lashkar e taiba
-
జమ్ము కశ్మీర్ ఉగ్రదాడుల వెనుక లష్కరే తోయిబా టెర్రరిస్ట్ హస్తం!
శ్రీనగర్: జమ్ము కశ్మీర్లో ఇటీవల వరుసగా చోటుచేసుకున్న ఉగ్రదాడుల వెనక లష్కర్-ఇ-తోయిబా మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ సైఫుల్లా సాజిద్ జట్ హస్తం ఉన్నట్లు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఎజేన్సీ (ఎన్ఐఏ) వెల్లడించింది. పాకిస్తాన్‌లోని కసూర్ జిల్లాలోని శంగమంగ గ్రామానికి చెందిన సాజిద్.. లష్కర్-ఇ-తోయిబా సంస్థకు చెందిన ఉగ్రవాది. అతని తలపై రు. 10 లక్షల రివార్డు ఉన్నట్లు ఎన్ఐఏ పేర్కొంది.సైఫుల్లా సాజిద్ జట్ పాకిస్తాన్ ఇస్లామాబాద్‌లో బేస్ క్యాంపు కార్యకలాపాలను నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. భారత సంతతికి చెందిన భార్య తనతోపాటు ఉంటోంది. సాజిద్ గతంలో పాక్ ఆక్రమిత కశ్మీర్లో సాధారణ పనులు చేస్తూ ఉండేవాడు. అనంతరం అతను లష్కరే తొయిబాలో చేరి.. ప్రస్తుతం ఉగ్రవాదుల నియామకాలను నిర్వహిస్తున్నాడు. అదేవిధంగా భారత దేశ వ్యాప్తంగా ఉగ్రవాదలుకు సాయం చేస్తున్నట్లు దర్యాప్తు సంస్థలు పేర్కొంటున్నాయి.లష్కరే తొయిబాలో సాజిద్ ఆపరేషనల్ కమాండర్. దీంతో ఉగ్రవాదులు నిధులు సమకూర్చుతాడు. సాజిత్ ఎన్ఐఏ జాబితాలో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది. సాజిత్‌కు ఖాసిమ్అనే వ్యక్తి సాయం చేస్తున్నాడని దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. ఖాసిమ్ కోసం వెతుకుతున్నారు. కొన్నేళ్ల నుంచి కశ్మీర్ వ్యాలీలో జరుగుతున్న ఉగ్రదాడుల వెనక సాజిద్ హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. గత నెలలో రియాసీ జిల్లాలో యాత్రికుల బస్సుపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ దాడిలో 9 మంది మృతి చెందారు. ఈ ఘటన తర్వాత జరిగిన మరో ఉగ్రదాడిలో ఇద్దరు ఉగ్రవాదులు, ఒక సీఆర్పీఎఫ్ జవాన్ మృతిచెందాడు. గడిచిన రెండు రోజుల్లో కుల్గాం జిల్లాలో జరిగిన ఉగ్రదాడుల్లో ఐదుగురు టెర్రరిస్టులు మృతి చెందారు. -
ముంబయి 26/11 దాడులకు 15 ఏళ్లు.. ఇజ్రాయెల్ కీలక నిర్ణయం
ఢిల్లీ: ముంబయిలో 26/11 ఉగ్రదాడి జరిగి 15 ఏళ్లు గడుస్తున్న నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ దాడులకు కారణమైన లష్కర్-ఈ తోయిబాను ఉగ్రసంస్థగా గుర్తించింది. ఢిల్లీలోని ఇజ్రాయెల్ ఎంబసీ ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ రకమైన అభ్యర్థనను భారత్ కోరనప్పటికీ తాము స్వతహాగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. ముంబయిలో నవంబర్ 11, 2008న ఉగ్రవాదులు వరుసదాడులకు పాల్పడ్డారు. పదిమంది ఉగ్రవాదులు సముద్రమార్గం గుండా ముంబయిలోకి చొరబడ్డారు. ఆ తర్వాత బృందాలుగా విడిపోయి ఛత్రపతి శివాజీ మహరాజ్ టెర్మినస్ రైల్వే స్టేషన్, తాజ్ హోటల్, నారిమన్ లైట్ హౌస్ సహా ఇలా 12 చోట్ల కాల్పులకు తెగబడ్డారు. ఈ దాడుల్లో ఉగ్రవాదులతో కలిపి మొత్తం 175 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో భారతీయులతో పాటు మరో 14 దేశాలకు చెందిన పౌరులు ఉన్నారు. ఇందులో నలుగురు ఇజ్రాయెల్ దేశస్థులున్నారు. ప్రస్తుతం ఇజ్రాయెల్-హమాస్ మధ్య భీకర యుద్ధం నడుస్తోంది. అక్టోబర్ 7న హమాస్ బృందం ఇజ్రాయెల్‌లోకి చొరబడి కాల్పులకు తెగబడ్డారు. అనంతరం ఇజ్రాయెల్ యుద్ధానికి దిగింది. ఈ యుద్ధంలో ఇప్పటివరకు ఇజ్రాయెల్ వైపు 1200 మంది మరణించారు. పాలస్తీనా వైపు 12,700 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇదీ చదవండి: టీకాతో యువతలో అకాల మరణాలు ముప్పుపై.. వెలుగులోకి కీలకాంశాలు -
ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతం
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని బండిపోరా జిల్లాలో శనివారం భద్రతా దళాలతో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు గుర్తు తెలియని ఉగ్రవాదులు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఉత్తర కశ్మీర్‌లోని బండిపోరాలో సుంబ్లార్ ప్రాంతంలోని షోక్‌బాబా అడవిలో ఉగ్రవాదులు ఉన్నట్లు భద్రతా దళాలు సమాచారం అందుకున్నట్లు పోలీసు అధికారి తెలిపారు. అయితే ఉగ్రవాదుల కోసం వెతుకుతుండగా.. ఉగ్రవాదులు వారిపై కాల్పులు జరిపారు. దీంతో భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. కాగా గత వారం రోజుల్లోనే ఈ లోయలో పలు ఎన్కౌంటర్లు జరిగిగాయి. బారాముల్లాలోని సోపోర్‌లోని వార్పోరా గ్రామంలో శుక్రవారం జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు లష్కరే తోయిబా (ఎల్ఇటీ) ఉగ్రవాదులు మరణించారు. వారి నుంచి ఆయుధాలు, మందుగుండు సామగ్రి, పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు కశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు. ఇక జమ్మూ కశ్మీర్‌లోని షోపియన్‌లో భద్రతా దళాలతో జరిగిన ఎన్కౌంటర్లో సోమవారం లష్కరే తోయిబా ఉగ్రవాది, మరో గెరిల్లా మృతి చెందారు. -
జమ్మూకశ్మీర్‌లో నలుగురు ఉగ్రవాదులు హతం
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో రెండు వేర్వేరు ఎన్కౌంటర్లలో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. వీరిలో ముగ్గురు నిషేధిత లష్కరే తోయిబా(ఎల్ఈటీ)కి చెందినవారు. అధికారుల సమాచారం ప్రకారం.. హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ బుర్హాన్ వనీ ఐదో వర్థంతి సందర్భంగా జమ్మూకశ్మీర్‌లో పలు ప్రాంతాల్లో జనం బంద్ పాటించారు. ఈ నేపథ్యంలో పుల్వామా జిల్లాలోని పుచాల్ ప్రాంతంలో ముష్కరుల కదలికలపై సమాచారం అందుకున్న భద్రతా సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. వీరి రాకను గమనించిన ముష్కరులు వెంటనే కాల్పులు ప్రారంభించారు. ఆత్మరక్షణ కోసం భద్రతా సిబ్బంది సైతం ఎదురు కాల్పులు జరిపాల్సి వచ్చింది. కొంతసేపటి తర్వాత ఉగ్రవాదుల వైపునుంచి కాల్పులు ఆగిపోయాయి. ఘటనా స్థలానికి వెళ్లి చూడగా, రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతులు లష్కరే తోయిబాకు చెందిన కిఫాయత్ రంజాన్ సోఫీ, అల్ బదర్ ఉగ్రవాద సంస్థకు చెందిన ఇనాయత్ అహ్మద్ దార్గా గుర్తించారు. ఇక కుల్గామ్ జిల్లాలో జాతీయ రహదారిపై ఉగ్రవాదులు ప్రయాణిస్తున్నారన్న సమాచారంతో అధికారులు చెక్‌పోస్టు ఏర్పాటు చేశారు. వాహనాల తనిఖీ చేపట్టారు. అనుమానాస్పదంగా కనిపించిన ఓ వాహనాన్ని ఆపగా, అందులోని ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. భద్రతా సిబ్బంది సైతం ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఉద్దరు ఉగ్రవాదులు మరణించారు. మృతులు లష్కరే తోయిబాకు చెందిన నాసిర్ అహ్మద్ పండిత్, షాబాజ్ అహ్మద్ షాగా గుర్తించారు. జమ్మూకశ్మీర్‌లో ఇద్దరు జవాన్ల వీరమరణం జమ్మూ: పాకిస్తాన్ ఉగ్రవాదుల చొరబాటు యత్నాన్ని భారత భద్రతా సిబ్బంది విజయవంతంగా తిప్పికొట్టారు. కశ్మీర్లో రాజౌరీ జిల్లా సుందర్బనీ ప్రాంతంలో ఉన్న దాదల్ అటవీ ప్రాంతంలో నియంత్రణ రేఖ(ఎల్ఓసీ) వద్ద భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించేందుకు పాకిస్తాన్ ముష్కరులు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం అందడంతో గురువారం భద్రతా సిబ్బంది రంగంలోకి దిగారు. వారిపై చొరబాటుదారులు కాల్పులు జరిపారు. సైన్యం దీటుగా బదులిచ్చింది. ఈ ఘటనలో ఇద్దరు పాకిస్తాన్ ఉగ్రవాదులు హతమయ్యారు. అయితే భారత సైన్యానికి జవాన్లు శ్రీజిత్.ఎం, మరుప్రోలు జశ్వంత్‌రెడ్డి వీరమరణం పొందారని సైనిక ఉన్నతాధికారులు ప్రకటించారు. -
కసబ్‌ను గుర్తుపట్టిన ఆ ‘హీరో’ ఫుట్‌పాత్‌పై..
ముంబై: భారత్‌పై విద్వేషం పెంచుకున్న లష్కరే తొయిబా ఉగ్రవాదులు ముంబైలో సృష్టించిన ఉగ్రదాడులు దాదాపు అందరికీ గుర్తుండే ఉంటాయి. 2008లో నవంబర్ 26న 10 మంది దేశ వాణిజ్య రాజధానిలో చొరబడి కాల్పులకు తెగబడిన ఘటనలో దాదాపు 166 మంది చనిపోయారు. ఈ మారణకాండకు కారణమైన ఉగ్రవాదుల్లో ప్రాణాలతో పట్టుబడింది కసబ్ మాత్రమే. 26/11 ముంబై దాడుల్లో కీలకమైన కసబ్‌ను గుర్తుపట్టి.. ఆ కేసులో సాక్షిగా ఉన్న హరిశ్చంద్ర శ్రీవార్ధంకర్ ప్రస్తుతం దయనీయ పరిస్థితుల్లో ఉన్నారు. అరవై ఏళ్ల వయస్సులో ముంబైలోని ఫుట్‌పాత్‌పై అచేతనంగా పడి ఉన్న ఆయనను డీన్ డిసౌజా అనే ఓ షాపు ఓనర్ చేరదీసి.. స్వచ్చంద సంస్థకు అప్పగించారు. కసబ్, అబూ ఇస్మాయిల్ కామా ఆస్పత్రి వద్ద జరిపిన కాల్పుల్లో బులెట్ దెబ్బతిన్న హరిశ్చంద్రను ఇంటికి తీసుకువెళ్లడానికి.. అతడి కుటుంబం ఇష్టపడటం లేదని.. అందుకే ఆయనను ఆశ్రమానికి తరలిస్తున్నట్లు పేర్కొన్నారు. (దేశవ్యాప్తంగా ఇంటింటి సర్వే) ఈ విషయం గురించి డిసౌజా స్నేహితుడు, ఐఎంకేర్స్ అనే ఎన్జీవో నడుపుతున్న గైక్వాడ్ మాట్లాడుతూ.. ‘‘శ్రీవార్ధంకర్ మేము ఇచ్చిన ఆహారం తినడం లేదు. ఆయనకు స్నానం చేయించి.. జుట్టు కత్తిరించాం. తనలో తానే మాట్లాడుకుంటున్నారు. ఆయన మాటల్లో హరిశ్చంద్ర, బీఎంసీ, మహాలక్ష్మి అనే పదాల ఆధారంగా బీఎంసీ కాలనీకి వెళ్లి ఆరా తీయగా... శ్రీవార్ధంకర్ సోదరుడు ఆయనకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ముంబై దాడుల ఘటనలో కీలక సాక్షిగా ఉన్నారని చెప్పారు. ఆయన కుటుంబ సభ్యులు కళ్యాణ్‌లో ఉన్నట్లు తెలిపారు. (ఆ షరతుకు ఒప్పుకుంటేనే తరలిస్తాం!) ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకువెళ్లాం. లాక్డౌన్ అమల్లో ఉన్న నేపథ్యంలో శ్రీవార్ధంకర్ కొడుకుకు ప్రత్యేక పాస్ జారీ చేసి ఆయనను తీసుకువెళ్లేందుకు అవకాశం కల్పించారు. అయితే శ్రీవార్ధంకర్‌ను మాతో పాటే ఉండనివ్వమని ఆయన కుటుంబ సభ్యులు కోరారు. ఉగ్రవాదికి శిక్ష పడటంలో కీలకంగా వ్యవహరించిన హీరో శ్రీవార్ధంకర్‌ను సాయం చేసేందుకు ముందుకు రావాల్సిన ఆవశ్యకత ఉంది. ఆయన సరిగ్గా మాట్లాడలేకపోతున్నారు. తలపై గాయం కూడా ఉంది. ఆయనకు చికిత్స చేసేందుకు సహకరించండి’’ అని విజ్ఞప్తి చేశారు. కాగా నవంబర్ 21, 2012న కసబ్‌ను పుణెలోని ఎరవాడ సెంట్రల్ జైళ్లో ఉరి తీసిన విషయం తెలిసిందే. -
గతంలో కూడా అరెస్టయ్యాడు కదా: అమెరికా
వాషింగ్టన్ : ఉగ్రవాది హఫీజ్ సయీద్ విషయంలో పాక్ ఏ మేరకు కఠినంగా వ్యవహరిస్తుందో ఇకపై చూడాల్సి ఉందని వైట్‌హౌజ్ అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. ముంబై పేలుళ్లు, భారత పార్లమెంట్‌పై దాడి సూత్రధారి, జమాత్ ఉద్దౌలా (జేయూడీ) హఫీజ్ సయీద్‌ను పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌కు చెందిన కౌంటర్ టెర్రరిజం డిపార్ట్మెంట్ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తొలిసారి అమెరికా పర్యటనకు వెళ్లనున్న నేపథ్యంలో హఫీజ్ అరెస్ట్ ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ నేపథ్యంలో ట్రంప్ పరిపాలనా అధికారి మాట్లాడుతూ.. ‘గతంలో ఏం జరిగిందో మనకు తెలుసు. మిలిటరీ గ్రూపులకు పాకిస్తాన్ సైన్యం సహాయం చేస్తుందన్న విషయం బహిరంగ రహస్యమే. ఉగ్రవాదాన్ని అంతం చేసే క్రమంలో ఉగ్ర సంస్థల ఆస్తులు సీజ్ చేసే దిశగా ముందుకు సాగుతున్నామంటూ ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చెప్పడం హర్షించదగ్గ విషయం. అయితే ఇప్పుడు హషీజ్ సయీద్ విషయంలో పాక్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. ఎందుకంటే గతంలో అతడు ఏడుసార్లు అరెస్టయ్యాడు. కానీ వెంటనే విడుదలయ్యాడు కూడా. అందుకే అతడి అరెస్టు లష్కర్-ఎ-తొయిబా కార్యకలాపాలను ఏ మేరకు ప్రభావితం చేస్తుందనేది మన ముందున్న ప్రశ్న. తూతూ మంత్రంగా కాకుండా పాక్ నిజంగా ఉగ్రవాదాన్ని రూపుమాపాలని భావిస్తే ఆ దేశంలో శాంతి, సుస్థిరత నెలకొంటాయి’ అని పేర్కొన్నారు. కాగా అంతర్జాతీయ ఉగ్రవాది అయిన హఫీజ్.. ఉగ్రకార్యకలాపాలకు ఆర్థిక సహాయం అందిస్తున్నాడన్న కేసులో ముందస్తు బెయిల్ పొందేందుకు గుజ్రన్‌వాలా ప్రాంతం నుంచి లాహోర్‌కు వెళ్తుండగా అదుపులోకి తీసుకున్నారు. ఇక హఫీజ్‌పై అమెరికా ఇప్పటికే దాదాపు రూ.68 కోట్ల రివార్డు ప్రకటించింది. హఫీజ్‌ను ఉగ్రకార్యకలాపాల వ్యతిరేక కోర్టు ముందు హాజరుపర్చగా ఏడు రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. ఆ తర్వాత కోట్ లక్పత్ జైలుకు తరలించారు. ఇక జేయూడీకి చెందిన 13 మంది అగ్రనేతలపై పంజాబ్ ప్రావిన్స్‌లోని పలు ప్రాంతాల్లో జూలై 3న దాదాపు 23 కేసులు నమోదయ్యాయి. -
బాలాకోట్ నుంచి బిచాణా ఎత్తేశారు!
న్యూఢిల్లీ: పాకిస్తాన్లో ఉగ్రవాద సంస్థలు ప్రస్తుతం అఫ్గానిస్తాన్ సరిహద్దుల్లోకి మకాం మార్చాయి. పాక్‌లోని బాలాకోట్ ఉగ్ర శిక్షణ శిబిరంపై ఫిబ్రవరిలో భారత వైమానిక దళం దాడులు జరిపిన విషయం తెలిసిందే. ఈ దాడుల అనంతరం ఉగ్రసంస్థలు తమ మకాంను అఫ్గానిస్తాన్‌లోకి మార్చేశాయి. జైషే మొహమ్మద్, లష్కరే తోయిబా సంస్థలు కునార్, నంగర్హార్, నూరిస్తాన్, కాందహార్‌లలో శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేశాయి. దీంతో భారత నిఘా వర్గాలు కాబూల్, కాందహార్‌లలో ఉన్న దౌత్య కార్యాలయాలను అప్రమత్తం చేశాయి. అఫ్గాన్ తాలిబన్, హక్కానీ నెట్‌వర్క్‌తో చేతులు కలిపిన జైషే మొహమ్మద్, లష్కరే తోయిబాలు పాక్–అఫ్గాన్ సరిహద్దు డ్యూరాండ్ రేఖ వెంబడి శిక్షణ శిబిరాలను నెలకొల్పి, ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తున్నట్లు సమాచారం. ఫిబ్రవరి 14వ తేదీన కశ్మీర్‌లోని పుల్వామాలో జైషే మొహమ్మద్ ఉగ్రవాది ఆత్మాహుతి దాడికి ప్రతీకారంగా అదే నెలలో భారత వైమానిక దళం బాలాకోట్‌పై బాంబు దాడులు జరిపింది. అంతర్జాతీయ ఒత్తిడులకు లొంగిన పాక్ ప్రభుత్వం ఈ నెల మొదటి వారంలో లష్కరే తోయిబాకు చెందిన 15 మంది నేతలను అదుపులోకి తీసుకుంది. అయితే, ఇవన్నీ కంటి తుడుపు చర్యలేనని భారత్ అంటోంది. నిర్దిష్టమైన చర్యలతో ఉగ్రమూకలను కట్టడి చేయాలని కోరుతోంది. మరోవైపు, పాక్ ఉగ్ర సంస్థలకు దన్నుగా ఉంటోందంటూ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్(ఎఫ్ఏటీఎఫ్) సంస్థ ఆర్థిక సాయం నిలిపివేసింది. దీంతో ఆర్థికంగా కుంగిపోయిన పాక్‌పై ఒత్తిడి తీవ్రమైంది. ఈ నేపథ్యంలోనే ఉగ్ర సంస్థలు పాక్ నుంచి తమ మకాంను అఫ్గానిస్తాన్‌కు మార్చాయని భారత్ నిఘా వర్గాలు అంటున్నాయి. అయితే, ఈ పరిణామంతో అఫ్గాన్ రాజధాని కాబూల్‌తోపాటు కాందహార్‌లో ఉన్న భారత దౌత్య కార్యాలయాలకు ఉగ్ర ముప్పు పెరిగిందని హెచ్చరిస్తున్నాయి. జైషే మొహమ్మద్ ఉగ్రవాదులతోపాటు, పేలుడు పదార్థాలు అమర్చిన వాహనాలతో కాబూల్ ఎంబసీపై కారివరి గుల్ అనే ఉగ్ర సంస్థ దాడులకు దిగే ప్రమాదముందని అనుమానిస్తున్నాయి. కాందహార్‌లోని ఇండియస్ ఎంబసీపై తాలిబన్లు కూడా దాడులకు పాల్పడే ప్రమాదముందని అంటున్నాయి. తాలిబన్, హక్కానీ నెట్‌వర్క్‌లు జైషే మొహమ్మద్ అధిపతి మసూద్ అజార్‌కు ఆశ్రయం కల్పించేందుకు ఫిబ్రవరిలో ముందుకు వచ్చినా పాక్‌లోని భావల్పూర్లో సైనిక రక్షణ మధ్య ఉండటమే శ్రేయస్కరమని అతడు ఆ ఆఫర్‌ను తిరస్కరించాడు. అంతేకాకుండా, కాబూల్, కాందహార్ల్లో ఉన్న భారత కార్యాలయాలపై ఈ ఉగ్ర సంస్థలు నిఘా వేసి ఉంచాయి. జనవరిలో సెదిక్ అక్బర్, అతావుల్లా అనే ఇద్దరు ఉగ్రవాదులను అఫ్గాన్ బలగాలు అదుపులోకి తీసుకుని, విచారించగా ఈ విషయాలన్నీ బయటకు వచ్చాయి. అమెరికా బలగాలకు ముప్పు లష్కరే తోయిబా కూడా తన అనుచరులను నంగర్హార్, నూరిస్తాన్, కునార్, హెల్మండ్, కాందహార్ ప్రావిన్సుల్లోని శిక్షణ శిబిరాలకు తరలించింది. పెషావర్‌లో ఉన్న సభ్యుల మకాంను కాబూల్‌కు మార్చింది. తాలిబన్ సాయంతో విధ్వంసక, విద్రోహ చర్యలపై శిక్షణ ఇస్తోంది. మరోవైపు, అఫ్గానిస్తాన్‌లో ఉన్న 300 మంది జైషే మొహమ్మద్ ఉగ్రవాదులతో అమెరికా, సంకీర్ణ బలగాలకు ముప్పు ఉననట్లు అమెరికా రక్షణ శాఖ పెంటగాన్ కూడా తన నివేదికలో పేర్కొంది. తాలిబన్, ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఖైబర్–పక్తున్వా మధ్య రాజీ కుదర్చడంలో జైషే మొహమ్మద్ పాత్ర ఉందని తెలిపింది. -
నలుగురు ఉగ్రవాదుల ఎన్కౌంటర్
శ్రీనగర్: లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్ గ్రూపునకు చెందిన నలుగురు ఉగ్రవాదులను జవాన్లు మట్టుబెట్టారు. సోమవారం కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో ఈ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు ఆర్మీ జవాన్లతోపాటు ఒక పోలీసు గాయపడ్డారు. పుల్వామా జిల్లాలోని లస్సిపోరాలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారం మేరకు సోమవారం ఆర్మీ గాలింపు చేపట్టింది. జవాన్లను చూడగానే ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. వెంటనే ఆర్మీ జరిపిన ఎదురుకాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు మరణించారు. కాగా, కశ్మీర్‌లోని పూంచ్ లో నియంత్రణ రేఖ వెంబడి సోమవారం పాక్ జరిపిన కాల్పుల్లో ఒక బీఎస్ఎఫ్ అధికారి, మరో ఐదేళ్ల బాలిక మరణించారు. ఈ ఘటనలో ఆరుగురు జవాన్లుసహా 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. షాపుర్ సబ్ సెక్టార్లో ఓ ఇంటి వద్ద బాంబు పేలడంతో సోబియా అనే ఐదేళ్ల బాలిక ప్రాణాలు కోల్పోయింది. -
లష్కరే కమాండర్ నవీద్ జఠ్ హతం
శ్రీనగర్: కశ్మీర్ లోయలో భద్రతా సిబ్బంది, పౌరులపై పలు అమానుష దాడులకు పాల్పడిన లష్కరే తోయిబా కమాండర్ నవీద్ జఠ్ (22) హతమయ్యాడు. కశ్మీరీ సీనియర్ పాత్రికేయుడు షుజాత్ బుఖారీ హత్య కేసులో అతడే ప్రధాన నిందితుడు. కశ్మీర్ బుద్గాం జిల్లాలోని ఓ గ్రామంలో బుధవారం జరిగిన ఎన్కౌంటర్లో జఠ్తో పాటు అతని సహచరుడుని భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. ఎదురు కాల్పుల్లో ముగ్గురు ముగ్గురు ఆర్మీ సిబ్బంది గాయపడ్డారు. గతంలో జఠ్ ఆరు సార్లు పోలీసులకు చిక్కినట్లే చిక్కి తప్పించుకున్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో చికిత్స కోసం ఆసుపత్రికి తరలించగా అతడు పోలీసు కస్టడీ నుంచే నాటకీయ పరిణామాల నడుమ పారిపోవడం సంచలనం సృష్టించింది. జఠ్ పాకిస్తానీయుడని, విధానపర లాంఛనాల ప్రకారం అతని మృతదేహాన్ని పాకిస్తాన్‌కు అప్పగిస్తామని జమ్మూ కశ్మీర్ డీజీపీ దిల్బాగ్ సింగ్ చెప్పారు. ఎన్కౌంటర్ జరిగిందిలా.. మిలిటెంట్లు సంచరిస్తున్నారన్న సమాచారంతో బుద్గాంలోని కుత్పోరా చాతర్ గామ్ అనే ప్రాంతంలో బుధవారం వేకువ జామునే భద్రతా సిబ్బంది తనిఖీల్ని ముమ్మరం చేశారు. జమ్మూ కశ్మీర్ పోలీస్ స్పెషల్ ఆపరేషన్స్ బృందం, ఆర్మీ సంయుక్తంగా ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి. ఓ ఇంట్లో దాక్కున్న ఉగ్రవాదులు తొలుత భద్రతా సిబ్బందిపైకి కాల్పులకు పాల్పడ్డారు. దీంతో బలగాలు ఎదురు కాల్పులు జరిపాయి. ఈ క్రమంలో ముగ్గురు జవాన్లకు స్వల్ప గాయాలయ్యాయి. సూర్యోదయం అయ్యాక ఇద్దరు మిలిటెం ట్లను భద్రతా సిబ్బంది అంతమొందించారు. మృతుల్లో ఒకరిని నిషేధిత ఎల్ఈటీ కమాండర్ నవీద్ జఠ్గా గుర్తించారు. కసబ్‌కు సహాధ్యాయి.. పాక్‌లోని ముల్తాన్‌లో జన్మించిన నవీద్ జఠ్.. 26/11 ముంబై దాడిలో సజీవంగా చిక్కిన అజ్మల్ కసబ్‌కు మదరసాలో సహాధ్యాయి. వీరిద్దరు అక్కడే ఆయుధాల వాడకంలో శిక్షణ పొందారు. సముద్ర మార్గంలో వినియోగించే దిక్సూచి కంపాస్, జీపీఎస్, వైర్లెస్ సెట్లు, స్కైప్ సాఫ్ట్‌వేర్‌తో కూడిన మొబైల్ ఫోన్లను ఆపరేట్ చేయడంలో జఠ్ నైపుణ్యం సంపాదించాడు. 2012, అక్టోబర్‌లో జఠ్ తన సహచరులతో కలసి కశ్మీర్ లోయలోకి చొరబడినట్లు పోలీసు రికార్డులు చెబుతున్నాయి. లోయలో ఎన్నో ఉగ్రదాడులు, బ్యాంకు దొంగతనాల్లో అతని పాత్ర ఉందని భావిస్తున్నారు. -
ఆమెకు ఉగ్ర సంస్థలతో సంబంధాలు ఉన్నాయి!
సాక్షి, న్యూఢిల్లీ : లష్కర్-ఎ-తొయిబా చీఫ్ హఫీజ్ సయీద్‌తో సంబంధాలు కలిగి ఉన్న కశ్మీరి వేర్పాటు వాది ఆసియా ఆండ్రాబీని విచారిస్తున్న జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అధికారులు పలు కీలక విషయాలు వెల్లడించారు. ఆసియాకు పలు ఉగ్ర సంస్థలతో సంబంధాలు ఉన్న విషయాన్ని నిరూపించేందుకు తగిన ఆధారాలు సమీకరించినట్లు పేర్కొన్నారు. లండన్ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ ఓ ఆలయాన్ని ప్రారంభించిన సమయంలో.. లష్కర్- ఎ- తొయిబాతో సహా పలు ఉగ్రవాద సంస్థలకు ఆసియా ఆడియో మెసేజ్‌ల ద్వారా సమాచారాన్ని చేరవేసినట్లు తెలిపారు. మోదీ పర్యటనలో ఉన్న సమయంలో భారత్‌పై దాడి చేసేందుకు ప్రపంచం నలుమూలలా ఉన్న ఉగ్రవాదులు ఏవిధంగా ప్రణాళికలు రచించారో తమ విచారణలో వెల్లడైనట్లు పేర్కొన్నారు. ఆసియా ఆండ్రాబీ నేపథ్యం.. కశ్మీర్లో ప్రముఖ వేర్పాటు వాదిగా గుర్తింపు పొందిన 56 ఏళ్ల ఆసియా ఆండ్రాబీ 2016లో ఉగ్రవాది బుర్హాన్ వనీ మరణానికి వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించి వెలుగులోకి వచ్చారు. బుర్హాన్ ఎన్‌కౌంటర్‌ను వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమాల్ని నిర్వహించిన ఆసియా విద్యార్థులను రెచ్చగొట్టి అల్లర్లకు కారణమయ్యారు. దుఖ్తరన్-ఈ-మిలాత్ అనే సంస్థను నెలకొల్పి.. భారత్‌పై ద్వేష భావంతో రగిలిపోయే విద్యార్థినులను తన సంస్థలోకి ఆహ్వానించేవారు. కాగా ఈ సంస్థపై ప్రభుత్వం నిషేధం విధించింది. పాకిస్తాన్ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని పాక్ జెండాలు ఎగరవేసినందుకు ఆసియా పలుమార్లు అరెస్టయ్యారు. ఆమెకు ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిలో ఒకరు మెల్బోర్న్లో ఎంటెక్ చేస్తుండగా, మరొకరు మలేషియా ఇస్లామిక్ యూనివర్సిటీలో ఉన్నత విద్యనభ్యసిస్తున్నారు. అయితే వీరికి కూడా ఉగ్ర సంస్థలతో సంబంధాలు ఉన్నాయా అన్న కోణంలో విచారణ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. కాగా లష్కర్-ఎ-తొయిబా చీఫ్ హఫీజ్ సయీద్‌తో సంబంధాలు కలిగి ఉందని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆసియాను శ్రీనగర్ జైలు నుంచి ఢిల్లీకి తరలించిన విషయం తెలిసిందే. పలు సామాజిక మాధ్యమాల ద్వారా ద్వేషపూరిత భావాల్ని రెచ్చగొడుతూ శాంతి భద్రతలకు, సౌభ్రాతృత్వానికి భంగం కలిగిస్తున్న కారణంగా ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. పాక్‌లోని అనేక ఉగ్ర సంస్థలతో సోషల్ మీడియాలో కాంటాక్ట్‌లో ఉన్న ఆసియా.. అఖండ పాకిస్తాన్ స్థాపన కోసం ప్రచారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. -
బుఖారీ హంతకుల్లో పాకిస్తానీ..!
శ్రీనగర్: కశ్మీర్లో శాంతి స్థాపన కోసం కృషి చేసిన ‘రైజింగ్ కశ్మీర్’ పత్రికాధిపతి, సీనియర్ జర్నలిస్టు షుజాత్ బుఖారీని కాల్చిచంపిన కేసులో కీలక మలుపు. బుఖారీపై కాల్పులు జరిపిన దుండగులను గుర్తించినట్లు పోలీసు వర్గాలు బుధవారం వెల్లడించాయి. నిందితుల్లో ఒకరు పాకిస్తాన్‌కు జావేద్ జట్గా గుర్తించామని డీఐజీ నేతృత్వంలోని ప్రత్యేక దరాప్తు బృందం తెలిపింది. జావేద్‌ను ఉగ్రవాద సంస్థ లష్కరే తొయిబాలో సభ్యుడిగా అనుమానిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులని గుర్తించామని దర్యాప్తు బృందం పేర్కొంది. కాగా, జావేద్ గతంలో పోలీసు కస్టడీ నుంచి తప్పించుకున్నాడని బృందం తెలిపింది. మరోవైపు గతంలో బుఖారిపై బ్లాగులో అనుచిత వ్యాఖ్యలు చేసిన ఓ పాకిస్తానీని కూడా గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు. జూన్ 14న ఇఫ్తార్ విందులో పాల్గొనడానికి కారులో వెళ్తున్న బుఖారీపై బైక్‌పై వచ్చిన ముగ్గురు దుండగులు కాల్పులు జరిపి పొట్టనబెట్టుకున్నారు. ఘటనలో బుఖారీ ఇద్దరు సెక్యూరిటీ సిబ్బంది కూడా ప్రాణాలు కోల్పోయారు. 15 ఏళ్లపాటు హిందూ పత్రికలో పనిచేసిన బుఖారీ, తర్వాత రైజింగ్ కశ్మీర్ పత్రికను నెలకొల్పారు. -
‘కాంగ్రెస్ ఉద్దేశమేమిటో అర్థం కావడం లేదు’
సాక్షి, న్యూఢిల్లీ : కశ్మీర్లో సైనిక, పారా మిలటరీ దళాలు ఉగ్రవాదుల కంటే అమాయక ప్రజలనే ఎక్కువగా చంపుతున్నాయంటూ కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ చేసిన వ్యాఖ్యలను కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ తప్పుపట్టారు. శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ వ్యాఖ్యలను లష్కర్-ఎ-తోయిబా వంటి ఉగ్రవాద సంస్థలు సమర్థించడం సిగ్గుచేటన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం జాతిని విడదీయాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. తారిఖ్ హమీద్ వంటి పాకిస్తానీ వకాల్తాదార్లను పార్టీలోకి ఆహ్వానించడంలో కాంగ్రెస్ పార్టీ ఉద్దేశమేమిటో అర్థం కావడం లేదని వాఖ్యానించారు. కాగా, కాంగ్రెస్ పార్టీ తారిఖ్ హమీద్‌ను చేర్చుకోవడాన్ని ప్రస్తావిస్తూ.. ‘ఆజాద్, సోజ్‌లతో పాటు ప్రస్తుతం మరో పాకిస్తానీ ప్రతినిధి(వకాల్తాదారు) హమీద్‌కు కాంగ్రెస్ పార్టీలో సరైన స్థానం లభించింది. పాకిస్తానీ భాష మాట్లాడే మిస్టర్ హమీద్ కర్రా.. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, సోనియా గాంధీల సమక్షంలో ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరారంటూ’ బీజేపీ ట్వీట్ చేసింది. Azad and Soz are not exceptions, another Pakistan proxy finds his rightful place in the Congress party! Mr Tariq Hameed Karra, who is known for speaking the language of Pakistan, recently joined the Congress in the presence of Smt. Sonia and Rahul Gandhi. #CongLeTGathbandhan pic.twitter.com/sMVu3bbmXN — BJP (@BJP4India) June 22, 2018 -
కశ్మీర్‌పై సంచలన ప్రకటన
శ్రీనగర్: జమ్ము కశ్మీర్‌పై ఉగ్రసంస్థ లష్కరే తాయిబా సంచలన ప్రకటన చేసింది. కశ్మీర్లో గవర్నర్ పాలనను వ్యతిరేకిస్తూ గురువారం ఓ స్టేట్మెంట్ విడుదల చేసింది. ప్రస్తుత పరిస్థితుల మూలంగా కశ్మీర్లో నరమేధం జరిగే అవకాశం ఉందని అభిప్రాయడింది. లష్కరే చీఫ్ మహ్మద్ షా పేరిట గురువారం ఓ మెయిల్ భారత మీడియా ఛానెళ్లకు చేరింది. (ముష్కరుల ఏరివేత కోసం...) ఇది నరమేధమే... ‘మాజీ ముఖ్యమంత్రి గులాం నబీ అజాద్ సహా మిగతా నేతలు అభిప్రాయాలతో మేం ఏకీభవిస్తున్నాం. ఇకపై అమాయకులైన కశ్మీరీలు పెద్ద సంఖ్యలో మరణిస్తారు. వారిని ఊచకోత కోసేందుకే గవర్నర్ పాలన విధించారు. మళ్లీ జగ్మోహన్ (1990లో కశ్మీర్ మాజీ గవర్నర్) రోజులను గుర్తుకు తెస్తున్నారు. బీజేపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున సైనిక చర్య దిగుతోంది. ఆపరేషన్ ఆల్అవుట్ పేరిట కశ్మీరీలను చంపడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. 8 లక్షల మంది సైనికులు జమ్ములో అరాచకాలకు పాల్పడుతున్నారు. కశ్మీర్ లోయలో ప్రజలు బానిసలుగా బతుకుతున్నారు. జర్నలిస్ట్ బుఖారీ భారత దళాల ప్రధాన అజెండాలను బయటపెట్టేందుకు యత్నించారు. ఆరెస్సెస్ ఎజెండాను తీసికెళ్లడంలో పీడీపీ నేత మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ తన వంతు ప్రయత్నం చేశారు. కశ్మీర్‌పై ఐరాస మానవహక్కుల సంఘం ఇచ్చిన నివేదిక ప్రత్యేకం, ఆలస్యమైన ఐరాస అసలు విషయాన్ని గమనించింది. అయితే అక్కడి దుస్థితిని వివరించేందుకు ఈ ఒక్క నివేదిక సరిపోదు’’అని మీడియా సంస్థలకు పంపిన ఈమెయిల్లో దుయ్యబట్టారు. ఈ పరిణామం రాజకీయంగా వివాదాన్ని రేపుతోంది. కాంగ్రెస్‌కు లష్కరే లాంటి ఉగ్రవాదసంస్థలు కొమ్ముకాస్తున్నాయని బీజేపీ ధ్వజమెత్తింది. ఆజాద్ ఏమన్నారంటే... ‘ఉద్ధృతమైన మిలటరీ ఆపరేషన్ అంటే అమాయకుల ఊచకోతే. ఎందుకంటే ఉగ్రవాదుల కంటే ప్రజలనే ఎక్కువ సంఖ్యలో సైనిక, పారా మిలటరీ దళాలు చంపుతున్నాయి. సగటున నలుగురు టెర్రరిస్టులకు 20 మంది ప్రజలను హతమారుస్తున్నారు. పుల్వామాలో ఒక్క ఉగ్రవాదిని చంపడానికి 13 మంది ప్రజలను పొట్టనపెట్టుకున్నారు. ఆర్మీ బలగాల చర్యలు సామాన్యుల పాలిటే వ్యతిరేకంగా ఉన్నాయి. ‘ఆలౌట్ ఆపరేషన్’ అంటూ బీజేపీ ఉపయోగిస్తున్న భాష నరమేధం దిశగా ఆ పార్టీ నేతల ప్రణాళికను సూచిస్తోంది. ’’ అని వ్యాఖ్యానించి గులాంనబీ అజాద్ దుమారం రేపారు. -
కలకలం రేపుతున్న ఉగ్రవాది వీడియో
-
కలకలం రేపుతున్న ఉగ్రవాది వీడియో
సాక్షి, న్యూఢిల్లీ : కొత్తగా బయటకు వచ్చిన కరడుగట్టిన ఉగ్రవాది వీడియో ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. గత నెలలో శ్రీనగర్ ఆస్పత్రి నుంచి తప్పించుకుపోయిన పాకిస్థాన్ ఉగ్రవాది నవీద్ జట్ తాజగా ఆ వీడియోలో కనిపించాడు. అది కూడా జమ్ముకశ్మీర్‌లో ప్రభావం ఉన్న ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ సమీర్ టైగర్ మరో ఐదుగురితో కలిసి ఉండి. దీని ప్రకారం పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థలతో కలిసి హిజ్బుల్ ముజాహిదీన్ కలిసి పనిచేస్తుందని మరోసారి స్పష్టమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆ వీడియో దక్షిణ కశ్మీర్‌లోని ఏదో ఒక ప్రాంతంలో ఆ వీడియోను తీసి ఉంటారు. నవీద్ తప్పించుకున్న ఘటనపై పోలీసులు విచారించగా అతడిని తప్పించేందుకు గత నాలుగు నెలల కిందటే ప్రణాళికలు సిద్ధం చేసి ఉగ్రవాదులు అమలు చేసినట్లు, దానికి హిజ్బుల్ ముజాహిదీన్ సాయం చేసినట్లు గుర్తించారు. తాజాగా వెలుగులోకి వచ్చిన వీడియోలో మొత్తం ఐదు నుంచి ఆరు మంది ఉన్నారు. వారందరి చేతుల్లో కూడా ఆయుధాలు ఉన్నాయి. నవీద్ లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన ఉగ్రవాది. -
హఫీజ్‌కు చుక్కెదురు!
ఇస్లామాబాద్ : ముంబైదాడుల సూత్రధారి హఫీజ్ సయీద్‌కు పాకిస్తాన్ ప్రభుత్వం మరోసారి చెక్ పెట్టింది. వచ్చ ఏడాది ఎన్నికల్లో పాల్గొంటానని ఇప్పటికే సయీద్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఏర్పాటు చేసిన మిల్లీ ముస్లిం లీగ్ పార్టీ రిజిస్ట్రేషన్‌ను పాకిస్తాన్ అంతర్గత మంత్రిత్వ శాఖ తిరస్కరించింది. ఇదిలా ఉండగా.. ఈ పార్టీని రిజిస్టర్ చేసేందుకు గతంలోనే పాకిస్తాన్ ఎన్నికల సంఘం నిరాకరించింది. మిల్లీ ముస్లిం లీగ్ అనే పార్టీ నిషేధిత జమాతే ఉద్ దవా, లష్కరే తోయిబా ఉగ్రసంస్థలకు జేబు సంస్థఅని పాక్ అంతర్గత మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఎంఎంఎల్ పార్టీ రిజిస్ట్రేషన్‌ను తిరస్కరించిన అంతర్గత మంత్రిత్వ శాఖ.. ఇటువంటి పార్టీలకు అనుమతివ్వండం దేశానికి మంచిది కాదని పేర్కొంది. రాజకీయాల్లో హింస, వేర్పాటు, ఉగ్రవాదా భావజాలం వేగంగా వ్యాప్తి చెందేందుకు ఇటువంటి పార్టీలు దోహదం చేస్తాయని అంతర్గ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇస్లామాబాద్ హైకోర్టు కూడా.. ఎంఎంఎల్ పిటీషన్‌ను స్వీకరించేది పరిగణలోకి తీసుకోవడం లేదని తెలిపింది. -
మరోసారి పాక్‌ను హెచ్చరించిన అమెరికా
వాషింగ్టన్: పాకిస్థాన్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఉగ్రసంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అక్కడి ప్రభుత్వాన్ని మరోసారి హెచ్చరించారు. అమెరికా కొత్త జాతీయ భద్రతా వ్యూహాన్ని (ఎన్ఎస్ఎస్) ప్రకటించిన అనంతరం ఆయన మాట్లాడుతూ ఉగ్ర నిరోధక చర్యల కోసం పాక్‌కు ఏటా భారీగా నిధులు ఇస్తున్నామని, వాళ్లు తప్పకుండా సాయం చేయాలని ఆయన స్పష్టం చేశారు. పార్లమెంటు ఆదేశాల మేరకు ట్రంప్ సోమవారం ఎన్ఎస్ఎస్ను ఆవిష్కరించారు. ఉగ్రవాదులకు మద్దతు ఇస్తున్నంత కాలం ఆ దేశంతో కుదుర్చుకునే ఒప్పందాలు వృథాయేనని ట్రంప్ పేర్కొన్నారు. అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ట్రంప్ పాకిస్థాన్‌పై విమర్శలు ఆపడం లేదు. లష్కరే తోయిబా నాయకుడు హఫీజ్ సయీద్‌ను మళ్లీ అరెస్టు చేయాలన్న అమెరికా సూచనను పాక్ పట్టించుకోలేదు. అయినా పాక్‌పై కఠిన చర్యలకు మాత్రం ట్రంప్ వెనుకాడుతున్నారు. పాక్ మాత్రం ఉగ్రవాద సంస్థలను ప్రోత్సహిస్తూనే ఉండటం గమనార్హం. -
ఉగ్రసంస్థలపై ముషారఫ్ సంచలన వ్యాఖ్యలు
కరాచీ : ఉగ్రవాద సంస్థలపై పాకిస్తాన్ మాజీ సైనిక పాలకుడు పర్వేజ్ ముషారఫ్ అభిమానాన్ని మరోసారి చాటుకున్నారు. జమాతే ఉద్ దవా, లష్కరే తోయిబా సంస్థలు.. దేశబక్తికి మారుపేరని ముషారఫ్ అన్నారు. దేశభద్రత కోసం లష్కరే తోయిబా, జమాతే ఉద్ దవాలతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ముషరాఫ్ ప్రకటించారు. ఇదిలా ఉండగా.. గతంలోనే ఒక ఇంటర్వ్యూలో.. లష్కే తోయిబా, జమాతే ఉద్ దవాలకు తాను పెద్ద అభిమానిని అని ప్రకటించిన విషమం తెలిసిందే. లష్కరే తోయిబా, జమాతే ఉద్ దవాలో పనిచేసే వాళ్లంతా.. దేశభక్తులేనని ముషారఫ్ అభివర్ణించారు. వారంతా పాకిస్తాన్ కోసమే జీవిస్తున్నారని.. పాకిస్తాన్ కోసమే మరణిస్తున్నారని ఆయన అభివర్ణించారు. లష్కే తోయిబా, జమాతే సంస్థలు ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తే.. ఎవరైనా ఎందుకు అభ్యంతరాలు వ్యక్తం చేయాల్సిన అవసరం లేదని ముషారఫ్ అన్నారు. వారితో పొత్తు పెట్టుకోవడానికి, కలిసి పనిచేయడానికి నేను సిద్దంగా ఉన్నాను.. ఈ విషయంపై వారు నాతో ఇంకా సంప్రదించలేదని చెప్పారు. ఒక వేళ వారు ముందుకు వస్తే.. నాకు ఎటువంటి అభ్యంతరాలు లేవు. నాలో ఉదారవాద భావాలు ఉన్నప్పటికీ.. మతపరమైన అంశాలను ద్వేషించనని చెప్పారు. కశ్మీర్లో తీవ్రవాద చర్యలను తానెప్పుడూ సమర్ధిస్తాననే ముషారఫ్ ప్రకటించడం గమనార్హం. -
‘నన్ను పట్టుకున్నావ్‌గా.. అభినందనలు’
శ్రీనగర్: ‘నేను ఎప్పుడైతే మా అమ్మానాన్నలను విడిచిపెట్టి వచ్చానో అప్పుటి నుంచే వారు చనిపోయినట్లు భావిస్తున్నాను. నాకు ఎవరూ లేరు.. ఎలాంటి సెంటిమెంట్లు లేవు. కొన్నిసార్లు నేను ముందడుగు వేశాను. కొన్నిసార్లు మీరు ముందడుగేశారు. ఈ రోజు నన్ను పట్టుకున్నారు. అందుకు మీకు అభినందనలు’ అంటూ కశ్మీర్లో మంగళవారం బలగాల చేతుల్లో హతమైన లష్కరే తోయిబా ఉగ్రవాది అబు దుజానా అన్నాడు. బలగాలు చుట్టుముట్టి అతడిని లొంగిపోవాలని సూచిస్తూ అతడికి ఫోన్ చేయగా చివరిసారిగా దాదాపు తొమ్మిదినిమిషాలు మాట్లాడిన అతడు లొంగిపోయేందుకు నిరాకరించాడు. పాకిస్థాన్‌కు చెందిన దుజాన ఓ గ్రామంలోని తనకు ఉన్న మిత్రురాళ్లలో ఒకరిని కలిసేందుకు వచ్చినప్పుడు బలగాలు చుట్టుమట్టారు. ఆ సమయంలో అతడిని అరెస్టు చేసేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో అతడికి ఫోన్ చేయించారు. అయితే, తొలిమాటగా ఎలా ఉన్నారు? అంటై పలకరించి ఆశ్చర్యపరిచిన దుజానా లొంగిపోయేందుకు నిరాకరించాడు. ‘నేను ఎలా ఉన్నాననే విషయం మర్చిపో.. నువ్వెందుకు సరెండర్ కావడం లేదు? ఇప్పుడెంత చెత్తగా ఉందో నీకు తెలుసా? ఇదంతా ఓ ఆట. మీ అమ్మనాన్నల గురించి ఓసారి ఆలోచించు. నీకు సహాయం చేస్తాను.. లొంగిపో.. నువ్వు బయటకు వచ్చి ప్రజలకు సమాధానం చెప్పకుంటే అనవసరం రక్తపాతం జరుగుతుంది. ఇష్టమొచ్చినట్లుగా మీరు చేసే పనులకు కశ్మీరు ప్రజలు ప్రాణాలుకోల్పోవాల్సి వస్తుంది’ అని ఆఫీసర్ అనగా.. నేను ఈ రక్తపాతాన్ని సృష్టించలేదు.. దీనంతటికి ఎవరు కారణమో నాకు తెలుసు’ అని అతడు అన్నాడు. అయితే, ఇది జిహాద్ కాదు.. అని బదులివ్వగా ‘అది కాక ఏంటి ఇది’ అంటూ అతడు ఫోన్ కట్ చేశాడు. ఈ క్రమంలోలోనే బలగాలు జరిపిన కాల్పుల్లో మృత్యువాతపడ్డారు. -
అనంతనాగ్‌లో ఎన్కౌంటర్.. మహిళ మృతి
అనంతనాగ్: జమ్ముకశ్మీర్‌లో మరోసారి ఉగ్రవాదులకు బలగాలకు మధ్య కాల్పులు మొదలయ్యాయి. అనంతనాగ్ జిల్లాలోని కొన్ని నివాసాల్లో ఉగ్రవాదులు చొరబడ్డారనే సమాచారం అందడంతో శనివారం ఉదయం పోలీసులు, బలగాలు గాలింపు చర్యలు ప్రారంభించగా ఎదురుకాల్పులు మొదలయ్యాయి. ఈ క్రమంలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఇప్పటికే కాల్పులు జరుగుతునే ఉన్నాయి. ఓ ఇంట్లోకి ఉగ్రవాదులు చొరబడ్డారని, అందులోని కుటుంబ సభ్యులను వారు బందించారని చెబుతున్నారు. కుటుంబ సభ్యులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నామని అన్నారు. కొంతమంది మాత్రం లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన ఓ టాప్ లీడర్ అందులో ఉన్నట్లు చెబుతున్నారు. -
ట్రంప్-మోదీ దోస్తీపై సయీద్ ఫైర్!
ట్రంప్ సర్కార్ ఒత్తిడితో ఉగ్రవాద సూత్రధారి హఫీజ్ సయీద్‌కు వ్యతిరేకంగా పాకిస్థాన్ అధికారులు రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే. ముంబై దాడుల సూత్రధారి, జమాత్ ఉద్ దావా (జేయూడీ) అధినేత అయిన సయీద్‌ను పాక్ పోలీసులు ఆదివారం రాత్రి గృహనిర్బంధంలో ఉంచారు. అయితే, లాహోర్‌లోని తన నివాసంలోనే గృహనిర్బంధంలో ఉన్న సయీద్ ఒక వీడియో ఫుటేజ్‌ను విడుదల చేశాడు. అమెరికా-భారత్ మధ్య అనుబంధం బలపడుతుండటమే తన హౌజ్ అరెస్టుకు కారణమని ఆయన ఈ వీడియోలో నిందించాడు. తనను అరెస్టు చేయాలని పాక్ ప్రభుత్వంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒత్తిడి తెచ్చారని, తద్వారా భారత ప్రధాని మోదీతో ఆయన తన స్నేహాన్ని బలోపేతం చేసుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. అంతకుముందు జేయూడీ అధికారి అహ్మద్ నదీమ్ మాట్లాడుతూ కూడా ఇదేవిధంగా అమెరికా, భారత్‌పై ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అమెరికా, భారత్‌లను సంతృప్తిపరిచేందుకు సయీద్‌ను పాక్ ప్రభుత్వం అరెస్టు చేసిందని, జేయూడీ కార్యాలయం వద్ద భారీగా బలగాలను మోహరించి తమను భయపెడుతున్నదని ఆయన విమర్శించారు. దీనికి సంబంధించిన మరిన్ని వార్తలకై చదవండి (అమెరికా దిక్కులు పిక్కటిల్లేలా..) (ఇది ముస్లింలపై నిషేధంకాదు: ట్రంప్) (ట్రంప్ ‘నిషేధం’: ఐసిస్ విజయోత్సవాలు) (ట్రంప్ చెప్పింది పచ్చి అబద్ధం!) (అమెరికాను సమర్థించిన సౌదీ, అబుదాబి) (ట్రంపోనమిక్స్ మనకు నష్టమా? లాభమా?) (ట్రంప్‌గారు మా దేశంపై నిషేధం విధించండి!) (ట్రంప్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన సీఈవో!) (వీసా హోల్డర్స్పై ట్రంప్ కొరడా) -
పాక్ ఉగ్ర సూత్రధారికి ట్రంప్ ఝలక్!
-
బ్రేకింగ్: పాక్ ఉగ్ర సూత్రధారికి ట్రంప్ ఝలక్!
హఫీజ్ సయీద్ హౌజ్ అరెస్టు.. ఆకస్మికంగా చర్యలు తీసుకున్న పాక్ ఇస్లామాబాద్: ముంబై దాడుల సూత్రధారి, జమాత్ ఉద్ దావా (జేయూడీ) అధినేత హఫీజ్ సయీద్‌కు పాకిస్థాన్ అధికారులు సడన్‌గా ఝలక్ ఇచ్చారు. ఆయనతోపాటు జేయూడీకి చెందిన మరో నలుగురిని గృహనిర్బంధం (హౌజ్ అరెస్టు)లో ఉంచారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సర్కారు ఒత్తిడి మేరకే పాక్‌లో యథేచ్ఛగా తిరుగుతున్న సయీద్‌పై ఈ మేరకు చర్యలు తీసుకున్నట్టు తెలుస్తోంది. లాహోర్ చౌబుర్జీలోని జమియా మసీద్ ఆల్ ఖద్సియా వద్ద సయీద్‌కు గృహనిర్బంధాన్ని విధించారు. ఇక్కడ జేయూడీ ప్రధాన కార్యాలయం ఉంది. ఇక్కడే ఉన్న సయీద్ నివాసాన్ని సబ్ జైలుగా మార్చి.. ఆయనను గృహ నిర్బంధంలో కొనసాగించనున్నట్టు అధికారులు తెలిపారు. పాక్ కేంద్ర హోంమంత్రిత్వశాఖ ఈ నెల 27న జారీచేసిన ఆదేశాల మేరకు పంజాబ్ ప్రావిన్స్ హోంత్రిత్వశాఖ సయీద్ హౌజ్ అరెస్టుకు ఆదేశాలిచ్చింది. భారీ ఎత్తున మోమరించిన పోలీసులు జేయూడీ ప్రధాన కార్యాలయాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారని జేయూడీ సభ్యుడు నదీమ్ పేర్కొన్నారు. పాక్ ప్రభుత్వం బయటి ఒత్తిడికి తలొగ్గి ఈ నిర్ణయం తీసుకుందని, భారత్‌ను సంతృప్తిపరిచేందుకు సయీద్‌ను అదుపులోకి తీసుకున్నారని ఆయన ఆరోపించారు. ఐరాస భద్రతా మండలి సయీద్‌పై ఆంక్షలు విధించిన నేపథ్యంలో అతన్ని అదుపులోకి తీసుకోవాలని భావిస్తున్నట్టు అంతకుముందు పాక్ హోంమంత్రి చౌదరి నిస్సార్ అలీఖాన్ తెలిపారు. జేయూడీ అణచివేతకు చర్యలు తీసుకోకుంటే పాక్‌పై ఆంక్షలు తప్పవని అమెరికా సర్కార్ హెచ్చరించిందని, అందుకే సయీద్‌ను అదుపులోకి తీసుకున్నారని పాక్‌కు చెందిన న్యూస్డైలీ పేర్కొంది. సయాద్ స్థాపించిన కరుడుగట్టిన ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా 26/11 ముంబై దాడులకు పాల్పడి.. మారణహోమం సృష్టించిన సంగతి తెలిసిందే. లష్కరేపై నిషేధం విధించడంతో దీనికి ముసుగు సంస్థగా జేయూడీని సయీద్ స్థాపించాడు. ఇది కూడా ఉగ్రవాద సంస్థనని ఇప్పటికే అమెరికా, ఐరాస ప్రకటించిన సంగతి తెలిసిందే. -
‘లష్కరే’ టాప్ కమాండర్ ఎన్ కౌంటర్
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్ రాజధాని శ్రీనగర్‌లో శుక్రవారం జరిగిన ఎన్ కౌంటర్లో భద్రతా బలగాలు లష్కరే తోయిబా టాప్ కమాండర్ ముజాఫర్ నైకూ అలియాస్ ముజ్ మౌల్విని హతమార్చాయి. మిలిటెంట్ ఉన్నాడన్న సమాచారంతో భద్రతా సిబ్బంది గుల్జార్‌పురాలో గురువారం సాయంత్రం ఆపరేషన్ ప్రారంభించాయి. తప్పించుకునేందుకు మిలిటెంట్ గ్రెనేడ్ విసరగా కానిస్టేబుల్ గాయపడ్డాడు. ఇరు వర్గాల మధ్య కొంతసేపు జరిగిన కాల్పుల్లో మిలిటెంట్ మరణించాడు. -
నదుల గుండా చొరబడి.. దేశంలో భారీ బ్లాస్ట్స్!
-
నదుల గుండా చొరబడి.. దేశంలో భారీ బ్లాస్ట్స్!
భారీ విధ్వంసానికి కుట్రపన్నిన లష్కరే ఉగ్రవాద దాడులు పొంచి ఉండటంతో భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో భద్రతను భారీగా పెంచిన నేపథ్యంలో లష్కరే తోయిబా ఉగ్రవాదులు మరో మార్గం మీదుగా దేశంలోకి ప్రవేశించి.. భారీ విధ్వంసానికి పాల్పడాలని కుట్రపన్నారు. నిఘా వర్గాల విశ్వసనీయ సమాచారం ప్రకారం.. లష్కరే చీఫ్ హఫీజ్ సయీద్ భారత్‌లో మరో భారీ విధ్వంసానికి పథకం రచిస్తున్నాడు. ఇందుకోసం సరిహద్దుల్లో ఉన్న నదులు, కాలువలను ఉపయోగించుకొని తన ఉగ్రమూకను దేశంలోకి పంపాలని అతను కుట్ర పన్నినట్టు నిఘా వర్గాలు తెలిపాయి. ఈ ఉగ్రవాద ఆపరేషన్‌కు లష్కరే కమాండర్ అబు ఇర్ఫాన్ తందేవాలాను ఇన్చార్జిగా సయీద్ నియమించినట్టు సమాచారం. దేశంలో భారీ మారణహోమం లక్ష్యంగా ఎనిమిది నుంచి తొమ్మిది మంది ఈ ఆపరేషన్‌లో పాల్గొనబోతున్నట్టు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. ఈ ఉగ్రవాదులు దేశంలోకి చొరబడేందుకు వీలుగా పాక్ సైన్యం లోపాయికారి సహకారం అందిస్తున్నట్టు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సరిహద్దుల మీదుగా ఉన్న నదులు, కాలువ మార్గాల వద్ద భారత సైన్యం నిఘాను, భద్రతను మరింత పెంచింది. అంతేకాకుండా అనుమానిత చొరబాటు మార్గాల వద్ద బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి పహారా కాస్తున్నది. భారత సైన్యం సర్జికల్ స్ట్రైక్స్ చేసిన తర్వాత అంతర్జాతీయ సరిహద్దుల మీదుగా రికార్డుస్థాయిలో ఉగ్రవాద చొరబాటు యత్నాలు ఈసారి జరిగాయని, సెప్టెంబర్ 29 తర్వాత దాదాపు 15 చొరబాటు యత్నాలను బీఎస్ఎఫ్ భగ్నం చేసిందని సమాచారం. కాగా, భారత్-పాక్ సరిహద్దుల్లో మూడు నదులు, 11 కాలువలు ఉన్నాయి. -
భారత్‌పై భారీ దాడికి లష్కరే కుట్ర?
భారతదేశంపై భారీ స్థాయిలో దాడి చేయడానికి లష్కరే తాయిబా అధినేత హఫీజ్ సయీద్ కుట్ర పన్నుతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ప్రస్తుతం సరిహద్దుల్లో భద్రత అత్యంత పటిష్ఠంగా ఉండటంతో ఉగ్రవాదులు ఆ మార్గంలోంచి భారతదేశంలో ప్రవేశించడం సాధ్యం అయ్యే పరిస్థితి లేనందున.. జలమార్గం ద్వారానే దేశంలోకి ఉగ్రవాదులను పంపాలని లష్కర్ భావిస్తోంది. ప్రధానంగా నిక్కి, తావి, బడీతావి నదుల ద్వారా రావాలని లష్కరే ఉగ్రవాదులు ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. ఈ మొత్తం ఆపరేష్‌కు అబు ఇర్ఫాన్ తండేవాలాను ఇన్చార్జిగా సయీద్ నియమించాడంటున్నారు. అతడి సారథ్యంలో పెద్ద ఎత్తునే భారత్ మీద దాడి చేయాలని తలపెడుతున్నారు. ఈ ఆపరేషన్‌లో దాదాపు ఎనిమిది నుంచి తొమ్మిది మంది ఉగ్రవాదులు పాల్గొనే అవకాశం ఉంది. వాళ్లంతా మన దేశంలోకి ప్రవేశించడానికి పాకిస్థాన్ సైన్యం కూడా ఇతోధికంగా సాయం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఉగ్రవాదులు నదీ మార్గంలో దేశంలోకి ప్రవేశించాలని చూస్తున్నట్లు సమాచారం అందడంతో.. నదులు, ప్రవాహాలు అన్ని ప్రాంతాల్లోనూ భద్రతను కట్టుదిట్టం చేశారు. సరిహద్దుల్లో కూడా బలగాలను పెంచారు. ఉగ్రవాదులు చొరబడే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్న ప్రాంతాల్లో బీఎస్ఎఫ్ బలగాలు అదనపు దళాలను మోహరించాయి. ఈసారి భారీస్థాయిలో అంతర్జాతీయ సరహిద్దుల ద్వారా లోనికి చొరబడే ప్రయత్నాలు జరిగినట్లు బీఎస్ఎఫ్ వర్గాలు చెబుతున్నాయి. సెప్టెంబర్ 29 నాటి సర్జికల్ స్ట్రైక్స్ తర్వాత దాదాపు 15 సార్లు చొరబాటు యత్నాలను బీఎస్ఎఫ్ తిప్పికొట్టింది. ఇవన్నీ అంతర్జాతీయ సరిహద్దు వెంబడి నదులు లేదా అడవుల ద్వారానే జరిగాయి. భారత్-పాక్ సరిహద్దుల్లో మూడు నదులు, 11 ప్రవాహాలు ఉన్నాయి. -
మోదీకి 'పాక్' లేఖ: లష్కరే సంతకం
పఠాన్‌కోట్: ఉగ్రదాడికి గురైన పఠాన్ కోట్ ఎయిర్ బేస్ కు సమీపంలో ఆదివారం ఒక అనుమానాస్పద పావురాన్ని బీఎస్ఎఫ్ జవాన్లు గుర్తించారు. పాకిస్థాన్ వైపు నుంచి వచ్చిన ఆ పావురాన్ని బమియాల్ సెక్టార్ లోని సింబాల్ పోస్టు వద్ద స్వాధీనం చేసుకున్నట్లు చెప్పిన బీఎస్ఎఫ్ అధికారులు.. పావురం కాలికి ఒక లేఖ కట్టిఉన్నట్లు వెల్లడించారు. ఉర్దూలో రాసి ఉన్న ఆ లేఖలో ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశిస్తూ.. 'మోదీజీ మీ(ఇండియా)తో యుద్ధం చేయడానికి ఇక్కడి యువకులందరూ సిద్ధంగా ఉన్నారు. మమ్మల్ని నాటి(1971 యుద్ధంనాటి) వాళ్లకింద లెక్కకట్టకండి..' అని రాసి ఉన్నట్లు అధికారులు చెప్పారు. ఈ ఉదంతంపై దర్యాప్తు ప్రారంభించిన పఠాన్ కోట్ పోలీసులు పావురాన్ని కస్టడీలోకి తీసుకున్నారు. కాగా, పావురం లేఖలో సంతకంగా ఉగ్రవాద సంస్థ లష్కరే తాయిబా పేరు ఉందని పఠాన్ కోట్ ఇన్ స్పెక్టర్ రాకేశ్ కుమార్ సోమవారం మీడియాకు తెలిపారు. ఈ వ్యవహారాన్ని తేలికగా తీసుకోబోమని, లోతైన దర్యాప్తు చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే పంజాబ్, కశ్మీర్ సరిహద్దుల్లో భారత భద్రతా బలగాలు అప్పమత్తంగా వ్యవహరిస్తుండగా, పై నుంచి పావురం లేఖలు, బెలూన్ లెటర్లు వచ్చి పడుతున్నాయి. శనివారం కూడా ఇదే తరహాలోగురుదాస్‌పూర్‌లోని ఘేసల్ గ్రామం గాలిబుడగలకు కట్టిన లేఖలు పాక్ నుంచి ఇండియాకు వచ్చి వాలాయి. బెలూన్ల లేఖల్లోనూ 'మోదీజీ, సహనం అనే కత్తులు ఇప్పుడు మా దగ్గర ఉన్నాయి' అని ఉర్దూలో రాసిఉన్నట్లు పోలీసులు చెప్పారు. సెప్టెంబర్ 23న కూడా పంజాబ్‌లో హోషియార్పూర్ జిల్లాలో ఉర్దూలో రాసి ఉన్న ఉత్తరంతో ఉన్న ఓ తెల్ల పావురాన్ని భారత అధికారులు అదుపులోకి తీసుకున్నారు. -
లష్కరే ముష్కరుల కుట్రే
