింది. కరాచీలోని కేతిబందర్ ప్రాంతం నుంచి ఉగ్రవాదులు ఓ నౌకలో బయల్దేరినట్లు విశ్వసనీయంగా తెలిసింది. బోటులో నలుగురు ఉన్నట్లు కోస్ట్ గార్డ్ బృందాలు గుర్తించాయి. లష్కరే తాయిబా బృందాలు దాడికి పాల్పడొచ్చని ఐబీ బృందాలు ఇటీవలే హెచ్చరించాయి. ఈ నేపథ్యంలోనే ఈ ఘటన జరగడం గమనార్హం. జనవరి 1న.. లేదా జనవరి 26న ఉగ్రవాద దాడి జరగొచ్చని ముందుగానే హెచ్చరికలు వచ్చాయి. ఇంటెలిజెన్స్ హెచ్చరికలకు తగినట్లుగానే తాజా ఘటన జరగడంతో.. రాష్ట్రాలన్నింటినీ కేంద్రం మరోసారి హెచ్చరించింది.