ఇస్లామాబాద్ : ముంబైదాడుల సూత్రధారి హఫీజ్ సయీద్‌కు పాకిస్తాన్ ప్రభుత్వం మరోసారి చెక్ పెట్టింది. వచ్చ ఏడాది ఎన్నికల్లో పాల్గొంటానని ఇప్పటికే సయీద్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఏర్పాటు చేసిన మిల్లీ ముస్లిం లీగ్ పార్టీ రిజిస్ట్రేషన్‌ను పాకిస్తాన్ అంతర్గత మంత్రిత్వ శాఖ తిరస్కరించింది. ఇదిలా ఉండగా.. ఈ పార్టీని రిజిస్టర్ చేసేందుకు గతంలోనే పాకిస్తాన్ ఎన్నికల సంఘం నిరాకరించింది. మిల్లీ ముస్లిం లీగ్ అనే పార్టీ నిషేధిత జమాతే ఉద్ దవా, లష్కరే తోయిబా ఉగ్రసంస్థలకు జేబు సంస్థఅని పాక్ అంతర్గత మంత్రిత్వ శాఖ పేర్కొంది.
ఎంఎంఎల్ పార్టీ రిజిస్ట్రేషన్‌ను తిరస్కరించిన అంతర్గత మంత్రిత్వ శాఖ.. ఇటువంటి పార్టీలకు అనుమతివ్వండం దేశానికి మంచిది కాదని పేర్కొంది. రాజకీయాల్లో హింస, వేర్పాటు, ఉగ్రవాదా భావజాలం వేగంగా వ్యాప్తి చెందేందుకు ఇటువంటి పార్టీలు దోహదం చేస్తాయని అంతర్గ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇస్లామాబాద్ హైకోర్టు కూడా.. ఎంఎంఎల్ పిటీషన్‌ను స్వీకరించేది పరిగణలోకి తీసుకోవడం లేదని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment