జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీకి జరుగనున్న ఎన్నికల్లో హింసాత్మక ఘటనలు సృష్టించేందుకు లష్కేరా తోయిబా కుట్రలు పన్నుతోంది.
జమ్మూ కాశ్మీర్: జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీకి జరుగనున్న ఎన్నికల్లో హింసాత్మక ఘటనలు సృష్టించేందుకు లష్కేరా తోయిబా కుట్రలు పన్నుతోంది. ఇందులో భాగంగానే కాశ్మీర్ యువతను లక్ష్యంగా చేసుకుంది. కాశ్మీర్ లోని యువతను రిక్రూట్ చేసే యత్నాలను ముమ్మరం చేసింది. గత మూడు నెలల కాలంలో 25 మంది యువకులు లష్కరే తోయిబాలో చేర్చుకుంది. అయితే ఉగ్రవాదులను కుట్రను భగ్నం చేసేందుకు భారత ఆర్మీ రంగంలోకి దిగింది.
త్వరలో జమ్మూ కాశ్మీర్ శాసనసభలోని 87 స్థానాలకు ఐదుదశల్లో ఎన్నికలు జరుగనున్నాయి. జార్ఖండ్‌తో పాటు కాశ్మీర్‌లో వచ్చే నెల 25న 15 సీట్లలో జరగబోయే తొలిదశ పోలింగ్‌కు ఎన్నికల కమిషన్ అక్టోబర్ లో నోటిఫికేషన్ జారీ చేసింది.