వారు స్మగ్లర్లు కాదు.. నిషేధిత ఉగ్రవాదులు! | Pak boat men not smugglers but suspected terrorists, Parrikar | Sakshi
Sakshi News home page

వారు స్మగ్లర్లు కాదు.. నిషేధిత ఉగ్రవాదులు!

Published Mon, Jan 5 2015 11:57 AM | Last Updated on Wed, Apr 3 2019 5:24 PM

వారు స్మగ్లర్లు కాదు.. నిషేధిత ఉగ్రవాదులు! - Sakshi

వారు స్మగ్లర్లు కాదు.. నిషేధిత ఉగ్రవాదులు!

న్యూఢిల్లీ: గత రెండు రోజుల క్రితం భారత కోస్ట్ గార్డులు అడ్డుకున్న పాకిస్థాన్ బోటు కచ్చితంగా సముద్రపు స్మగ్లర్లది కాదని రక్షణ మంత్రి మనోహర్ పారికర్ స్పష్టం చేశారు. భారత్ జలాల్లోకి చొచ్చుకువచ్చిన ఆ బోటు నిషేధిత ఉగ్రవాదులవి అయ్యి ఉండవచ్చనే అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ కోణంలోనే దర్యాప్తు చేపట్టినట్లు ఆయన తెలిపారు. ఆ బోట్లు సముద్ర జలాల స్మగ్లరవి అయి ఉండవచ్చనే వార్తలను ఆయన ఖండించారు.  ఆ బోటు ఉగ్రవాదులవా? లేక నిషేధిత ఉగ్రవాదులవా? అనేది తేలాల్సి ఉందన్నారు.

 

శుక్రవారం రాత్రి పాక్ కు చెందిన ఒక బోటును భారత కోస్ట్ గార్డ్ దళాలు గమనించి చుట్టుముట్టడంతో అందులోని ఉగ్రవాదులు తమను తాము పేల్చేసుకుని.. బోటును కూడా పేల్చేసిన విషయం తెలిసిందే.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement