కరాచీ : ఉగ్రవాద సంస్థలపై పాకిస్తాన్ మాజీ సైనిక పాలకుడు పర్వేజ్ ముషారఫ్ అభిమానాన్ని మరోసారి చాటుకున్నారు. జమాతే ఉద్ దవా, లష్కరే తోయిబా సంస్థలు.. దేశబక్తికి మారుపేరని ముషారఫ్ అన్నారు. దేశభద్రత కోసం లష్కరే తోయిబా, జమాతే ఉద్ దవాలతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ముషరాఫ్ ప్రకటించారు. ఇదిలా ఉండగా.. గతంలోనే ఒక ఇంటర్వ్యూలో.. లష్కే తోయిబా, జమాతే ఉద్ దవాలకు తాను పెద్ద అభిమానిని అని ప్రకటించిన విషమం తెలిసిందే.
లష్కరే తోయిబా, జమాతే ఉద్ దవాలో పనిచేసే వాళ్లంతా.. దేశభక్తులేనని ముషారఫ్ అభివర్ణించారు. వారంతా పాకిస్తాన్ కోసమే జీవిస్తున్నారని.. పాకిస్తాన్ కోసమే మరణిస్తున్నారని ఆయన అభివర్ణించారు. లష్కే తోయిబా, జమాతే సంస్థలు ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తే.. ఎవరైనా ఎందుకు అభ్యంతరాలు వ్యక్తం చేయాల్సిన అవసరం లేదని ముషారఫ్ అన్నారు.
వారితో పొత్తు పెట్టుకోవడానికి, కలిసి పనిచేయడానికి నేను సిద్దంగా ఉన్నాను.. ఈ విషయంపై వారు నాతో ఇంకా సంప్రదించలేదని చెప్పారు. ఒక వేళ వారు ముందుకు వస్తే.. నాకు ఎటువంటి అభ్యంతరాలు లేవు. నాలో ఉదారవాద భావాలు ఉన్నప్పటికీ.. మతపరమైన అంశాలను ద్వేషించనని చెప్పారు. కశ్మీర్‌లో తీవ్రవాద చర్యలను తానెప్పుడూ సమర్ధిస్తాననే ముషారఫ్ ప్రకటించడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment