ఉగ్రవాద దాడియత్నం.. ఎప్పుడేం జరిగింది? | terror attack plot: some facts | Sakshi
Sakshi News home page

ఉగ్రవాద దాడియత్నం.. ఎప్పుడేం జరిగింది?

Published Fri, Jan 2 2015 5:16 PM | Last Updated on Sat, Mar 23 2019 8:04 PM

ఉగ్రవాద దాడియత్నం.. ఎప్పుడేం జరిగింది? - Sakshi

ఉగ్రవాద దాడియత్నం.. ఎప్పుడేం జరిగింది?

* అది డిసెంబర్ 31వ తేదీ అర్ధరాత్రి సమయం. పోర్బందర్ తీరానికి సరిగ్గా 365 కిలోమీటర్ల దూరంలో పాక్ వైపు నుంచి ఓ బోటు అనుమానాస్పదంగా రావడాన్ని కోస్ట్ గార్డ్ సిబ్బంది గమనించారు.
* ఆ మత్స్యకార బోటును వెంటనే ఆపాల్సిందిగా బోటులోని వారికి కోస్ట్ గార్డ్ సిబ్బంది హెచ్చరికలు జారీచేశారు.
* కానీ బోటులో ఉన్నవాళ్లు వినిపించుకోలేదు. బోటు స్పీడు పెంచి, అక్కడినుంచి పారిపోయే ప్రయత్నం చేశారు.
* హెచ్చరికగా కోస్ట్ గార్డ్ సిబ్బంది కాల్పులు జరిపి..బోటు సమీపంలోకివళ్లారు.
* కోస్ట్ గార్డ్ సిబ్బంది పాక్ బోటును దాదాపు గంట సేపు వెంబడించారు.
* ఎట్టకేలకు బోటుకు అత్యంత సమీపంలోకి కోస్ట్ గార్డ్ సిబ్బంది వెళ్లి చూశారు.
*అయితే బోటు సిబ్బంది మొత్తం డెక్ కింది భాగంలో దాక్కుని ఉన్నారు. వాళ్లను లొంగిపోవాలని హెచ్చరించగా కొద్ది సేపటికే తమను తాము పేల్చేసుకున్నారు.
* ఫిషింగ్ బోటులో మొత్తం నలుగురు మాత్రమే ఉన్నారు. అయితే అందులో భారీ మొత్తంలో పేలుడు పదార్థాలు ఉన్నాయి. దాంతో భారీ ఎత్తున పేలుడు సంభవించి మంటలు చెలరేగాయి.
* ఈ పేలుడు నుంచి ఎవరైనా తప్పించుకున్నారేమోనన్న అనుమానంతో కోస్ట్ గార్డ్ సిబ్బందితో పాటు నేవీ హెలికాప్టర్లు కూడా ఆ పరిసర ప్రాంతాల్లో ముమ్మరంగా గాలింపు జరిపాయి.
* కరాచీ సమీపంలోని కేతిబందర్ ప్రాంతం నుంచి ఈ బోటు బయల్దేరినట్లు భారత వర్గాలు గుర్తించాయి.
* ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉందని నేవీ చీఫ్ గత నెలలోనే చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement