
ప్రధాని మోదీపై లష్కరే తాయిబా గురి!
పాకిస్థాన్‌తో భారత దేశానికి సత్సంబంధాలు వస్తే తమకు ఇబ్బంది అని భావించారో ఏమో గానీ.. భారత ప్రధాని నరేంద్ర మోదీ మీద లష్కరే తాయిబా ఉగ్రవాదులు గురిపెట్టారు. ఈ విషయాన్ని భారత నిఘా వర్గాలు గుర్తించి హెచ్చరించాయి.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీతోపాటు భారత పార్లమెంటు, సైన్యం ప్రధాన కార్యాలయం, అణు కేంద్రాలు.. ఈ అన్నింటికీ కూడా లష్కరే తాయిబా నుంచి ముప్పు పొంచి ఉందని తాజా హెచ్చరికలో నిఘా వర్గాలు తెలిపాయి.