నేను రెక్కీ నిర్వహించి సమాచారం ఇచ్చా ముంబై మారణహోమంపై వీడియో కాన్ఫరెన్సలో హెడ్లీ వాంగ్మూలం ముంబై: ముంబై మహానగరంలో మారణహోమం సృష్టించిన ఉగ్రదాడికి కుట్ర పన్నిందీ, అమలు చేసిందీ.. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థేనని.. ఆ కుట్రలో పాలుపంచుకున్న లష్కరే ఉగ్రవాది డేవిడ్ హెడ్లీ వెల్లడించాడు. ఇందులో పాక్ గూఢచార సంస్థ ఐఎస్ఐ అధికారుల సాయం ఉందని పేర్లతో సహా వివరించాడు. తనకు ఎక్కడెక్కడ ఎవరెవరు ఎలాంటి శిక్షణ ఇచ్చారు.. తాను పేరు మార్చుకుని అమెరికా నుంచి ఇండియాలోకి ఎలా ప్రవేశించాడు.. ముంబైలో ఎలా రెక్కీ నిర్వహించాడు.. 26/11 ఉగ్రదాడికి ఎలా సాయం చేశాడు అనే విషయాలను.. సోమవారం ముంబై విచారణ కోర్టుకు వీడియో వాంగ్మూలం ద్వారా పూసగుచ్చినట్టు వివరించాడు. లష్కరే వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్, ఆ సంస్థ కమాండర్ జకీఉర్ రెహ్మాన్ లఖ్వీల మార్గదర్శకత్వంలో తనకు పాక్ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)లో, పాక్ రాజధాని ఇస్లామాబాద్ సమీపంలోని అబోటాబాద్లోనూ ఆ ఉగ్రవాద సంస్థ ఇచ్చిన శిక్షణ గురించి చెప్పాడు. సయీద్, లఖ్వీల ఫొటోలను అతడు కోర్టులో గుర్తించి చూపాడు. పాక్ ఐఎస్ఐకి చెందిన ముగ్గురు అధికారులు మేజర్ అలీ, మేజర్ ఇక్బాల్, మేజర్ అబ్దుల్ రెహ్మాన్ పాషాలతో తనకు ఎలా సంబంధం ఏర్పడిందీ తెలిపాడు. పాకిస్తానీ-అమెరికన్ అయిన డేవిడ్ కోల్మాన్ హెడ్లీ.. ముంబై దాడుల కేసులోనే అమెరికా కోర్టులో దోషిగా నిర్ధారితుడై 35 సంవత్సరాల జైలు శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. ముంబై దాడుల కేసును విచారిస్తున్న ముంబై కోర్టులో సైతం.. తనకు క్షమాభిక్ష పెట్టేట్లయితే అప్రూవర్‌గా మారి వాంగ్మూలం ఇవ్వడానికి హెడ్లీ సమ్మతించాడు. కోర్టు ఆదేశం మేరకు సోమవారం అమెరికా జైలు నుంచే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాంగ్మూలం ఇచ్చాడు. ముంబై నగరంలో 166 మంది మరణానికి, 309 మంది క్షతగాత్రులవటానికి కారణమైన 2008 నవంబర్ 26 నాటి ఉగ్రదాడులకు ముందు జరిగిన పరిణామాలన్నిటి గురించీ ప్రత్యేక న్యాయమూర్తి జి.ఎ.సనాప్ ఎదుట వివరించాడు. విదేశీ గడ్డ నుంచి భారతదేశంలోని కోర్టుకు వీడియో వాంగ్మూలం ఇవ్వటం ఇదే తొలిసారి. ఉదయం 7 గంటలకు మొదలైన వాంగ్మూలం ప్రక్రియ ఐదున్నర గంటల పాటు కొనసాగింది. హెడ్లీవాంగ్మూలం, విచారణ ప్రక్రియ మంగళవారం కూడా కొనసాగనుంది. పాక్ పాత్రపై అస్పష్టత తొలగుతుంది: రిజిజు న్యూఢిల్లీ: పాకిస్తానీ - అమెరికన్ ఉగ్రవాది డేవిడ్ హెడ్లీ ఇచ్చిన వాంగ్మూలంతో.. ముంబై ఉగ్రవాద దాడిలో పాక్‌కు చెందిన ప్రభుత్వ, ప్రభుత్వేతర శక్తుల పాత్రపై అస్పష్టత తొలగిపోతుందని.. కేసును తార్కిక ముగింపునకు తీసుకెళుతుందని భారత ప్రభుత్వం వ్యాఖ్యానించింది. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిరెన్ రిజిజు సోమవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ముంబై ఉగ్రవాద దాడుల కుట్రలో ఎవరి పాత్ర ఉందనేది ప్రతి ఒక్కరికీ తెలుసు. ఎవరెవరు ఉన్నారో తెలుసు. హెడ్లీ వాంగ్మూలం ఒక తార్కిక ముగింపునకు దారితీస్తుంది. అది మనకు సాయపడుతుంది’’ అని పేర్కొన్నారు. వాంగ్మూలం అతని మాటల్లోనే... సయీద్ ప్రేరేపణతో లష్కరేలో చేరా... ‘‘నా అసలు పేరు దావూద్ జిలానీ. పాకిస్తాన్‌లోని హసన్ అబ్దల్ కాడెట్ కాలేజ్‌లో చదివాను. పదిహేడేళ్ల వయసులో అమెరికాకు వలస వెళ్లాను. హఫీజ్ సయీద్ ప్రసంగాలతో ప్రేరేపితమై లష్కరే ఉగ్రవాద సంస్థలో చేరాను. ఇండియాను నా శత్రువుగా పరిగణించేవాడిని. నేను లష్కరేకు నిజమైన కార్యకర్తను. కశ్మీర్ వెళ్లి భారత బలగాలతో యుద్ధం చేయాలనుకున్నాను. కానీ.. అందుకు నా వయసు ఎక్కువైపోయిందని లఖ్వీ తదితరులు చెప్పారు. నన్ను మరొక అవసరానికి వాడుకుంటామని, అది కశ్మీర్ కన్నా చాలా సాహసోపేతమైన పని అని లఖ్వీ నాకు చెప్పాడు. ఇండియా లో దాడుల కోసం రెక్కీ నిర్వహించటానికి నా పేరు మార్చుకోవాలని లఖ్వీ, ఐఎస్ఐ కమాండర్లు సూచించారు.’’ రెండేళ్ల పాటు లష్కరే శిక్షణ పొందా... ‘‘నేను తొలిసారి 2002లో ముజఫరాబాద్‌లో లష్కరే శిక్షణ పొందాను. సయీద్, లఖ్వీలు నడిపిన ‘నాయకత్వ శిక్షణ’కు కూడా హాజరయ్యాను. లష్కరే శిబిరాల్లో దాదాపు రెండేళ్ల పాటు ఐదు, ఆరు శిక్షణ కోర్సులకు హాజరయ్యాను. దౌరా-ఎ-సూఫా అనేది ఒక అధ్యయన కోర్సు. లాహోర్‌లోని మురిడ్కేలో ఈ శిక్షణ ఇస్తారు. దౌరా-ఎ-ఆమ్ అనేది ప్రాథమిక సైనిక శిక్షణ. ‘ఆజాద్ కశ్మీర్’(పీఓకే)లోని ముజఫరాబాద్‌లో ఈ శిక్షణ ఇస్తారు. దౌరా-ఎ-ఖాస్ అనేది మరింత తీవ్రమైన శిక్షణ. అందులో నాకు ఆయుధాలు, తుపాకులు, పేలుడు పదార్థాలు, మందుగుండును ఎలా వినియోగించాలో నేర్పించారు. దౌరా-ఎ-రిబాత్ అనే శిక్షణ కూడా నాకు ఇచ్చారు. ఇది నిఘా కోర్సు. సురక్షిత స్థావరాలను నెలకొల్పటం, రహస్యంగా సమాచారం సేకరించటం తదితరాలు నేర్పారు. ఈ శిక్షణా కేంద్రం పాక్‌లోని అబోటాబాద్‌కు 40 కిలోమీటర్ల దూరంలో గల మన్సేరాలో ఉంది.’’ అమెరికాలో పేరు మార్చుకుని ఇండియా వీసా తీసుకున్నా... ‘‘ఇండియాలోకి ప్రవేశించటానికి.. అమెరికా గుర్తింపుతో ఇండియాలో వ్యాపారం స్థాపించే మిషతో వచ్చాను. అందుకోసం.. నా పేరును డేవిడ్ హెడ్లీగా మార్చుకుంటూ 2006 ఫిబ్రవరి 5న ఫిలడెల్ఫియాలో దరఖాస్తు చేశాను. ఆ పేరుతో కొత్త పాస్‌పోర్ట్ సంపాదించాను. ఆ విషయాన్ని లష్కరేలోని నా సహచరులకు చెప్పాను. వారిలో సాజిద్ మిర్.. నాతో సంప్రదింపులు జరుపుతుండేవాడు. ఇండియాలో ఒక ఆఫీసు లేదా వ్యాపారం నెలకొల్పటం ద్వారా నేను అక్కడ ఒక ముసుగులో నివసించాలనేది ఉద్దేశం. భారత రాయబార కార్యాలయంలో వాణిజ్య వీసా కోసం దరఖాస్తు చేశాను. భారత వీసా కోసం దరఖాస్తు చేసేటపుడు నేను ఒక ఇమిగ్రేషన్ కన్సల్టెంట్‌నని తప్పుడు కథ అల్లి చెప్పాను. ప్రతిసారీ భారత వీసా కోసం దరఖాస్తు చేయాల్సిన అవసరం లేకుండా.. పలుమార్లు వచ్చి వెళ్లేందుకు వీలైన వీసా తీసుకున్నాను. ఒక డానిష్ వార్తా పత్రికపై దాడికి కుట్ర పన్నటంలో లష్కరే సంస్థకు మద్దతిచ్చిన కేసులో దోషిగా నిర్ధారితుడైన పాక్ మాజీ సైనిక వైద్యుడు తాహావ్వుర్ హుస్సేన్ రాణా.. నేను ఇండియా ప్రయాణానికి ఐదేళ్ల వీసా సంపాదించటంలో సాయపడ్డాడు. 26/11 దాడుల గురించి రాణాకూ తెలుసు. ఐఎస్ఐ మేజర్లు మాకు సహకరించారు... ‘‘ఐఎస్ఐకి చెందిన మేజర్ ఇక్బాల్ నాకు తెలుసు. ఐఎస్ఐకే చెందిన మేజర్ అలీ అతడిని నాకు పరిచయం చేశాడు. ఆ తర్వాత ఒకసారి లాహోర్‌లో మేజర్ ఇక్బాల్‌ను నేను కలిశాను. పాక్‌లోని ఫెడరల్లీ అడ్మినిస్ట్రేటెడ్ ట్రైబల్ ఏరియాలో నేను ఒకసారి అరెస్టయ్యాను. ఆ సమయంలో ఐఎస్ఐకి చెందిన మేజర్ అబ్దుల్ రెహ్మాన్ పాషా కూడా నాతోనే ఉన్నాడు. నన్ను ప్రశ్నించేందుకు మేజర్ అలీ వచ్చాడు. నేను విదేశీయుడిలా కనిపించటం వల్ల, నా వద్ద ఇండియా మీద గల పుస్తకాలు దొరకటం వల్ల నన్ను అరెస్ట్ చేశారు. అయితే నాకు గల పాకిస్తానీ గుర్తింపు కార్డును చూపటంతో నాపై కేసు నమోదు చేయలేదు. ’’ రెండు సార్లు విఫలమయ్యారు... ‘‘ముంబైలో 2008 నవంబర్ 26వ తేదీన మారణహోమం సృష్టించిన పది మంది ఉగ్రవాదులు.. అంతకుముందు సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లోనే దాడులు చేయటానికి రెండు సార్లు కుట్ర పన్నారు. కానీ వారి ప్రయత్నాలు విఫలమయ్యాయని సాజిద్‌మిర్ నాకు చెప్పాడు. సెప్టెంబర్‌లో తొలి ప్రయత్నం చేశారు. కరాచీ వెలుపలి నుంచి సముద్రంలో ప్రయాణమైన ఉగ్రవాదుల బోటు.. కొంత దూరం వెళ్లాక రాళ్లను ఢీకొట్టి ముక్కలైంది. బోటులోని ఆయుధాలు, పేలుడు పదార్థాలన్నీ సముద్రంలో పడిపోయాయి. అందులో ఉన్నవారికి లైఫ్ జాకెట్లు ఉండటంతో వారు వెనుదిరిగి పాక్ తీరానికి చేరుకున్నారు. అక్టోబర్‌లో రెండోసారి ప్రయత్నం చేశారు. అదీ విఫలమైంది. అదే 10 మంది ఉగ్రవాదులు ముంబైపై దాడి చేయటంలో మూడోసారి సఫలమయ్యారు.’’ దాడులకు ముందు ఏడుసార్లు ముంబై వచ్చాను.. ‘‘నా వీసా ప్రణాళికనంతటినీ నేను సాజిద్మిర్తోను, ఐఎస్ఐకి చెందిన మేజర్ ఇక్బాల్లతోను చర్చించాను. ముంబై చేరుకుని.. నా వాస్తవ గుర్తింపు తెలియకుండా ఉండటం కోసం ఒక ఆఫీసు స్థాపించాను. నేను తొలిసారి ఇండియాకు రావటానికి ముందు.. ముంబై నగరాన్ని వీడియో తీసి తీసుకురావాలని లష్కరే ప్రతినిధి సాజిద్‌మిర్ (ఈ కేసులో మరో నిందితుడు) నాకు చెప్పాడు. 2008 ఉగ్రవాద దాడులకు ముందు నేను ఏడుసార్లు ముంబై వెళ్లాను. ఆ దాడి తర్వాత 2009 మార్చిలో ఒకసారి ఢిల్లీ వెళ్లాను. (ముంబైలో హెడ్లీ చేసిన పని.. నగరానికి సంబంధించి మ్యాపులు తయారు చేసి, వీడియో తీయటం, తాజ్, ఒబెరాయ్ హోటళ్లు, నారీమన్ హౌస్‌ల వద్ద రెక్కీ నిర్వహింభఃచటం. ముంబైపై 10 మంది ఉగ్రవాదుల దాడులకు హెడ్లీ అందించిన రెక్కీ సమాచారమే కీలకమైంది.) సంచలన విషయాలు వెల్లడించాడు: నికమ్ హెడ్లీ తన వాంగ్మూలంలో వెల్లడించిన విషయాలతో తాను పూర్తిగా సంతృప్తి చెందినట్లు ప్రత్యేక ప్రాసిక్యూటర్ ఉజ్వల్ నికమ్ పేర్కొన్నారు. ‘‘హెడ్లీ సంచలన విషయాలు వెల్లడించాడు. తాను హఫీజ్ సయీద్‌ను కలిసినట్లు చెప్పాడు. అతడి ఫొటోను గుర్తించాడు. ఐఎస్ఐలో ఉన్న మేజర్ ఇక్బాల్, మేజర్ అలీల గురించి చాలా విషయాలు వెల్లడించాడు. అతడికి శిక్షణ ఇచ్చింది మేజర్ ఇక్బాల్. పలువురు లష్కరే శిక్షకుల పేర్లను కోర్టు ఎదుట వెల్లడించాడు. హఫీజ్ సయీద్ వల్ల ప్రేరేపితుడనై లష్కరే తోయిబాలో చేరినట్లు హెడ్లీ ఒప్పుకున్నాడని అతడి తరఫు న్యాయవాది మహేశ్జెఠ్మలాని పేర్కొన్నారు. ఇదిలావుంటే.. 26/11 దాడుల మరో కుట్రదారు సయ్యద్ జబీయుద్దీన్ అన్సారీ అలియాస్ అబుజుందాల్‌ను కూడా ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ఎదుట హాజరుపరిచారు. తన న్యాయవాదిని ఉపసంహరించుకుంటున్నట్లు కోర్టుకు తెలిపిన జుందాల్.. కొత్త న్యాయవాదిని నియమించుకునేందుకు 15 రోజుల గడువు కోరాడు. అలాగే తన పేరు సయ్యద్ జబీయుద్దీన్ అన్సారీ అని.. అబుజుందాల్ కాదంటూ అలియాస్ పేరును కోర్టు రికార్డుల నుంచి తొలగించాలని కోరాడు. -
భారత్ రావడానికే పేరు మార్చుకున్నా: హెడ్లీ
ముంబై మహానగరంలో జరిగిన 26/11 మారణహోమం వెనుక పాక్ ఉగ్రవాద సంస్థ లష్కరే తాయిబా హస్తం ఉందన్న విషయం స్పష్టంగా తేలిపోయింది. తాను లష్కరే తాయిబాకు అసలైన అనుచరుడినని ముంబై పేలుళ్ల సూత్రధారి డేవిడ్ కాల్మన్ హెడ్లీ వెల్లడించాడు. కేవలం భారతదేశంలో ప్రవేశించడానికే తాను అమెరికన్లా పేరు మార్చుకున్నట్లు చెప్పాడు. తన అసలు పేరు దావూద్ గిలానీ అని.. ఆ పేరు ఉంటే రావడం కుదరదని పేరు మార్చుకున్నానని వీడియో లింకు ద్వారా హెడ్లీ సోమవారం ఉదయం ముంబైలోని ప్రత్యేక కోర్టు విచారణకు హాజరై.. ఈ వివరాలు వెల్లడించాడు. తన పేరు మార్చుకున్న తర్వాత ఆ సమాచారాన్ని లష్కరే తాయిబాకు చెందిన సాజిద్ మీర్‌కు చెప్పానన్నాడు. పేరు మార్చుకున్న కొన్ని వారాల తర్వాత పాకిస్థాన్ వెళ్లానని, భారతదేశంలో ప్రవేశించడానికి మాత్రమే పేరు మార్చానని చెప్పాడు. భారతదేశంలో ఏదైనా వ్యాపారం లేదా ఆఫీసు పెట్టాలని సాజిద్ మీర్ తనకు చెప్పాడని, అతడి అసలు ఉద్దేశం ఏంటో.. తాను తొలిసారి భారతదేశం సందర్శించానికి కొద్ది ముందే చెప్పాడని హెడ్లీ తెలిపాడు. కొత్త పేరుతో తనకు పాస్‌పోర్టు వచ్చిన తర్వాత భారత దేశానికి 8 సార్లు వచ్చానని, అందులో 7 సార్లు ముంబై నగరంలోనే తిరిగానని అతడు అన్నాడు. ఒక్కసారి మాత్రమే తాను దుబాయ్ నుంచి భారత్ వెళ్లానని, మిగిలిన 7 సార్లూ నేరుగా పాకిస్థాన్ నుంచే వెళ్లానని వివరించాడు. తన వీసా దరఖాస్తులో తాను పుట్టిన ఊరు, తేదీ, తల్లి జాతీయత, తన పాస్‌పోర్టు నంబర్ తప్ప అన్నీ తప్పులేనని తెలిపాడు. 2015 డిసెంబర్లో హెడ్లీ ఈ కేసులో అప్రూవర్‌గా మారిపోయాడు. పేలుళ్లకు మొత్తం కుట్ర పన్నిందంతా లష్కరే తాయిబాయేనని, దానికి పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ అనుమతి కూడా ఉందని హెడ్లీ అంటున్నాడు. ముంబైలో రెక్కీ చేయడానికి కూడా తనకు ఆర్థిక సహకారం అందించింది ఐఎస్ఐ సంస్థేనన్నాడు. తాను ఢిల్లీలో ఉప రాష్ట్రపతి ఇల్లు, ఇండియా గేట్, సీబీఐ కార్యాలయాల వద్ద కూడా రెక్కీ చేశానన్నాడు. కాగా.. డేవిడ్ హెడ్లీ తరఫున ప్రముఖ న్యాయవాది మహేష్ జెఠ్మలానీ వాదిస్తున్నారు. -
ప్రధాని మోదీపై లష్కరే తాయిబా గురి!
-
ప్రధాని మోదీపై లష్కరే తాయిబా గురి!
పాకిస్థాన్‌తో భారత దేశానికి సత్సంబంధాలు వస్తే తమకు ఇబ్బంది అని భావించారో ఏమో గానీ.. భారత ప్రధాని నరేంద్ర మోదీ మీద లష్కరే తాయిబా ఉగ్రవాదులు గురిపెట్టారు. ఈ విషయాన్ని భారత నిఘా వర్గాలు గుర్తించి హెచ్చరించాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతోపాటు భారత పార్లమెంటు, సైన్యం ప్రధాన కార్యాలయం, అణు కేంద్రాలు.. ఈ అన్నింటికీ కూడా లష్కరే తాయిబా నుంచి ముప్పు పొంచి ఉందని తాజా హెచ్చరికలో నిఘా వర్గాలు తెలిపాయి. -
భారత్‌లో దాడులకు ఐఎస్ఐ కుట్ర
♦ లష్కరే, జైషే, హిజ్బుల్లతో పాటు సిక్కు ఉగ్రవాదులకూ శిక్షణ ♦ 15 నుంచి 20 మంది వరకూ ఉగ్రవాదుల సమీకరణ న్యూఢిల్లీ : పాకిస్తాన్ గూఢచర్య సంస్థ ఐఎస్ఐ భారత్‌లో ఉగ్రదాడులు జరపటానికి.. లష్కరే తోయిబా, జైషేమొహమ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థలతో పాటు.. సిక్కు తీవ్రవాద సంస్థలైన బబ్బర్‌ఖల్సా, ఖలిస్తాన్ జిందాబాద్ ఫోర్స్ ఉగ్రవాదులను సమీకరించి శిక్షణనిప్పిస్తోందని నిఘా సమాచారం తెలిసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఆ వర్గాల కథనం ప్రకారం.. ఢిల్లీ, పంజాబ్, జమ్మూకశ్మీర్‌లలో దాడులు జరపటానికి.. 15 నుంచి 20 మంది ఉగ్రవాదులను ఐఎస్ఐ సమీకరించింది. ఆయా సంస్థల్లో పనిచేసే పాక్, ఆక్రమిత కశ్మీర్ వాసులను ఎంపిక చేసింది. పాక్ నుంచి ఎంపిక చేసిన సిక్కు ఉగ్రవాదులకు.. సిక్కు సంప్రదాయాలు, గుర్ముఖీ గ్రంథం గురించి పాక్‌లోని కర్తార్‌పూర్ సాహిబ్ గురుద్వారాలో తర్ఫీదునిచ్చింది. ఇందుకోసం ఖలిస్తాన్ జిందాబాద్ ఫోర్స్ చీఫ్ రంజిత్‌సింగ్ సాయం తీసుకుంది. పంజాబ్ భౌగోళిక స్వరూపస్వభావాలను వివరించింది. ఈ ఉగ్రవాదులందరికీ భారత సరిహద్దు వెంట పాక్ ఆక్రమిత కశ్మీర్‌తో పాటు పాక్‌లోని ఇతర శిబిరాల్లో.. ఆయుధాలు, మందుగుండు సామగ్రిని వినియోగించటంపై శిక్షణనిస్తోంది. శిక్షణ కార్యక్రమం లష్కరే వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్ సాయంతో సాగుతోంది. ఈ ఉగ్రవాదుల్లో కొందరు ఇప్పటికే దాడుల కోసం పంజాబ్‌కు వచ్చి ఉండొచ్చని, లేదా ప్రవేశించే క్రమంలో ఉండి ఉంటారని.. పంజాబ్, కశ్మీర్‌లలోని భద్రతా సంస్థలను భారత నిఘా విభాగం హెచ్చరించింది. ఈ దాడుల కోసం వాడే ఆయుధాలను జమ్ముకశ్మీర్ నుంచి పంజాబ్‌కు వచ్చే ట్రక్కుల చాసిస్‌లలో తొలిచిన పగుళ్లలో దాచిపెట్టి పంపించే అవకాశముందని పేర్కొంది. ఈ సమాచారాన్ని జమ్ముకశ్మీర్ ప్రభుత్వంతో పాటు.. అక్కడ ఉన్న సైన్యం, కేంద్ర బలగాలకు ఈ నెల 24వ తేదీన తెలియజేసింది. పంజాబ్ ప్రభుత్వంతో పాటు అక్కడున్న బీఎస్ఎఫ్, డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ మిలటరీ ఇంటెలిజెన్స్, సీఆర్పీఎఫ్ యూనిట్లకు ఈ నెల 26వ తేదీన తెలిపింది. -
లష్కరే తాయిబాలోనే నాకు శిక్షణ
పాకిస్థాన్‌లోని లష్కరే తాయిబా ఉగ్రవాద సంస్థే తనకు శిక్షణ ఇచ్చిందని ఉధంపూర్‌లో పట్టుబడ్డ ఉగ్రవాది నావెద్ తెలిపాడు. ఎన్ఐఏ అధికారుల దర్యాప్తులో ఈ వివరాలను అందించాడు. పాకిస్థాన్‌లో నావెద్ సహా చాలామంది తీవ్రవాదులు పూర్తిస్థాయిలో శిక్షణ పొందారు. లష్కరే తాయిబా వాళ్లకు రెండు రకాలుగా శిక్షణ ఇచ్చింది. శారీరక సామర్థ్యం పెంచుకోవడం, కొండలు ఎక్కడం, చిన్నపాటి ఆయుధాల తయారీపై తొలి దశలో శిక్షణ ఇచ్చారు. రెండో దశలో భారీ ఆయుధాల వినియోగం, పేలుడు పదార్థాల తయారీలో శిక్షణ ఇచ్చారు. ఆ శిక్షణ పొందిన తర్వాత.. ఉత్తర కశ్మీర్‌లోని బారాముల్లా వద్ద సరిహద్దులు దాటినట్లు నావెద్ వెల్లడించాడు. సరిహద్దులో ఉన్న కంచెను కట్ చేసి చొరబడినట్లు చెప్పాడు. తంగ్ మార్గ్, బాబారేషి ప్రాంతాల్లో తొలుత స్థావరాలు ఏర్పాటుచేసుకున్నాడు. తర్వాత దక్షిణ కశ్మీర్‌లోని అవంతిపుర, పుల్వామా ప్రాంతాలకు మార్చినట్లు తెలిపాడు. కొండల్లోని ఓ గుహలో స్థావరాన్ని ఏర్పాటుచేసుకున్నట్లు విచారణ అధికారులకు చెప్పాడు. తర్వాత రెండు బృందాలుగా విడిపోయామని, ట్రక్కు ఎక్కి ఉధంపూర్ చేరుకున్నామని అన్నాడు. నావెద్ వెల్లడించిన ప్రాంతాలకు వెళ్లిన అధికారులు మరిన్ని వివరాలు సేకరిస్తున్నారు. -
90 రోజులుగా నవేద్ ఇక్కడే తిష్ట
జమ్మూ: బీఎస్ఎఫ్ జవాన్లకు సజీవంగా చిక్కిన పాకిస్థాన్ ఉగ్రవాది మొహమ్మద్ నవెద్ దేశంలోకి వచ్చి 90 రోజులవుతుందని ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం. బీఎస్ఎఫ్ జవాన్లపై కాల్పులకు దిగి అనంతరం గ్రామస్థుల సాయంతో సరిహద్దు బలగానికి దొరికిన నావెద్ను రాత్రంతా ప్రముఖ ఇంటెలిజెన్స్ అధికారులు విచారిస్తుండగా కొన్ని ఆసక్తి కర విషయాలు తెలిశాయి. మొహమ్మద్ నవెద్ కు ఉగ్రవాద శిక్షణను లష్కరే ఈ తాయిబా సంస్థ ఇచ్చిందని, రంజాన్ మాసం నేపథ్యంలో అతడు 90 రోజుల కిందటే దేశంలోకి అడుగుపెట్టి కాశ్మీర్ లోయ ప్రాంతంలో తలదాచుకొని మెల్లగా తన పావులు కదిపినట్లు అధికారులు గుర్తించారు. విచారణ అధికారుల తెలిపిన వివరాల మేరకు.. * రంజాన్ సమయంలో కాశ్మీర్ లోయ ప్రాంతంలో అడుగుపెట్టాడు * పాకిస్థాన్ లోని ఫైసలాబాద్ కు చెందిన నావెద్ గత నెల రోజులుగా జమ్మూకాశ్మీర్ లో తలదాచుకున్నాడు * ఉదంపూర్‌కు మొహమ్మద్ నవెద్ సహా మరో ఉగ్రవాది ఓ ట్రక్కు ద్వారా చేరుకున్నారు. * వారు చెప్తున్నట్లు అమృత్ సర్ యాత్రికులు టార్గెట్ కాదు.. బనిహల్ టన్నెల్‌కు దక్షిణ భాగంలో ఉన్న రహదారిపై వెళ్లే మిలటరీ కాన్వాయ్‌లే లక్ష్యం * నేరుగా ఒకే ప్రశ్నకు ఒకే సమాధానం చెప్పకుండా వేర్వేరుగా సమాధానాలు చెప్తున్న ప్రకారం వారు భారీ వ్యూహమే రచించారు. * దేశంలోని అత్యున్నత అధికారులు నావెద్ను గురువారం విచారించనున్నారు. జమ్మూ పోలీసులు కూడా ప్రశ్నించనున్నారు. * జాతీయ దర్యాప్తు బృందం(ఎన్ఐఏ) రంగంలోకి దిగనుంది. * మొహమ్మద్ నవెద్ అరెస్టు విషయంలో పాకిస్థాన్ ఇప్పటి వరకు ఒక్క ప్రకటన కూడా చేయలేదు. -
మళ్లీ లష్కర్ పడగ?
ఉగ్రదాడితో దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరంతో పాటు యావజ్జాతిని ఒక్కసారిగా వణికించిన లష్కరే తాయిబా.. మరోసారి మన దేశంపై తన పడగనీడ సారించినట్లు తెలుస్తోంది. దాదాపు ఏడేళ్ల క్రితం 26/11 దాడులకు పాల్పడి ముంబైలో భారీ మారణహోమం సృష్టించిన లష్క్రర్.. మళ్లీ ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీ నగరం మీద తన దృష్టి సారించినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. దీనికి తగ్గట్లే.. జమ్ము కాశ్మీర్‌లోని ఉదంపూర్ వద్ద బీఎస్ఎఫ్ దళాలపై భారీ ఎత్తున దాడికి పాల్పడిన ఉగ్రవాదుల్లో ఖాసింఖాన్ అలియాస్ ఉస్మాన్ ఖాన్ అనే ఉగ్రవాదిని సజీవంగా పట్టుకున్నారు. అతడు లష్కరే తాయిబాకు చెందినవాడే అయి ఉంటాడని కూడా భద్రతా దళాలు బలంగా అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ఢిల్లీలో ఉగ్రదాడులు చేయడం ద్వారా ఒక్కసారిగా అనిశ్చితి సృష్టించాలని భారీ ఎత్తున ఆయుధాలు, పేలుడు పదార్థాలతో తొమ్మిది మంది ఉగ్రవాదులు చేరారని ఇంటెలిజెన్స్ వర్గాలు అంటున్నాయి. దీంతో ఢిల్లీలోని సున్నిత ప్రాంతాలన్నింటిలో ఇప్పటికే హై ఎలర్ట్ ప్రకటించారు. అనుమానాస్పదంగా కనిపించే ప్రతి ఒక్కరినీ క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. లష్కరే తాయిబా ఉగ్రవాదులు ఎక్కడ ఏ రూపంలో దాగున్నారో వాళ్ల అనుపానులు పసిగట్టేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సమీపిస్తుండటంతో.. ఆ సందర్భంలోనే ఉగ్రవాదులు ఏమైనా దాడులకు కుట్రపన్నారా అనే కోణంలో ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. -
వచ్చినది ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులా?
పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ జిల్లా దీనానగర్ పోలీసు స్టేషన్ వద్ద కాల్పులు జరిపి ఏడుగురి మృతికి కారణమైనది ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. పోలీసు స్టేషన్లోకి చొరబడే ముందు వాళ్లు ఐఎస్ఐఎస్ అనుకూల నినాదాలు చేశారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. లష్కరే తాయిబా ప్రోద్బలంతో ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు దాడిచేసే ప్రమాదం ఉందని నిఘా వర్గాలు ఎప్పటి నుంచో హెచ్చరిస్తున్నాయి. -
లష్కరే తాయిబా, జైషే మహ్మద్ ఉగ్రవాదులా?
పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ జిల్లా దీనానగర్ పోలీసు స్టేషన్‌పై దాడిచేసి, మొత్తం 13 ప్రాణాలు పోయేందుకు కారణమైన ఉగ్రవాదులు ఎవరు.. ఎక్కడి నుంచి వచ్చారన్న ప్రశ్నలు ఆసక్తి రేపుతున్నాయి. వీళ్లు లష్కరే తాయిబా, జైషే మహ్మద్ ఉగ్రవాద గ్రూపులకు చెందినవారు అయి ఉంటారని విశ్వసనీయ వర్గాల సమాచారం. గతంలో కూడా ముంబై ఉగ్రదాడుల సమయంలో లష్కరే తాయిబా వద్ద శిక్షణ పొందిన ఉగ్రవాదులు వచ్చి ఇక్కడ దాడులు చేసిన విషయం తెలిసిందే. అదే దారిలో మరోసారి లష్కరే తాయిబా, జైషే మహ్మద్ ఉగ్రవాదులు ఇప్పుడూ ప్రవేశించి ఉంటారని అనుమానిస్తున్నారు. మొత్తం ఉగ్రవాదులందరూ 15 నుంచి 54 ఏళ్ల మధ్య వయసున్నవారేనని అంటున్నారు. వారిలో ఒక తీవ్రవాది హతం కాగా, మరో తీవ్రవాదికి తీవ్ర గాయాలయ్యాయి. 2007 తర్వాత పంజాబ్‌లో ఉగ్రవాద ఘటన చోటు చేసుకోవడం ఇదే మొదటిసారి. దీనానగర్ ప్రాంతంలో స్కూళ్లు, కాలేజీలను అధికారులు పూర్తిగా బంద్ చేశారు. పంజాబ్ రాజధాని చండీగఢ్ నగరానికి 260 కిలోమీటర్ల దూరంలో ఈ దీనానగర్ ఉంది. తీవ్రవాదుల ఎన్కౌంటర్లో పంజాబ్ పోలీసు కమాండోలు ముమ్మరంగా పాల్గొన్నారు. -
వారు స్మగ్లర్లు కాదు.. నిషేధిత ఉగ్రవాదులు!
న్యూఢిల్లీ: గత రెండు రోజుల క్రితం భారత కోస్ట్ గార్డులు అడ్డుకున్న పాకిస్థాన్ బోటు కచ్చితంగా సముద్రపు స్మగ్లర్లది కాదని రక్షణ మంత్రి మనోహర్ పారికర్ స్పష్టం చేశారు. భారత్ జలాల్లోకి చొచ్చుకువచ్చిన ఆ బోటు నిషేధిత ఉగ్రవాదులవి అయ్యి ఉండవచ్చనే అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ కోణంలోనే దర్యాప్తు చేపట్టినట్లు ఆయన తెలిపారు. ఆ బోట్లు సముద్ర జలాల స్మగ్లరవి అయి ఉండవచ్చనే వార్తలను ఆయన ఖండించారు. ఆ బోటు ఉగ్రవాదులవా? లేక నిషేధిత ఉగ్రవాదులవా? అనేది తేలాల్సి ఉందన్నారు. శుక్రవారం రాత్రి పాక్ కు చెందిన ఒక బోటును భారత కోస్ట్ గార్డ్ దళాలు గమనించి చుట్టుముట్టడంతో అందులోని ఉగ్రవాదులు తమను తాము పేల్చేసుకుని.. బోటును కూడా పేల్చేసిన విషయం తెలిసిందే. -
మరో బోటు తప్పించుకుందా?
గుజరాత్ తీరంలోకి వచ్చి.. పేలిపోయిన బోటుతో పాటు మరో బోటు కూడా పాక్ నుంచి వచ్చిందట! భారత కోస్ట్ గార్డ్ బృందాల కన్నుగప్పి తప్పించుకుని పారిపోయిందని అంటున్నారు. పాకిస్థాన్‌లోని కేతిబందర్ ప్రాంతం నుంచి భారీ ఆయుధ సామగ్రితో వచ్చిన ఒక మత్స్యకార బోటును భారత కోస్ట్ గార్డ్ దళాలు గమనించి చుట్టుముట్టడంతో అందులోని ఉగ్రవాదులు తమను తాము పేల్చేసుకుని.. బోటును కూడా పేల్చేసిన విషయం తెలిసిందే. అయితే.. అప్పుడు వచ్చినది ఒక్కటి కాదని, రెండు బోట్లని తాజా సమాచారం. భారత కోస్ట్ గార్డ్ బృందాలు రెండో బోటును కూడా గమనించాయి. ఇది కూడా కేతిబందర్ నుంచే వచ్చింది. ఈ విషయం కోస్ట్ గార్డ్‌కు తెలిసినా.. ఈలోపు మొదటి బోటు పేలుడు హడావుడి ఉండటంతో అది తప్పించుకుంది. -
టార్గెట్ గుజరాత్.. అక్కడే విధ్వంసానికి కుట్ర!
పాక్ ఉగ్రవాదులు ప్రధానమంత్రి నరేంద్రమోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌నే ఎందుకు లక్ష్యంగా ఎంచుకున్నారు? అక్కడే దాడులు చేయాలని ఎందుకు ప్రయత్నించారు? ఇటీవల అంతర్జాతీయ వేదికలపై పాకిస్థాన్ కుట్రలను ప్రధాని సమర్థంగా తిప్పికొట్టడం, అంతర్జాతీయ స్థాయిలో దౌత్య విజయాలు సాధించడంతో ఆయనను నైతికంగా దెబ్బకొట్టాలన్న ఉద్దేశంతోనే లష్కరే తాయిబా ఉగ్రవాదులు తీరమార్గం గుండా గుజరాత్‌లోకి ప్రవేశించి.. విధ్వంసం సృష్టించాలని భావించారు. ఈ విషయం ఇంటెలిజెన్స్ నివేదికలతో నిర్ధారణ అయ్యింది. గతంలో కూడా లష్కరే తాయిబా ఉగ్రవాదులు ముంబై సముద్ర జలాల ద్వారానే దేశంలోకి ప్రవేశించి, దేశ ఆర్థిక రాజధాని నగరమైన ముంబై మీద దాడికి పాల్పడ్డారు. ఇప్పుడు కూడా ఇలాగే వచ్చి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్లో ఉగ్రవాద దాడి చేయడానికి భారీ కుట్ర పన్నినట్లు ఇంటెలిజెన్స్ నివేదిక ద్వారా తెలుస్తోంది. దీనిపై కేంద్ర హోంశాఖ అత్యంత అప్రమత్తంగా ఉండటంతో భారీ కుట్రను కోస్ట్ గార్డ్ సిబ్బంది భగ్నం చేయగలిగారు. -
కాశ్మీర్ లో హింసకు లష్కరే తోయిబా కుట్ర
జమ్మూ కాశ్మీర్: జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీకి జరుగనున్న ఎన్నికల్లో హింసాత్మక ఘటనలు సృష్టించేందుకు లష్కేరా తోయిబా కుట్రలు పన్నుతోంది. ఇందులో భాగంగానే కాశ్మీర్ యువతను లక్ష్యంగా చేసుకుంది. కాశ్మీర్ లోని యువతను రిక్రూట్ చేసే యత్నాలను ముమ్మరం చేసింది. గత మూడు నెలల కాలంలో 25 మంది యువకులు లష్కరే తోయిబాలో చేర్చుకుంది. అయితే ఉగ్రవాదులను కుట్రను భగ్నం చేసేందుకు భారత ఆర్మీ రంగంలోకి దిగింది. త్వరలో జమ్మూ కాశ్మీర్ శాసనసభలోని 87 స్థానాలకు ఐదుదశల్లో ఎన్నికలు జరుగనున్నాయి. జార్ఖండ్‌తో పాటు కాశ్మీర్లో వచ్చే నెల 25న 15 సీట్లలో జరగబోయే తొలిదశ పోలింగ్‌కు ఎన్నికల కమిషన్ అక్టోబర్ లో నోటిఫికేషన్ జారీ చేసింది.